
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. చాలా హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని తేజస్వి యాదవ్ క్యాప్షన్ పెట్టారు.