ఎన్డీఏలోకి రాజ్‌ఠాక్రే? | Raj Thackeray MNS May Join NDA | Sakshi
Sakshi News home page

Maharashtra: ఎన్డీఏలోకి రాజ్‌ఠాక్రే?

Published Sat, Mar 16 2024 12:52 PM | Last Updated on Sat, Mar 16 2024 1:04 PM

Raj Thackeray May Join NDA - Sakshi

మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయి. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎన్డీయేలో చేరడంపై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. 

దక్షిణ ముంబై సీటును ఎంఎన్ఎస్ అభ్యర్థికి కేటాయించాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ సీటు నుంచి ఇప్పటికే బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్ పేరు వినిపిస్తోంది. కాగా రాజ్ ఠాక్రే డిమాండ్‌పై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ సీటు కేటాయించిన తర్వాతనే రాజ్‌ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్త వినిపిస్తోంది.

తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో బీజేపీకి ఒప్పందం  ఏమీ లేదని అన్నారు. బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) కూటమి మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈసారి బీజేపీ సీట్ల రికార్డును బ్రేక్ చేస్తుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement