
ఏఐయూ పెన్‌కాక్ సిలాట్ పోటీల్లో ఏకేయూ విద్యార్థికి స్వ
ఒంగోలు సిటీ: అఖిల భారత స్థాయిలో కర్ణాటక రాష్ట్రంలోని నార్త్ బెంగళూరు యూనివర్శిటీలో ఈనెల 14వ తేదీ నుంచి జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ పెన్‌కాక్ సిలాట్ పోటీల్లో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ తరఫున పాల్గొన్న పురుషుల జట్టులో కే.ప్రేమ్ కుమార్ బంగారు పతకాన్ని కై వసం చేసు కున్నారు. తొలి సంవత్సరం లోనే ఏకేయూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో జరిగిన క్రీడల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి ఏకేయూ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేయడంపై యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు బుధవారం సాయంత్రం హర్షం వ్యక్తం చేశారు. ప్రేమ్‌కుమార్ ఏకేయూ పరిధిలోని ఒంగోలులో ఉన్న ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ప్రేమ్ కుమార్‌ను అభినందించిన వారిలో ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాజమోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలామణి, సి.డి.సి డీన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ.దేవీ వర ప్రసాద్ , ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల చైర్మన్ డాక్టర్ కే.నరసింగరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సి.వి.రామ కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.నటరాజ కుమార్ ఉన్నారు.
పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి
● వైద్యశాఖపై సమీక్షలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) పనిచేస్తున్న డాక్టర్లు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ చాంబర్‌లో బుధవారం వైద్యశాఖపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు రావాలన్నారు. గతంతో పోల్చితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులతో పోటీపడి మరీ పనిచేయాలని వైద్యులను ఆదేశించారు. గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలు, హైరిస్క్ కేసులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో నమోదు చేయటం, తద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని పొందటంలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బరువు తక్కువ పిల్లల జననం, ఇలాంటి పిల్లల ఆరోగ్య పరిస్థితిని బాలింతల ఇళ్లకు వెళ్లి పారామెడికల్ సిబ్బంది నిరంతరం గమనించడం, మాతా–శిశు మరణాలు, వ్యాక్సినేషన్, దోమల వలన కలిగే వ్యాధులు, వేసవి దృష్ట్యా వచ్చే మూడు నెలల పాటు వడగాలుల వలన ప్రాణనష్టం జరగకుండా చూసేలా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. సాంకేతిక సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. తక్షణమే యాప్‌లో నమోదు చేయడంలో కుదరకపోయినా వ్యాక్సినేషన్ వంటి ఫిజికల్‌గా చేయాల్సిన పని తక్షణమే చేయాలని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, డీఐవో పద్మజ, మండల మెడికల్ ఆఫీసర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏఐయూ పెన్‌కాక్ సిలాట్ పోటీల్లో ఏకేయూ విద్యార్థికి స్వ