హైకోర్టు జడ్జీలుగా ఐదుగురు | SC collegium recommends five names for judgeship in four High Courts | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జీలుగా ఐదుగురు

Published Sat, Jan 6 2024 6:32 AM | Last Updated on Sat, Jan 6 2024 6:32 AM

SC collegium recommends five names for judgeship in four High Courts - Sakshi

న్యూఢిల్లీ: నాలుగు హైకోర్టుల్లో నియామకానికిగాను సుప్రీంకోర్టు కొలీజియం అయిదుగురు జడ్జీల పేర్లను ప్రతిపాదించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలో భేటీ అయిన కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫారసులను పంపించింది. కొలీజియంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ కూడా ఉన్నారు.

జమ్మూ కశీ్మర్‌ అండ్‌ లద్దాఖ్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ రాహుల్‌ భారతి, జస్టిస్‌ మోక్షా ఖజూరియా కజి్మలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియంకోరింది. బాంబే హైకోర్టులో అదనపు జడ్జి అభయ్‌ అహుజాను శాశ్వత న్యాయమూర్తిగా, కోల్‌కతా హైకోర్టు న్యాయాధికారి చైతలి చటర్జీ(దాస్‌)ను అదే హైకోర్టులో న్యాయమూర్తిగా, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయాధికారి అరవింద్‌ కుమార్‌ వర్మను అదే హైకోర్టులో జడ్జిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement