
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ సీటును వరుసగా నాలుగోసారి కైవసం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ తనకు రూ.55 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ.49 కోట్లు కాగా, రూ.6.75 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు.
2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4.32 కోట్ల ఆదాయం వచి్చనట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రెండు కార్లు ఉన్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో రూ.23 కోట్ల ఆస్తులు, 2019 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.35 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు థరూర్ వెల్లడించారు.