
ఉగ్రదాడి హేయయమైన చర్య
నిర్మల్‌చైన్‌గేట్: కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన హిందూ యాత్రికుల ఆత్మశాంతి కోసం పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ చౌక్ నుంచి శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నారాయణరెడ్డి మార్కెట్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులు హిందూ ధర్మాన్ని అడిగి హత్య చేయడం దారుణమన్నారు. మతోన్మాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజలంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. వారిని తగిన విధంగా శిక్షించేందుకు నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దాడుల వెనుక గల ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ ఘటనలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి