
న్యూఢిల్లీ: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఆడియోలపై ‘ఏఐ జనరేటెడ్/డిజిటల్లీ ఎన్‌హాన్స్‌డ్/ సింథటిక్ కంటెంట్ వంటి లేబుల్స్ జతచేయాలంటూ నిబంధనను విధించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్(Deepfake) కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా(Social Media) వేదికల వినియోగంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Elections) ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్ ప్రచారకులను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల డిస్కైమర్లను ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది.
ఇదీ చదవండి: శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్