
అక్కాబావ వద్దకే దేవి
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ కస్తూ ర్బా విద్యాలయంలో నాగరాజు దేవి ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. ఆమె సొంతూరు ఆ దిలాబాద్ కాగా దేవికి మూడేళ్లున్నప్పుడే ఆమె తండ్రి రవి గుండెపోటుతో, మూడేళ్ల క్రితం తల్లి ఊర్మిల అనా రోగ్యంతో మృతి చెందారు. దేవికి ఇద్దరు అక్కలున్నారు. చిన్నక్క హైదరాబాద్‌లో పనిచేస్తోంది. పెద్దక్క, బావ లోహిత–వినోద్ దంపతులు ఖానాపూర్‌లో నివాసముంటున్నా రు. వేసవి సెలవులు కావడంతో దేవిని కేజీబీవీ స్పెషలాఫీసర్ సునీతారాణి ఆమె బావ వినోద్ ద్వారా వాళ్లింటికి పంపించారు.