Corona Updates
-
దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్ -19 నుండి 548 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. అటు.. జేఎన్.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 47కి చేరుకున్నాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 41 కేసులు బయటపడ్డాయి. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! -
వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా 797 కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుంది. దేశంలో కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటివరకు 157 జేఎన్.1 కరోనా వేరియంట్‌కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో అత్యధికంగా 78, గుజరాత్ (34), గోవా (18), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4) కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు?
2019 డిసెంబర్ చివర్లో సాంప్రదాయంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. తర్వాత కొద్ది వారాల్లోనే ప్రపంచమంతా చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపించింది. మళ్లీ అదే డిసెంబర్లోనే మరో వేరియంట్ రూపంలో వైరస్ మనముందుకొచ్చింది. అసలు డిసెంబర్లోనే ఎందుకని వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇందుకు గల కారణాలేంటి? కరోనా ప్రధానంగా మూడు ప్రధాన మ్యుటేషన్లుగా మార్పు చెందింది. డిసెంబర్ 2020లో వ్యాప్తి చెందిన కరోనా ఆల్ఫా(B.1.1.7), బీటా(B.1.351), గామా(P.1)గా మార్పు చెందింది. మరుసటి ఏడాది 2021 డిసెంబర్లో ఉద్భవించింన ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మరుసటి ఏడాది డిసెంబర్ 2022లో ప్రధాన వేరియంట్ వ్యాప్తి చెందనప్పటికీ ఒమిక్రాన్‌లోనే BA.2, BA.5గా పరిణామం చెందింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న JN1 కూడా ఒమిక్రాన్ వేరియంట్లోని ఉపరకమే. ఇది కూడా డిసెంబర్లోనే వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్లోనే ఎందుకు? ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నుంచి కొవిడ్-19 కొత్త రకంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. శీతాకాలంలోని చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగానే వైరస్ మార్పు చెంది వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. డెల్టా వేరియంట్, మహమ్మారి మొదటి దశలోనూ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నేచర్ జర్నల్ పేర్కొంది. వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు ఉష్ణోగ్రత పడిపోతుంది. గాలి కూడా పొడిగా మారుతుంది. ఉత్తర అర్ధగోళంలోని దేశాలలో కోవిడ్-19 వ్యాప్తికి ఈ అంశాలే దోహదం చేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. చైనాలోని సిచువాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విశయాన్ని వెల్లడించారు. వెచ్చని పరిస్థితుల్లోని వారికంటే చల్లని పరిస్థితుల్లో నివసించేవారికి కరోనావైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వారి అధ్యయనం కనుగొంది. 'కొవిడ్-19 అనేది శ్వాసకోశ వైరస్. దీన్ని ఎదుర్కొనే క్రమంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి వైరస్, రెండోది మన శరీరం. వైరస్ నిరంతరం మార్పు చెంది వేరియంట్లుగా పరిణామం చెందుతోంది. మన శరీరం గత వేరియంట్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని కల్పించుకుంటే మరో రకమైన వేరియంట్ సవాళ్లను విసురుతోంది. అంటే కొత్త వేరియంట్‌కు మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది.' అని అమృత హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపు తెలిపారు. సెలవుల్లో పర్యటనలు.. కరోనా వేరియంట్ చైనాలో డిసెంబర్లోనే ఉద్భవించింది. నెలలోనే విపరీతంగా వ్యాప్తి చెందింది. ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో డిసెంబర్ నెలలో ఎక్కువగా సెలువులు ఉన్నాయి. క్రిస్టమస్ సెలవులు, చైనాలో జనవరిలో లునార్ న్యూ ఇయర్ వేడుకలు వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయి. ఈ సారి జేఎన్1 వేరియంట్ కూడా సరిగ్గా ఇదే సమయంలో వ్యాప్తి చెందుతోంది. అని డాక్టర్ దీపు తెలిపారు. భయం అవసరం లేదు.. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్ 1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇదీ చదవండి: Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు -
Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
ఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది. కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 4054 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128 కొత్త కేసులు కేరళలో నమోదయ్యామని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. 24 గంటలల్లో కేరళతో కలుపుకొని దేశవ్యాప్తంగా మరో 334 కొత్త కేసులు నమోదు కావటంతో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది. కేరళలో కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు). వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు). జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. -
జయశంకర్ భూపాలపల్లిలో కోవిడ్ కలకలం
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ
ఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్నాటకలో ఒకరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కు చేరుకుంది. అటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జేఎన్-1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్‌లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
TS: ఒక్కరోజులో 12 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 1,322 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు కరోనా బులెటిన్ విడుదల చేశారు. నమోదైన కేసుల్లో తొమ్మిది హైదరాబాదులోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 38 మంది ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.44 లక్షలకు చేరింది. అందులో 8.40 లక్షల మంది రికవరీ అయ్యారు. చలికాలం కావడం, ఫ్లూ జ్వరాలు కూడా ఉండటం తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. పర్యాటకులకు తప్పనిసరి ఐసోలేషన్ తాజాగా రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకుల కోసం తప్పనిసరి ఐసోలేషన్‌ను ప్రారంభించాలని రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ వైద్యుల ప్యానెల్ వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, గోవా, మహారాష్ట్రలలో కోవిడ్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరింది. జేఎన్.1 వేరియంట్ పై స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉందని పేర్కొంది. కేరళ లేదా ఇతర ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు ఎవరైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పైగా చాలా మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదనిడాక్టర్ల బృందం అభిప్రాయపడింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 40 నమూనాలు..: రాష్ట్రంలో కరోనా కేసులు ఏ వేరియంట్ అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. గత వారం మొత్తం 40 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 4–5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సమావేశంలో మంత్రి ఆదేశాలిలా.. పని చేయని పీఎస్ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరిగ్గా వినియోగించాలి. అన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య పరికరాలు, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్ మొదలైన వాటి అవసరాలను ఆసుపత్రులు తెలియజేయాలి. మొత్తం 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు రోజుకు 16,500 నమూనాలను పరీక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లతో పాటు, రాష్ట్రంలో 84 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ కిట్లు మొదలైన వాటిని టిఎస్ఎంఎస్ఐడిసి సేకరించి సరఫరా చేస్తుంది. గత 2 వారాల్లో మొత్తం 6,344 నమూనాలు సేకరించారు. నెలాఖరు నాటికి పరీక్షలను వేగవంతం చేయాలి. రోజుకు 4,000 పరీక్షలు నిర్వహించాలి. గాంధీ హాస్పిటల్లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలి కోవిడ్ రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ సంస్థల నుంచి గత నాలుగేళ్లుగా అందిన సీఎస్ఆర్ విరాళాల జాబితాపై నివేదిక అందజేయాలి. -
దేశంలో కరోనా విజృంభణ.. 3 వేలకు చేరిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బిహార్‌లో నమోదైన కేసులతో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా వేరియంట్ జేఎన్1 విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 జేఎన్1 వేరియంట్ కేసులు ఉన్నాయి.కాగా.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇదీ చదవండి: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే.. -
Covid Variant JN.1: కరోనా కొత్త వేరియంట్.. 21 కేసులు నమోదు
కరోనా వైరస్ మరోసారి తన పంజా విసురుతోంది. అంతమైపోయిందనుకున్న కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు దేశంలో ఇప్పటి వరకు జేఎన్.1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. చదవండి: ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా?.. కారణమిదే! కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు . వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు
-
ఒక్కరోజులో నాలుగు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ బులెటిన్ విడుదల చేశారు. కాగా గత వారం రోజుల్లో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులు అందరూ ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు... కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన జేఎన్1 సబ్ వేరియంట్‌వని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఈ వేరియంట్‌వి ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కరోనాపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలి కొత్త సబ్ వేరియంట్ జేఎన్1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలనీ మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లోని జేఎన్ 1 వైరస్ పరిస్థితిపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సమగ్ర సమాచారం అందజేశారు. భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రికి అధికారులు వివరించారు. అయితే ఇతర దేశాల్లో కేసులు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బుధవారం నుంచి పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లల్లో వారిని ఐసోలేషన్‌లో ఉంచడం వల్ల ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. మాస్క్‌లు అవసరం లేదు కానీ... మాస్క్‌లు ధరించాల్సిన ప్రత్యేక అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కరోనా కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సబ్ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయని, కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. -
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మే రకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని, మాస్కులను ధరిం చాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవా రు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనడానికి రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని, వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలు ఆందోళన చెంద వద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది కరోనా గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న కరోనా వేరియంట్ జేఎన్1 ఒమిక్రాన్‌కు చెందినదే. ఇది ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో రెండు నెలలుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ప్రమాదకారి కాదని ఇప్పటికే నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్వాస కోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ కిరణ్‌మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
కరోనా డేంజర్ బెల్స్.. మరోసారి 12 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్‌కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 5,31,300కు పెరిగింది. కాగా.. వైరస్ సోకిన వారిలో 4,42,83,021 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కొనసాగించాలన్నారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఉంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని చెబుతున్నారు. చదవండి: అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది? -
కోవిడ్ గుప్పిట్లో దేశ రాజధాని.. ఏకంగా 430 శాతం పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కోవిడ్ గుప్పిట్లో చిక్కుకుంది. కొత్త కేసుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. మూడు వారాల లోపే కేసుల సంఖ్య ఏకంగా 430 శాతం పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పాజిటివిటీ రేటు కూడా 26.54 శాతంగా ఉండటం కలవారుపాటుకు గురిచేస్తోంది. మార్చి 30న ఢిల్లీలో 4,976 కేసులు ఉండగా.. ఏప్రిల్ 17నాటికి ఆ సంఖ్య 13,200కు చేరింది. తాజాగా బుధవారం మరో 1,537 కేసులు వెలుగుచూశాయి. మరో ఐదుగురు వైరస్‌కు బలయ్యారు. ఫలితంగా ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,25,781కి చేరింది. మృతుల సంఖ్య 26,572గా ఉంది. దేశంలో 10వేలకు పైగా కొత్త కేసులు.. మరోవైపు దేశంలో కరోనా కొత్త కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగి మళ్లీ 10వేల మార్కును దాటాయి. మంగళవారం 7,633 కేసులు వెలుగుచూడగా.. బుధవారం ఆ సంఖ్య 10,542కు పెరిగింది. మరో 38 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,562గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,31,190కి చేరింది. రికవరీ రేటు 98.67శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..? -
Covid-19: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు
దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేల మార్క్‌కు దాటింది. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో మొత్తం 6,313 రికవరీలు జరగగా మొత్తం రికవరీల సంఖ్య 4,42,35,772కి చేరుకుంది. గత కొద్ది రోజలుగా పెరుతున్న కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే తాజగా నమోదైన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదీగాక గత 24 గంటల వ్యవధిలో గుజరాత్లో ఆరుగురు, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో నలుగురు చొప్పున, ఢిల్లీ, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,31,141కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,26,522) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్‌బీ1.16 వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దేశంలో పదిరోజుల వరకు ఇలానే కొనసాగుతుందని తదనంతరం తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్.. 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు) -
Covid-19: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల మార్క్‌కు చేరువై 49,622గా ఉంది. కరోనా కారణంగా మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు మొత్తం 4,42,16,853 మంది కోలుకున్నారు. మొత్తం 5,31,064 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోజువారి పాజిటివిటీ రేటు 5.01శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉంది. కాగా.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా యాంటీ ఇన్ఫెక్టివ్, రెస్పిరేటరీ డ్రగ్స్ విక్రయాలు దాదాపు 50 శాతం పెరిగినట్లు ఓ నివేదిక తెలిపింది. జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారు మెడికల్ షాపులకు వెళ్లి ఈ మందులు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల్లో వృద్ధి నమోదవుతున్న కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్కూళ్లు, కాలేజీలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. అలాగే కార్యాలయాల్లో శానిటైజేషన్ చేసి పరిశుభ్రత పాటించాలని, కరోనా లక్షణాలు కన్పించిన ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వాలని తెలిపింది. చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు తప్పనిసరి.. దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..! -
స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు.. ఆ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!
లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ బారినపడకుండా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు పని ప్రదేశాల్లో యజమాన్యాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు. కార్యాలయాలను శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ ఉష్ణోగ్రత స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎవరైనా ఉద్యోగుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని చెప్పారు. లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ఉద్యోగులకు సూచించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో దాని పక్కనే ఉన్న గౌతమ్ బుద్ధ నగర్, సహా ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నోయిడా అధికారులు ఈమేరకు చర్యలు చేపట్టారు. దేశ రాజధానిలో గురువారం 1,527 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే ఇవి 33 శాతం అధికం. పాజిటివీ రేటు కూడా 27.7 శాతంగా ఉంది. దీంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యగా చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. చదవండి: సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’ -
కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదు
-
దేశం లో కొత్త కరోనా కేసులు...
-
Covid-19: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,830 మందికి పాజిటివ్‌గా తేలింది. గత ఏడు నెలల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. క్రితం రోజుతో(5,676 కేసులు) పోల్చితే దాదాపు 50 శాతం అధికం. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40వేల మార్క్ దాటి 40,215కు చేరింది. కరోనావ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ బారినపడివారిలో 4,42,04,771 మంది కోలుకున్నారు. కోవిడ్ సోకి ఇప్పటివరకు మొత్తం 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త తెలిపారు. వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్లు చెంది బలహీనపడుతోందని చెప్పారు. అందుకే పాజిటివ్‌గా తేలిన వారిలో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడం లేదని పేర్కొన్నారు. అయితే ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు. చదవండి: కోవిడ్ అంతమయ్యే అవకాశముంది.. అయినా సరే నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే -
గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
-
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
Corona Virus: జాగ్రత్త! కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తగ్గుముఖం పట్టిందనుకునేలోపే మరోసారి మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,880 మంది కరోనా బారినపడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక నిన్న ఒక్క రోజే 14 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 44,196,318కు చేరింది. మరణాల సంఖ్య 5,30,979కు చేరింది. మరణాలు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. రికవరీ రేటు 98.74, మరణాల రేటు 1.19గా ఉంది. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. అంతేగాక మూడు రాష్ట్రాలు (హర్యానా, కేరళ పుదుచ్చేరి) బహరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీచేశాయి. చదవండి: తెలంగాణ పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ -
తెలంగాణలో భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు.. దేశంలోనే టాప్-2
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్ కేసులు తెలంగాణలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కేసులతో తొమ్మిది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు మహారాష్ట్రలో 104 కేసులు, కర్ణాటకలో 57, గుజరాత్లో 54, ఢిల్లీలో 19, పుదుచ్చేరిలో 7, హరియాణాలో 6, హిమాచల్ ప్రదేశ్‌లో 3 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఆ వేరియంట్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 344కి చేరుకుంది. ఈ వేరియంట్ వైరస్ అధిక వ్యాప్తిని కలిగి ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని తీవ్రతను ఇంకా నిర్ణయించలేదని పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ సోకినవారు ఇప్పటివరకు తీవ్రమైన స్థితిలో ఉన్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. ఈ కొత్త వేరియంట్ నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యం. జలుబు, దగ్గు లేదా జ్వరంతో బాధపడేవారు మాస్‌్కలు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదు రాష్ట్రంలో మంగళవారం 5,122 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..వారిలో 23 మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8.42 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 52 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 190 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
Covid XBB 1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్.. నాలుగో వేవ్ తప్పదా?
న్యూఢిల్లీ: దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ మహమ్మారి నుంచి బయపడినట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనాతో పాటు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితితో భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది. అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఎక్స్‌బీబీ రకం వేరియంట్‌ను ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించారు. అయితే భారత్‌లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ మున్ముందు పెరిగి దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ కోవిడ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాం వివరాల ప్రకారం XBB 1.16 వేరియంట్ కేసులు భారత్‌లోనే అధికంగా నమోదయ్యాయి. మనదేశంలో ఈ వేరియంట్ అధికారిక కేసుల సంఖ్య 48గా ఉంది. అమెరికా, సింగపూర్‌లో ఈ సంఖ్య 20 లోపే ఉండటం గమనార్హం. గత కొద్ది వారాలుగా భారత్‌లో ఈ వేరియంట్ కేసుల్లో సడన్ జంప్ నమోదైంది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో XBB 1.16 వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కోవ్‌స్పెక్ట్రం ప్రకారం XBB 1.16 వేరియంట్ XBB 1.15 నుంచి అవతరించలేదు. కానీ రెండూ XBB నుంచి వచ్చిన ఉపరకాలే. ప్రస్తుతానికి, కోవిడ్ XBB 1.16, XBB 1.15 లక్షణాల మధ్య ఎటువంటి తేడాలు లేవు. ఇది సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట వంటి లక్షణాలే ఉంటాయి. ఈ వేరియంట్ జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజీపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్ సర్వే వైరల్ -
వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక..!
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్-19 జాగ్రత్తలపై ప్రజలను అలర్ట్ చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్లు పైడినవారు, పిల్లలు, గర్భణీలు గుంపుల్లో తిరగకూడదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ హెచ్చరించారు. వీరు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఏమీ లేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా నిపుణుల కమిటీతో సమావేశమై పరిస్థితిపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం సమీపించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్‌పైనా సమీక్షించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలు రోజుకు రూ.2-3 లీటర్ల నీటిని తీసుకొని హైడ్రేట్‌గా ఉండాలని సూచించారు. నీటితో పాటు మజ్జిక, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలన్నారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గి చాలా రోజులవుతున్నప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పిస్తోంది. మార్చి 5న 281 మంది, మార్చి 4న 324 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) కేసులు వెలుగుచూస్తున్నాయి. అనేక మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తఫ్లూ కరోనా లాంటిది కాకపోయినప్పటికీ జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యమంత్రి కూడా కరోనా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చదవండి: కొత్త ఫ్లూ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్ -
గండం నుంచి గట్టెక్కిన చైనా.. భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు!
బీజింగ్: కరోనా గండం నుంచి చైనా మరోసారి గట్టెక్కింది. జనవరిలో మొదట్లో కోవిడ్ పీక్ స్టేజికి వెళ్లి భారీగా నమోదైన కేసులు, మరణాలు ఎట్టకేలకు దిగొచ్చాయి. మూడు వారాల క్రితంతో పోల్చితే గణనీయంగా తగ్గాయి. జనవరి మొదటి వారంతో పోల్చితే కరోనా కొత్త కేసులు 72 శాతం, మరణాలు 79 శాతం తగ్గినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం అధికారిక వెబ్సైట్లో బుధవారం వెల్లడించింది. చైనా జనాభాలో 80శాతం మంది కరోనా బారినపడ్డారని, మరో రెండు మూడు నెల్లలో మరో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వ శాస్త్రవేత్త ఒకరు గతవారమే హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం కరోనా లెక్కలను అధికారికంగా వెల్లడించింది. కేసులు తగ్గినట్లు పేర్కొంది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం జనవరి 4న 1,28,000 కరోనా రోగులు ఉండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య 36,000కు పడిపోయింది. అలాగే మరణాలు అప్పుడు రోజుకు 4,273 నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్య 896కు దిగొచ్చింది. జ్వరంతో ఆస్పత్రులకు వెళ్లిన వారి సంఖ్య డిసెంబర్ 22న 28 లక్షలుగా ఉండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య లక్షా 11వేలకు పడిపోయింది. చదవండి: మోదీకి షాకిచ్చిన అమెరికా.. బీబీసీ డాక్యుమెంటరీపై యూటర్న్! -
భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు లేవు.. భయాందోళన వద్దు.. కానీ..!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లేమీ వెలుగు చూడలేదని కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లు ప్రమాదకరం ఏమీ కాదని, రోగులు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా రాలేదని స్పష్టం చేసింది. ఈమేరకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా తెలిపారు. కరోనా వేరియంట్ల గురించి ఆందోళన లేనప్పటికీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహిరిస్తోందని అరోరా స్పష్టం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించారు. అందుకే ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతన్నప్పటికీ, వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా లేదని కేంద్రం వివరించింది. అనేక నమూనాలను పరీక్షించినా కొత్త వేరియంట్లు కన్పించలేదని చెప్పింది. వచ్చే వారం కూడా కేసులు పెరిగే సూచనలు లేవని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, కానీ కరోనా జగ్రత్తలు పాటిస్తేనే మంచిదని సూచించింది. చదవండి: ఆయిల్ పైప్ లైన్‌ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం -
25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దీని ముప్పు గురించి తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పింది. ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ ప్రపంచానికి కొత్త ముప్పుగా పరిణమించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో గత ఏడాది డిసెంబర్లో ఈ వేరియంట్ వల్లే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. భారత్ బేఫికర్.. మరోవైపు భారత్‌లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.01గా ఉంది. ప్రస్తుతం 2,509 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.8శాతంగా ఉంది. చదవండి: చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స -
చైనా.. ఇప్పటికైనా కరోనా అసలు లెక్కలు చెప్పు..!
బీజింగ్: చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెడ్డడం లేదు. వైరస్ బాధితులను ట్రాక్ చేయడం సాధ్యం కాదని కొద్దిరోజుల క్రితమే చేతులెత్తేసింది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలను చైనా దాస్తోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వాస్తవ గణాంకాలను చైనా వెల్లడించాలని, దేశంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరింది. వైరస్‌కు కట్టడిచేసేందుకు అవసరమైతే అంతర్జాతీయంగా సహకారం అందిస్తామని చెప్పింది. కోవిడ్ నిర్వహణకు వైద్య సామర్థ్యాన్ని పెంచుకోవాలని డబ్ల్యూహెచ్ఓ చైనాకు సూచించింది. చైనా నుంచి వచ్చేవారికి ఫ్రాన్స్‌లో పరీక్షలు.. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడం కొనసాగిస్తామని ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్ని తెలిపారు. చైనా నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ దీనిపై తాము రాజీపడబోమన్నారు. పరీక్షలు నిర్వహించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. చైనా నుంచి వచ్చే వారికి భారత్, అమెరికా సహా పలు దేశాలు కరోనా పరీక్షను తప్పనిసరి చేశాయి. దీనిపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. ఇది వివక్షపూరిత చర్య అని వ్యాఖ్యానించింది. చదవండి: అతి చేష్టలు: ఉక్రెయిన్‌కు రష్యా న్యూఇయర్ విషెస్ -
Covid-19: ఈ 6 దేశాల మీదుగా వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనసరి చేసింది. తాజాగా కేంద్రం మరోసారి ఇందుకు సంబంధించి నూతన ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఈ ఆరు దేశాల మీదుగా ప్రయాణించి వేరే దేశం నుంచి వచ్చినా సరే ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రయాణికులు 72 గంటలకు మందు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే భారత్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే అనుమతి లేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వారం రోజుల క్వారంటన్ నిబంధనను అమలు చేస్తోంది. చదవండి: Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం.. -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..! -
Corona Virus: చైనాలో ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు..!
న్యూఢిల్లీ: చైనాలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా వెల్లడించారు. చైనా నుంచి సరైన సమాచారం లేనందున.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. చైనాలో కోవిడ్ వ్యాప్తికి ఒకటి కాదు నాలుగు వేరియంట్లు కారణమని పేర్కొన్నారు. డ్రాగన్ దేశంలో మహమ్మారి విలయానికి వైరస్ల కాక్టెయిల్ కారణమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బీఎఫ్.7 వేరియంట్ కేసులు కేవలం 15 శాతం మాత్రమే నమోదవుతున్నాయని.. అత్యధికంగా 50 శాతం కేసులు బీఎన్, బీక్యూ వేరియంట్ ద్వారా వ్యాపిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ఎస్వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. కోవిడ్ మొదటి, రెండు, మూడో వేవ్‌ల నుంచి వ్యాక్సిన్లు, ఇన్ఫెక్షన్ల ద్వారా భారతీయులకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ లభించిందని తెలిపారు. దీని కారణంగా జలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే చైనా వాళ్లకు ఈ వేరియంట్లు వారికి కొత్తవని అన్నారు. ఇంతకుముందు ఇన్ఫెక్షన్ బారిన పడలేదన్నారు. అంతేగాక అక్కడి వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఉండటం, వంటి కారణాల వల్ల చైనీయుల్లో ఎక్కువ మంది మూడు, నాలుగు డోసులు తీసుకున్నారని పేర్కొన్నారు. చదవండి: పసలేని చైనా టీకా.. ఏమాత్రమూ లొంగని కరోనా.. తమకొద్దంటున్న దేశాలు చైనాతో పోల్చుకుంటే భారత్ లో 97 శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని ఆరోరా తెలిపారు. మిగిలిన వారు ఒకటి కంటే ఎక్కువసార్లు కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. ఇక పిల్లల విషయానికొస్తే 12 ఏళ్ల లోపు చిన్నారులు 96 శాతం మంది ఒక్కసారి వైరస్ బారిన పడినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో కూడా చాలా మందికి కోవిడ్ సోకిందని... వీటన్నింటిని చూస్తే మహమ్మారి నుంచి మనం చాలా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అయితే కేసుల విషయంలో చైనా నుంచి అస్పష్టమైన సమాచారం ఉన్నందుకున జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు. చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు -
చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు
బీజింగ్: చైనాలో కరోనా నానాటికీ చుక్కలు చూపుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక నగరం జిజెయాంగ్‌లో రోజుకు కనీసం 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు పాతిక లక్షలు దాటొచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులకు రోగుల వెల్లువ నానాటికీ పెరుగుతోంది. మార్చురీల బయట శవాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. చాలాచోట్ల కనీసం 10 రోజులకు పైగా వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఒకవైపు కేసులు ఇలా కట్టలు తెంచుకుంటుంటే మరోవైపు వాటి కట్టడి ప్రయత్నాలను, నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తూ చైనా ప్రభుత్వం హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా తెరవాలని నిర్ణయించింది. అంతేగాక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనను కూడా పూర్తిగా ఎత్తేయనుంది. ఇవన్నీ జనవరి 8 నుంచి అమల్లోకి వస్తాని ప్రకటించింది. ఇందుకు వీలుగా కరోనాను డెంగీ తదితర జ్వరాలతో సమానమైన బి కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెల్లడిని కూడా ఆదివారం నుంచి చైనా ఆపేయడం తెలిసిందే. చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే?
బెంగళూరు: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపింది. రెవెన్యూ మంత్రి ఆర్ ఆశోక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బీఎఫ్.7 వేరియంట్ సోకిన బాధితుల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్లాక్ హాస్పిటల్లో చికిత్స అందించనున్నట్లు చెప్పారు. అలాగే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఆశోక స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలు, బార్లు, పబ్‌లు, హోటళ్లలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అర్ధ రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని చెప్పారు. చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక -
కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్..
బీజింగ్: కరోనా నిబంధనలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. జనవరి 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో మూడేళ్ల తర్వాత విదేశీ ప్రయాణికులకు విముక్తి లభించింది. ఇకపై చైనాకు వెళ్లేవారు కరోనా నెగిటివ్ ద్రువపత్రం చూపిస్తే సరిపోతుంది. 48 గంటలకు ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలి. అలాగే కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగిన విదేశీయులను ట్రాక్ చేయడాన్ని కూడా చైనా నిలిపివేస్తోంది. సరకు దిగుమతికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వెలుగు చూసిన కొత్తలో విదేశీ ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులు ప్రభుత్వ కారంటైన్ కేంద్రంలో ఉండాలని చైనా రూల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకు దీన్ని 21 రోజులకు పెంచింది. అయితే కేసులు తగ్గాక ఐదు రోజులకు తగ్గించింది. కోవిడ్ జీరో పాలసీ పేరుతో దాదాపు మూడేళ్లుగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది డ్రాగన్ దేశం. అయితే ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ మొదటి వారంలో ఆంక్షలు సడలించింది. కానీ ఆ తర్వాత కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
Covid-19: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య..
బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు లక్షల కొత్త కేసులు, వేల మరణాలు నమోదవుతున్నాయి. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పడకలు ఖాళీలేక బేంచీలు, బల్లల మీదే చికిత్స అందిస్తున్నారు. శవాలను పూడ్చేందుకు శ్మశాన వాటికల్లో స్థలం లేక వేరే ప్రదేశాలకు తరలిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే చైనా ఆరోగ్య శాఖ ఆదివారం అనూహ్య ప్రకటన చేసింది. ఇకపై కరోనా కేసుల వివరాలు తాము వెల్లడించమని తెలిపింది. అంటువ్యాధుల నియంత్రణ, పరిశోధన కేంద్రమే కరోనా వివరాలను చూసుకుంటుందని చెప్పింది. అయితే కేసుల లెక్కలు ఎప్పుడు వెల్లడిస్తారు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కరోనా లెక్కలు దాచేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. రేడియో ఫ్రీ ఆసియా లీక్ చేసిన ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారం చైనాలో 20 రోజుల వ్యవధిలోనే 25 కోట్ల మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య చైనా జనాభాలో 17.65 శాతం కావడం గమనార్హం. అంతేకాదు రానున్న మూడు నెలల్లో చైనాలో కరోనా కారణంగా 20 లక్షల మంది చనిపోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా.. -
అక్కడ పరిస్థితులు భయానకం..ఏ క్షణంలోనైనా లాక్డౌన్..ప్లీజ్ వెళ్లకండి
వాషింగ్టన్: చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తమ పౌరులను హెచ్చరించింది అమెరికా. చైనాకు వెళ్లాలనుకునే అమెరికన్లు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పింది. వీలైతే పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించింది. చైనాలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించడానికి ఆలస్యం అవుతోంది. అంబులెన్సులు కూడా సరిగ్గా అందుబాటులో లేవు. పలు చోట్లు ఆంక్షలు కూడా అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు అక్కడకు వెళ్తే ఇబ్బందులు తప్పవు. మేం కూడా వైద్యపరంగా సాయం అందించలేం. అని అమెరికా తమ పౌరులను అప్రమత్తం చేసింది. అలాగే చైనా వెళ్లినవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. కరోనా లాక్డౌన్ ఉండదని ఎవరూ పొరపాటుగా అంచనా వేయవద్దని, పరిస్థితి అదపుతప్పితే చైనా ఏ క్షణంలోనైనా మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం ఉందని అగ్రరాజ్యం తమ పౌరులను హెచ్చరించింది. చదవండి: మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. ఆక్సిజన్‌పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్డౌన్ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్ స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్‌లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు.. -
Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. బెంగళూరు సహా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌తో భయాపడాల్సిన పనిలేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రతివారం కరోనా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని పేర్కొంది. 185 కొత్త కేసులు.. కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటికి దేశంలో గురువారం 185 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,402 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4.47కోట్ల మంది వైరస్ బారినపడగా.. 5.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు -
గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..!
బీజింగ్: చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. రోజు వేల మంది వైరస్ బారినపడుతున్నారు. వందల మంది చనిపోతున్నారు. ఆస్పత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. శ్మశాన వాటికల్లో శవాలు గట్టలుగుట్టలుగా కన్పిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. చైనా లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా వల్ల మంగళవారం ఒక్కరు కూడా చనిపోలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ బుధవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఐదుగురే మరణించారని పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 5,241 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయినట్లు చెబుతోంది. మంగళవారం కొత్తగా 3,101 మందికి వైరస్ సోకిందని చైనా వెల్లడించింది. వీరిలో 52 మంది విదేశాల నుంచి వచ్చిన వారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి చైనాలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,86,276కి చేరిందని పేర్కొంది. అయితే చైనా లెక్కలకు వాస్తవ పరిస్థితుల వ్యత్యాసానికి కారణం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా సోకిన వారు దుష్ప్రభావాలు లేదా మరే ఇతర కారణంతో చనిపోయినా దాన్ని కోవిడ్ మరణాల కిందే లెక్కకడుతున్నాయి. చైనాలో మాత్రం నిబంధనలు మరోలా ఉన్నాయి. వైరస్ సోకి శ్వాసకోస వ్యవస్థ దెబ్బతిని చనిపోయిన వారిని మాత్రమే కరోనా మృతులుగా గుర్తిస్తోంది. వైరస్ సోకి మిగతా ఏ కారణంతో చనిపోయినా.. వారిని కోవిడ్ మృతులుగా గుర్తించడం లేదు. అలాగే లక్షణాలు ఉంటేనే కరోనా కేసుగా లెక్కగడుతోంది. చైనాలోని ఓ ఆస్పత్రిలో శవాలు ఈ కారణంగానే చైనాలో రోజుకు ఎంతమంది చనిపోయినా.. అధికారిక కరోనా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ నిపుణుల అంచనాల ప్రకారం చైనాలో ప్రస్తుతం రోజుకు 40వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వందల మంది వైరస్‌కు బలవుతున్నారు. అక్కడ ఆస్పత్రులు కూడా పడకల ఖాళీ లేనంత రద్దీగా మారాయి. శవాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికల్లో ఖాళీ కూడా లేని దుస్థితి ఉంది. చదవండి: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు -
షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..!
బీజింగ్: కరోనా కోరల నుంచి బయటపడిన ప్రపంచంపై మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతాయని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. చైనాలో కరోనా ఆంక్షలు ఇటీవలే ఎత్తివేశారు. దీంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అక్కడ రోజులు కాదు గంటల్లోనే వైరస్ బాధితులు రెట్టింపు అవుతున్నారు. ఆస్ప్రత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే 90 రోజుల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చైనాలో అత్యధికంగా 60 శాతం మందికి వైరస్ సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా ప్రపంచ దేశాల్లో 10 శాతం మంది వైరస్ బారిన పడవచ్చని చెబుతున్నారు. కొత్త సంవత్సరం సమయానికి చైనాలో మరో కరోనా వేవ్ వస్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి కరోనా మూడో వేవ్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. చదవండి: మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు.. -
Maharashtra: కరోనా మృతుల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం!
ముంబై: కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికీ మృతుల సంఖ్యపై ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. వివిధ ప్రభుత్వ ఆరోగ్య శాఖలు వేర్వేరు సంఖ్య వెల్లడించడంతో అయోమయ పరిస్ధితి నెలకొంది. దీంతో అసలు మృతుల సంఖ్య ఎంత.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక శాఖ 1,39,007 మంది అని వెల్లడించగా మరోశాఖ 1,48,404 అని పేర్కొంది. కరోనా మృతుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉంది. ఆ తరువాత స్ధానంలో కేరళ రాష్ట్రం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. మూడు దశల్లో వచ్చిన కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు ఏకంగా 1,39,007 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇందులో అధిక శాతం కుటుంబ పెద్ద దిక్కు, కుటుంబంకోసం సంపాదించే వారే ఉన్నారు. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలో 2020 మార్చిలో కరోనా వైరస్ విజృంభించడం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి లాక్డౌన్ అమలుచేసింది. 2020 మార్చి నుంచి 2021 అక్టోబర్ వరకు రాష్ట్రంలో 1,39,007 మంది కరోనా కారణంగా మృతి చెందారని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో 92,212 మంది పురుషులు, మిగతా మహిళలు, పిల్లలున్నారు. కాని సార్వజనిక ఆరోగ్య విభాగానికి చెందిన సిబ్బంది ఈ నెలలో నిర్వహించిన తాజా అ ధ్యయనంలో 1,48,404 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ రా ష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది. కరోనా కారణంగా మృతి చెందిన వారిలో పురుషుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ అందులో కుటుంబ పెద్ద దిక్కు, సంపాధించే వారే అధికంగా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి ఇద్దరిని కోల్పోయినవారున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 851 మంది పిల్లలు అనాధలయ్యారు. అప్పట్లో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తల్లిదండ్రులను కోల్పొయి ఇలా అనాధలైన పిల్లలకు సాయం చేసింది. ప్రత్యేక పథకం ద్వారా ఆనాథ పిల్లల పేరట రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసింది. వీటి ద్వారా ఈ పిల్లలకు ప్రతీ నెల రూ.1,225 సాయం అందుతుంది. అంతేగాకుండా పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా అనాథలైన ఈ పిల్లలకు 23 ఏళ్ల వయసొచ్చే సరికి బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలతో పోలిస్తే ముంబై అగ్రస్ధానం... ఆరోగ్య శాఖ అందించిన గణాంకాల ప్రకారం కరోనా మృతుల్లో రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాలతో పోలిస్తే ముంబై ప్రథమ స్ధానంలో ఉంది. రా్ర‹Ù్టరంలో కరోనా రోగుల సంఖ్య 81,35,620 ఉండగా అందులో ఒక్క ముంబైలోనే 11,53,951 ఉంది. అలాగే రాష్ట్రంలో కరోనా రోగులు 98.17 శాతం కోలుకోగా, మృత్యు రేషియో 1.82 ఉందని ఆరోగ్య శాఖ గుణంకాలు చెబుతున్నాయి. ‘టీకా’ చట్టపరమైన బాధ్యత కాదు... ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ప్రజలను కచ్చితంగా ప్రోత్సహిస్తుందని, అయితే టీకాలు వేయడం ప్రభుత్వాల చట్టపరమైన బాధ్యత కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. వ్యాక్సిన్ వల్ల ఎవరైనా దుష్ప్రభావాలకు లోనైతే ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మార్చి 22న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి తమ ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు ప్రజా సౌకర్యాలను ఉపయోగించకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం తరపున ఏఏజీ అమిత్ ఆనంద్ తివారీ, దీని వెనుక గొప్ప ప్రజా ప్రయోజనం ఉందని చెప్పారు. బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి, తద్వారా కరోనా ఇన్ఫెక్షన్ మరింత విస్తరించబోదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఆయన ఉదహరించారు, ఇందులో రాష్ట్రాలు 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ పొందాలని కోరాయి. కరోనా వ్యాక్సినేషన్ మ్యుటేషన్‌ను నివారిస్తుందని, వ్యాక్సిన్ లేని వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉందని కేంద్రం చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి సమ్మతి ఇచ్చిన వ్యక్తికి పూర్తిగా సమాచారం ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తదు. పరిహారం కోసం పిటిషనర్లు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మే 2న విచారణ సందర్భంగా, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ విధానాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచింది, ఇది శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి ఉందని, అయితే ఎవరినీ బలవంతంగా టీకాలు వేయించుకోలేమని పేర్కొంది. కానీ ప్రభుత్వ నిబంధనలు అయితే ప్రయాణానికి టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. -
సుదీర్ఘకాలంగా కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత విముక్తి
కోవిడ్.. రెండేళ్లుగా ప్రజలను అల్లాడిచ్చిన ఈ మహమ్మారి ప్రస్తుతం పత్తాలేకుండా పోయింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓరియంట్ వేరియంట్లతో యావత్ ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకున్న వైరస్ ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. జనాలు కూడా కరోనాను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలేవి పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. సాధారణంగా కోవిడ్ బారిన పడితే 10 లేదా 20 మహా అయితే నెలలో కోలుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి సంవత్సరానికి మించి మహమ్మారితో పోరాడుతూనే ఉన్నాడు. ఏకంగా 411 రోజులుగా అతన్ని కరోనా విడిచిపెట్టడం లేదు. దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న రోగి తాజాగా వైరస్ నుంచి బయటపడ్డాడు. నిర్ధిష్ట వైరస్ జన్యు కోడ్‌ను విశ్లేషించి సరైన చికిత్సను అందిచడంతో కోలుకున్నాడని బ్రిటీష్ పరిశోదకులు తెలిపారు. గైస్ &సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, కింగ్స్ కాలేజ్ లండన్‌లోని పరిశోధకుల బృందం క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో 13 నెలలపాటు కరోనా సోకిన 59 ఏళ్ల వ్యక్తికి చేసిన చికిత్స గురించి వివరించారు. చదవండి: విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు మూత్రపిండం మార్పిడి కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి 2020 డిసెంబరులో కోవిడ్ సోకిందని.. ఈ ఏడాది జనవరి వరకు పాజిటివ్ గానే కొనసాగిందనిప పేర్కొన్నారు. దీర్ఘకాల కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు నానోపోర్ సీక్వెన్సింగ్ టెక్నాలజీతో వేగవంతమైన జన్యు విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో రోగికి బీ.1 వేరియంట్ సోకినట్లు గుర్తించారు. కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా చికిత్స చేసినట్లు పరిశోధకులు తెలిపారు. సదరు వ్యక్తి కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లోనే కరోనాకు గురవ్వడంతో ఈ చికిత్స ద్వారా నయం చేశామని. ఇది ఓమిక్రాన్ వంటి వేరియంట్‌పై సమర్థంగా పనిచేయదని పేర్కొన్నారు. ఇలా మొత్తానికి కరోనా ఫస్ట్ వేవ్ నుంచి వైరస్‌తో పోరాడుతున్న రోగిని విజయవంతంగా దాని నుంచి విముక్తి కలిగించారు. సాధారణ వైరస్ కాదు అయితే అతనికి సోకింది పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఇది నార్మల్ కోవిడ్ కంటే భిన్నమైంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది సోకిన వారు నెలలు ఒక్కోసారి సంవత్సరాలు కూడా కరోనా పాటిజివ్‌గా వస్తుందని సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టుకు చెందిన అంటువ్యాధుల ప్రత్యేక వైద్యుడు ల్యూక్ స్నెల్ తెలిపారు. అంటువ్యాధుల తీవ్ర ముప్పు వల్ల సగం మంది రోగుల్లో ఊపిరితిత్తుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌లో కొత్తగా 7 వేల కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,231 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోన కేసుల సంఖ్య 4,44,28,393కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం సుమారు 45 మరణాలు సంభవించాయని, దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 5 లక్షలకు చేరుకుందని వెల్లడించింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 0.15 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో సుమారు 377 క్తొత కేసులు నమోదయ్యాయని పేర్కొంది. అలాగే కరోనా సంబంధితన మరణాలు రెండు సంభవించాయని తెలిపింది. ప్రస్తుతం తాజగా అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 2.58 శాతంగా ఉందని పేర్కొంది. (చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు) -
కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసులు.. గురువారం ఒక్కసారిగా పెరిగాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకంగా మారింది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,608 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,01,343 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.23 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,42,98,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,36,70,315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,27,206 మంది మృతి చెందారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 1652 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. రెండు వారాల కింద 291 మంది ఆసుప్రతిలో చేరగా.. తాజాగా 591 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య.. 2,08,95,79,722కు చేరింది. బుధవారం ఒక్కరోజే.. 38,64,471 మందికి టీకాలు అందించారు. ఇది కూడా చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా.. -
వామ్మో కరోనా.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఢిల్లీ: క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా.. తాజా కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. నిత్యం 19వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి ఈ మధ్య. మరో వేవ్ ముప్పు తప్పినట్లేనని, వైరస్ ప్రభావం తగ్గిందని, వ్యాక్సినేషన్ ప్రభావంతో కరోనా కట్టడి జరుగుతుందని వైద్య నిపుణులు భావించారు ఇంతకాలం. అయితే కొత్త వేరియెంట్ ప్రస్తావన లేకుండా కొత్త కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కేసులు పెరిగిపోతున్నందున కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరింది. అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్రేసింగ్‌పై దృష్టి సారించాలని సూచించింది. ముఖ్యమంగా ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమం తప్పకుండా పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిలకు లేఖలు రాసింది. అంతేకాదు.. దేశంలో కొవిడ్-19 జబ్బుతో మరణించేవాళ్ల సంఖ్య సైతం యాభైకి తక్కువ కాకుండా నమోదు అవుతోంది. కాబట్టి, కరోనా ప్రొటోకాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య కార్యదర్శి లేఖలో కోరారు. తాజాగా గడిచిన 24 గంటల్లో.. 19,406 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో దేశవ్యాప్తంగా 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన మరణాల సంఖ్య 5,26,649కి చేరింది. పాజిటివిటీ రేటు సైతం ఆందోళనకరంగానే ఉంది. అయితే అదే సమయంలో.. గత 24 గంటల్లో రికవరీల సంఖ్య 19,928కి పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35 వేల నుంచి లక్షా 34 వేలకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! -
జర జాగ్రత్త.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
Corona cases Updates.. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే, కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలపైనే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 20,409 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,988 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటి వరకు 4,33,09,484 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 5,26,258 మంది కరోనా కారణంగా మృతిచెందారు. మరోవైపు.. 2,03,60,46,307 మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. India reports 20,409 new COVID19 cases today; Active caseload at 1,43,988 pic.twitter.com/3YYULK8bZJ — ANI (@ANI) July 29, 2022 ఇది కూడా చదవండి: 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తుకు అవకాశం.. ఈసీ కీలక నిర్ణయం -
IND: కరోనా రెడ్ అలర్ట్.. భయపెడుతున్న కేసులు, మరణాలు
Corona Cases Updates In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు.. 20వేలపైనే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 67 మంది మృత్యువాతపడ్డారు. ఇక, కరోనా నుంచి 20,726 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,50,100 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు.. మొత్తం కేసులు 4,38,68,476కు చేరుకోగా.. కరోనా మృతుల సంఖ్య 5,25,997 మందికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,31,92,379 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు 201.68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. #COVID19 | India reports 21,411 fresh cases, 20,726 recoveries and 67 deaths in the last 24 hours. Active cases 1,50,100 Daily positivity rate 4.46% pic.twitter.com/jxr8ep9utB — ANI (@ANI) July 23, 2022 ఇది కూడా చదవండి: అప్పుడు ప్రధాని మోదీ, ఇప్పుడు సీఎం యోగికి షాకిచ్చిన బీజేపీ ఎంపీ -
దేశంలో కరోనా కలవరం.. భారీగా పెరిగిన కోవిడ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 21,880 మంది వైరస్ బారిన పడగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా నుంచి 21,219 మంది కోలుకున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం 149,482 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో వైరస్ నుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 43,171,653కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43,847,065కు చేరింది. మొత్తం 5,25,930 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసుల్లో మరణాలు 1.20 శాతంగా ఉన్నాయి. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 201 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. గురువారం ఒక్కరోజే 37,06,997 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,53,341 మందికి వైరస్ సోకింది. 1,789 మంది మరణించారు. 8 లక్షలకుపైగా కోలుకున్నారు. జపాన్‌లో అత్యధికంగా 135,239 కేసులు రావటం కలకలం సృష్టిస్తోంది. అమెరికాలో కొత్త కేసులు మళ్లీ లక్ష మార్క్‌ను దాటాయి. 250 మంది మరణించారు. జర్మనీలోనూ 107,819 కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 80వేలు, దక్షిణ కొరియాలో 71 వేల మందికి వైరస్ సోకింది. India records 21,880 new Covid19 cases and 60 deaths in the last 24 hours; Active cases at 1,49,482 pic.twitter.com/HCE6x3uNiW — ANI (@ANI) July 22, 2022 ఇదీ చదవండి: India Covid Updates: దేశంలో కరోనా టెన్షన్ షురూ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు -
IND: దేశంలో కరోనా టెన్షన్ షురూ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్దిరోజలుగా తగ్గుముఖం పట్టిన కేసులు బుధవారం అన్యూహంగా పెరిగాయి. దీంతో, ఆందోళన నెలకొంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,566 మంది వైరస్ బారిన పడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా నుంచి 18,294 మంది కోలుకున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం 1,48,881 పాజిటివ్ కేసులు ఉన్నాయని.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. మరోవైపు.. దేశవ్యాపంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,25,185కు చేరుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,25,870కి చేరింది. వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,31,50,434 చేరుకుంది. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200.91 కోట్లు వ్యాక్సిన్ డోసులను అందించారు. బుధవారం ఒక్కరోజే 29,12,855 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,71,390 మంది వైరస్ బారినపడగా.. మరో 2,015 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో కొత్తగా 1,36,624 మందికి వైరస్ సోకింది. 177 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 1,13,588 మందికి వైరస్ సోకగా.. 367 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకగా.. 125 మంది మరణించారు. #COVID19 | India reports 21,566 fresh cases and 18,294 recoveries in the last 24 hours. Active cases 1,48,881 Daily positivity rate 4.25% — ANI (@ANI) July 21, 2022 -
India: వ్యాక్సినేషన్లో కొత్త రికార్డు.. మోదీ ఏమన్నారంటే..?
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 20వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,528 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, అదే సమయంలో కరోనాతో 49 మంది మృతిచెందారు.దీంతో, దేశంలో ఇప్పటికి వరకు నమోదైన పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 4,37,50,599కి చేరగా.. కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 5,25,709 మందికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. దేశంలో ప్రస్తుతం 1,43,449 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్‌లో పేర్కొంది. కాగా, కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. వయోజన జనాభాలో 98 శాతం మంది మొదటి డోసు టీకాను తీసుకున్నట్టు తెలిపింది. ఇక, శనివారం ఒక్కరోజే 25,59,840 మందికి వ్యాక్సినేషన్ చేశారు. COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449 199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd — ANI (@ANI) July 17, 2022 ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. అసమానంగా కృషిచేసి ఈ రికార్డును అందుకోవడం గర్వకారణం. ఇది కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against COVID-19. https://t.co/K5wc1U6oVM — Narendra Modi (@narendramodi) July 17, 2022 -
భారత్‌లో కరోనా టెన్షన్.. భయపెడుతున్న పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వరుసగా మూడో రోజూ కూడా 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు రావడం ఆందోళన లిగిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,044 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇదే సమయంలో కరోనాతో 53 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,30,071కు చేరింది. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా, 5,25,660 మంది మృతిచెందారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం 1,40,760 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 18,301 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగిందని, యాక్టివ్ కేసులు 0.32 శాతం ఉండగా.. మరణాలు 1.20 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. డ్రాగన్ కంట్రీ చైనాలో కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో నిన్ని ఒక్కరోజే 547 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. #COVID19 | India reports 20,044 fresh cases, 18,301 recoveries, and 56 deaths in the last 24 hours. Active cases 1,40,760 Daily positivity rate 4.80% pic.twitter.com/lvMcyWZ0ti — ANI (@ANI) July 16, 2022 -
కరోనా వైరస్: కలవరపెడుతున్న కొత్త కేసులు
న్యూఢిల్లీ: కొత్త వేరియెంట్ ముప్పు రాకున్నా.. భారత్‌లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20వేలకు పైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో.. 20, 038 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. దేశవ్యాప్తంగా 47 మంది కరోనాతో చనిపోయారు. గత ఇరవై నాలుగు గంట్లో దేశవ్యాప్తంగా 20, 038 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే వంద కేసులు తక్కువే(20, 139) నమోదు అయినప్పటికీ.. మరణాలు మాత్రం ఎక్కువే రికార్డు అయ్యాయి. డెయిలీ పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే ఎక్కువగా నమోదు అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని, బూస్టర్ డోసు పంపిణీ ద్వారా వైరస్ కట్టడికి మరింత కృషి చేస్తామని కేంద్రం ప్రకటించుకుంది. సరిగ్గా 145 రోజుల తర్వాత భారత్‌లో గురువారం 20వేల మార్క్ దాటాయి కొత్త కేసులు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1, 39, 073కి చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో.. 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలు సాధారణ స్థాయికి చేరడం, పాజిటివిటీ రేటు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనాతో ఇప్పటివరకు 5, 25, 604 మంది మృతి చెందారు. జనజీవనం సాధారణంగా మారినప్పటికీ వ్యాక్సినేషన్ ప్రభావంతో కేసులు తక్కువగా నమోదు అవుతుండగా.. చాలామంది టెస్టులకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కొత్త వేరియెంట్ రాకుంటే భారత్ కరోనా గండాన్ని దాటినట్లేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఒకరికి కరోనా పాజిటివ్.. లాక్డౌన్లోకి 3 లక్షల మంది!
బీజింగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా.. ఓ చిన్న నగరంలో మంగళవారం ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలటం వల్ల ఆ నగరం మొత్తం లాక్డౌన్ విధించింది జిన్‌పింగ్ ప్రభుత్వం. దీంతో 3 లక్షల మందికిపైగా లాక్డౌన్లోకి వెళ్లాల్సి వచ్చింది. హెనాన్ ప్రావిన్స్‌లోని వుగాంగ్ నగరంలో సోమవారం ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వ్యాధిని అరికట్టేందుకంటూ మూడు రోజుల లాక్డౌన్ విధించారు అధికారులు. నగరంలోని 3,20,000 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలోని ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను స్థానిక ప్రభుత్వ సంస్థలు అందిస్తాయని తెలిపారు. మరోవైపు.. అత్యవసర పరిస్థితిలో కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆంక్షల చట్రంలో 25 కోట్ల మంది చైనాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్ బ్యాంక్ నోమురా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మంగళవారం 347 స్థానిక కేసులు నమోదయ్యాయి. అందులో 80 శాతానికిపైగా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇదీ చూడండి: ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకుతోంది -
డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా సబ్‌వేరియంట్ కలకలం
షాంఘై: కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు నగర హెల్త్ కమిషన్ డిప్యూటీ డెరెక్టర్ జావో డాండన్ వెల్లడించారు. రెండు నెలల అనంతరం షాంఘై నగరంలో జూన్ మొదటివారంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయితే కొత్త కేసులు వెలుగుచూసిన ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానికంగా వ్యాప్తి చెందుతున్న కేసుల సంఖ్య పెరిగినట్లు జావో వివరించారు. దీంతో షాంఘైలో నివాసముండే వారికి జులై 12-14 మధ్య రెండు రౌండ్ల కరోనా పరీక్షలు నిర్వహించిననున్నట్లు చెప్పారు. విదేశాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ BA.5 రకాన్ని చైనాలో తొలిసారి మే 13న షాంఘై నగరంలో గుర్తించారు. ఉగాండ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో ఇది బయటపడింది. ఇప్పుడు అందులోనే సబ్వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. చైనాలో ఇప్పటివరకు మొత్తం 2,26,610 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 5,226 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో 2,20,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,004 యాక్టివ్ కేసులున్నాయి. -
దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 18,257 మందికి పాజిటివ్‌గా తెేలింది. వైరస్ బారినపడినవారిలో 14,553 మంది కోలుకున్నారు. మరో 42 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,22,651కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,428కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,28,428(0.30 శాతం) యాక్టివ్ కేసులున్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.08శాతంగా నమోదైంది. కరోనా రికవరీ రేటు 98.50శాతంగా ఉంది. మరణాల రేటు 1.20శాతంగా నమోదైంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.76 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మరో 4,32,777 కరోనా పరీక్షలు నిర్వహించారు. -
తెలంగాణలో కరోనా రెడ్ అలర్ట్.. కేసులు ఎన్నంటే..?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 608 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో కరోనా నుంచి 459 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా మరణాలు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,146 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు తెలంగాణలో 8,05,137 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు 7,95,880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా బులిటెన్ ప్రకారం.. హైదరాబాద్ 329, మేడ్చల్ మల్కాజ్గిరి 54, ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 5, జగిత్యాల 6, జనగామ 7, గద్వాల 1 , కరీంనగర్ 10, ఖమ్మం 11, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 4, మంచిర్యాల 5, మెదక్ 1 , నాగర్ కర్నూల్ 2, నల్గొండ 7, నారాయణపేట్ 4, నిజామాబాద్ 10, పెద్దపల్లి 12, సిరిసిల్ల 4, రంగారెడ్డి 67, సంగారెడ్డి 16, సిద్దిపేట 6, వికారాబాద్ 7, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 2, యాదాద్రి 6 చొప్పున నమోదయ్యాయి. Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.08.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/VwoZEmewKJ — IPRDepartment (@IPRTelangana) July 8, 2022 -
Corona Updates: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల చూస్తుంటే ఫోర్త్‌వేవ్ మొదలైందా అనే సంకేతాలకు ఊతమిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18,930 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,66,739కు పెరిగింది. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 35 మంది మరణించారు. ఇప్పటి వరకు 5,24,305 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 14,650 మంది కోలుకోగా మొత్తం మహమ్మారి నుంచి 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 1,19,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.52శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు 4,29,21,977 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇక ఇప్పటి వరకు 198 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. చదవండి: హైదరాబాద్‌లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా #COVID19 | India reports 18,930 fresh cases, 14,650 recoveries, and 35 deaths in the last 24 hours. Active cases 1,19,457 Daily positivity rate 4.32% pic.twitter.com/cAqSEIWR0L — ANI (@ANI) July 7, 2022 -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మరో 28 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 16,159 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,35,47,809కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,270కి పెరిగింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసుల సంఖ్య 737 పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,15,212 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడినవారిలో 98.53 శాతం మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. మరణాల శాతం 1.21గా నమోదైంది. రోజూవారి పాజిటివిటీ రేటు 3.56శాతం కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.54శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.20 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన 4,54,465 కరోనా పరీక్షలతో కలిపి మొత్తం పరీక్షల సంఖ్య 86.49 కోట్లకు చేరింది. -
భారత్‌ను టెన్షన్ పెడుతున్న కరోనా.. పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు, మరణాల రేటు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో 16,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో వైరస్ కారణంగా మరో 31 మంది మృతిచెందారు. కాగా, ప్రస్తుతం దేశంలో 1,11,711 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 13,929 బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 4,35,02,429కి చేరాయి. ఇందులో 4,28,65,519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,199 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉంది. ఇక మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 197.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. #COVID19 | India reports 16,103 fresh cases, 13,929 recoveries and 31 deaths, in the last 24 hours. Active cases 1,11,711 Daily positivity rate 4.27% pic.twitter.com/bSAssBCfIX — ANI (@ANI) July 3, 2022 -
కరోనా భారత్: ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గత వారంగా క్రమం తప్పకుండా 15వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి తోడు డెయిలీ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. తాజాగా.. దేశంలో ఒక్కరోజులో 17,092 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 29 నమోదుకాగా.. 14,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి చేరుకోగా.. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రేసింగ్‌పై దృష్టిసారించాలని కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతోంది. #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/VkryOJG5vz pic.twitter.com/QxO99p5odW — Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2022 భారత్‌లో ఇప్పటిదాకా కరోనాతో 5,25,168 మంది మరణించారు. కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,28,51,590 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా 1,97,84,80, 015 డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలను ఇప్పటికే పలు దేశాలు పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. -
భారత్‌లో కరోనా: యాక్టివ్ కేసులు పైపైకి..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 17, 070 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే (18వేలకుపైగా) తక్కువే అయినప్పటికీ.. పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం, రికవరీలు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 17,070 కేసులు నమోదు అయ్యాయి. 23 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07, 189కి చేరింది. దేశంలో 3.40 శాతానికి కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. ఈ మధ్యకాలంలో రికవరీల సంఖ్య పెరగకపోవడంపై వైద్య విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని అంచనా వేస్తున్నారు. ఇక సుమారు 122 రోజుల తర్వాత.. దేశంలో లక్ష మార్క్‌ను దాటేశాయి కరోనా యాక్టివ్ కేసులు. గత రెండు వారాల సగటున 78 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోందని, మరణాలు కూడా 119 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ విషయంలోనూ కేంద్రం స్పష్టమైన ప్రకటనలూ చేస్తూ వస్తోంది. #Unite2FightCorona ➡️ Over 86.28 Cr COVID Tests conducted so far. ➡️ Weekly Positivity Rate currently at 3.59%. ➡️ Daily Positivity Rate stands at 3.40%. pic.twitter.com/aRFcPhQ8Is — Ministry of Health (@MoHFW_INDIA) July 1, 2022 ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. గత వారం రోజుల్లో 4.1 మిలియన్ కేసులు నమోదు అయ్యాయని, 18 శాతం పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి కథ ముగియలేదని, మార్పు తీసుకుని వేరియెంట్ల రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తోంది డబ్ల్యూహెచ్‌వో. చదవండి: కరోనా మారుతోంది.. జాగ్రత్తగా ఉండండి -
ఫోర్త్ వేవ్ రెడ్ అలర్డ్: లక్ష దాటిన యాక్టివ్ కేసులు
Corona Active Cases In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 39 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 13,827 మంది కోలుకున్నారు. అయితే, రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.16 శాతానికి పెరిగింది. #COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours. Active cases 1,04,555 Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr — ANI (@ANI) June 30, 2022 ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఫిబ్రవరి 28 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటడం ఇదే రెండోసారి. కాగా, ఫిబ్రవరి 28న దేశంలో 1,02,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ జూన్ 30(నేడు)వ తేదీన ఆ మార్కు దాటి యాక్టివ్ కేసులు పెరిగాయి. -
భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారతీయులకు స్వల్ప ఊరట లభించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,793 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్‌తో 27 మంది మృతిచెందారు. ఇక, కరోనా నుంచి 9,486 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 96,700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశంలో 43,418,839 మంది వైరస్ బారినపడగా.. కరోనాతో 5,25,047 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 4,27,97,092 కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది. భారత్‌లో సోమవారం 19,21,811 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 366,742 మంది కరోనా బారినపడగా.. మరో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,351,925కు చేరుకుంది. ఇది కూడా చదవండి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 25 మంది.. -
Corona Alert: దేశంలో 45 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్‌తో దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 పాజిటవ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఇక, దేశంలో ప్రస్తుతం 94,420 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,87,606 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,25,020 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. ఇక దేశంలో 1,97,11,91,329 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇక, ఆదివారం 11,739 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సోమవారానికి కేసుల సంఖ్య ఒక్కసారిగా 17వేల మార్కును దాటింది. దీంతో, పాజిటివ్ కేసుల సంఖ్య 45 శాతం పెరిగింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 20 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య 17వేలు దాటడం జూన్ 24న, మళ్లీ సోమవారమే(జూన్ 27) చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 6493 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 1891 కేసులు నమోదయ్యాయి. India reports 17,073 fresh COVID19 cases & 21 deaths today; Active caseload at 94,420 pic.twitter.com/NBcPK0kcl7 — ANI (@ANI) June 27, 2022 ఇది కూడా చదవండి: దావత్‌లు ఇవ్వరు.. డీజే, బారాత్‌లు బంద్.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు అక్కడ!! -
భారత్‌లో కరోనా: కొత్తగా కేసులు ఎన్నంటే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో.. 15,940 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. పాజిటివ్ కేసులు కాస్త తగ్గినప్పటికీ.. వరుసగా రెండు రోజుల పాటు 15 వేల పైచిలుకు కేసులు నమోదవడం విశేషం. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 91,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.21 శాతంగా ఉంది. కరోనా వల్ల గత 24 గంటల్లో 20 మంది చనిపోయారు. కరోనాతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5,24,974కి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4, 27,61,481కి చేరుకుంది. కరోనా బారిన పడినవారిలో 98.58 శాతం కోలుకుంటున్నారు. ఇక గడచిన 24 గంటల్లో 15,73,341 కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. దాంతో, దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 196.94 కోట్ల డోసులు పంపిణీ జరిగింది. -
భారత్‌లో కరోనా.. ఒక్కసారిగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ: కొత్త వేవ్ సంకేతాలకు ఊతమిచ్చేలా.. భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలతో కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 30 శాతం కేసులు పెరిగిపోగా.. నాలుగు నెలల తర్వాత దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం నుంచి రోజూ 10 వేలకుపైనే కొత్త కేసులు వస్తు న్నాయి. గురువారం 13,313 కేసులు.. కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శుక్రవారం 17,336 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అంటే.. గత ఇరవై నాలుగు గంటల్లో ఇది 30 శాతం(4,294 కేసులు) మేర పెరిగింది. గత ఇరవై నాలుగు గంటల్లో.. కరోనాతో 13 మంది చనిపోయారు. అలాగే పాజిటివిటీ రేటు కూడా దాదాపు 4 శాతంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 కేసులు వచ్చాయి. కేరళలో 3,890, ఢిల్లీ 1,934 కేసులు, తమిళనాడు 1,063 కేసులు, హర్యానా(872) కేసులు వచ్చాయి. ఢిల్లీలో అంతకు ముందు రోజు 926 కేసులు రాగా, తాజాగా 1,934 కేసులతో రెట్టింపు కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి.. వైరస్ మ్యూటేషన్ గురించి ఆరా తీశారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని పలు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కరోనాతో ఇప్పటిదాకా దేశంలో 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి. 4,27,49,056 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,96,77,33,217 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. -
Covid 4th Wave: గత అనుభవాలతో గట్టిగా ఎదుర్కొందాం..!
