మోదీ పుణ్య స్నానం | PM Modi Attend Prayagraj Mahakumbh Live Updates | Sakshi
Sakshi News home page

ప్రయాగ్‌రాజ్‌: మహా కుంభమేళాలో మోదీ పుణ్య స్నానం

Published Wed, Feb 5 2025 10:54 AM | Last Updated on Wed, Feb 5 2025 11:50 AM

PM Modi Attend Prayagraj Mahakumbh Live Updates

ఢిల్లీ:  మహా కుంభమేళా సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్‌(Prayagraj త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఉన్నారు.  

జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌ వచ్చారు. హెలికాప్టర్‌లో అరైల్‌ ఘాట్‌ వద్దకు.. అక్కడి నుంచి బోట్‌లో సంగమం వద్దకు చేరుకున్నారు.ప్రధాని రాక నేపథ్యంలో అరైల్‌ ఘాట్‌ నుంచి సంగమం వరకు భారీ భద్రతా మోహరించారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement