Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu And Yellow Media1
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?

‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్‌ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్‌ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్య​​​ం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్‌ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్‌ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్‌, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్‌సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్‌ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్‌ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

PM Modi Meeting With Rajnath Singh About Security Preparedness2
మోదీతో రాజ్‌నాథ్‌ భేటీ.. భారత సైన్యం, సరిహద్దు భద్రతపై చర్చ!

సాక్షి, ఢిల్లీ: పహల్గాం దాడితో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పహల్గాంలో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక.. మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌ కూడా పాల్గొన్నారు. మరోవైపు.. రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ కూడా సోమవారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనతో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్‌.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాక్‌ జాతీయులను వారి దేశానికి పంపించింది.#WATCH | Delhi: Defence Minister Rajnath Singh leaves from 7 Lok Kalyan Marg, Prime Minister Narendra Modi's residence. pic.twitter.com/lCINxlD82x— ANI (@ANI) April 28, 2025మరోవైపు.. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే పాక్‌.. కొన్నేళ్లుగా రూటు మార్చిందని నిఘా వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఆన్‌లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి, తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి పాక్‌లోకి తీసుకెళ్తోందని పేర్కొన్నాయి. తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయుధాలు వాడగల, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిని తమవైపు ఆకర్షిస్తోందని చెప్పాయి.కొన్నేళ్లలో ఇలా 300 మందికి పైగా కశ్మీర్‌ యువత అధికారిక ప్రయాణ పత్రాలతో పాక్‌కు ప్రయాణించారని పలు కథనాలు వెల్లడించాయి. వీరిలో పలువురు నిషేధిత ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారు. తర్వాత ఉగ్రసంస్థల్లో చేరి, సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకు పాల్పడతారు. అనంతరం జమ్ముకశ్మీర్‌లోని పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారు. అయితే ఇలా చొరబాట్లకు పాల్పడినవారిలో 15 మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందిన తొమ్మిది మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. వారిలో కొందరు పాకిస్తాన్‌లో ఉండి, మరికొందరు కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు.పాక్‌కు సైనిక విమానాలు..పహల్గాం దాడితో సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. భారత్‌ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టర్కీకి చెందిన పలు సీ-130 హెర్క్యులస్‌ విమానాలు పాక్‌లో ల్యాండ్‌ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్‌ కూడా అలర్ట్‌ అయ్యింది.

Bumrah Wife Sanjana Ganesan Shuts Down Trolls Mocking Baby Angad Expression3
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్‌

భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేషన్‌ (Sanjana Ganesan) నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తమ చిన్నారి కుమారుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమకేమీ ప్రచార పిచ్చి లేదని.. ఇకనైనా పిచ్చి వాగుడు కట్టిపెట్టాలంటూ చురకలు అంటించారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌-2025 (IPL 2025) లో భాగంగా ముంబై ఇండియన్స్‌ ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.ఐడెన్‌ మార్క్రమ్‌ (9), డేవిడ్‌ మిల్లర్‌ (24) రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. అబ్దుల్‌ సమద్‌ (2), ఆవేశ్‌ ఖాన్‌ (0)లను వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. తన పేస్‌ పదునుతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చిన్నారి అంగద్‌తోస్టేడియానికి సంజనఇదిలా ఉంటే.. ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌కు బుమ్రా భార్య, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌ తమ కుమారుడు అంగద్‌తో కలిసి హాజరైంది. ఈ క్రమంలో చిన్నారి అంగద్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అందులో అతడు కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించిందని.. డిప్రెషన్‌, ట్రామా వంటి పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు.PC: Xఈ విషయంపై సంజనా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు.. ‘‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరు లాగొద్దు. జస్‌ప్రీత్‌, నేను అంగద్‌ను సోషల్‌ మీడియాకు వీలైనంత ఎక్కువ దూరంగానే ఉంచుతాం. ఎందుకంటే.. ఇంటర్నెట్‌లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు.మాకు అలాంటి పిచ్చిలేదుచిన్నారితో కలిసి క్రికెట్‌ స్టేడియానికి వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. అక్కడ కెమెరాలు ఉంటాయనీ తెలుసు. అయితే, నేను, అంగద్‌ కేవలం జస్‌ప్రీత్‌కు మద్దతుగా మాత్రమే అక్కడకు వచ్చాం.మా కొడుకు ఇంటర్నెట్‌లో వైరల్‌ కంటెంట్‌గానో.. జాతీయ వార్తగానో మారిపోవాలని మాకు ఎంతమాత్రం లేదు. కీబోర్డు వారియర్లు అయితే ఏకంగా అంగద్‌ను మూడు సెకన్ల ఫుటేజ్‌లో చూసి ఏదేదో మాట్లాడేస్తున్నారు.మా గురించి మీకేం తెలుసు?.. వాడికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్‌ వంటివి పదాలు వాడుతూ వాడి గురించి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా విచారకరం. మా కొడుకు గురించి మీకు ఏం తెలుసు?మా జీవితాల గురించి మీకెంత తెలుసు. మీ అభిప్రాయాలను మీతోనే పెట్టుకోండి. ఎదుటివారి పట్ల దయ, సహానుభూతి కలిగి ఉండటం వంటివి ఈరోజుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలుగా మారిపోయాయి’’ అని సంజనా గణేషన్‌ తన ఇన్‌స్టా స్టోరీలో భావోద్వేగపూరిత నోట్‌ రాశారు. దయచేసి చిన్నపిల్లల విషయంలోనైనా కాస్త సంయమనంతో వ్యవహరించాలని కోరారు. చదవండి: కేఎల్‌ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్‌ కీపర్‌! వీడియో View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

Case Against Singer Neha Singh Rathore over pahalgam incident4
పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్‌ సింగర్‌పై పదుల సంఖ్యలో కేసులు

లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోక్‌ సింగర్‌పై కేసు నమోదైంది. ఆమెపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.లక్నో పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన ఫోక్‌ సింగర్‌ నేహా సింగ్ రాథోడ్ ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. అందులో జాతీయ సమగ్రతపై ప్రతీకూలం ప్రభావం చూపేలా అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు. మతం ఆధారంగా సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్‌ చేసిందంటూ అభయ్ ప్రతాప్ సింగ్ లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేహాసింగ్‌ రాథోడ్‌ చేసిన ట్వీట్లను పరిశీలించారు. ఆ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించారనే సెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.In UP's Lucknow, FIR registered against folks singer Neha Singh Rathore (@nehafolksinger) for her alleged inflammatory tweet post the Pahalgam terror attack. Multiple sections of BNS and IT Act slapped in the FIR registered based on the complaint of Abhay Kumar Singh at… pic.twitter.com/CfHsHkQ1pS— Piyush Rai (@Benarasiyaa) April 28, 2025 కాగా, పహల్గామ్‌ విషాదంపై కేంద్రం సోషల్‌ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా, ఫోక్‌ సింగర్‌ నేహా సింగ్ రాథోడ్‌పై చర్యలకు సిద్దమైంది.

Gold Rates and Silver Price Today On April 28th 20255
గోల్డ్‌ డౌన్‌.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..

దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా ఆరో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 28) పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు తగ్గుదలతో 22 క్యారెట్ల నగల బంగారం రూ.90 వేల దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్‌లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 28 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాచెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,550ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.630, రూ.620 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్‌లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరల మార్పునకు కారణాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్‌ బంగారం’వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీకి రూ.900 మేర క్షీణించి రూ.1,11,000 వద్దకు తగ్గింది. అదే ఢిల్లీ ప్రాంతంలో అయితే అత్యధికంగా రూ.1400 తగ్గి రూ. 1,00,500 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

CM Revanth And Jana Reddy Meeting Over operation Kagar6
కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి: రేవంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డితో భేటీ అయ్యారు. జానారెడ్డి నివాసంలో ఆపరేషన్ కగార్ అంశంపై సీఎం రేవంత్‌.. జానారెడ్డితో చర్చిం‍చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి భేటీకి హాజరయ్యారు. అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్‌పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక.. ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా..తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని రోజులుగా మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. కర్రెగుట్టలో బాంబు వర్షం కురిపిస్తోంది. ఈ ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోలు మృతిచెందుతున్నారు. మావోలు చనిపోతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర చర్యలను ఖండించారు. పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతి చర్చల కమిటీ భేటీలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సామాజిక కోణంలో మావోయిస్టుల అంశాన్ని చూడాలి. మావోయిస్టుల భావాజాలాన్ని చంపాలనుకోవడం సరైంది కాదని అన్నారు.

