
ఫోన్లు వెనక్కు ఇచ్చేస్తామంటూ ఆందోళన
యాప్‌లు సక్రమంగా పనిచేయకపోవడం, తాజాగా అమల్లోకి వచ్చిన బాల సంజీవని యాప్ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో అంగన్‌వాడీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అన్ని యాప్‌లను కలిిపి ఒక యాప్‌గా రూపొందిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంగన్‌వాడీలు విమర్శిస్తున్నారు. మొబైల్ ఫోన్లను వెనక్కు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ స్థానంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన 5జీ ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాప్‌ల నిర్వహణలో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఇబ్బందులు తొలగించాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు.