
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018లో ఎన్టీఏ ఏర్పాటు కాగా.. వివిధ కారణాల వల్ల 16 పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కొంది.
అయితే పరీక్షలను వాయిదా వేయడానికి కోవిడ్ 19 మహమ్మారి,సాంకేతిక, రవాణా, పరిపాలనా పరమైన సమస్యలను కారణాలుగా తెలిపింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు. విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
‘2018లో ఎన్టీఏ ఏర్పాటయ్యింది. 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 5.4 కోట్ల మందికి పైగా విద్యార్ధులు ఇందులో పాల్గొన్నారు. ఎన్టీఏ నిర్వహించే చాలా పరీక్షలు అనేక సబ్జెక్టులు, బహుళ-షిఫ్ట్‌లు, ఎక్కువ రోజుల వ్యవధిలో జరుగుతాయి. కాబట్టి కరోనా, లాజిస్టికల్, సాంకేతిక సమస్యలు, పరిపాలనాపరమైన సమస్యలు, చట్టపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందు చెప్పిన తేదీలు, సమయాలకు పరీక్షలు నిర్వహించలేకపోయింది.’ అని పేర్కొన్నారు.
కరోనా కారణంగా జేఈఈ-మెయిన్ (2020), నీట్-యూజీ (2020), JEE-మెయిన్ (2021) నీట్-యూజీ(2021) పరీక్షలు వాయిదా పడ్డాయి.
వాయిదా పడిన మరిన్ని పరీక్షలు..
CSIR UGC-NET (2020), UGC-NET (డిసెంబర్ 2020),
UGC-NET (మే 2021)
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) AIEEA (2020)..
ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (DUET) 2020,
GNOU PhDకామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT)-2021
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET)-2021
జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్మ్యాట్)- 2021,
GNOU PhD ఎంట్రన్స్ పరీక్ష
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బయోటెక్నాలజీ (GAT-B), 2023
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET), 2024,
CSIR-NET, 2024