
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆరవ విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 25న జరిగిన ఈ ఎన్నికల్లో రాజధాని వాసులు గతంలో కంటే తక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆరవ విడతలో ఓటర్ టర్నవుట్ డేటాను ఈసీ మంగళవారం(మే28) వెల్లడించింది.
గతంలో ఢిల్లీలో 60.52 శాతం ఓట్లు పోలైతే ప్రస్తుత ఎన్నికల్లో అది 58.69 శాతానికి తగ్గిపోయింది. ఇక్కడ అత్యధికంగా కన్హయ్యకుమార్, మనోజ్‌తివారీ తలపడిన ఈశాన్య ఢిల్లీలో 62.87 శాతం ఓట్లు పోలవడం గమనార్హం. కన్హయ్యకుమార్ కాంగ్రెస్ నుంచి ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఢిల్లీలో కాంగ్రెస్,ఆప్ కూటమి,బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరిగింది.ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపీ సీట్లున్నాయి.