
రూ.10వేల పింఛన్ ఇవ్వాలి
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల్లో భరోసా కల్పించేందుకు రెండుసార్లు పార్లమెంట్‌లో ప్రస్తావించా. గతంలో రూ.10 సింగరేణి చెల్లించేది. నా పోరాటంతో మరో రూ.10 కలిపి ప్రస్తుతం రూ.20 చెల్లించేలా అంగీకారం కుదిరింది. ప్రతీరిటైర్డ్ ఉద్యోగికి నెలకు కనీసం రూ.10వేల పింఛన్ వచ్చేలా పోరాటం చేస్తా.
– వంశీకృష్ణ, ఎంపీ, పెద్దపల్లి
భరోసా కల్పించాం
కోలిండియా యాజమాన్యం ఆదేశాల మేరకు టన్ను బొగ్గుపై రూ.20 చెల్లించేందుకు అంగీకరించాం. సింగరేణిలో అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేశాం. వచ్చేనెల నుంచి సీఎంపీఎంఫ్ ఖాతాలో ఈ సొమ్ము జమవతుంది. సుమారు 80 వేల మంది పైచిలుకు రిటైర్డ్ ఉద్యోగులకు దీనిద్వారా భరోసా లభిస్తుంది.
– బలరాం, సీఎండీ, సింగరేణి

రూ.10వేల పింఛన్ ఇవ్వాలి