కరోనా.. ప్రపంచాన్ని గడగడ లాడించిన మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రూపుమార్చుకుని.. కొత్త వేరియంట్లు/ ఉప వేరియంట్లతో మరోసారి దాడికి సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాల్లో విజృంభిస్తున్న ఈ వైరస్.. కొద్దిరోజులుగా మన దేశంలోనూ ప్రభావం చూపుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ గణనీయంగానే నమోదవు తున్నాయి. గత మూడు వేవ్‌ల తాకిడికి మనమంతా తీవ్రంగా నష్టపోయినా గత అనుభవాలు నేర్పిన పాఠంతో వైరస్‌ను గట్టిగా ఎదుర్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ కొద్ది నెలలుగా కలకలం.. 2019 డిసెంబర్లో చైనాలో కరోనా కలకలం మొద లైంది. అప్పటికే చాప కింద నీరులా చాలా దేశా లకు విస్తరించిన మహమ్మారి.. ఒక్కసారిగా పంజా విసరడం మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ దేశాలను కబళించింది. ఒకటి, రెండు, మూడో వేవ్ అంటూ కరాళనృత్యం చేసింది. విస్తృతమైన వ్యాక్సినేషన్ ఓవైపు.. విపరీత మైన మ్యుటేషన్లతో వైరస్ బలహీనపడటం మరోవైపు.. కలిసి అదుపులోకి వచ్చింది. కాదు వచ్చినట్టే కనబడింది. కొద్దిరోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, కొన్ని దేశాల్లో అయితే లక్షల్లో నమోదవుతూ ఉండటం కలవరం రేపుతోంది. మళ్లీ మాస్కుల్లోకి.. కరోనా మహమ్మారి మొదలైన కొత్తలో అందరూ డాక్టర్లే. ఆ మందు పనిచేస్తుందని ఒకరు.. ఈ మందు పనిచేస్తుందని మరొకరు.. ఆయుర్వేదం నుంచి అల్లోపతి దాకా ఎన్నో ప్రయోగాలు. చివరికి వ్యాక్సిన్లు తెరపైకి వచ్చినా ఎన్నో అనుమానాలు. అన్ని అనుమానాలను, ఆటంకాలను దాటేసుకుని టీకాలు అందరికీ చేరినా.. కరోనా కొత్త రూపాంత రాలతో మళ్లీ విజృంభిస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నా మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో చాలా వరకు ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్లవేనని.. వాటితో లక్షణాలు తీవ్రంగా ఏమీ ఉండటం లేదని చెప్తున్నారు. జనం గుమిగూడిన చోట మాస్కు ధరించడం, శానిటైజేషన్ వంటి కోవిడ్ మార్గదర్శకాలను సరిగ్గా పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. మన దేశంలోనూ మెల్లగా.. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం రోజులుగా రోజూ 10 వేలకుపైనే కొత్త కేసులు వస్తు న్నాయి. గురువారం 13,313 కేసులు వచ్చినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పాజిటివిటీ రేటు 2.8 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 83,990కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 కేసులు వచ్చాయి, ఒకరు చనిపోయారు. కేరళలోని 11 జిల్లాలు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం వరకు నమోదవుతోంది. కేరళలో గురువారం ఒక్క రోజే నలుగురు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,934 పాజిటివ్ కేసులురాగా.. పాజిటివిటీ రేటు ఏకంగా 10% దాటడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళనాడులో 1,063 కొత్త కేసులు వచ్చాయి. కర్ణాటకలో ఒక్కరోజే 858 కేసులురాగా.. అందులో సగానికి పైగా కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి. తెలంగాణలో 494 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు కరోనా వేవ్‌ల ప్రారంభంలోనూ ఇదే తరహాలో కేసులు నమోదు అయ్యాయని.. ఇది నాలుగో వేవ్‌కు ప్రారంభం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, తాజాగా కేంద్ర మంత్రి çస్మృతి ఇరానీ, కేంద్ర మాజీ మంత్రి ఆజాద్‌కు కోవిడ్ సోకింది. కొత్త వేరియంట్లతో.. చైనాలో మొదలైన నాటి నుంచి కరోనా ఎన్నో రూపాంతరాలు చెందింది. పదుల కొద్దీ మ్యుటేషన్లు చెందింది. అందులో ఆల్ఫా, డెల్టా వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ తర్వాత అన్నింటినీ తోసిరాజంటూ ఒమిక్రాన్ వచ్చింది. మెల్లమెల్లగా ఒమిక్రాన్‌లోనూ బీఏ.2, బీఏ.4, బీఏ.5 వంటి సబ్ వేరియంట్లు పుట్టాయి. ఏ వేరియంటో తేల్చేందుకు... దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. ఒక్కసారిగా కేసుల పెరుగుదల నమోదైన జిల్లాలు, ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని రాష్ట్రా లకు సూచించింది. ఏదైనా కొత్త వేరియంట్/ ఉప వేరియంట్గానీ పుట్టిందా? ఏ వేరియంట్ ఇలా విజృంభిస్తోందన్న దానిని జీనోమ్ సీక్వెన్సింగ్‌తో తేల్చనున్నారు. టీకా.. ఇమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలై రెండేళ్లు కావస్తోంది. చాలా వరకు వ్యాక్సిన్ల ప్రభావశీలత (ఇమ్యూనిటీ సమ యం) గరిష్టంగా 6 నెలల–9 నెలల వరకు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా సోకి తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా దాదాపు ఇంతేకాలం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజల్లో కరోనా సోకి తగ్గడం, వ్యాక్సిన్లతో వచ్చిన ఇమ్యూనిటీ బాగా తగ్గి పోయి ఉంటుందని.. కరోనా కేసులు పెరగడా నికి ఇదీ కారణమని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఒమిక్రాన్ ఉప వేరి యంట్లు అయిన బీఏ.2, బీఏ.4, బీఏ.5 రకాలు వ్యాప్తిలో ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో బీఏ.2 వేరియంట్‌కు వ్యాప్తి సామర్థ్యం ఎక్కువని వెల్లడించాయి. ఇవి ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న ఇమ్యూనిటీ నుంచి తప్పించుకుని, ఇన్ఫెక్షన్ కలిగించగలవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఇదీ.. కరోనా మరోసారి పంజా విసురుతుండటం తో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు అప్రమత్తమ య్యాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించలేకున్నా.. ముందు జాగ్రత్త చర్యలు,నియంత్రణలను అమలు చేస్తున్నాయి. అమెరికాలో కేసులు గణనీయంగా నమోద వుతున్నాయి. దీనితో ఆ దేశం వ్యాక్సినేష న్ను మరింత విస్తరించింది. తొలిసారిగా 6 నెలల నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారు లకూ వ్యాక్సిన్లు వేసేందుకు అను మతిం చింది. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అనుమతి జారీ చేసింది. యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతుండ టంతో ప్రజలు జాగ్రత్తలు చేపట్టాలని ప్రభు త్వాలు హెచ్చరించాయి. ముఖ్యంగా పోర్చు గల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, గ్రీస్, నెదర్లాండ్స్, డెన్మార్క్ దేశాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఆయా దేశాల్లో కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరికలూ స్వల్పంగా పెరుగుతున్నాయి. పోర్చుగల్‌లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. 90% పైగా బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. అయినా ఇటీవల కేసులు పెరగడం, మరణాల రేటు కూడా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వీరిలో వృద్ధుల శాతం ఎక్కువగా ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇరాక్‌లో మరో కోవిడ్ వేవ్ మొదలైనట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, తైవాన్, బ్రెజిల్లో రోజుకు 30, 40 వేల కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, చిలీ, ఇజ్రా యెల్ తదితర దేశాల్లోనూ 10 వేలకుపైగా కొత్త కేసులు వస్తున్నాయి. తైవాన్, బ్రెజిల్, రష్యా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. -
Covid: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,899 మంది కోవిడ్ బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే వైరస్‌తో 15 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 72,474. యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,855కు చేరుకుంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 7.71 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,99, 363కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 14,88,807 మందికి కరోనా వ్యాక్సిన్లను అందించినట్టు కేంద్రం తెలిపింది. చదవండి: Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్ -
భారీగా పెరిగిన కరోనా కేసులు.. నిన్నటితో పోలిస్తే 38% అధికం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు అమాంతం పెగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్ బారినపడ్డారు. నిన్నటితో పోలిస్తే 38% ఎక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తరువాత ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం దేశంలో నాలుగో వేవ్ ప్రారంభమైందా అనే అనుమానాలు రేకేత్తిస్తోంది. పెరిగిన యాక్టివ్ కేసులు భారత్‌లో ఇప్పటి వరకు 4,32,57,730 మంది కరోనా బారినపడ్డారు. బుధవారం 11 మంది కోవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 5,24,803కు పెరిగింది. నిన్న ఒక్క రోజు 7,624 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4,26,74,712 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. యాక్టిక్ కేసుల సంఖ్య 58,215కు పెరిగింది. పాజిటివిటీ రేటు 2.35% శాతంగా ఉంది. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మహారాష్ట్ర టాప్ అత్యధికంగా మహారాష్ట్రలో 4,024, కేరళలో 3,488 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానాల్లో ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క ముంబైలోనే నిన్న రెండు వేలకు పైగా కేసులొచ్చాయి. అయిదు నెలల తర్వాత అక్కడ ఇన్ని కేసులు కావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజు 1.21 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటి వరకు 195 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. చదవండి: AP: నియంత్రణలోనే కరోనా.. పొరుగుతో పోలిస్తే తక్కువే -
భారత్ కు పొంచి ఉన్న కరోనా ముప్పు
-
Corona Virus: 50 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతోపాటు యాక్టివ్ కేసులు సంఖ్య కూడా పెరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా కరోనా మహమ్మారి కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. కిందటి రోజుతో పోలిస్తే 2 వేల కేసులు తక్కువ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,594 మంది కోవిడ్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,36,695కు చేరాయి. యాక్టిక్ కేసుల సంఖ్య 50,548కు పెరిగింది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తుండటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీని ప్రకారం గత 24 గంటల్లో 3,21,873 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పాజిటివిటీ రేటు 2.32 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,26,61,370 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.67%గా ఉంది. చదవండి: కరోనా డేంజర్ బెల్స్.. ‘ఫోర్త్ వేవ్’ మొదలైందా? -
కరోనా డేంజర్ బెల్స్: 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్‌కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెబుతున్నారు. భారత్‌లో కేసుల నమోదు చూస్తుంటే కోవిడ్ నాలుగో వేవ్ దగ్గరికి వచ్చినట్లే కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఒక్క రోజే 10 మంది మరణించడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,24,771కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువగా ఉన్నాయి. ప్రస్తుతం 47,995 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 4,592 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీని ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు ఉన్నాయి. కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 నమోదయ్యాయి.ఇక యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపింణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొంది. చదవండి: పోస్ట్ కోవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయా? నిర్లక్ష్యం చేయకండి.. -
కరోనా విజృంభణ: ఎనిమిది వేలకు పైగా కొత్త కేసులు
న్యూఢిల్లీ: మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా.. మెల్లగా తన వ్యాప్తిని అంతకంతకూ విస్తరిస్తూ పోతుంది. పరిస్థితులు సాధారణ స్థితిక వచ్చేసాయని ప్రజలు మాస్క్‌లు, శానిటైజర్ల వాడకం తగ్గించేశారు. దీంతో మరోసారి భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో ఎనిమిది వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 8,582 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన మూడు నెలల్లో ఇంత భారీగా కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. శనివారం కోవిడ్‌తో 4 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే 3,791 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం కోవిడ్‌పై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 2,922 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో ప్రస్తుతం 44,513 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,24,761కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,435 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4,26,52,743గా ఉంది. చదవండి: చదువుకున్నంత మాత్రాన పని చేయాలనేం లేదు -
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
-
ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా..చాపకింద నీలా మళ్లీ విస్తరిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది. దేశ విదేశాల రాకపోకలు పెరిగాయి. ప్రజలు మాస్క్, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి అంశాలను పూర్తిగా విస్మరించారు. పబ్బులు,క్ల ్లబ్బులు, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, విహార యాత్రల్లో మునిగితేలుతున్నారు. అడ్డూ అదుపు లేని ప్రయాణాలు, ఒకే చోట వేలాదిమంది గుమిగూడటం వంటి చర్యలతో వైరస్ మరోసారి వణికిస్తోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో ఏడు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 7,584 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన మూడు నెలల్లో ఇంత భారీగా కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో అత్యధికంగా 2,813 మంది కరోనా బారినపడ్డారు. గురువారం కోవిడ్‌తో 24 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే 3,791 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 36,267 ఉన్నాయి. చదవండి: ముంచుకొస్తుంది.. జాగ్రత్త పడదాం! ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,747కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కి పెరిగింది. దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,44,092కి చేరింది. #COVID19 | India reports 7,584 fresh cases, 3,791 recoveries, and 24 deaths in the last 24 hours. Total active cases are 36,267 pic.twitter.com/kwQIIy8K3s — ANI (@ANI) June 10, 2022 -
కరోనా ఫోర్త్ వేవ్!: మూడు నెలల తర్వాత హయ్యెస్ట్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. కరోనా వైరస్ నాలుగో వేవ్‌ను దాదాపుగా ధృవీకరిస్తున్నారు వైద్య నిపుణులు. గత 24 గంటల్లో.. ఏకంగా 7,240 తాజా కేసులు నమోదు అయ్యాయి. మార్చి 2 తర్వాత ఇదే అత్యధిక కేసులు కావడ గమనార్హం. భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుసగా రెండో రోజూ దేశంలో కొత్త కేసుల పెరుగుదల 40 శాతంపైగా కనిపిస్తోంది. మొత్తం 7, 240 తాజా కేసులు నమోదు అయ్యాయి. మూడున్నర లక్షల టెస్టులకుగానూ.. ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్ర, కేరళలో కొత్త, క్రియాశీలక కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క ముంబై నగరంలోనే బుధవారం 1, 765 కేసులు వెలుగు చూశాయి. దీంతో మహారాష్ట్ర అప్రమత్తం అయ్యింది. క్లోజ్డ్ పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళ మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందని చెప్తుండడం విశేషం. తాజా కరోనా మరణాలు ఎనిమిది రికార్డు కాగా.. దేశంలో ఇప్పటిదాకా కరోనాతో 5, 24, 723కి చేరింది. డెయిలీ పాజిటివిటీ రేటు 2.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.31 శాతంగా నమోదు అవుతోంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 32,498కి చేరడం కలవర పరుస్తోంది. #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/EcaW7dPkRU pic.twitter.com/XgCWmTPGtU — Ministry of Health (@MoHFW_INDIA) June 9, 2022 చదవండి: కేసులు పెరుగుతున్నాయ్.. తెలంగాణలో టెస్టులు పెంచండి -
మహారాష్ట్ర: పెరిగిపోతున్న కరోనా కేసులు
ముంబై: మహారాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రం అక్కడి వైద్యశాఖ విడుదల చేసిన బులిటెట్ ప్రకారం.. గత ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా 2,701 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ముంబైలోనే 1,765 కేసులు వెలుగు చూడడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐదు నెలల తర్వాత ఇదే హయ్యెస్ట్ కేసులు. ఒక్కరోజులోనే ముంబైలో కేసుల పెరుగుదల 42 శాతం నమోదు అయ్యింది. ముంబైలో మంగళవారం బులిటెన్‌లో 1,242 కేసులు రికార్డు అయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత వెయ్యికి పైగా కేసులు వరుసగా రెండు రోజుల పాటు నమోదు అయ్యాయి. ఇక ముంబై తర్వాత థానేలో కరోనా విజృంభణ అధికంగా ఉంది. పుణేతో పాటు రాయ్‌గడ్, పాయిగఢ్‌లోనూ కేసులు అధికంగానే నమోదు అవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 1,327 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా మరణాలు శూన్యం. ప్రస్తుతం 9,806 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. Maharashtra | 2701 new COVID cases were reported today in the state while 1327 patients were discharged. With zero deaths today, active cases stood at 9806 pic.twitter.com/paj2ceOecp — ANI (@ANI) June 8, 2022 -
కరోనా అప్డేట్స్.. నిన్నటితో పోలిస్తే 40 శాతం అధికంగా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి దాకా అదుపులోనే ఉందనుకున్న మహమ్మరి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో పాటిజివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో అయిదు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 5, 223 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇది నిన్నటితో పోలిస్తే కేసుల్లో 40 శాతం పెరుగుల కనిపించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం కోవిడ్‌తో ఏడుగురు మృత్యువాతపడ్డారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,715కు చేరింది. అయితే అత్యధికంగా 84శాతం కేసులు అయిదు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో 1,881, కేరళలో 1,494, ఢిల్లీలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో 227 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 3,345 మంది కోలుకున్నారు, దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,36,710కి చేరింది. దేశంలో రికవరీ రేటు 98.72%గా ఉంది. యాక్టివ్ కేసులు 28,857 ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 1,94,43,26,416 డోసుల వ్యాక్సిన్లను కేంద్రం అందించింది. చదవండి: వెన్నులో వైరస్ల వణుకు.. ఒకటి పోతే మరొకటి! -
కరోనా అలర్ట్: ఆఫీసుల్లో, ప్రయాణాల్లో మాస్క్ మస్ట్!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మరోసారి తన ఉనికిని చాటుతోంది. గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతున్న కేసుల్లో పెరుగుదల ఊగిసలాట కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. శనివారం కేంద్రం విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 3,962 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 26 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. తాజాగా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ముంబై నుంచే అధికంగా కేసులు వస్తున్నాయి. ఈ తరుణంలో.. అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో మాస్క్ తప్పనిసరిని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అదనపు సీఎస్ డాక్టర్ ప్రదీప్ వ్యాస్.. జిల్లా అధికారులకు ఉత్తర్వులు పంపించారు. రైళ్లు, బస్సులు, సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్, ఆఫీసులు, ఆస్పత్రులు, కాలేజీలు, స్కూల్స్.. ఇలా క్లోజ్డ్గా ఉండే పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరి అని ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే బహిరంగ ప్రాంతాల్లో మాత్రం మాస్క్ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అయినప్పటికీ మాస్క్ స్వచ్ఛందంగా ధరించాలంటూ సీఎం ఉద్దవ్ థాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 2,697 మంది కరోనా నుంచి కోలుకోగా... 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 22,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ కరోనా ఉదృతి ఉన్నప్పటికీ.. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. తాజా కరోనా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,72,547కి చేరుకున్నాయి. మొత్తం 4,26,25,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా 26 మరణాలతో.. ఇప్పటి వరకు 5,24,677 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా, క్రియాశీల రేటు 0.05 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,93,96,47,071 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 11,67,037 మంది వ్యాక్సినేషనల్‌లో పాల్గొన్నారు. #LargestVaccineDrive #Unite2FightCorona #AmritMahotsav pic.twitter.com/kbmuYEmk8O — Ministry of Health (@MoHFW_INDIA) June 4, 2022 కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ.. శుక్రవారం ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెరుగుతున్న కోవిడ్ కేసులు, పాజిటివిటీ రేటుపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖలు రాసింది. వైరస్ కట్టడికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. చదవండి: భారత్‌లో మంకీపాక్స్ కలకలం -
Corona: కరోనా కేసులు పైపైకి.. మళ్లీ మాస్క్ తప్పదా!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగు ముఖం పట్టాయి. తాజాగా శుక్రవారం బులిటెన్‌లో 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్నటి కేసులతో పోలిస్తే ఇవాళ అదనంగా మరో పదిహేను వందలకు పైగా కొత్త కేసులు రావడం గమనార్హం. దేశంలో తాజాగా 4,041 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్‌తో పది మంది మృతి చెందారు. అలాగే యాక్టివ్ కేసులు కూడా 20 వేల మార్క్‌ను దాటేసి.. 21, 177కి చేరాయి. డెయిలీ పాజిటివిటీ రేటు.. 0.60 శాతంగా, వీక్లీ రేటు 0.56 శాతంగా నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే బుధవారం.. 2, 745 కేసులు నమోదు అయ్యాయి. నాలుగున్నర లక్షల శాంపిల్స్‌కుగానూ.. గురువారం ఏకంగా 3, 172 కేసులు వెలుగు చూశాయి. దాదాపు 22 రోజుల తర్వాత మూడు వేల మార్క్ దాటింది కరోనా. ఇక గురువారం యాక్టివ్ కేసుల సంఖ్య 19, 509 ఉండగా.. శుక్రవారం ఆ సంఖ్య 21, 177కి చేరింది. ఇలాగే ఉంటే మాస్క్ తప్పదు! దేశంలో కరోనా కేసుల పెరుగుదల మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మాస్క్ నిబంధనను మళ్లీ తెస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, కేరళలో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో చాలా చోట్ల కరోనా నిబంధనలకు కాలం చెల్లింది. అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వాటి గురించి ఆలోచించాలంటూ కేంద్రం, పలు రాష్ట్రాలను అప్రమ్తతం చేస్తోంది. -
కరోనా అలర్ట్.. మళ్లీ పెరుగుతున్న కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క రోజులో ఏకంగా వెయ్యి కొత్త కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో 3, 172 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేసుల పెరుగుదలపై కీలక ప్రకటన చేసింది. కొత్త కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1, 081 కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే బుధవారం.. 2, 745 కేసులు నమోదు అయ్యాయి. నాలుగున్నర లక్షల శాంపిల్స్‌కుగానూ.. గురువారం ఏకంగా 3, 172 కేసులు వెలుగు చూశాయి. దాదాపు 22 రోజుల తర్వాత కేసులు 3వేల మార్క్ దాటినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక డెయిలీ పాజిటివిటీ రేటు 0.05శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.67గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 19, 509గా ఉంది. ఇది కూడా ఆందోళనకు గురి చేసే అంశమని కేంద్రం పేర్కొంది. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 584 మంది కోలుకున్నారు. భారత్‌లో కరోనా రికవరీ రేటు ఇప్పటిదాకా 98.74 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్ ప్రభావంతో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని పేర్కొంది కేంద్రం. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో ఉత్తర భారత్‌కు చెందిన విద్యార్థులు కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆ రాష్ట్రంలోనూ వంద దాకా కొత్త కేసులు వెలుగు చూశాయి. చదవండి: కోవిడ్ సోకితే అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం! -
దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం
ఢిల్లీ: భారత్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన దేశంలోనూ వెలుగు చూడడం ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌లో బీఏ.4, బీఏ.5 సబ్‌వేరియెంట్ కేసులు బయటపడినట్లు ఇన్సాకాగ్ (INSACOG) ప్రకటించింది. బీఏ.4 కేసులు తెలంగాణ, తమిళనాడులో వెలుగు చూడగా.. బీఏ.5 కేసు తెలంగాణలోనే బయటపడిందని తెలిపింది. ఒమిక్రాన్ వేరియెంట్లో ఉపవేరియెంట్లు బీఏ.4, బీఏ.5లు.. కరోనాలో ఇప్పటిదాకా అత్యంత వేగవంగా వైరస్‌ను వ్యాప్తి చెందించేవిగా పేరొందాయి. దక్షిణాఫ్రికా నుంచి దీని విజృంభణ మొదలైందని తెలిసిందే. అయితే ఒమిక్రాన్ ప్రధాన వేరియంట్ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి ద్వారా సామాజిక వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. ఇన్సాకాగ్ ఆదవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. తమిళనాడులో 19 ఏళ్ల యువతిలో బీఏ.4 ఉపవేరియెంట్ బయటపడిందని, అలాగే తెలంగాణలో (హైదరాబాద్ ఎయిర్పోర్ట్) సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లోనూ ఈ ఉపవేరియెంట్ వెలుగు చూసింది. మరోవైపు తెలంగాణలోనే 80 ఏళ్ల వ్యక్తికి బీఏ.5 ఉపవేరియెంట్ కనుగొన్నట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఈ వృద్ధుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, పైగా వ్యాక్సినేషన్ ఫుల్‌గా పూర్తికాగా, కేవలం స్వల్పకాలిక లక్షణాలే బయటపడినట్లు తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన అధికారులు.. కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు. భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సబ్ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ.. మరిన్ని వేరియెంట్లు.. అందులో ప్రమాదకరమైనవి ఉండే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం).. కరోనా వేరియెంట్ల కదలికలపై, కేసుల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించే కేంద్ర ఆధీన విభాగం. చదవండి: శారీరకంగా కలవడం వల్లే వైరస్ విజృంభణ! -
హైదరాబాద్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్ కేసులు తెలంగాణలో వెలుగుచూశాయి. ఇవి దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నమోదయ్యాయి. సబ్ వేరియంట్ ‘బీఏ.4’కేసు ఈ నెల తొమ్మిదో తేదీన నమోదైంది. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన దక్షిణాఫ్రికాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించగా బీఏ.4 సోకినట్లు నిర్ధారణ అయింది. మరో సబ్ వేరియంట్ ‘బీఏ.2.12.1’కేసు కూడా ఈ నెల ఆరో తేదీన నమోదైంది. ఇటీవల అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తెలంగాణకు చెందిన 51 ఏళ్ల వ్యక్తిలో అది బయటపడింది. ఈ ఇద్దరి నమూనాలను సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా రెండు వేర్వేరు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నట్లుగా తేలింది. అయితే ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో ఇప్పటివరకు తెలియరాలేదు. వారు వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణలోనే ఆసుపత్రుల్లో ఉన్నారా? లేదా? అన్న వివరాలను అధికారులు వెల్లడించడంలేదు. కాగా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కోవిడ్ కేసుల ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ’బీఏ.4 ’ కేసులు భారత్‌లోని మరిన్ని నగరాల్లో నమోదయ్యే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు కరోనా వచ్చి, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఇవి సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ రెండు సబ్ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. చదవండి: మంకీపాక్స్ సెక్స్ వల్లే విజృంభణ! -
Corona Updates: కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ స్వల్ప పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,805 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 22 మంది మరణించారు. ఇందులో 20 మరణాలు కేరళ నుంచి ఉండడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 20,303గా ఉంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,168 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో ఇప్పటి వరకు 5,24,024 మంది మృతి చెందారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 4, 30, 98, 743 మంది కరోనా బారినపడ్డారు. ► భారత్‌లో ప్రస్తుతం ఇన్ఫెక్షన్ రేటు ఆధారంగా.. యాక్టివ్ కేసుల శాతం 0.05 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతం. డెయిలీ పాజిటివిటీ రేటు 0.78 శాతంగా ఉండగా, వారంతపు పాజిటివిటీ రేటు 0.79 శాతంగా నమోదు అవుతోంది. ► గడిచిన 24 గంటల్లో.. ఢిల్లీలో గరిష్ఠంగా 1, 656 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత ఇదే హయ్యెస్ట్ మార్క్. పాజిటివిటీ రేటు 5.39 శాతంగా ఉంది. ► ముంబైలో 117 కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. వరుసగా నాలుగవరోజూ కేసులు 100కి పైగా నమోదు కావడం గమనార్హం. #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/PJIiBPrHb0 pic.twitter.com/bhVaDrzMYE — Ministry of Health (@MoHFW_INDIA) May 7, 2022 -
Corona: ఒక్కరోజులో తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ, ఉత్తరాదిలో మరికొన్ని చోట్ల కేసుల ఎఫెక్ట్‌తో గత వారం రోజులుగా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 568 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనాతో 20 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. ఇది 18.7 శాతం తక్కువ. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,84,913 కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 5,23, 889 మంది మరణించారు(అధికారికంగా). రికవరీ రేటు 98.74 శాతానికి చేరుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 911 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల నుంచే 80.58 శాతం కొత్త కేసులు నమోదు అవుతుండగా.. ఢిల్లీ నుంచి ఎక్కువ కేసులు రికార్డు అవుతున్నాయి. -
Corona: భారత్‌లో కరోనా.. ఊరట ఇచ్చే విషయం
దేశంలో కరోనా వైరస్‌కు సంబంధించి ఊరట ఇచ్చే విషయం చెప్పింది కేంద్ర పరిధిలోని ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కాన్సోర్టియమ్). స్వల్పంగా కేసులు పెరుగుతూ పోతున్న వేళ.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే మిగతా దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో కరోనా వైరస్‌కు సంబంధించి చాలా తక్కువ రీకాంబినెంట్ వేరియెంట్లు వెలుగుచూశాయని ప్రకటించింది. అంతేకాదు.. ఈ రీకాంబినెట్ వేరియెంట్లు.. వైరస్ తీవ్రవ్యాప్తికి కారణం కాలేదని, అలాగే ఆస్పత్రుల్లో చేరిన కేసులు.. తీవ్రస్థాయిలో ఇన్ఫెక్షన్కు గురైన పేషెంట్లపైనా ప్రభావం చూపలేదని ఇన్సాకాగ్ తన నివేదికలో పేర్కొంది. తాజాగా ఢిల్లీలో కరోనా వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియెంట్ బీఏ.2.12.1 కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ తరుణంలో వేరియెంట్ల తీవ్రతపై ఆందోళన నెలకొనగా.. తగు జాగ్రత్తలు తీసుకుంటే మరోవేవ్ నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులతో పాటు కేంద్రం కూడా చెబుతోంది. రీకాంబినెంట్ అంటే.. వైరస్ యొక్క రెండు విభిన్న వైవిధ్యాల నుండి జన్యు పదార్ధాల కలయిక ద్వారా సృష్టించబడిన వైవిధ్యం. అయితే భారత్‌లో కరోనా వైరస్‌కు సంబంధించి చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే రీకాంబినెట్ వేరియెంట్లు బయటపడ్డాయి. వాటి ప్రభావం కూడా తక్కువేనని ఇప్పుడు ప్రకటించింది ఇన్సాకాగ్. యూఎస్, యూకే సహా చాలా చోట్ల వేరియెంట్లు వెల్లువలా వచ్చాయి. కానీ, ఇంత జనాభా ఉన్న భారత్‌లో మాత్రం ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమని నిపుణులు అంటున్నారు. కేంద్ర విభాగమైన ఇన్సాకాగ్.. దేశంలో కరోనా తీరు తెన్నులు పరిశీలించడంతో పాటు వ్యాప్తి, వేరియెంట్ల మీదా పరిశోధనలు చేస్తుంది. ఏప్రిల్ 8వ తేదీ వరకు(ముందు మూడు నెలల వ్యవధిలో) వచ్చిన శాంపిల్స్ నుంచి రెండున్నర లక్షల దాకా శాంపిల్స్‌పై జెనెటిక్ సీక్వెన్స్ చేసి ఈ నివేదిక రూపొందించింది ఇన్సాకాగ్. ఇందులో ఒమిక్రాన్, డెల్టా, ఆల్ఫా, బీ.1.617.1, బీ.1.617.3, ఏవై సిరీస్, బేటా, గామా.. కేసులు ఉన్నాయి. చదవండి: భయం కరోనా కోసం కాదు.. వేరే ఉంది! -
Covid Cases: దేశంలో కరోనా టెన్షన్..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,927 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 32 మంది మృతిచెందారు. మరో 2,252 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,279 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా నమోదు అయింది. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు 4,30,65,496 కరోనాబారినపడ్డారు. కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 5,23,654 కు చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,88,19,40, 971 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇదిలా ఉండగా.. దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిస్థితి, కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నాం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. COVID-19 | India reports 2,927 fresh cases and 2,252 recoveries, in the last 24 hours. Active cases 16,279 Daily positivity rate (0.58%) pic.twitter.com/bUGouzeoSX — ANI (@ANI) April 27, 2022 ఇది కూడా చదవండి: ఫోర్త్ వేవ్ ముప్పుతప్పదు.. నిపుణుల హెచ్చరిక -
Corona Virus: వరుసగా రెండో రోజు కేసుల్లో పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంబిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 56 మంది వైరస్‌కు బలయ్యారు. మరో 1,231 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 49వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. ప్రస్తుతం 13,433 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.53 శాతానికి పెరిగింది. రివకరీరేటు 98.76 ఉంది. కాగా ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య దడ పుట్టిస్తోంది. కొత్తగా వెయ్యికి పైగా కేసులు వెలుగు చేశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై మాస్క్‌ను తప్పనిసరీ చేసింది. మాస్క్ ధరించని వారి నుంచి 5వందల ఫైన్ విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. చదవండి: కరోనా విజృంభణ.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం -
ఢిల్లీలో కలవరపెడుతున్న కరోనా.. పెరిగిన పాజిటివిటీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా కేసుల పెరుగుదల నమోదవుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. శనివారం కరోనా పాజిటివిటీ రేటు 4 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో మరణాల సంఖ్య సున్నా. మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,158గా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో భారత్‌లో 975 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అదే విధంగా 796 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. దేశంలో 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మరో 175 పెరగడం గమనార్హం. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే.. నిపుణులు అంచనా ప్రకారం మరో వేవ్ కూడా వస్తుందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. అయితే ఇప్పటివరకు దేశంలో సుమారు 180 కోట్ల డోసుల వాక్సిన్ను ప్రజలకు అందించినట్లు పేర్కొంది. -
చైనాలో మరో 3,472 పాజిటివ్ కేసులు
బీజింగ్: చైనాలో గురువారం ఒక్కరోజే 3,472 కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షణాల్లేని కేసులు మరో 20,782 బయటపడ్డాయి. పాజిటివ్ కేసుల్లో 3,200, లక్షణాల్లేని వాటిలో 19,872 షాంఘైలోనే నమోదయ్యాయి! కరోనా కట్టడికి షాంఘైలో 15 రోజులుగా కఠిన లాక్డౌన్ అమలవుతుండటం తెలిసిందే. ఇళ్ల నుంచి బయటికొచ్చే వీల్లేక, ఆహారం, అత్యవసర ఔషధాలు కూడా దొరక్క కోట్లాది మంది గగ్గోలు పెడుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం భారీగా పెంచింది. -
ఢిల్లీలో ఒక్క రోజే 50 శాతం పెరిగిన కరోనా కేసులు..
-
ముంబైలో కొత్త వేరియంట్.. నాలుగో వేవ్‌కు సంకేతమా? లక్షణాలివే..
దేశంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ XE ముంబైలో తొలి కేసు వెలుగు చూసింది. జెనెటిక్ ఫార్ములా డిటర్మినేషన్‌లో భాగంగా మొత్తం 230 శాంపిల్స్‌ను పరీక్షించగా 228మందికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. ఒక శాంపిల్‌లో కప్పా రకం వైరస్ బయటపడగా.. మరో వ్యక్తికి XE వేరియంట్ సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే మే, జూన్ నెలలో ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు అంచనా వేశారు. మరి XE వేరియంట్ దేశంలో వైరస్ నాలుగో దశ విజృంభణకు కారణమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 19న మొదటిసారిగా బ్రిటన్‌లో XE వేరియంట్ వెలుగుచూసింది. ఒమిక్రాన్‌లోని రెండు ఉపరకాల కలయికతో ఈ రకం పుట్టినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఈ మ్యూటెంట్‌కు వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉందని WHO ఇటీవలే హెచ్చరించింది. తాజాగా ముంబైలో XE కేసు నిర్థారణ కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న XE వేరియంట్ లక్షణాలు ఇంకా పూర్తిస్థాయిలో గుర్తించలేదు. సంబంధిత వార్త: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం కొత్త వేరియంట్ లక్షణాలు అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ తరహాలోనే ఈ సబ్ వేరియంట్ సోకిన వారికి జలుబు, ముక్కు కారడం, తుమ్ములు, గొంతునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 600 మంది XE వేరియంట్ బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు పేర్కొన్నాయి. తాజాగా భారత్‌లో XE వేరియంట్ వెలుగుచూడటంతో ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడం వల్ల వైరస్ ఉధృతిని అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే ముంబై బీఎంసీ అధికారులు చెప్పిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసును కేంద్ర వైద్యారోగ్యశాఖ ఇంకా నిర్ధారించలేదు. -
చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు.. ఏడాది తర్వాత
కరోనా ఈజ్ బ్యాక్.. వినడానికి కొంచెం భయంగానే ఉన్నా ఇదే నిజం.. ప్రతీసారి మహమ్మారి తగ్గిపోయింది అని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు మూడు వేవ్‌లో రూపంలో వచ్చిన కోవిడ్ ప్రజల జీవితాలతో చెలగాటమడింది. లక్షలమంది ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నం చేసింది. ప్రస్తుతం కరోనా పుట్టినిల్లుగా భావించే చైనా, దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. చైనాలో జీరో కొవిడ్ విధానం ఉన్నా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు తగ్గడం లేదు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ సామాజిక వ్యాప్తి దశ అధికంగా ఉంది. గత రెండేళ్లలో లేనంతగా ఇప్పుడు అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అయితే చైనాలో కోవిడ్ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. కాగా చైనాలో మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. శనివారం మహమ్మారి బారినపడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో గత ఏడాది కాలంలో కోవిడ్ మరణం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చదవండి: Invisibility Shield Co.: మీరు గానీ.. ఒక్కసారి గానీ.. ఈ షీల్డ్ వెనక్కి వెళ్లారంటే! చివరిసారిగా జనవరి 2021లో కరోనాతో మరణించారు. చైనాలో శనివారం 2,157 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కరోనా టెస్టులు, ట్రాకింగ్, ట్రీట్‌తోపాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని, వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ‘డైనమిక్ జీరో కోవిడ్’ విధానాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోందని వచ్చిన వార్తలను చైనా శుక్రవారం తోసిపుచ్చింది. చదవండి: కరోనా కల్లోలం: ఒక్క రోజే 6 లక్షల పాజిటివ్ కేసులు -
కరోనా అలర్ట్: నిర్లక్ష్యం వద్దు.. కేంద్రం హెచ్చరిక
దేశంలో కరోనా కథ ముగిసినట్లే కనిపిస్తోంది పరిస్థితి. జన సంచారం మామూలు స్థితికి చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియెంట్ బయటపడడం, చైనాలో ఊహించని స్థాయిలో కరోనా విజృంభణ-లాక్డౌన్, అమెరికాతో పాటు దక్షిణాసియా పరిధిలోని కొన్ని దేశాల్లో(దక్షిణ కొరియా, హాంకాంగ్‌లో పరిస్థితి మరీ దారుణం).. కొన్ని యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మన కేంద్రం..రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జనాలు ఇస్టానుసారం తిరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశాల్లో కేసుల విజృంభణనను ప్రస్తావిస్తూ.. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం ఓ లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్. కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ పాటించాలంటూ ఆ లేఖలో కేంద్రం సూచించింది. ఐసీఎంఆర్, ఎన్సీడీసీ National Centre for Disease Control (NCDC) ప్రొటోకాల్స్ పాటిస్తూ.. టెస్టులు చేస్తుండాలని తెలిపింది. అంతేకాదు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఇన్ఫెక్షన్ల తీవ్రత సోకకుండా నియంత్రించాలని సూచించారు లేఖలో. కంటోన్మైట్, క్లస్టర్, డేంజర్ జోన్లను అవసరమైతే ఏర్పాటు చేయాలని కోరింది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, శుభ్రతా తదితర సూచనలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసిన గైడ్‌లెన్స్‌ల గురించి ప్రస్తావించిన కేంద్రం.. పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక వ్యవహారాల కొనసాగింపునకు అనుమతులు ఇవ్వాలంటూ మరోసారి గుర్తు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన మార్చి 16వ తేదీన హై లెవల్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంపై చర్చించారు. ఆపై మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. కరోనాలో కొవిడ్ కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2, 528 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 149గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 29, 181గా ఉంది. దాదాపు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన యాక్టివ్ కేసుల గణాంకం నమోదు అయ్యింది. భారత్‌లో ఇప్పటిదాకా కరోనా కేసులు 4, 30, 04,005 నమోదు కాగా, మరణాల సంఖ్య 5, 16, 281గా ఉంది. -
కరోనా కల్లోలం: ఒక్క రోజే 6 లక్షల పాజిటివ్ కేసులు
హమ్మయ్యా! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది. కరోనా ఉద్భవించిన చైనాలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్టైల్త్ ఒమిక్రాన్ రూపంలో చైనాను కోవిడ్ మళ్లీ వణికిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియాలోనై కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇక ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఊహించని స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే కొత్తగా 6 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు ఇంత భారీగా రోజువారీ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో 6,21,328 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 429 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క రోజులోనే 55 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో మొత్తం దేశంలో కేసుల సంఖ్య 8,250,592కి పెరిగింది. చదవండి: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా కేసులు వెలుగు చూడటంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుల్లో ఎక్కువగా ఒకరినుంచి ఒకరికి సంక్రమించినవేనని ఉన్నయని తెలిపారు. కాగా బుధవారం కూడా 400,000 కొత్తగా కేసులతో గరిష్ట స్థాయికి చేరింది. మార్చి మధ్యలో కోవిడ్ 1,40,000 నుంచి 2, 70,000 గరిష్ట స్థాయికి రోజువారీ కేసులకు చేరుకుంటుందని నెల కిందటే అంచనా వేసిన విషయం తెలిసిందే. చదవండి: జాగ్రత్త.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది! -
ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం
కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బుధవారం ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్ష చేయగా కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక, ఈ రెండు స్ట్రెయిన్లు కలిగిన కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాల్లు ఉన్నట్లు తెలిపింది. రెండు వేరియంట్ల కరోనా గురించి తెలుసని, ఈ కొత్త వేరియంట్ వల్ల ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ పాండమిక్ రెస్పాన్స్ చీఫ్ సల్మాన్ జర్కా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వ్యాప్తి, కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందడం లేదని తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక చికిత్స కూడా అవసరం లేదని ఆయన అభిప్రాపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్‌లోని సుమారు 92 లక్షల మంది ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడు డోసులు పొందినట్లు సల్మాన్ జర్కా వెల్లడించారు. -
జాగ్రత్త.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది!
ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి తర్వాత Covid-19 కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో మరో వేవ్ ఉండబోదంటూ వైద్య నిపుణులు సైతం ఉపశమనం ఇచ్చే వార్త చెప్పారు. మరి వేరియెంట్.. అదీ ప్రమాదకరమైంది పుట్టుకొస్తే తప్పా భయాందోళనలు అక్కర్లేదంటూ ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో అటు అమెరికాలో, ఇటు చైనాలో, ఇంకోపక్క యూరప్ దేశాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్న ట్రెండ్ కనిపిస్తోంది. కొవిడ్-19 ట్రెండ్స్‌ను మానిటర్ చేస్తున్న వేస్ట్‌వాటర్ నెట్వర్క్ నివేదికల ప్రకారం.. అమెరికాలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్య కరోనా కేసుల ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించింది. కిందటి నెల ఇదే టైంలో ఈ కేసుల సంఖ్య తక్కువగా నమోదు అయ్యాయి. కారణాలు.. స్కూల్స్ రీ ఓపెనింగ్, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్ నిబంధనల సడలింపు కారణాల అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేడిమి పరిస్థితులతో జనాలు బయటే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో.. వైరస్ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు. బ్లూమరాంగ్ డేటా రివ్యూ ప్రకారం.. 530 మురుగు నీటి పర్యవేక్షణ ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందులో మార్చి 1-10వ తేదీల మధ్య 59శాతం కేసులు తగ్గుముఖం పట్టగా, 5 శాతం కేసులు స్థిరంగా ఉన్నాయి. అయితే 36 శాతం కేసులు పెరిగినట్లు చూపించాయి. ఈ సర్వేలో ఎంత మేర కేసులు పెరుగుతున్నాయనేది చెప్పకపోయినా.. మురుగు నీటి sewer water లో వైరస్ జాడ గుర్తించినట్లు తెలిపారు. న్యూయార్క్‌తో సహా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ‘‘ఈ ప్రస్తుత ట్రెండ్ మునుముందు కూడా కొనసాగుతుందా? పెరుగుదల ఇలాగే ఉంటుందా? అనే దానిపై నిర్ధారణకు రావడం తొందరపాటు చర్యే అవుతుందని, స్థానిక ఆరోగ్య ప్రతినిధులను పర్యవేక్షణకు ఆదేశించినట్లు.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ ప్రతినిధి కిర్బీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. యూరోపియన్ దేశాల్లోనూ ఇలాంటి పెరుగుదలే కనిపిస్తోంది. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా.. ఇతర ఐరోపా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు వారాల్లో కేసులు పెరిగిపోతున్నట్లు ఆయా దేశాల కరోనా గణాంకాలు చెప్తున్నాయి. అక్కడా యూఎస్ తరహా వాతావరణం, ఉక్రెయిన్ యుద్ధ హడావుడి నేపథ్యంలో వలసల కారణాలతో కేసులు పెరిగిపోతుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ప్రపంచం ఉలిక్కి పడింది. కరోనా మొదలైనప్పటికీ ఆ దేశంలో హయ్యెస్ట్ కేసులు సోమవారం నమోదు కావడం విశేషం. ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి అక్కడ. ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచిన డ్రాగన్ సర్కార్.. కఠిన లాక్‌డౌన్‌తో కట్టడికి ప్రత్నిస్తోంది. హాంకాంగ్‌లోనూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. వరుసగా రెండోరోజు 3 వేలకు దిగువకు కేసులు నమోదైయ్యాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం వందకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ మంగళవారం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2 వేల 568 మందికి వైరస్ ఉందని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 97 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క కేరళ నుంచే 78 మరణాలు నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాల సంఖ్యలో మాత్రం తేడా కనిపిస్తోంది. -
China Corona: ప్చ్.. చైనా జీరో టోలరెన్స్ అట్టర్ ఫ్లాప్
జీరో టోలరెన్స్ పేరిట చైనా చేపట్టిన చర్యలేవీ సత్పలితాలను ఇవ్వడం లేదు. సరికదా.. గత మూడు వారాలుగా కరోనా కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి. తాజాగా.. ఒక్కరోజులో ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి. బయటి ప్రపంచం దృష్టిలో.. కరోనా మొదలైనప్పటి నుంచి చైనాలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే!. చైనా China లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఆదివారం బులిటెన్‌లో 1,337 కేసులు, సోమవారం బులిటెన్‌లో 3,507 కేసులు, మంగళవారం ఉదయం రిలీజ్ చేసిన కరోనా బులిటెన్.. ఏకంగా 5,280 కేసుల్ని చూపించింది. ఈశాన్య ప్రావిన్స్ అయిన జిలిన్‌లోనే మూడు వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు నేషనల్ హెల్త్ కమీషన్ వెల్లడించింది. అయితే పరిస్థితిని వారంలోగా అదుపులోకి తీసుకొస్తామని జిలిన్ గవర్నర్ ప్రకటించినప్పటికీ.. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చైనా వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జిలిన్, ఉత్తర కొరియాకు సరిహద్దు ప్రాంతం. అందుకే ఇరు ప్రాంతాల మధ్య ప్రయాణాలను కొన్నాళ్లపాటు నిషేధించింది చైనా. జీరో టోలరెన్స్ అంటే.. కఠినంగా కట్టడి చేయడం, పెద్ద ఎత్తున్న పరీక్షలు నిర్వహించడం.. ఇది జీరో టోలరెన్స్‌లో భాగంగా చైనా అనుసరిస్తున్న విధానం. రెండు సంవత్సరాల మూసేసిన సరిహద్దులు, సామూహిక పరీక్షలు, లాక్డౌన్లు, నిర్బంధాలు అమలు చేసింది. ఎక్కడికక్కడే కేసుల్ని కట్టడి చేసింది. ఈ క్రమంలో హేయమైన చర్యలకూ పాల్పడి.. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంది. కానీ, జీరో టోలరెన్స్‌ను పటాపంచల్ చేస్తూ.. వైరస్ విజృంభిస్తోంది ఇప్పుడు. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున.. మునుపెన్నడూ లేని పరిస్థితిని డ్రాగన్ ఎదుర్కొంటోంది. 2019లో వుహాన్‌లో కేసులు వెలుగు చూసినప్పటి నుంచి.. ఇప్పటిదాకా చైనాలో ఈ రేంజ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు కూడా జీరో కొవిడ్ స్ట్రాటజీతో.. కఠిన లాక్డౌన్ అమలు చేస్తూ జనాలను ఇళ్లకే కట్టడి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ లాభం లేకుండా పోతోంది. వింటర్ ఒలింపిక్స్ ముగిశాక.. ఆంక్షల సడలింపులతో జనసంచారం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభిస్తోంది. ఇది కొత్త వేరియెంట్లు అనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. సైంటిస్టులు మాత్రం అది ఒమిక్రాన్ stealth omicron అయి ఉండొచని అభిప్రాయపడుతున్నారు. ఇది ఏ తరహా వేరియెంట్ అన్నదానిపై చైనా ఆరోగ్య విభాగం స్పష్టత ఇవ్వడం లేదు. భారీ ఎఫెక్ట్ కేసులు పెరిగిపోతుండడంతో.. 11 ప్రధాన నగరాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న టెక్‌హబ్ షెంజెన్‌లో బయట మనిషి కనిపించడం లేదు. మరోవైపు లాక్డౌన్ వల్ల ఆర్థికంగానూ ప్రభావం పడుతోంది. మంగళవారం ఉదయం.. కరోనా ఎఫెక్ట్‌తో హాంకాంగ్ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయ్యింది. అక్కడా కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. బీజింగ్, షాంగై విమానశ్రయాలకు భారీగా విమానాలు రద్దు అయ్యాయి. షాంగైలోనూ లాక్డౌన్ కఠినంగా అమలు అవుతోంది. మరణాల గోప్యత కరోనా కేసుల వెల్లడి విషయంలో చైనా చాలాకాలం పాటు గమ్మున ఉండిపోయింది. కొన్ని నెలల కేసుల వివరాలను చైనా బయటకు రిలీజ్ చేయకపోవడం విశేషం. ఇక మరణాల సంగతి సరేసరి. ఇప్పటిదాకా కేవలం ఐదు వేల మరణాలు నమోదు అయ్యాయని చెప్తోంది. అత్యధిక జనాభా ఉన్న చైనాలో.. ఇది నమ్మశక్యంగా ఉందంటారా?. ఏది ఏమైనా జీరో టోలరెన్స్‌ను ఎంత ఘనంగా ప్రచారం చేసుకున్న చైనా.. ఇప్పుడు కరోనా కేసుల్ని కట్టడి చేయడంలో మాత్రం ఘోరంగా తడబడుతోంది. -
కరోనా కేసులు: ఐదువేలకు దిగువన కొత్త కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా దేశంలో 4362 పాటిజిట్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రసుతం దేశవ్యాప్తంగా 54118 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
Corona Latest Updates: కరోనాపై గుడ్ న్యూస్
-
ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదా.. ఈ విషయం తెలుసుకోండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. రెండు లేదా ఒక డోసైనా వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే.. తీసుకున్న వారిలో 50 శాతం తక్కువగా లాంగ్ కోవిడ్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలపై కరోనా దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రస్థాయికి కూడా చేరుకోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర నిపుణుల తాజా హెచ్చరికల నేపథ్యంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. స్వల్ప లక్షణాలతో మైల్డ్‌గానే కరోనా సోకి తగ్గిపోయినా.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, పోస్ట్ కోవిడ్ చిక్కులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చునని మరికొన్ని అధ్యయనాలు ఇప్పటికే సూచించాయి. ఈ క్రమంలోనే టీకాలు తీసుకున్న వారిలో లాంగ్ కోవిడ్ సమస్యలు తక్కువగా ఉన్నట్టు, వ్యాక్సిన్లు తీసుకోని వారిని సమస్యలు వెంటాడుతున్నట్టు యునైటెడ్ కింగ్డమ్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకే హెచ్ఎస్ఏ) తేల్చింది. వివిధ సంస్థలు నిర్వహించిన దాదాపు 15 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించింది. టీకాలతో త్వరగా రికవరీ.. ఫైజర్, బయో ఎన్‌టెక్, ఆస్ట్రాజెనికా, మోడెర్నా రెండు వ్యాక్సిన్లు లేదా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా వేసుకున్న వారిలో, వ్యాక్సిన్ తీసుకోని వారికంటే 50 శాతం తక్కువగా లాంగ్ కోవిడ్ లక్షణాలు ఉంటున్నాయని యూకే హెచ్ఎస్ఏ పేర్కొంది. టీకాలు వేయించుకున్న వారు త్వరగా కోలుకుంటున్నట్టుగా కూడా వెల్లడించింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మంచి ప్రయోజనాలు కలుగుతున్నట్టుగా తేలిందని సంస్థకు చెందిన డాక్టర్ మేరి రామ్సే తెలిపారు. ‘కోవిడ్ సోకాక వ్యాక్సినేషన్ ద్వారా సీరియస్ లక్షణాల నుంచి రక్షణ లభిస్తుంది.దీర్ఘకాలిక ప్రభావాలు, లక్షణాలు కూడా తగ్గుతాయి. చాలామందికి లాంగ్‌కోవిడ్ లక్షణాలు తక్కువ కాలమే ఉండడమే కాకుండా త్వరలోనే పరిష్కారమౌతాయి. కొందరిలో మాత్రమే ఈ లక్షణాలు తీవ్రంగా మారి రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది..’ అని ఆమె చెప్పారు. కరోనా సోకాక నాలుగు వారాల తర్వాత కూడా అసాధారణ, అనూహ్య లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. యూకే హెచ్ఎస్ఏ పరిశీలన ప్రకారం.. - లాంగ్ కోవిడ్‌లో ఎక్కువగా అలసట, - ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కీళ్లు, కండరాల నొప్పులు, తదితరాలు కొనసాగుతుంటాయి. - యూకే జనాభాలో 2 శాతం మంది దాకా దీర్ఘకాలిక కరోనా లక్షణాలు, సమస్యలతో బాధపడుతున్నారు - వ్యాక్సిన్లు తీసుకున్న వారు 28 రోజుల పాటు కోవిడ్ లక్షణాలు కలిగి ఉన్నారు - పోస్ట్ కరోనా లక్షణాలపై టీకాలు బాగా పనిచేస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారిలో వీటి ప్రభావం అత్యధికం కాగా 19–35 ఏళ్ల మధ్యలోని వారిపై తక్కువగా ఉంది. -
దేశంలో 50 వేల లోపు కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Coronavirus Update: దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటలలో 44,877 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,17,591 కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,15,85,711 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 5,37,045 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా
లండన్: బ్రిటన్ యువ రాజు ప్రిన్స్ చార్లెస్‌కు మరోమారు కరోనా సోకింది. గురువారం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణైందని, దీంతో ఆయన స్వీయ ఐసోలేషన్లోకి వెళ్లారని యువరాజు కార్యాలయం తెలిపింది. కరోనా సోకడంతో ముందుగా అనుకున్నట్లు వించస్టర్ పర్యటనకు రాలేకపోతున్నందుకు విచారిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. బుధవారం సాయంత్రం ఆయన బ్రిటిష్ మ్యూజియం వద్ద చాలామందిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య కమిల్లా, బ్రిటన్ ట్రెజరీ చీఫ్ రుషి సనక్ తదితరులు కూడా ఉన్నారు. కమిల్లీకు పరీక్షలో నెగెటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. చార్లెస్‌కు గతంలో ఒకమారు కరోనా సోకింది. అనంతరం ఆయన మూడు డోసుల టీకా తీసుకున్నారు. ఈ దఫా కరోనా సోకినప్పుడు లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు ఆయన సిబ్బంది చెప్పారు. స్పెయిన్ రాజదంపతులకు కూడా కరోనా సోకింది. -
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్నంటే?
Coronavirus Update: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటలలో 58,077 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,50,407 మంది వైరస్ బారినుంచి కోలుకోగా 657 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,177 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 6,97,802 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,71,79,51,432 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
ఒమిక్రాన్ ఎంత పని చేసిందంటే..
కరోనా వేరియేంట్లలో ప్రమాదకరం కాకపోయినా.. వేగంగా ఇన్ఫెక్షన్లతో వెల్లువలా కేసులు పెరగడానికి కారణమైంది ఒమిక్రాన్. కిందటి ఏడాది చివర్లో మొదలైన ఒమిక్రాన్ విజృంభణ.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో కేసుల తగ్గుముఖంతో సాధారణ ప్రజానీకానికి సడలింపులు, ఆంక్షల ఎత్తివేతతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్‌పై ఓ లెక్క అంటూ రిలీజ్ చేసింది డబ్ల్యూహెచ్‌వో.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ను నవంబర్ చివర్లో కరోనా వేరియెంట్‌గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల కేసులు నమోదు అయ్యాయని WHO ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మరణాలు నమోదు అయ్యాయని తెలిపింది. విషాదానికి మించినది ఈ పరిణామం అని ఈ గణాంకాలపై వ్యాఖ్యానించారు ఆరోగ్య సంస్థ మేనేజర్ అబ్ది మహముద్. ప్రమాదకరమైన డెల్టా వేరియెంట్ తర్వాత ఒమిక్రాన్.. ప్రపంచంపై తన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రమాదకరమైంది కాకపోయినా.. త్వరగతిన వ్యాపిస్తూ కేసుల సంఖ్యను పెంచేసింది. కరోనా వేరియెంట్లు వచ్చి తగ్గిన పేషెంట్లపై మరికొంత కాలం ప్రభావం చూపిస్తుండగా.. ఒమిక్రాన్ మాత్రం సుదీర్ఘకాలం చూపించే అవకాశం ఉండడం గమనార్హం. కరోనా మొదలైనప్పటి నుంచి తీవ్రస్థాయిలో రేంజ్లో కేసులు వెల్లువెత్తడం ఒమిక్రాన్ వల్లే అయ్యింది. అనధికారికంగా ఈ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ, ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం మాత్రమే ఇది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కరోనాలో ఒమిక్రాన్ చివరి వేరియెంట్ కాకపోవచ్చని, ఒకవేళ తర్వాత వేరియెంట్ గనుక పుట్టుకొస్తే.. దాని తీవ్రత మరింత దారుణంగా ఉండబోతుందంటూ డబ్ల్యూహెచ్‌వో ఇదివరకే ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. COVID-19 డిసెంబర్ 2019 లో చైనాలో కరోనా వైరస్ పుట్టిందని ప్రకటించినప్పటి నుంచి.. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లమందికిపైగా కరోనా(వివిధ వేరియెంట్లు) బారినపడ్డారు. మొత్తం 57 లక్షల మందికి పైగా కరోనాతో మరణించారు. ఇందులో భారత్ నుంచి మరణాలు ఐదు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటిదాకా పది బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందాయి. -
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు.. ఎన్నంటే?
Coronavirus Update: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మంగళవారంతో పోల్చితే పెరిగాయి. గడిచిన 24 గంటలలో 71,365 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,72,211 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా 1,217 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,05,279 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 8,92,828 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,70,87,06,705 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
కరోనా అప్డేట్: కొత్తగా మరో 67,597 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 1,80,456 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1,188 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,02,874 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 9,94,891 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 170.21 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
లక్ష దిగువకు పడిపోయిన కరోనా కేసులు! కొత్తగా ఎన్నంటే..
Corona New Cases Update: భారత్‌లో మూడో వేవ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. గత ఇరవై నాలుగు గంటల్లో 83, 876 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో.. మొత్తం 83, 876 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 11,56,363 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. 83 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మరణాలు 895 చోటు చేసుకున్నాయి. ఒక్కరోజులో 1,99, 054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జనవరి 6 తర్వాత లక్ష మార్క్‌కు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11, 08, 938 కాగా, రోజూవారీ పాజిటివిటీ శాతం 5, 02, 874గా ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనాతో 5, 02, 874మంది(అధికార గణాంకాల ప్రకారం) చనిపోయారు. మొత్తం రికవరీల సంఖ్య 4,06,60,202గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా భారత్‌లో ఇప్పటిదాకా 1,69,63,80,755 డోసులు అందించింది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/DmnW6kanpU pic.twitter.com/06W1fEECj9 — Ministry of Health (@MoHFW_INDIA) February 7, 2022 వర్క్‌ఫ్రమ్ హోం ముగిసింది కాగా, సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కార్యాలయాలకు పూర్తి హాజరు కావాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయాలు కోవిడ్ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రమ్ హోం ఇక ముగిసినట్లేనని సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ విజృంభణ సమయంలో కేంద్ర ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. -
Corona New Cases: ఒక్కసారిగా తగ్గిన కరోనా కేసులు.. పాజిటివిటీ రేటు!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మూడో వేవ్‌లో.. ఒక్కసారిగా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో లక్షా 27 వేల 952 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి పోల్చుకుంటే పాజిటివిటీ రేటు 9.2 శాతం నుంచి 7.9 శాతానికి పడిపోవడం విశేషం. ఇక కిందటి రోజుతో పోలిస్తే.. 14 శాతం కేసుల తగ్గుదల చోటు చేసుకోవడం విశేషం. రికవరీల సంఖ్య 2, 30, 814గా ఉంది. ఒక్కరోజులో 1,059 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648గా ఉంది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5, 01, 114కి చేరుకుంది. మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 1,68,98,17,199 పూర్తి చేసుకుంది. -
Corona Update:స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటలలో 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,59,107 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1008 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,98,983 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 15,33,921 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 167.87 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. India reports 1,72,433 fresh COVID cases (6.8% higher than yesterday), 2,59,107 recoveries, and 1008 deaths in the last 24 hours Active cases: 15,33,921 Death toll: 4,98,983 Daily positivity rate: 10.99% Total vaccination: 167.87 crore pic.twitter.com/ZgQtIloAzu — ANI (@ANI) February 3, 2022 -
సీన్ రివర్స్.. కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజు మూడు లక్షలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,15,993 పరీక్షలు నిర్వహించగా 2,34,281 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఓ వైపు కొత్త కేసులు తగ్గినా.. మరణాలు మాత్రం పెరిగాయి. నిన్న 893 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,94,091కు పెరిగాయి. అయితే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఒక్కరోజే 3,52,784 మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం యాక్టివ్ 18,84,937 కేసులు ఉన్నాయి. మొత్తం రికవరీల సంఖ్య 3,87,13,494కి పెరగగా.. రికవరీ రేటు 94.21శాతంగా ఉంది. రోజువారీ పాటిటివిటీ రేటు13.39 శాతం నుంచి 14.50 శాతానికి పెరిగింది. వారం వారీ పాజిటివ్ రేటు16.0 శాతానికి పెరిగింది. మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 165.70 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశారు. అలాగే మొత్తం 72.73 కోట్ల పరీక్షలు నిర్వహించారు. చదవండి: నియోకోవ్ వైరస్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు! -
31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ ద్వారా చేపట్టిన విచారణకు డీహెచ్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న న్యాయవాదులు ప్రస్తావించగా.. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదన్న డీహెచ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. చదవండి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్ న్యూస్.. ఇక ఇంటికొస్తారు! -
తగ్గేదేలే అంటున్న కోవిడ్.. ప్రతి 100 మందిలో 15 మంది..
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు దేశంలో పాటిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతానికి పెరిగింది. అంటే ప్రతి 100 మందిలో 15 మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 2,51,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 627 మంది మృత్యువాత పడ్డారు. ఒకే రోజు 3,47,443 మంది కోవిడ్‌నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల ఆరు లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 4,92,327కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో ప్రస్తుతం 21 లక్షల 5వేల 611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 164.44 కోట్ల వ్యాక్సినేషన్ పంపిణీ చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో వ్యాక్సినేషన్, కరోనా తాజా పరిస్థితులపై కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, తెలంగాణ, అండమాన్&నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ -
కరోనా: మరోసారి 3 లక్షలకు దిగువన కేసులు.. కొత్తగా ఎన్నంటే
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వైరస్‌తో నిన్న మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,03,71,500 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,91,700 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 22,02,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,76,77,328 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది. చదవండి: మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా? -
కరోనా పాజిటివ్: సేఫ్‌గా హోం ఐసోలేషన్.. 7 రోజులకే నెగిటివ్
కాజీపేటకు చెందిన ఓ ఉద్యోగికి రెండు రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతూ పరీక్ష చేయించుకున్నాడు. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు కూడా చేయించగా వారికి కూడా పాజిటివ్ వచ్చింది. అందరికీ స్వల్ప లక్షణాలే. కిట్లు తీసుకుని ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు. ఖిలా వరంగల్‌కు చెందిన కూరగాయల వ్యాపారికి వారం రోజులక్రితం పాజిటివ్ వచ్చింది. జ్వరం, జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నాయి. మూడు రోజుల్లో జ్వరం తగ్గింది. జలుబు ఐదు రోజులు ఉంది. 7వ రోజు పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. సాక్షి, కాజీపేట: కరోనా మూడో దశలో కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైరస్‌ను జయిస్తున్నారు. దీనిపై పూర్తి అవగాహన పెరగడం.. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతూ సురక్షితంగా బయటపడుతున్నారు. వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం నింపుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చినా.. ఇతర సభ్యులందరికీ వచ్చినప్పటికీ ఆందోళన చెందడం లేదు. ఇరుగుపొరుగు వారు కూడా సహకరిస్తుండడంతో ఆస్పత్రుల్లో చేరి లక్షల రూపాయలు పెట్టడం లేదు. ఇలా నగరంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20,650 మందికిపైగా హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. వారి ఇళ్లకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు రోజూ వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఇంటింటి జ్వర సర్వే... వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు మూడు రోజులుగా సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి ప్రత్యేక జ్వరం సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారణ జరిగినట్లయితే వెంటనే మందుల కిట్లను అందజేస్తున్నారు. అర్బన్, గ్రామీణ హెల్త్ సెంటర్లపై ఒత్తిడి లేకుండా జ్వరం సర్వే ఉపయోగపడుతోంది. హనుమకొండ జిల్లాలో 22,375 గృహాలను సందర్శించి అందులో 3,356 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించి 3,356 మందికి హోం ఐసోలేషన్ కిట్స్ ఇచ్చారు. వరంగల్ ట్రై సిటీలో దాదాపు 7వేలమంది వరకు హోం ఐసోలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యాధికారుల సూచనలు... ► ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్న కరోనా రోగులు వైద్యాధికారులకు ఫోన్ చేసి వారి సూచనలు, సలహాలు పొందుతున్నారు. ► జ్వరం ఎక్కువగా ఉంది..ఇంట్లోనే ఉండొచ్చా.. ఆస్పత్రికి వెళ్లాలా .. ఏ మందులు వాడాలి. ఇలా అర్ధరాత్రి సైతం జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర వైద్యులకు ఫోన్లు చేస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ► ఒకప్పుడు కరోనా సోకితే వారితో మాట్లాడేందుకు కూడా భయపడేవారు. ఇప్పుడు మాస్క్‌లు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబంతోనే కలిసి ఉంటున్నారు. ► ప్రత్యేక గదిలో ఉంటూ ఇంటి భోజనం తింటున్నారు. ఇలా చేయడం వలన వారిలో ఒత్తిడి తగ్గుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. -
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కరోనా బారినపడ్డారు. ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు — Vice President of India (@VPSecretariat) January 23, 2022 -
తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,393 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,319 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 31,199 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 6,95,942 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ కారణంగా 4,071 మంది బాధితులు మృతి చెందారు. -
శనివారం రాత్రి నుంచే పూర్తి లాక్డౌన్
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆదివారం జనవరి 23న పూర్తి లాక్డౌన్ విధించింది. అయితే ఈ లాక్డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఈ నెల ప్రారంభంలోనే తమిళనాడు ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జనవరి 9 నుంచి ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాక మిగతా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించింది. అయితే పాల దుకాణాలు ఏటీఎం కేంద్రాలు, ఆసుపత్రులు, సరుకు రవాణ, పెట్రోల్ బంక్‌లు అనుమతించింది. కాగా రెస్టారెంట్లు, హోటళ్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ డెలివరీ సౌకర్యాలతో పాటు టేకౌట్ సేవలను అందిస్తాయని తెలిపింది. ఈ మేరకు తమిళనాడులో గురువారం 24 గంటల్లో 28,561 కొత్త కోవిడ్-19 కేసులు, 39 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,79,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: ఉగ్రరూపం దాల్చిన కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా ఎన్నంటే!) -
వరంగల్: కరోనా పేషెంట్లకు ‘టెక్నికల్’ కష్టాలు
సాక్షి, వరంగల్: కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. తొలి, రెండో వేవ్‌లు మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని ప్రచారమున్నా కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ మేల్కోవడం లేదు. జనవరి తొలివారం నుంచి ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. అధికారుల గణాంకాలు విడుదల చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదే సమయంలో కరోనా పాజిటివ్ రోగులకు అవసరమైన సమయాల్లో సలహాలు, సూచనలిచ్చే ‘టోల్ ఫ్రీ నంబర్లు’ ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడం ఉన్నతాధికారుల అలసత్వానికి నిదర్శనంగా మారింది. టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటే ఏ సమయాల్లో ఏఏ మందులు వాడాలి, ఎన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి, రాత్రి సమయాల్లో పరిస్థితి విషమిస్తే ఫోన్ ద్వారా వైద్య సిబ్బందితో మాట్లాడే వీలు లేకపోవడంతో వందల మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు. వైద్యుడితో మాట్లాడితే వచ్చే భరోసా కనబడకపోవడంతో కలవరపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి పర్యవేక్షణ లోపంతోనే కరోనా కట్టడిపై సిబ్బంది కూడా సీరియస్‌గా లేరని ఆ శాఖ వర్గాలే అంటున్నాయి. స్వీయ వైద్యం వద్దు.. జిల్లాలో వైరస్ బారిన పడిన వందలాది మంది ఇప్పుడు సొంత వైద్యం బాట పట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అనేక మంది రెండు దశల్లో మహమ్మారి సోకినప్పుడు వాడిన మందులనే ఇప్పుడూ వాడేస్తున్నారు. ఇలా సొంతంగా వాడడం ఆరోగ్యపరంగా మంచిది కాదని, దాని వల్ల ఇతర అవయవాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రస్తుతం వైరస్ సోకిన వారిలో చాలా మందికి పెద్దగా లక్షణాలు ఉండడం లేదు. స్వల్పంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం ఉంటున్నాయి. ఇలా ఉండి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చిన వారు వెంటనే వైద్యుడ్ని సంప్రందించి మందులు వాడితే ఆరేడు రోజుల్లో లక్షణాలన్నీ తగ్గిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు జ్వరం అలాగే ఉన్నా ఆక్సిజన్ 94 శాతం కంటే తగ్గితే వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అయితే చాలా మంది పాజిటివ్ అని తేలగానే పీహెచ్సీ, యూపీహెచ్‌సీలో వైద్యుడు అందుబాటులో లేకుంటే పాత వేవ్‌ల్లో వాడిన మందులు తీసుకెళ్తున్నారు. టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా తెలుసుకుందామన్నా.. అవి పనిచేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. భరోసానిచ్చే వైద్యమంత్రం లేక మాన సికంగా క్రుంగిపోతున్నార’ని సామాజిక కార్యకర్త శ్రావణి తెలిపారు. -
కాస్త తగ్గిన కరోనా కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో లక్షల్లో రోజువారీ కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన రేపుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టు అనిపిస్తోంది. అయితే గత రోజుతో పోలిస్తే దేశంలో తాజాగా రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,38,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్త కేసులు 20 వేలకు పైగా తగ్గడం సానుకూలాంశం అయినప్పటికీ 2లక్షలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా 19.65 శాతం నుంచి 14.43 శాతానికి తగ్గడం కొంత ఊరటనిస్తోంది. చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్! 9వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు సోమవారం రోజు వైరస్ కారణంగా మరో 310 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,57,421 మంది కోలుకోగా రికవరీ రేటు 94.09శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 9వేలకు చేరువైంది. ప్రస్తుతం 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ఇప్పటివరకు భారత్‌లో 158కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. చదవండి: జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని? -
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..
సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2 లక్షల 58వేల 89 కేసులు నమోదయ్యాయి. 385 మంది మృతి చెందారు. లక్షా 58వేల 750 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8వేల 209కి చేరింది. దేశంలో ప్రస్తుతం 16 లక్షల 54వేల 361 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరిగింది. భారత్‌లో ఇప్పటివరకు 157 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. చదవండి: ఆర్థిక వృద్ధిబాటలో అవరోధాలు -
దేశంలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్
-
Telangana Cabinet Meet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై ఊహాగానాలు..
-
Corona Update: కరోనా కల్లోలం.. కొత్తగా 2.71 లక్షల కేసులు
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. దేశంలో తాజాగా 2,71,202 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 314 మంది మృతి చెందారు. శనివారంతో(జనవరి 15) పోలిస్తే పెరిగిన కేసుల సంఖ్య 2,369గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377గా ఉంది. మరోవైపు కేసుల పాజిటివ్ రేటు 16.28%గా ఉంది. ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 7,743గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 156.76 కోట్లు పూర్తి చేసుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 66 లక్షల డోసుల్ని అందించారు. ముంబై నగరంలో జనవరి 15న పది వేల కొత్త కేసులు, 11 మరణాలు సంభవించాయి. వ్యాక్సినేషన్‌కి ఏడాది పూర్తి #1YearOfVaccineDrive.. భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవియా ప్రకటించారు. आज विश्व के सबसे बड़े टीकाकरण अभियान को 1 वर्ष पूर्ण हो गया है। PM @NarendraModi जी के नेतृत्व में शुरू हुआ यह अभियान 'सबके प्रयास' के साथ आज दुनिया का सबसे सफल टीकाकरण अभियान है। मैं सभी स्वास्थ्य कर्मियों, वैज्ञानिकों व देशवासियों को बधाई देता हूँ। #1YearOfVaccineDrive pic.twitter.com/IvoX3Z9Nso — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 16, 2022 -
దేశంలో పెరిగిపోతున్న కరోనా, ఆన్లైన్లో వీటి అమ్మకాలు బీభత్సం!
భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆన్లైన్లో ఆక్సిమీటర్లు, కరోనా టెస్ట్ కిట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. వీటితో పాటు ఇమ్యూనిటీ బూస్టర్లు, మినరల్ సప్లిమెంట్ల ఆర్డర్లు ప్రతి వారం దాదాపు 50 శాతం పెరుగుతున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ►ఈ-కామర్స్ దిగ్గగం ఫ్లిప్‌కార్ట్, హెల్త్ కేర్ ఫ్లాట్ ఫామ్ 1ఎంజీ లెక్కల ప్రకారం...మనదేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభంతో ఆక్సిమీటర్ల అమ్మకం దాని సాధారణ డిమాండ్ కంటే 4.4 రెట్లు పెరిగిందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అదే సమయంలో దేశంలోని పలు మెట్రో నగరాల్లో కోవిడ్-19 టెస్ట్ కిట్లకు డిమాండ్ 12 రెట్లు పెరిగింది. ►సెల్ఫ్ కరోనా టెస్ట్ కిట్ తయారీ సంస్థ మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ ప్రతినిధులు సైతం కొత్త కేసులు ప్రారంభం కావడంతో కోవిసెల్ఫ్ అమ్మకం 500 శాతం పెరిగిందని తెలిపారు. ఈ అమ్మకాలలో ఎక్కువ భాగం ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపింది. ►ఫ్లిప్‌కార్ట్, మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వివరాల ప్రకారం..సెల్ఫ్ కరోనా కిట్లను పంపిణీ చేసే పిరమల్ సంస్థ జనవరి మొదటి తొమ్మిది రోజుల్లో దేశ మొత్తం 4 లక్షల కిట్లపై అమ్మకాలు జరిపింది. గత డిసెంబర్ నెల మొత్తంలో 1.39 లక్షల సెల్ఫ్ టెస్టింగ్ కిట్లను మాత్రమే అమ్మింది. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా టెస్ట్‌లతో పాటు రోగనిరోధక శక్తిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కాబట్టే డాక్టర్ల సాయం లేకుండా ప్రజలు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి రోగనిరోధక శక్తిని పెంచే ప్రొడక్ట్‌లు, విటమిన్ సప్లిమెంట్లు,కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తున్నారు. జనవరి రెండో వారం ముగిసే సమయానికి ప్రతి వారంతో 50 శాతం వృద్ధిని చూస్తుండగా, ఈ కాలంలో కిరాణా సామాగ్రి డిమాండ్ కూడా దాదాపు రెట్టింపు అయింది. భారతీయ నగరాల్లో అనేక లాక్డౌన్లు మరియు కదలిక ఆంక్షలు కనిపించడం ద్వారా కూడా ఇది ఊపందుకుంది. చదవండి: వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్.. ఈ లక్షణాలు ఉంటేనే కోవిడ్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. దాంతోపాటు వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా హై రిస్క్ కేటగిరీలోకి రాకపోతే.. కోవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్‌కు కూడా పరీక్షలు అవసరం లేదని పేర్కొంది. హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు... కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. (చదవండి: భారీగా కేసులు.. వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వండి!) -
60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!
