
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం