కేంద్ర కేబినెట్‌లోకి రామ్మోహన్‌నాయుడు? | Ram Mohan Naidu place in the Union Cabinet | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌లోకి రామ్మోహన్‌నాయుడు?

Published Sun, Jun 9 2024 5:58 AM | Last Updated on Sun, Jun 9 2024 5:58 AM

Ram Mohan Naidu place in the Union Cabinet

పెమ్మసాని, వేమిరెడ్డిలకు సహాయ మంత్రి పదవులు 

జనసేన–బీజేపీ ఎంపీల్లో ఒకరికి కూడా..!

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కిం­జరపు రామ్మో­హన్‌నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రి­వర్గంలో ఆయనను కేబినెట్‌ హోదా­లో తీసుకోను­న్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వ­డా­నికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచా­రం జరుగు­తోంది. 

వాటిలో ఒకటి కేబినెట్‌ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తా­మని చెప్పగా అందుకు చంద్ర­బాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్‌ హోదా మంత్రి పదవికి రామ్మోహన్‌ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతు­న్నారు. 

అలాగే, సహాయ మంత్రి పదవు­లకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమి­రెడ్డి ప్రభాకర్‌రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసి­నట్లు సమాచారం. ప్రధా­నమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమా­ణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితు­డుగా, మూడు­సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌­నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయ­మని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. 

జనసేన–బీజేపీకి ఒకటి..
జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహా­య మంత్రి పదవి దక్కే అవకాశము­న్నట్లు తెలు­స్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీ­పట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్‌ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్‌ ఉండవచ్చని చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement