
జలంధర్: పంజాబ్(Punjab)లో ఇటీవలి కాలంలో గ్రనేడ్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్‌లో హిందూనేత, యూట్యూబర్ రోజర్ సంఘూ ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌కు చెందిన డాన్ షహజాద్ ప్రకటన చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నందున రోజర్ సంఘూ ఇంటిపై దాడి చేసినట్లు డాన్ షహజాద్ తెలిపాడు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం హిందూవాదంపై ప్రచారం సాగించే రోజర్ సంఘూ ఒక వర్గాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నానే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే అతని ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో జలంధర్ పోలీసులు ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనకు ముందు పంజాబ్‌లోని అమృత్‌సర్(Amritsar_ జిల్లాలోని ఖండ్వాలా ప్రాంతంలో శనివారం రాత్రి ఠాకుర్‌ద్వార్ ఆలయంపై గ్రనేడ్ దాడి జరిగింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలయం వెలుపల ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది.
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 12:35 గంటలకు మోటార్ సైకిల్ ఇద్దరు యువకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారి చేతుల్లో జండాలు ఉన్నాయి. కొద్దసేపు వారు ఆలయం ముందు అటుఇటు తిరిగాక, ఆలయంపైకి గ్రనేడ్‌లు విసిరారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలోనే ఆలయంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఈ సమయంలో ఆలయంలో పూజారి నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే పేలుడు కారణంగా ఆలయంలోని కొంత భాగం ధ్వంసం అయ్యింది.
ఇది కూడా చదవండి: ర్యాపిడ్ రైలు కారిడార్‌పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే..