
వరద బాధితులకు అధికార యంత్రాంగం అండగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
సాక్షి, అమరావతి: వరద బాధితులకు అధికార యంత్రాంగం అండగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వసతులు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.2 వేలు అందించామన్నారు. నగదుతో పాటు నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చామన్నారు.
చదవండి: డాన్ చీకోటి వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని
చంద్రబాబులా మాది మాటల ప్రభుత్వం కాదన్నారు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో కరువు తప్ప వరదలు వచ్చాయా?. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమవడానికి కారణం ఎవరు?. మూడేళ్లలో చంద్రబాబు పిడికెడు మట్టైనా వేశారా?. ప్రాజెక్టుల కంటే కాంట్రాక్టులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి బొత్స మండిపడ్డారు.