
భరోసా ఏది?
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి, పెద్దపల్లి: ఆత్మీయ భరోసా పథకం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుకావడంలేదు. ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉండి 20 రోజులు పనిచేసిన భూమిలేని రైతు కూలీలకు ఏడాదిలో రెండు విడతలుగా రూ.12వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆత్మీయ భరోసా పేరిట ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గత జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకం, కొత్త రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకాలు ప్రారభించిన విషయం తెలిసిందే. ఈ పథకాలను ఆరంభించిన రోజే మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా పథకాలకు ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు వర్తింపజేశారు. మిగిలిన గ్రామాల్లోని రైతుకూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించినా.. వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేయలేదు. దీంతో ఉపాధిహామీ కూలీలు ఆ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లోనే..
2023–24 ఆర్థిక సంవత్సరంలో 20రోజల పాటు ఉపాధిహామీ పథకం ద్వారా కూలి పనులు చేసిన భూమిలేని వారు జిల్లావ్యాప్తంగా 15,046 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా పెద్దపల్లి మండలంలో 2,156 మంది రైతు కూలీలు ఉన్నారని అధికారులు తేల్చారు.
జాబితాలో లేనివారి కోసం..
అర్హుల జాబితాలో పేర్లు రానివారి నుంచి గత జనవరి 24, 25వ తేదీల్లో నిర్వహించిన గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఇలా జిల్లావ్యాప్తంగా మరో 6,584 మంది రైతు కూలీలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 13 గ్రామాల్లో గుర్తించిన రైతు కూలీలు మినహా మిగతా గ్రామాల్లోని రైతు కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు.
ఎమ్మెల్సీ కోడ్ ముగిసినా..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో రైతుకూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేందుకు బ్రేక్ పడింది. అయితే, కోడ్ ముగిసి నెలలు గడుస్తున్నా తమ బ్యాంకు ఖాతాల్లో ఇంకా డబ్బులు జమచేయలేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు లబ్ధిదారులు కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికై నా అర్హులైన ప్రతీఒక్కరి బ్యాంకు ఖాతాల్లో తొలివిడత కింద రూ.6వేలు జమచేయాలని వేడుకుంటున్నారు.
అర్హులైన ఈజీఎస్ కూలీలు
మండలం గుర్తించిన కూలీలు పెద్దపల్లి 2,156 సుల్తానాబాద్ 1,907 మంథని 1,960 ఎలిగేడు 472 ఓదెల 1,010 రామగిరి 1,049 కమాన్‌పూర్ 568 పాలకుర్తి 1,216 జూలపల్లి 440 ముత్తారం 575 ధర్మారం 1,341 అంతర్గాం 1,133 కాల్వశ్రీరాంపూర్ 1,219
న్యూస్‌రీల్
అందని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లోనే అమలు మిగతా పల్లెల్లో తప్పని ఎదురుచూపులు జిల్లాలో 15,046 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు నిరాశలో ఉపాధిహామీ రైతు కూలీలు

భరోసా ఏది?