
సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,342 కరోనా కేసులు వెలుగు చూడగా.. 483 మరణాలు సంభవించాయి. ఈ కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,12, 93,062 ఉండగా.. మరణాల సంఖ్య 4,19,470గా ఉంది. ఇక 24 గంటల్లో 38,740 మంది కొత్తగా కోలుకోగా..మొత్తంగా 3,04,68,079 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,09,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 42,34,17,030 మందికి వ్యాక్సిన్ వేయించుకున్నారు.