
ఏడాదిలోగా పెర్క్ ్సపై ఇన్‌కంట్యాక్స్ మాఫీ
గోదావరిఖని/రామగిరి(మంథని): ఏడాదిలోగా కార్మికుల పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ చేస్తామ ని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1, 2లో ఏర్పాటు ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మా ట్లాడారు. సింగరేణి భవిష్యత్, కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్‌టీయూసీ పోరాటం చేస్తుందన్నారు. మొన్న కవిత గోదావరిఖనిలో మాట్లాడు తూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు బోగస్ అనటం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా రూ.5వేల చొప్పున అందజేసిందని అన్నారు. నాయకులు నర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి, వికాస్‌కుమార్, దాస్ ఉన్నారు.