Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Serious Comments On CM Chandrababu1
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025

India Bans All Imports From Pakistan2
పహల్గాం ఉగ్రదాడి: పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో షాక్‌

ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌ ఎగుమతులు, దిగుమతులపై నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ సర్కార్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ ఆర్థిక మూలాలను చావు దెబ్బ తీసే ప్రయత్నాల్ని భారత్‌ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్‌ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే, ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్‌,పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి వరుస కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్‌ను భారత్‌ దెబ్బకు దెబ్బ తీస్తోంది. ముందుగా సరిహద్దు దాటిన ఉగ్రవాదం అని పేర్కొంటూ సింధు జల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జాతీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. పాక్‌ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత గగనతలంలో పాక్‌ విమానాలపై నిషేధం విధించింది. భారత్‌లో పాక్‌ దేశ మీడియా,సోషల్‌ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్‌ విధించింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్న కేంద్రం పేర్కొంది.

KSR Comments On Yellow Media And Chandrababu3
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!

రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Authorities Open Salal Dam Gates To Regulate Water Flow After Heavy Rains In jammu and kashmir4
సలాల్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తివేత.. వరద భయంతో పాక్‌ గగ్గోలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ చినాబ్‌ నదిలో వరద ప్రవాహాం పెరుగుతుండడంతో అధికారులు అలెర్ట్‌ అయ్యారు. సలాల్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు.చినాబ్‌లో నీటి ప్రవాహం డేంజర్‌ మార్క్‌కు చేరుకోవడంతో సలాల్‌ డ్యామ్‌ గేట్లు తెరిచారు జమ్మూకశ్మీర్‌ అధికారులు. దీంతో పాకిస్తాన్‌లో వరద భయాలు మరింత పెరిగిపోయాయి. భారత్‌ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తివేసిందంటూ పాక్‌ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వాటర్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. అయితే, గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌ బస్టర్‌ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వెరసీ సలాల్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సలాల్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తారు.

Jos Buttler Creates History Becomes First Player To Achieve This Feat5
వారెవ్వా!.. చరిత్ర సృష్టించిన జోస్‌ బట్లర్‌.. తొలి ఆటగాడిగా రికార్డు

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌ (Jos Buttler) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా బట్లర్‌ ఈ ఘనత సాధించాడు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్లు సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు.సాయి 23 బంతుల్లో 48 పరుగులు చేసి అవుట్‌ కాగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ క్రీజులోకి వచ్చాడు. గిల్‌ (38 బంతుల్లో 76)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బట్లర్‌ 37 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 64 పరుగులు రాబట్టాడు.4000 పరుగుల మైలురాయిఅయితే, సన్‌రైజర్స్‌ ​కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇవ్వడంతో బట్లర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన బట్లర్‌.. ఐపీఎల్‌ కెరీర్‌లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా బట్లర్‌ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లోనే) ఈ మార్కు అందుకున్న మూడో బ్యాటర్‌గా.. అదే విధంగా.. తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయి అందుకున్న నాలుగో క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. కాగా బట్లర్‌ గతంలో ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లోనే 4000 పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్లు👉క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)- 2658 బంతుల్లో👉ఏబీ డివిలియర్స్‌ (సౌతాఫ్రికా)- 2658 బంతుల్లో👉జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌)- 2677 బంతుల్లో👉సూర్యకుమార్‌ యాదవ్‌ (ఇండియా)- 2714 బంతుల్లో..ఐపీఎల్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు👉కేఎల్‌ రాహుల్‌ (ఇండియా)- 105 ఇన్నింగ్స్‌లో👉క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)- 112 ఇన్నింగ్స్‌లో👉డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్‌లో👉జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌)- 116 ఇన్నింగ్స్‌లో👉ఫాఫ్‌ డుప్లెసిస్‌ (సౌతాఫ్రికా)- 121 ఇన్నింగ్స్‌లో👉విరాట్‌ కోహ్లి (ఇండియా)- 128 ఇన్నింగ్స్‌లో.ఇక గుజరాత్‌- హైదరాబాద్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. సాయి, గిల్‌, బట్లర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా గుజరాత్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా గుజరాత్‌ 38 పరుగులు తేడాతో జయభేరి మోగించింది.చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని! How’s the JOS? Quite high, indeed! 🙌🏻🔥#JosButtler continued his stellar IPL form with another fifty as #GT push towards a massive first-innings total!Watch the LIVE action ➡ https://t.co/RucOdyBo4H#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/sUDd0x9erf— Star Sports (@StarSportsIndia) May 2, 2025

Vijay Devarakonda Clarifies Tribes Remarks6
‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)పై ట్రైబల్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌ రాజ్‌ చౌహాన్..పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరో విజయ్‌ మాట్లాడుతూ..గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్‌ రాజ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదంపై హీరో విజయ్‌ దేవరకొండ స్పందించారు. తాను ఏ కమ్యూనిటీనీ కించపరిచేలా మాట్లాడలేదని, దేశం మొత్తం ఒక్కటే అని, మనమంతా ఒకే కుటుంబం అని తెలియజేయడానికే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే.. చింతిస్తున్నానని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు.ఇంతకీ ఏం జరిగింది?తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. క్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్‌ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్‌ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్‌ సెన్స్‌ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని కిషన్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ఉద్దేశం అది కాదు: విజయ్‌అయితే విజయ్‌ మాత్రం ట్రైబ్స్‌ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని అంటున్నాడు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్‌ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్‌ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్‌ తన ఎక్స్‌ ఖాతాలోరాసుకొచ్చాడు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడనని, మనమంతా ఒక్కటే అని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ఈ మాటకు ఎ‌వరైనా To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025

Czech Republic Hikers Find Crores Worth Treasure7
అదృష్టమంటే ఇదే.. విహార యాత్ర వెళ్తే 2.87 కోట్ల నిధి సొంతం!

ఇంట్లో బోర్‌ కొడుతుంది బ్రో.. ఎక్కడికైనా బయటకు వెళ్దామా?.. అంటూ సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు జాక్‌పాట్‌ తగిలింది. అనుకోకుండా నక్క తోక తొక్కవురా బాబు.. అని సామెత అంటారు కదా.. అలాంటి రేంజ్‌తో వారిద్దరీకి 2.87 కోట్ల నిధి దొరికింది. ఈ ఆసక్తికర ఘటన చెక్ రిపబ్లిక్ (Czech Republic) దేశంలో చోటుచేసుకుంది. ఈ జాక్‌పాట్‌ నిధికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చెక్ రిపబ్లిక్‌లో ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేసుకుంటూ ఈశాన్య పోడ్‌క్ర్కోనోసి పర్వతాలలోని అడవిలోకి వెళ్లారు. ఇలా వారు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత.. ఒకానొక ప్రదేశంలో తమ కాళ్ల కింద ఏదో ఉందని అనిపించింది. గట్టిగా అడుగులు వేయడంతో శబ్ధం వచ్చింది. దీంతో, అక్కడ కొంత భూమి పొరను తీసి చూడగానే వారిని నిధి కనిపించింది. దానిలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు. అనంతరం, వాటిని ఈస్ట్ బోహేమియా మ్యూజియం స్వాధీనం చేసుకుంది. ఈ నిధి ఫిబ్రవరిలోనే దొరికినా.. మ్యూజియం అధికారులు తాజాగా ఈ విషయం వెల్లడించారు.మ్యూజియం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిధిలో దొరికిన వాటి విలువ సుమారు రూ.2.87 కోట్లు($340,000) ఉంటుందని అంచనా వేశారు. తాజాగా వాటి బరువు సుమారు 15 పౌండ్లు ఉంటుందని పేర్కొంది. అయితే, నిధిలో దొరికిన బంగారు నాణేలు 100 సంవత్సరాల క్రితం 1808 నుంచి 19వ శతాబ్దం ప్రారంభం నాటివని తెలిపారు. ఈ నిధిని 1921 కాలంలో దాచిపెట్టి ఉంటారని అన్నారు. ఇక, ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఓల్డ్ ఆస్ట్రియా-హంగేరీ నుంచి వచ్చిన కరెన్సీ కూడా ఈ నిధిలో ఉంది.Whoa, what a find! Hikers in the Czech Republic uncovered a $340K stash of gold coins & jewelry near Zvičina Hill! Hidden since WWII, this treasure’s now at the Museum of East Bohemia. Keep hunting, folks! pic.twitter.com/oie6TkDoRI— @_Treasure_Kings_ (@_Treasure_Kings) April 30, 2025ఇదిలా ఉండగా.. నాణేలపై ఉన్న చిన్న గుర్తులు 1918-1992 వరకు ఉన్న పూర్వ యుగోస్లేవియాలో ముద్రించి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో నాజీలు రష్యన్ దళాలను బహిష్కరించినప్పుడు ముందుకు వస్తున్న రష్యన్ దళాల నుండి వెనక్కి తగ్గడం వల్ల ఈ నిధిని దాచి ఉంటారని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే, పర్వతం వైపున నిధి ఎలా పాతిపెట్టబడిందో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ‘చెక్’ దేశ చట్టాన్ని అనుసరించి పర్యాటకులు ఇద్దరికీ మొత్తం విలువలో దాదాపు 10 శాతం పొందే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. విలువైన వస్తువులను భూమిలో నిధుల రూపంలో నిల్వ చేయడాన్ని పూర్వకాలంలో డిపోలు అని పిలిచే ఆచారం స్థానికంగా ఉన్నట్టు ప్రజలు చెబుతున్నారు.

In India gold prices determined by a mix of global and domestic factors8
రోజూ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు..?

ప్రపంచవ్యాప్తంగా బంగారం నిలువలు పరిమితంగా ఉండడంతో దాని విలువ పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం ధర రూ.96 వేలకుపైగా చేరింది. నిత్యం దీని ధర మారుతుంటోంది. అయితే ఇంతకీ ఈ ధరను ఎవరు నిర్ణయిస్తారనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. దీని ధరను నిర్ణయించడంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది.. అందుకు ఎలాంటి సంస్థలు నిర్ణయాత్మకంగా ఉంటాయి.. అనే అంశాలను తెలుసుకుందాం.పసిడి ధరలను ప్రభావితం చేసే అంతర్జాతీయ అంశాలులండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్‌బీఎంఏ) ఫిక్సింగ్ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియ ద్వారా ఎల్‌బీఎంఏ రోజుకు రెండుసార్లు బెంచ్‌మార్క్‌ బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులకు రిఫరెన్స్ పాయింట్‌గా పనిచేస్తాయి.గోల్డ్ ఫ్యూచర్స్ & ట్రేడింగ్ మార్కెట్లుకమోడిటీ ఎక్స్ఛేంజీ-కామెక్స్ (న్యూయార్క్), షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ (ఎస్‌జీఈ), మల్టీ కామోడిటీ ఎక్స్చేంజీ-ఎంసీఎక్స్ (ఇండియా) వంటి ప్రధాన ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజీలు బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ట్రేడింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్, స్పెక్యులేషన్ ఆధారంగా నేరుగా ధరల కదలికలను ప్రభావితం చేస్తాయి.సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్‌.. మానిటరీ పాలసీరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)తో సహా కేంద్ర బ్యాంకులు గణనీయమైన బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. వారి క్రయవిక్రయాలు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.ద్రవ్యోల్బణం.. ఆర్థిక అనిశ్చితిబంగారం తరచుగా ద్రవ్యోల్బణం, ఆర్థిక తిరోగమనానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉపయోగించబడుతుంది. ప్రపంచ మార్కెట్లు మాంద్యం, వాణిజ్య వివాదాలు లేదా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వంటి అనిశ్చితిని ఎదుర్కొన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.దేశంలో బంగారం ధరలను ప్రభావితం అంశాలుదిగుమతి సుంకాలు, ప్రభుత్వ నిబంధనలుభారతదేశంలో బంగారం దిగుమతులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం కస్టమ్ సుంకాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. ఇది స్థానిక ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పన్ను విధానాల్లో మార్పులు బంగారాన్ని మరింత ఖరీదైనవి లేదా సరసమైనవిగా మారుస్తాయి.కరెన్సీ మారకం రేట్లుబంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది కాబట్టి, భారత రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు దేశీయ పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. రూపాయి బలహీనపడితే భారతీయ కొనుగోలుదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది.పండుగలు, వివాహాలుదేశంలో బంగారం పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. ముఖ్యంగా దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు, వివాహ సీజన్లలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి.దేశీయ సరఫరా, ఆభరణాల మార్కెట్ ధోరణిబంగారం స్థానిక లభ్యత, ఆభరణాల రూపకల్పనలో వినియోగదారుల ప్రాధాన్యతలు, బంగారు పెట్టుబడి ఉత్పత్తులలో ఆవిష్కరణలు (ఈటీఎఫ్‌లు, డిజిటల్ బంగారం మొదలైనవి) వివిధ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసాలను ప్రభావితం చేస్తాయి.ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ)ఐబీజేఏ గ్లోబల్ బెంచ్‌మార్క్‌లు, దేశీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజువారీ ధరల మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. రిటైల్ బంగారం ధరలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: భారత్‌ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్‌ ఈయనే..బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అవి ఆర్థిక విధానాలు, ప్రపంచ ఆర్థిక ధోరణులు, వినియోగదారుల ప్రవర్తనల కారణంగా మారుతాయి. అంతర్జాతీయ, దేశీయ కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు బంగారాన్ని ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై నిపుణులు సలహాతో నిర్ణయాలు తీసుకోవచ్చు.

CIA plans to layoffs workforce by some 1,200 positions9
CIA: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్‌ కత్తి..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టారు.అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)లో 1200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది.JUST IN: The CIA plans to cut 1,200 employees as the Trump admin eyes downsizing of thousands across the U.S. intelligence community. Keep cutting and downsizing the government!— Gunther Eagleman™ (@GuntherEagleman) May 2, 2025సీఐఏలో ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ పరిపాలన విభాగం చట్టసభ సభ్యులకు సమాచారం అందించింది. అయితే, సీఐఏ సంత్సరాలుగా తొలగింపులకు బదులుగా నియామకాల్ని నిలిపి వేసిన విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. సీఐఏ ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్‌ పరిపాలన విభాగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ మాట్లాడుతూ జాతీయ భద్రతా ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయి. ఈ చర్యలు సీఐఏ పటిష్టతకు దోహదం చేకూర్చడమే కాదు..ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన వ్యూహంలో భాగం’ అని చెప్పారు.దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ డోజ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం ఉద్యోగుల్నితొలగిస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్‌ఎస్‌) చెందిన 20000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా, సీఐఏ ఉద్యోగుల్ని సైతం తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమించింది.

Rishikesh: bull takes scooter for  test ride video goes viral10
స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!

సోషల్‌ మీడియా (Social media) విశేషాల పుట్ట. తాజాగా ఒకవిచిత్రమైన వీడియో తెగ సందడి చేస్తోంది. ‘‘రిమ్‌జిమ్‌.. రిమ్‌జిమ్‌.. స్కూటీ వాలా జిందాబాద్‌ అంటూ ఒక ఎద్దు (bull) స్కూటీని ఎంచక్కా రైడ్‌ చేస్తోంది. అదేంటి ఎద్దుల బండి చూశాం కానీ.. ఎద్దేంటి, స్కూటీ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవాల్సిందే. సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న వీడియో చూసి తీరాల్సిందే.ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో చోటు చేసుకుంది. ఒక వీధిలో తిరిగే ఎద్దు స్కూటీని నడుపుతున్న దృశ్యం CCTV ఫుటేజీలో రికార్డైంది. ఇది సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కావడంతో తెగ వైరల్ అవుతోంది. బుల్‌గారి జాయ్‌రైడ్‌ వీడియో ఆరు లక్షలకు పైగా వీక్షణలను, వేలాది కామెంట్లను సొంతం చేసుకుంది.శుక్రవారం (మే 2) శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, రిషికేశ్‌లో ఒక వీధిలో తిరిగే ఎద్దు కన్ను పార్క్ చేసిన తెల్లటి స్కూటర్‌పై పడింది. అంతే.. చలో టెస్ట్‌ రైడ్’ అంటూ రంగంలోకి దిగిపోయింది. ఎద్దు స్కూటర్‌ సీటుపై ముందు కాళ్లు, వెనుక కాళ్లను నేలపై ఉంచగానే అది జర్రున ముందుకు దూకింది. ఎక్కాక ఆగేదే లే అన్నట్టు ముందుకు సాగింది. అలా వెడుతూ.. వెడతూ.. మొత్తానికి ఒకచోట ఆగిపోయింది. దీంతో ఇది చూసిన వారంతా అవాక్కయ్యారు. ఆనక.. తప్పుకోండి రా బాబోయ్‌.. అక్కడినుంచి పరుగు తీశారు. స్కూల్ యూనిఫాంలో, చిన్న పిల్లవాడితో నడుస్తున్న సమీపంలోని ఒక మహిళ వెంటనే ఆ పిల్లవాడిని చంకనెత్తుకొని పరుగుదీసింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోను 'భూపి పన్వర్' అనే ఎక్స్‌ యూజర్‌ "మీరు స్కూటీలను దొంగిలించే వ్యక్తులను చూసి ఉంటారు..కానీ రిషికేశ్‌లో వెరైటీగా స్కూటీ దొంగతనం జరిగింది. ఇక్కడ వీధుల్లో తిరుగుతున్న విచ్చలవిడి ఎద్దులు కూడా బైక్‌లు , స్కూటీలపై మనసు పడుతున్నాయ’’ అనే క్యాప్షన్‌తో దీన్ని పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజనుల చమక్కులు, కామెడీకామెంట్ల్స్‌ వెల్లువెత్తాయి. ఇదీ చదవండి: వాటర్‌ ఫిల్టర్‌ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!ఒక వినియోగదారు, "cctv లేకుండా దీన్ని బీమా కంపెనీలకు ఎలా వివరించాలి" అని, మరొక వినియోగదారు, భాయ్ ఆజ్ మే భీ సవారీ కర్ హీ లేతా హూన్” (“బ్రో, ఈ రోజు నేను కూడా రైడ్‌కి వెళ్తాను.”).” అంటూ హాస్యంగా కామెంట్‌ చేశారు.అలాగే పాపం, స్కూటర్‌పై ముచ్చట పడ్డాక దాని కొమ్ములు హ్యాండిల్ మధ్యలో ఇరుక్కుపోయి ఉండొచ్చని, దాంతో అది విడిపించుకునేందుకు ప్రయత్నంలో అలా ముందుకు కదిలి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయ పడ్డారు. చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement