
అదుపు తప్పి కారు బోల్తా
● నలుగురికి గాయాలు
కంభం: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడటంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం స్థానిక అనంతపురం– అమరావతి హైవే రోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళితే..కర్ణాటక రాష్ట్రం చిక్లాపూర్‌కు చెందిన ఓ కుటుంబం కారులో శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా కంభం– జంగంగుంట్ల మధ్యలో హైవేరోడ్డుపై అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తాపడింది. ప్రమాదంలో కారులో ఉన్న పవన్, రామచంద్రపవన్, లక్ష్మి, విద్య, షాను, సిద్ధిరాజు ఉండగా వీరిలో ఇద్దరికి స్వల్పగాయాలు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరిని ప్రభుత్వ వైద్యశాలకు, మరికొందరి ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వీరిలో లక్ష్మి అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు.

అదుపు తప్పి కారు బోల్తా