
Coronavirus Update: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మంగళవారంతో పోల్చితే పెరిగాయి. గడిచిన 24 గంటలలో 71,365 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,72,211 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా 1,217 మంది కరోనాతో మృతిచెందారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,05,279 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 8,92,828 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,70,87,06,705 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు.