
సన్నాల మిల్లింగ్‌కు సన్నద్ధం కావాలి
పెద్దపల్లిరూరల్: యాసంగిలో సాగుచేసిన సన్నరకం వడ్లు లక్ష మెట్రిక్ టన్నులు సేకరించి మిల్లింగ్ చేసేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. సన్నరకం ధాన్యం మిల్లింగ్ చేసేందుకు 10 బాయిల్డ్ రైస్‌మిల్లులను గుర్తించాలన్నారు. డీఆర్డీవో, సివిల్ సప్లయ్ అధికారులు సమన్వయంతో ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. రా రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి సన్నరకం ధాన్యంపై మార్గదర్శకాలు వెల్లడించాలన్నారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ధాన్యం కేటాయించాలని అన్నారు. మిల్లర్లు ముందుకు రాకుంటే ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలని సూచించారు. డీఏవో ఆదిరెడ్డి, డీఎస్‌వో రాజేందర్, డీఎం శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
లాభదాయక యూనిట్లకు ప్రాధాన్యం
రాజీవ్ యువ వికాసం కింద లాభదాయక యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఒక గ్రామంలో ఒకేరకమైన యూనిట్లు స్థాపించకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈనెలాఖరులోగా మండలాల వారీగా విచారణ పూర్తిచేసి తుది జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఆ జాబితాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో ఖరారు చేస్తామని తెలిపారు. దరఖాస్తుదారుల సర్టి ఫికెట్లను తహసీల్దార్ పరిశీలించాలని ఆదేశించారు. డీఆర్డీవో కాళిందిని, లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, బీసీ వెల్పేర్ ఆఫీసర్ రంగారెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్‌కుమార్ ఉన్నారు.
సమస్యల పరిష్కారానికే భూ భారతి
ఎలిగేడు(పెద్దపల్లి): భూ సంబంధిత సమస్యల పరిష్కారానికే భూ భారతి ఆర్‌వోఆర్– 2025 చట్టం అమలు చేస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. భూముల క్రయ, విక్రయాలు, మ్యాప్, హద్దుల తయారీ, స్లాట్ బుకింగ్, పాస్‌పుస్తకాలు తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీ హైస్కూల్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉపాధిహామీ తదితర పనులు పరిశీలించారు. ఉద్యోగ విరమణ పొందుతున్న సుల్తాన్‌పూర్ పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్యారెడ్డిని శాలువాతో సత్కరించారు. ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణు, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డీఎం శ్రీకాంత్, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో కిరణ్, ఐకేపీ ఏపీఎం సుధాకర్, ఏవో ఉమాపతి, ఆర్‌ఐలు శేఖర్, జయలక్ష్మి సింగిల్‌విండోచైర్మెన్ గోపు విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
10 బాయిల్డ్ రైస్‌మిల్లులను గుర్తించాలి
లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ముందుకు..
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు

సన్నాల మిల్లింగ్‌కు సన్నద్ధం కావాలి