
మళ్లీ లంపీ స్కిన్
వ్యాధి లక్షణాలు..
● పశువుల శరీరంపై 2 నుంచి 5 సెంటి మీటర్ల విస్తీర్ణంలో గుండ్రంగా దద్దుర్లు, కురుపులు ఏర్పడతాయి.
● పశువులకు జ్వరం వస్తుంది. ఆకలి మందగించి మేత సరిగా మేయవు
● పాల ఉత్పత్తి తగ్గుతుంది.
● చూడి పశువుల్లో గర్భస్రావం జరుగుతుంది.
● చికిత్స అందకపొతే పశువులు మరణించే అవకాశాలు ఉన్నాయి.
లోకేశ్వరం: పశువుల్లో ప్రాణాంతకమైన లంపీ స్కిన్(ముద్దచర్మం) వ్యాధి జిల్లాలో మళ్లీ బయటపడింది. వ్యాధి లక్షణాలు తెల్లజాతి పశువుల్లో కనిపిస్తుండటంతో పశువుల యాజమానులు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం విస్తరించి పాడి రైతులను ఆందోళనకు గురిచేసింది. పశువుల్లో మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల మృత్యువాత పడిన ఘటనలు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.
అందుబాటులో టీకాలు...
గతంలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన పశువులతోపాటు వాటి పరిసరాల్లోని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి ఎల్‌ఎస్‌డీ టీకాలు వేశారు. ప్రతీ పశువైద్య ఆస్పత్రిల్లో ఎల్‌ఎస్‌డీ టీకా మందులు అందుబాటు ఉన్నాయి. పుట్టిన దూడలకు రైతులు మందుకువచ్చి టీకాలు వేయించాలి. పూర్తి స్థాయిలో ఆవుజాతి పశువులకు టీకాలు వేయించకపోవడంతో మళ్లీ లంపీ స్కీన్ సోకుతుందని పశువైద్యాధికారులు పేర్కొంటున్నారు.
ఈ మండలాల్లో గుర్తింపు..
ప్రస్తుతం లంపీ స్కిన్ వ్యాధిని జిల్లాలోని కుంటాల, లోకేశ్వరం, కడెం మండాల్లోని ఆవుజాతి లేగ దూడల్లో గుర్తించారు.
ఎలా ప్రబలుతుందంటే...
వైరస్ వల్ల వ్యాధి సోకుతుంది. ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్ల వంటి వాటి వల్ల వ్యాప్తి చెందుతుంది. తెల్లజాతి పశువులైన ఆవులు, ఎద్దులపై వై రస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గేదెల్లోనూ ప్ర బలుతుంది. టీకా వేస్తే ఏడాదిపాటు వ్యాధి సోకదు.
ఆవుజాతి లేగ దూడల్లో బహిర్గతం మిగతా వాటికి పొంచి ఉన్న ముప్పు ఆందోళనలో రైతులు
జిల్లాలోని పశువుల వివరాలు..
తెల్లజాతి పశువులు 1,77,954
నల్లజాతి పశువులు 1,19,973
లేగ దూడకు వ్యాధి
నాకు ఆవులు, లేగదూడలు, ఎద్దులు అన్నీ కలిపి 60 వరకు ఉన్నాయి. లేగ దూడలకు లంపీ స్కిన్ సోకింది. చికిత్స చేయిస్తున్నాను. మిగతా వాటికి సోకకముందే అధికారులు దూడలకు టీకాలు వేయాలి.
– సంజీవ్‌రెడ్డి, ధర్మోర
అప్రమత్తం చేశాం
జిల్లాలో లంపీ స్కిన్(ముద్ద చర్మ) వ్యాధి లక్షణాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఇప్పటికే పశువైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. రైతులు జాగ్రతగా ఉండాలి. లక్షణాలు కనపడగానే పశువును మంద నుంచి వేరు చేసి క్వారంటైన్‌లో ఉంచి మండల పశువైద్యాధికారికి సమాచారం అందించాలి. జిల్లాని అన్ని పశువుల ఆస్పత్రుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు లేగ దూడలకు తప్పని సరిగా టీకాలు చేయించాలి.
– మహమ్మద్ బలిక్ హైమద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
పంచగుడిలో లంపీస్కిన్ సోకిన లేగ దూడ

మళ్లీ లంపీ స్కిన్

మళ్లీ లంపీ స్కిన్