
పార్టీ పెట్టి పదేళ్లు గడుస్తున్నా.. ఇంకా 24 సీట్లలోనే పోటీ చేసే దుస్థితిలో పవన్‌లో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి..
సాక్షి, గుంటూరు: పార్టీ పెట్టి పదేళ్లైనా.. 24 సీట్లకే పోటీ చేసే దుస్థితిలో ఉన్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కో రోజా సెటైర్లు వేశారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలకు గురువారం ఆమె కౌంటర్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేష్టన్ పీక్స్‌కు చేరింది. పార్టీ పెట్టి పదేళ్లైనా 24 సీట్లకే పోటీ చేస్తున్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలని స్టేజ్‌లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌ను విమర్శించే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదు. చంద్రబాబు మాయలో పవన్ పూర్తిగా పడిపోయారు. బాబుకు ఊడిగం చేస్తూ పవన్ పాతాళంలోకి కూరుకుపోయారు
.. పార్టీ అధ్యక్షుడైనా పవన్ ఇంతదాకా మండల, బూత్ కమిటీలు వేయలేదు. 24 సీట్లు తీసుకొని... జనసేన నేతలకు పవన్ అన్యాయం చేశారు. తన తప్పును కార్యకర్తలపై రుద్దాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. గట్టిగా అరిచినంత మాత్రాన ఓట్లు పడవని పవన్ గుర్తించాలి. రిషికొండలో అద్భుతమైన భవనం నిర్మిస్తున్నాం. ముఖ్యమంత్రి రిషికొండలో ఉండాలని కమిటీ నిర్ణయించింది. క్యాంప్ ఆఫీసు కాకపోతే.. టూరిస్టు ప్లేస్ గా ఉంటుంది అని అన్నారు మంత్రి రోజా.