అమెరికాలో కరోనా కేసులు సంఖ్య దాదాపు 60 మిలియన్లకి చేరుకుంది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది మృతి చెందారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తన పరిశోధనలో పేర్కొంది. ఈ కరోనా మహమ్మరితో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా అమెరికా నిలిచింది. పైగా ప్రపంచపరంగా చూస్తే సుమారు 15 శాతానికి పైగా అత్యధిక మరణాలు యూఎస్‌లోనే సంభవించాయి. ఐతే గతేడాది నవంబర్ 29 కల్లా యూఎస్‌లో సుమారు 10 మిలయన్లకు పైగా కరోనా కేసులు నమోదైయ్యాయి. (చదవండి: వరల్డ్ స్ట్రాంగెస్ట్ గర్ల్: దెబ్బ పడితే ఖతమే!) అది కాస్త జనవరి 1, 2021 కల్లా 20 మిలియన్లు దాటింది. పైగా ఆ సంఖ్య గతేడాది డిసెంబర్ 13 చివరి కల్లా 50 మిలియన్లకు చేరింది. అంతేకాదు అమెరికాలోని కాలిఫోర్నియాలో డిసెంబర్ 1, 2021న కోవిడ్ -19 ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌కి సంబంధించిన తొలి కేసు నమోదు అయ్యిందని మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ స్థానిక మీడియాకి వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ ఇప్పటి వరకు చాలా దేశాల్లో పెను విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్ని కఠినమైన కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. (చదవండి: మోటర్బోట్లపై విరిగిపడ్డ కొండచరియలు.. చూస్తుండగానే ఏడుగురి ప్రాణాలు..) -
Covid: ఒక్కరోజులోనే 30మంది వైద్యులకు పాజిటివ్
సాక్షి,ముంబై: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం సామాన్యులతో పాటు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్న డాక్టర్లపై కూడా పడింది. మూడు వారాల్లోనే ఏకంగా 300 మందికి పైగా వైద్యులకు సోకింది. ఇప్పటికే రాష్ట్రంలో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటం, ఆపై వైద్యులు కూడా కరోనా బారిన పడి హోం క్వారంటైన్కే పరిమితమైపోవడంతో రాష్ట్రంలో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన వైద్యుల సంఖ్య 308కి చేరింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రెసిడెన్స్ డాక్టర్లకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు, ఆస్పత్రుల సిబ్బందిలో కలకలం మొదలైంది. ఒక్కరోజులోనే 30 మంది వైద్యులకు కరోనా ఇదిలాఉండగా కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ముంబైకర్లకు వైద్య సేవలందిస్తోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. గురువారం ఒక్క ముంబైలోనే 30 మంది డాక్టర్లు కోవిడ్ బారిన పడ్డారు. రెసిడెన్స్ డాక్టర్లలో కూడా కరోనా సోకుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఔట్ పేషంట్ (ఓపీ), అత్యవసరం మినహా సాధారణ సర్జరీ విభాగాలను దశల వారీగా మూసివేయాలని వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా, ఒమిక్రాన్ వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు, అలాగే తగినంత వైద్య సిబ్బంది విధుల్లోకి చేరే వరకు ఈ రెండు డిపార్టుమెంట్లు పూర్తి సామర్థ్యంతో పని చేయకూడదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా బీఎంసీ ఆస్పత్రుల సంచాలకుడు డా.రమేశ్ భార్మల్ ధృవీకరించారు. భయపెడుతున్న గణాంకాలు మొదటి, రెండో విడత కరోనా కాలంలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు చెందిన సుమారు 6,900 మంది సిబ్బంది, అధికారులకు కరోనా సోకగా...అందులో 250పైగా సిబ్బంది, అధికారులు మృతి చెందారు. గతనెల 17 నుంచి ఇప్పటివరకు 172 మంది అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా అనేకమంది కార్పొరేటర్లకు కూడా కరోనా సోకింది. లాక్డౌన్ అమలుచేసిన నాటి నుంచి అంటే 2020 మార్చి 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు బీఎంసీలో మొత్తం 7,038 మంది సిబ్బంది, అధికారులు కరో నా బారిన పడిన సంగతి తెలిసిందే. మూడో దఫా లో కరోనా బారిన పడిన వారిలో సీనియర్ స్థాయి అధికారులు, డిప్యూటీ కమిషనర్ స్థాయి నలుగురు అధికారులకు, ఆరోగ్య శాఖ, భద్రతా విభాగం, నాలుగో శ్రేణికి చెందిన కార్మికులున్నారు. వీరితో పాటు బీఎంసీ స్థాయి సమితి అధ్యక్షుడు యశ్వంత్ జాధవ్, మాజీమేయర్ విశ్వనాథ్ మహాడేశ్వర్సహా కొందరు కార్పొరేటర్లకు కరోనా సోకింది. -
ఆపతరమా..!
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వాయువేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియెంట్ అన్ని రాష్ట్రాల్లోనూ వణుకు పుట్టిస్తోంది. గత కొద్ది రోజుల వరకు దేశంలో పశ్చిమాది రాష్ట్రాల్లో మాత్రమే ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చేవి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో డెల్టా కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. కానీ ఇప్పుడు తూర్పు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ విజృంభణ మొదలైందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఒకే రోజులో 1,41,986 కరోనా కేసులు నమోదయ్యాయి. 222 రోజుల తర్వాత లక్షన్నరకి చేరువలో కేసులు నమోదు కావడంతో ఒమిక్రాన్ ఎంత ప్రమాదకరంగా మారుతోందో అర్థమవుతోంది. కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169కి చేరుకుంది. కేవలం ఒకే రోజులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,806 దాటేయడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజువారీ కేసుల పాజిటివిటీ రేటు 9.28శాతం ఉంటే, వీక్లీ పాజిటివిటీ రేటు 5.66శాతంగా ఉంది 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు 3,071కి చేరుకున్నాయి. ఆంక్షలు కఠినతరం చేయాలి: డబ్ల్యూహెచ్ఓ పిలుపు ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్–19 కేసులు భారీగా వెలుగులోకి వస్తూ ఉండడంతో కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పిలుపునిచ్చింది. వైరస్ సామాజిక వ్యాప్తిని నివారించడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ప్రజారోగ్య సదుపాయాలను పెంచాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియెంట్ తక్కువ తీవ్రత ఉంటుందని భావించి నిర్లక్ష్యం చేయవద్దని డబ్ల్యూహెచ్ఒ ఆగ్నేయాసియ రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ హితవు పలికారు. -
కరోనా: తెలంగాణలో 2,000 దాటిన రోజువారీ కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి తన విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 64,474 మందికి పరీక్షలు చేయగా.. 2,295 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీటిలో జీహెచ్ఎంపీ పరిధిలో1452,రంగారెడ్డిలో 218, మేడ్చెల్‌లో 232 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,89,751కు చేరింది. మరణాల సంఖ్య 4,039కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 97.98%గా ఉంది. ప్రస్తుతం 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక -
బీఅలర్ట్: ఒమిక్రాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు
WHO Alert World On Omicron variant As Serious Issue: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృభిస్తుంది. అయితే చాలా దేశాలు ఈ వేరియంట్‌ని చాలా తేలికగా తీసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఇది అంత పెద్ద ప్రమాదకారి కాదని కొట్టిపారేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఈ మేరకు డబ్ల్యుహెచ్వో చీఫ్ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఒకవైపు డెల్టా వేరియంట్‌తో పోటీపడుతూ ఒమిక్రాన్ వేగంగా విజృభిస్తుంది. అంతేకాదు మరోవేపు కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం వ్యవధిలో 71 శాతం కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారాయన. పైగా ఆస్పత్రులు కొత్త వేరియెంట్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. నిజానికి డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తక్కువ తీవ్రతతో ఉన్నట్లు కనిపించడంతో తీవ్రత లేదని భావిస్తున్నారంతా. కానీ, అది వాస్తవం కాదు. ఒమిక్రాన్ తీవ్రత వల్లే ఆస్పతి పాలవుతున్నారు. చనిపోతున్నారు కూడా. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి సైతం సంక్రమించడం ఆందోళన కలిగిస్తోందని, మరోవైపు ప్రాణాలు పోయే ముప్పు సైతం పొంచి ఉందని టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!) వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదని, వ్యాక్సిన్ కేవలం రక్షణ వలయం లాంటిదని చెప్తున్నారాయన. అంతేకాదు కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకి సునామీలా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సెలవుల వల్ల కేసులు పెరగ్గా.. కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో పలు దేశాలు విఫలం అయ్యాయని, అందుకే కేసులు రికార్డు స్థాయిలో పెరుగతున్నాయని అన్నారు. ఈ ఏడాది ప్రతి దేశం కూడా 70% వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ -19 టెక్నికల్ లీడ్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. "ఒమిక్రాన్ కరోనా వైరస్ చివరి వేరియెంట్ కాదు. ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేం. ఒమిక్రాన్ వేరియంట్‌ను నుండి తమను తాము రక్షించుకోవడానికి వారు ఇప్పటికే తీసుకుంటున్న చర్యలను మరింత వేగవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి" అని ప్రపంచాన్ని కోరారు. అయితే తాము 2022 ఏడాది చివరిలో కూడా ఈ కరోనా గురించి ఇంకా ప్రసంగించే పరిస్థితి ఏర్పడితే.. అంతకన్నా విషాదం ఇంకోకటి ఉండదు అని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఆవేదనగా చెప్పారు. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) -
ఒమిక్రాన్: జస్ట్ క్యాన్సిలేషన్స్తోనే రూ.200 కోట్ల నష్టం!
కరోనా దెబ్బకు ఆర్థికంగా దాదాపు ప్రతీ రంగం కుదేలు అయ్యింది. ముఖ్యంగా ప్రయాణాలు, కొవిడ్ రూల్స్ కారణంగా భారీగా నష్టపోయిన వాటిల్లో ఒకటి హాస్పిటాలిటీ సెక్టార్(ఆతిథ్య రంగం). అయితే పూర్వవైభవం సంతరించుకుందని సంబురపడే లోపే.. ఈ రంగంపై మరో పిడుగు పడింది. అది ఒమిక్రాన్ రూపంలో. తాజాగా ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు ఆతిథ్య రంగాన్ని మంచి సీజన్లో చావు దెబ్బ తీస్తున్నాయి. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో ఆతిథ్య రంగానికి వాటిల్లిన నష్టం లక్షల కోట్ల రూపాయల్లోనే!. అందునా వారం రోజుల వ్యవధిలో సుమారు 200రూ. కోట్లు నష్టపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ నష్టం కేవలం బుకింగ్ క్యాన్సిలేషన్ ద్వారా వాటిల్లింది కావడం. యస్.. డిసెంబర్ 25 నుంచి జనవరి 31 మధ్య ఆతిథ్య రంగం ఈ మేర నష్టం చవిచూసింది. క్రిస్మస్, న్యూఇయర్‌తో పాటు వెడ్డింగ్స్, ఇతరత్ర ఈవెంట్స్ రద్దు ద్వారానే ఈ నష్టం వాటిల్లిందని ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మాంచి సీజన్ మీదే.. కరోనా సీజన్లో బుకింగ్‌లు లేక పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ వెలవెలబోయాయి. నెలలపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో కోలుకోలేని దెబ్బ పడింది. 8 శాతం బిజినెస్ శాశ్వతంగా మూతపడింది కూడా!. తద్వారా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో భారీ నష్టమే వాటిల్లింది. అయితే రెండు వేవ్‌లు అన్-సీజన్లో రావడంతో ఆతిథ్య రంగంపై నష్టం మరీ ఘోరంగా అయితే లేదు. కానీ, ఇప్పుడు వేడుకల సమయం. పైగా పెళ్లిళ్ల సీజన్. వ్యాక్సినేషన్ కూడా నడుస్తుండడంతో వ్యాపారాలు గాడిన పడతాయని అంతా భావించారు. ఇప్పుడేమో ఒమిక్రాన్ వల్ల పరిస్థితి ఊహించిన విధంగా లేదు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లింది.. మునుముందు ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న దానిపై లెక్కలు కట్టే పనిలో ఉంది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్. అందుకే నష్టస్థాయి ఊహించినదానికంటే ఘోరంగా ఉండొచ్చనే ఆందోళనలో ఆతిథ్య రంగం ఉందని ఎఫ్హెచ్ఆర్ఏఐ సెక్రటరీ ప్రదీప్ శెట్టి చెబుతున్నారు. ఒమిక్రాన్ వల్లే.. అక్టోబర్ 2021 నుంచి హోటల్స్, రెస్టారెంట్ల బుకింగ్‌లు పెరుగుతూ వస్తుండడంతో హాస్పిటాలిటీ రంగానికి మంచి రోజులు వచ్చినట్లు భావించారంతా. డిసెంబర్ రెండో వారం నాటికి ఈ బుకింగ్‌లు ఏకంగా 80-90 శాతానికి చేరాయి( కార్పొరేట్ హోటల్స్‌లో అయితే అది 50 శాతం మార్క్ దాటింది). కానీ, కొత్త వేరియెంట్ ప్రభావంతో పరిస్థితి తలకిందులైంది. డిసెంబర్ 25 నుంచి హోటల్స్ ఆక్యుపెన్సీ, రేట్లు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి. ఆంక్షలు-కర్ఫ్యూలు, ఆక్యుపెన్సీ నిబంధనలు, కస్టమర్ల భయాందోళనల నడుమ అప్పటికే అయిన బుకింగ్స్ దాదాపు 60 శాతం మేర రద్దయ్యాయి. కరోనా తొలినాళ్లలోలాగా ఇప్పుడు మళ్లీ పది నుంచి 15 శాతం ఆక్యుపెన్సీతో హోటల్స్ బిజినెస్ నడుస్తోంది. మునుముందు కఠిన ఆంక్షలు విధిస్తే.. ఈ కాస్త ఆక్యుపెన్సీ కూడా ఉండకపోవచ్చనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వ సాయం! ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందో అనే ఆందోళన ఆతిథ్య రంగంలో నెలకొంది. మరోవైపు రెస్టారెంట్లలోకి అడుగుపెట్టేవాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని, డిసెంబర్లో 50 శాతం ఉన్న అమ్మకాలు, ఆదాయాలు.. ఇప్పుడు కేవలం 10-20 శాతానికి పడిపోయాయని ఎఫ్హెచ్ఆర్ఏఐ అంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మద్దతు కోరుకుంటోంది ఆతిథ్య రంగం. భౌతిక దూరం ఇతరత్ర కొవిడ్ రూల్స్ పాటిస్తామని, ప్రతిగా తమకు ఊరట-మినహాయింపులు ఇవ్వాలని కోరుతోంది ఎఫ్హెచ్ఆర్ఏఐ. అదే విధంగా ఉద్యోగుల జీతభత్యాల భారంగా మారుతున్న తరుణంలో.. పన్నులు తగ్గింపులాంటి మినహాయింపులు ఆశిస్తోంది కూడా. సంబంధిత వార్త: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండవచ్చంటే.. -
కరోనా సైరన్ మోత!... రికార్డు స్థాయిలో కేసులు
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ జిల్లాల్లో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 1,588 కేసులు నిర్ధారణ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,214 మేడ్చల్ జిల్లాలో 161, రంగారెడ్డి జిల్లాల్లో 213 మంది వైరస్ బారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారిలో తీవ్రమైన లక్షణాలేవీ లేకపోవడం, సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు మాత్రమే కన్పిస్తుండటం ఊరటనిచ్చే అంశంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కోవిడ్ చికిత్సలకు కేంద్రమైన గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతీ ఆస్పత్రి, నిలోఫర్ సహా అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. అత్యవసరమైతే మినహా సాధారణ కారణాలకు సెలవులను మంజూరు చేయకూడదని ఆయా ఆస్పత్రులకు సూపరింటెండెంట్లకు తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..!) -
కరోనా మళ్లీ ఉగ్రరూపం.. దేశంలో కొత్తగా 90వేలపైగా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 325 మంది కరోనాతో మరణించగా, 19,206 మంది కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరొకవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో ఇప్పటివరకు 2,630 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ కేసులు పెరగడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: ఒమిక్రాన్ మిగతా వాటిలా కాదు.. శ్వాస వ్యవస్థ పైభాగంలో ఎఫెక్ట్ ఉంటుంది: డబ్ల్యూహెచ్‌వో #Unite2FightCorona#OmicronVariant ➡️ 90,928 New Cases reported in last 24 hours. pic.twitter.com/hCg8vLC5ni — Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2022 ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,43,41,009 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బరినపడి 4,82,876 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,85,401 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ రోజువారి పాజిటివ్ రేటు 6.43 శాతంగా ఉంది. డిసెంబర్ 28న దాదాపు 9 వేలకు పైగా కేసులు నమోదుకాగా, గడిచిన 24 గంటల్లో 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/XLFKXylyRO pic.twitter.com/HqiNuPTlIZ — Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2022 -
తెలంగాణలో రెండో రోజు భారీగా కోవిడ్ కేసులు..నిన్నటితో పోలిస్తే 50% అధికం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంటే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజు భారీగా కేసులు పెరిగాయి. సోమవారం 1052 కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా 1520 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు వెయ్యికి చేరువలో వెలుగు చూశాయి. జీహెచ్ఎంసీలో 979, మేడ్చల్ జిల్లాలో 132, రంగారెడ్డి జిల్లాలో 176 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిలెన్ విడుదల చేసింది. 42,531 కరోనా టెస్టులు చేశామని పేర్కొంది. చదవండి: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం ఆ రాష్ట్రంలోనే.. వెల్లడించిన కేంద్రం తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,034కు చేరింది. కరోనా నుంచి మంగళవారం 209 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గడిచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 144 ఒమిక్రాన్ కేసులున్నాయి. చదవండి: నీ కోసమే జైలుకు వెళ్లిన కేసీఆర్: బండి సంజయ్ -
విజృంభిస్తున్న కరోనా.. దేశంలో కొత్తగా కేసులు ఎన్నంటే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 534 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,43,21,803 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బరినపడి 4,82,551 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,14,004 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ రోజువారి పాజిటివ్ రేటు 4.18 శాతంగా ఉంది. -
తెలంగాణ పై పడగవిప్పిన ఓమిక్రాన్
-
కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి
-
ఒకేసారి 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
-
కోవిడ్ బాధితులకు స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి: అరవింద్ కేజ్రీవాల్
-
దేశంలో భారీగా పెరుగుతున్న వైరస్ కేసులు
-
మళ్ళీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి
-
ప్రపంచం పై మళ్లీ పంజా విసురుతోన్న కరోన
-
జనానికి వాక్సిన్ అంటే భయం ఎందుకు ??
-
Telangana: మరో నలుగురికి ఒమిక్రాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కేసులు మొత్తంగా ఏడుకు చేరాయి. తొలి మూడు కేసులు వచ్చిన మరునాడే మరిన్ని కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. వీరంతా కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని.. స్థానికంగా ఒమిక్రాన్ కేసులేవీ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. తాజా కేసుల్లో ఒకరు హైదరాబాదీ: బుధవారం నమోదైన మూడు కేసుల్లో ఒకరు సోమాలియాకు, మరొకరు కెన్యాకు చెందినవారుకాగా.. మరొకరు కెన్యా నుంచి వచ్చిన బెంగాలీ. తాజాగా గురువారం వెలుగు చూసిన నాలుగు కేసుల్లో ఒకరు బ్రిటన్ నుంచి వచ్చిన 31 ఏళ్ల హైదరాబాద్ వాసి. యూసఫ్‌గూడ ప్రాంతానికి చెందిన ఆయన.. లండన్ నుంచి దుబాయ్ మీదుగా ఈ నెల 15న హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. ఇక మిగతా ముగ్గురు కెన్యా దేశస్తులే. వీరిలో ఇద్దరు 24 ఏళ్ల యువతులు, ఒకరు 44 ఏళ్ల పురుషుడు ఉన్నారని.. ఈ నెల 13, 14 తేదీల్లో షార్జా, దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారని అధికారులు చెప్తున్నారు. వారు వైద్య అవసరాల కోసం హైదరాబాద్‌కు వచ్చారని సమాచారం. అయితే వైద్యారోగ్యశాఖ మాత్రం పూర్తి సమాచారం ఇవ్వలేదు. ముప్పున్న దేశాల నుంచి మరో 120 మంది.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉన్న ‘రిస్క్’దేశాల నుంచి వచ్చిన 120 మంది గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. వారందరికీ పరీక్షలు చేయగా.. ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు. మొత్తంగా రిస్క్ దేశాల నుంచి ఇప్పటివరకు 6,764 మంది వచ్చారు. అందులో 21 మందికి సాధారణ కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. ఇక ‘రిస్క్’లేని దేశాల నుంచి వేలాది మంది రాష్ట్రానికి రాగా.. వారిలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకినట్టు వెల్లడైంది. తాజాగా మరో ముగ్గురి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో మరో 190 కేసులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా 40,103 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 190 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 6,79,064కి పెరిగాయి. వైరస్ బారినపడి మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాలు 4,012కు చేరాయి. -
Coronavirus Updates: 24 గంటల్లో కొత్తగా 7,774 కోవిడ్ కేసులు.. 306 మంది మృతి!
న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,774 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం 92,281 కేసులు యాక్టివ్ కేసులున్నాయి. 306 మంది ఒకే రోజు మరణించారు. 8,464 రికవరీలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,90,510కు చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 4,75,434కు చేరినట్లు ఆరోగ్య శాఖ ఆదివారం మీడియాకు తెల్పింది. అన్ని రాష్ట్రాల కంటే కేరళలో అత్యధికంగా 3,795 కేసులు, మహారాష్ట్రలో 807 కేసులు, తమిళనాడులో 681, పశ్చిమ బెంగాల్లో 610 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల రికార్డు 0.65 శాతంగా ఉంది. కాగా గడచిన 69 రోజులతో పోల్చితే రెండు శాతం తక్కువ అని డేటా తెల్పుతోంది. అలాగే రికవరీ రేటు 98.36 శాతం ఉందని ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటన్ తెల్పుతోంది. చదవండి: ఎయిర్‌పోర్టులో పోర్న్ వీడియో చిత్రీకరణ.. మోడల్‌కు 18 యేళ్ల జైలు శిక్ష! COVID19 | India reports 7,774 new cases, 306 deaths and 8,464 recoveries in the last 24 hours; Active caseload at 92,281 pic.twitter.com/pUMkvjVcY4 — ANI (@ANI) December 12, 2021 -
Telangana: కొత్తగా 103 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 22,902 కరోనా పరీక్షలు నిర్వహించగా, 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,555కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,981కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 153 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,66,999కి చేరింది.