
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్‌పూర్‌లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు.
#WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6
— ANI (@ANI) October 24, 2023
సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్‌కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్‌కు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు.