
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వరవరరావు భార్య హేమలత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ముంబయి హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. వరవరరావుకు చికిత్స అందజేస్తున్న హాస్పిటల్‌లో సౌకర్యాలను కూడా ముంబై హై కోర్టే పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వరవరరావు బెయిల్ అప్పీల్‌ను సరైన సమయంలో విచారించాలని సుప్రీం కోర్టు, ముంబయి హైకోర్టుకు సూచించించింది. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన)