
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు టీఆర్‌ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనమా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి తక్కువ ధరలకు విద్యుత్ లభిస్తున్న తరుణంలో చార్జీలు తగ్గించాల్సింది పోయి భారం మోపుతారా అని మండిపడ్డారు.పెట్రో ఉత్పత్తులపై వేసే పన్ను ఆర్టీసీ వెన్ను విరిచిన విషయం వాస్తవం కాదా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.ఘిది మీ పతనమైన పాలనా వ్యవస్థల దుష్పలితామా అని నిలదీశారు. ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపు, ఆర్టీసీ నష్టాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ట్వీట్ చేశారు.
దేశంలో ఉత్పత్తి పెరిగి,తక్కువ ధరకే విద్యుత్ లభిస్తోన్న పరిస్థితుల్లో వినియోగదారులకు ఛార్జీలు తగ్గించాల్సింది పోయి భారం మోపడం
— Revanth Reddy (@revanth_anumula) September 23, 2021
అసమర్ధతకు నిదర్శనమా?
మీ పాలనలో పతనమైన వ్యవస్థల దుష్ఫలితమా?
పెట్రో ఉత్పత్తుల పై నువ్వు వేసే పన్ను ఆర్టీసీ వెన్ను విరిచిందన్నది వాస్తవం కాదా, కేసీఆర్! pic.twitter.com/eajDYV6k4W