‘అందుకే ఒడిశా దుర్ఘటన జరిగింది’.. రైల్వే బోర్డుకు నివేదిక | Odisha Balasore train accident Reason Inquiry finds multi level lapses | Sakshi
Sakshi News home page

‘అందుకే ఒడిశా దుర్ఘటన జరిగింది’.. రైల్వే బోర్డుకు రైల్వే సేఫ్టీ కమిషన్‌ నివేదిక

Published Mon, Jul 3 2023 9:24 PM | Last Updated on Mon, Jul 3 2023 9:24 PM

Odisha Balasore train accident Reason Inquiry finds multi level lapses - Sakshi

ఒడిశా బాలాసోర్‌ ఘటనపై ఎట్టకేలకు తన నివేదికను.. 

సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు 300 మందిని బలిగొన్న ఒడిశా బాలాసోర్‌ రైల్వే దుర్ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషన్‌ తన స్వతంత్ర నివేదిక సమర్పించింది. రాంగ్‌ సిగ్నలింగ్‌ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు సమర్పించిన తన నివేదికలో పేర్కొంది. 

ప్రమాదానికి రాంగ్‌ సిగ్నలింగ్‌ ప్రధాన కారణమని వెల్లడించిన సీఆర్‌ఎస్‌ నివేదిక.. అనేక స్థాయిలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రైల్వే బోర్డుకు నివేదించింది. అలాగే.. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నివేదికలు వ్యక్తం చేసింది. 

గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని.. 2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖార్గ్‌పూర్ డివిజన్‌ బ్యాంక్‌రనాయబాజ్ స్టేషన్‌ వద్ద తప్పు వైరింగ్, కేబుల్ లోపం కారణంగా జరిగిన ఘటనను నివేదికలో ప్రస్తావించింది కమిషన్‌. అలాగే..  లోపం సరిచేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే బోర్డుకు సూచించింది కమిషన్‌.

జూన్‌ 2వ తేదీ రాత్రి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం జరగ్గా.. 292 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.

ఇదీ చదవండి: దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement