
సాక్షి,ఢిల్లీ: నామినేషన్‌లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో మూడు పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించింది. గురువారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు.
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి, కరీంగనర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లాఖాన్‌ను ప్రకటించారు. అయితే వీరంతా ఇప్పటికే నామినేషన్లు వేయడం గమనార్హం.
అటు ఏపీలోనూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మూడు లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు.