
‘బీసీ కులాల అభివృద్ధికి కృషి చేద్దాం’
నిర్మల్‌చైన్‌గేట్: బీసీ కులాల అభివృద్ధికి కృషి చే ద్దామని ఎంసీ లింగన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం జిల్లా బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మ హాత్మా జ్యోతీబా పూలె, సావిత్రీబాయి పూలె దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించడం, బీసీ భవన్ ని ర్మాణానికి స్థల సేకరణ, బీసీల ఆర్థిక, సామాజి క, రాజకీయ రంగాల్లో అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎంసీ లింగన్న, ప్రధాన కార్యదర్శిగా అమరవేణి నర్సాగౌడ్, సహాధ్యక్షులుగా అనుముల భాస్కర్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఈసవేణి మనోజ్‌యాదవ్, కోశాధికారిగా భూసారపు గంగాధర్, అదనపు కార్యదర్శిగా యాటకారి సాయన్న, ఉ పాధ్యక్షులుగా గణేశ్, వెంకటి, ప్రభాకర్, శ్రీనివా స్, రాజేశ్వర్, కార్యదర్శులుగా నరేందర్, సాయి, కిషన్, గణేశ్, రమేశ్, న్యాయ సలహాదారులుగా రాజశేఖర్, అర్చన, రమణగౌడ్, మీడియా కార్యదర్శిగా పోశెట్టి, సంయుక్త కార్యదర్శులుగా నర్సయ్య, రాజేందర్‌గౌడ్, శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా ఆర్.శ్రీధర్, కే శ్రీధర్, మరో 20 మందిని కార్యవర్గ, గౌరవ సలహా సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.