
ఇన్‌చార్జి అదనపు కలెక్టర్లు బాధ్యతల స్వీకరణ
నల్లగొండ : ఇన్‌చార్జి అదనపు కలెక్టర్లు (రెవెనూ, లోకల్‌బాడీ) అమిత్ నారాయణ్, రాజ్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ, ఇన్‌చార్జి లోకల్‌బాడీ) శ్రీనివాసులు నెలరోజుల పాటు సెలవుపై వెళ్తుండడంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్‌ను నియమిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్ బాడీ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌గా హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. నెలరోజుల పాటు వీరు విధులు నిర్వహించనున్నారు.

ఇన్‌చార్జి అదనపు కలెక్టర్లు బాధ్యతల స్వీకరణ