
ఒకే వంట
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఒకే ఇల్లు..
బలం.. బలగం
● ఇంటి పెద్ద మాటకు కట్టుబడి ● బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తూ ● ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలు
భీమనాతి బలగం
ఉమ్మడి కుటుంబం.. జీవిత పాఠం.. అలాంటి కుటుంబాల్లో భావోద్వేగాలకు..ఆప్యాయతలకు చోటుంటుంది. ఏది మంచో.. ఏది చెడో బాల్యం నుంచే చిన్నారులకు చెప్పే వారుంటారు. నీతి కథలు.. పెద్దల అనుభవాలు జీవిత పాఠాలుగా ఉపయోగపడుతాయి. ఏ ఆపదొచ్చినా.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మేమున్నామనే భరోసా ఉంటుంది. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో బంధాలు, బంధుత్వాలు భారమవుతున్నాయి. పెళ్లయిన కొన్నాళ్లకే వేరు కాపురాల సంఖ్య పెరుగుతోంది. ఎప్పుడో ఓసారి కలిసినప్పుడు నామమాత్రపు పలకరింపులు.. తర్వాత ఎవరి దారి వారిదే.. ఇలాంటి రోజుల్లో కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. విభేదాలు లేకుండా క లిసిమెలిసి ఉంటున్నారు. అలాంటి వారిపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.. – కోరుట్ల/సారంగాపూర్/యైటింక్లయిన్‌కాలనీ
వేములవాడ/ముత్తారం/మల్యాల
తరతరాలుగా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కాలం గడుపుతూ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కుటుంబం కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్‌లో నివాసముంటోంది. కుటుంబ పెద్ద భీమనాతి కాంతయ్య–గంగుబాయి దంపతులకు ఒక కుమార్తె, ఆరుగురు కుమారులు. భీమనాతి శ్రీనివాస్, వేణుగోపాల్, జనార్దన్, శ్రీధర్, దామోదర్, సాయికృష్ణ. కాంతయ్య ఇటీవల మృతిచెందినా ఆయన కొడుకులు తల్లి గంగుబాయితో కలిసే ఉంటున్నారు. వారసత్వంగా వస్తున్న ఐరన్‌హార్ట్‌వేర్ వ్యాపారంలో వీరంతా స్థిరపడ్డారు. వీరందరికీ పెళ్లిళ్లు కావడంతో పాటు పిల్లలు ఉన్నారు. తల్లి గంగుబాయితో కలిసి కొడుకులు–కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు అంతా 27 మంది ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉండటమే కాదు.. ఒకే వంట కావడం విశేషం. రోజూ చిన్నపాటి ఫంక్షన్ తీరుగా ఇల్లంతా పెద్దలతో పాటు పిల్లాపాపలతో కళకళలాడుతుంది. తరతరాలుగా ఈ కుటుంబం ఉమ్మడిగా కాలం గడపటం నిజంగా ఈ కాలంలో ఓ వింతగానే తోస్తోంది.
– వివరాలు
10లోu
న్యూస్‌రీల్

ఒకే వంట

ఒకే వంట