OTT: Upcoming Movies, Web Series in May 1st Week 20257
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు

మే నెలలో రెట్టింపు వినోదాన్ని పంచేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు రిలీజవుతుండగా ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలివే..నాని హీరోగా నటించిన 'హిట్‌ 3' - మే 1సూర్య హీరోగా నటించిన 'రెట్రో' - మే 1అజయ్‌ దేవ్‌గణ్‌ 'రైడ్‌ 2' - మే 1సంజయ్‌దత్‌, సన్నీ సింగ్‌ల 'భూతిని' - మే 1ఓటీటీ రిలీజెస్‌..నెట్‌ఫ్లిక్స్‌🎬 చెఫ్స్‌ టేబుల్‌: లెజెండ్స్‌ (సిరీస్‌) - ఏప్రిల్‌ 28🎬 ఆస్ట్రిక్స్‌ అండ్‌ ఒబెలిక్స్‌: ద బిగ్‌ ఫైట్‌ (మినీ సిరీస్‌) - ఏప్రిల్‌ 30🎬 ఎక్స్‌టెరిటోరియల్‌ - ఏప్రిల్‌ 30🎬 ద ఎటర్నాట్‌ - ఏప్రిల్‌ 30🎬 టర్నింగ్‌ పాయింట్‌: ద వియత్నాం వార్‌ (వెబ్‌ సిరీస్‌) - ఏప్రిల్‌ 30🎬 ద రాయల్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మే1🎬 యాంగి: ఫేక్‌ లైఫ్‌, ట్రూ క్రైమ్‌ - మే 1🎬 ద బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ - మే 1🎬 ద ఫోర్‌ సీజన్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 1🎬 బ్యాడ్‌ బాయ్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 2అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో🎥 అనదర్‌ సింపుల్‌ ఫేవర్‌ - మే1జీ5🎬 కొస్టావో - మే 1హాట్‌స్టార్‌🎥 కుల్ల్‌: ద లెగసీ ఆఫ్‌ ద రైసింగ్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 2🎥 ద బ్రౌన్‌ హార్ట్‌ (డాక్యుమెంటరీ) - మే 3ఆహా🎬 వేరేలెవల్‌ ఆఫీస్‌ రీలోడెడ్‌ - మే 1సోనీలివ్‌🎥 బ్రొమాన్స్‌ - మే 1🎥 బ్లాక్‌, వైట్‌ అండ్‌ గ్రే: లవ్‌ కిల్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 1ఎంఎక్స్‌ ప్లేయర్‌🎬 ఈఎమ్‌ఐ - మే1టుబి🎥 సిస్టర్‌ మిడ్‌నైట్‌ - మే 2యాపిల్‌ టీవీ ప్లస్‌🎬 కేర్‌ మీ - ఏప్రిల్‌ 30చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి

Indian Govt Banned Pakistan YouTube Channels8
పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌.. వాటిపై నిషేధం

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది. పాకిస్తాన్‌ యూట్యూబ్‌ ఛానళ్ల(Ban on Youtube Channels)పై భారత్‌ ఉక్కుపాదం మోపింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై భారత్‌లో నిషేధం విధించారు. ఇక, నిషేధం విధించిన వాటిలో మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్‌ ట్విట్టర్‌, సినిమాలపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీబీసీ చానల్స్‌కు సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీకి ప్రభుత్వం నోటీసులు అందజేసింది.భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.🚨 BIG BREAKING Modi govt BANS 16 #Pakistani #YouTube channels, including Dawn, Samaa TV, ARY, Geo News etc for spreading provocative content and false narratives against India, Army, and security forces after the Pahalgam terror attack.— Shoaib Akhtar’s channel also BLOCKED pic.twitter.com/DOzHwxgp4N— HIND KE SITARA ✨ (@ChanakyaRashtra) April 28, 2025ఇందులో భాగంగా.. ఈ ఛానళ్లను తెరవగానే.. కంటెంట్‌ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కనిపిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Bill Gates Predicts 2-Day Work Week For Employees9
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్‌..

విపరీతమైన పని గంటలు, వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న ఆందోళనలూ మరోవైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు.వారానికి ఐదు.. ఆరు రోజులు పని, 9 టు 5 జాబ్‌.. ఈ సంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పునర్నిర్మించగలదని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పని వారాన్ని కేవలం రెండు రోజులకు తగ్గించగలదని బిల్ గేట్స్ చెప్పారు.బిల్ గేట్స్ బోల్డ్ జోస్యంజిమ్మీ ఫాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్, ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు. తత్ఫలితంగా, సాంప్రదాయ ఐదు రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదని గేట్స్ పేర్కొన్నారు.పని గంటల్లో ఊహించని మార్పువారానికి ఐదు రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుందని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ (ఏఐ) సహాయం చేయడమే కాదు.. మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్వచించగలదని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో రెండు లేదా మూడు రోజులే పనిచేసే రోజులొస్తాయంటున్నారు.సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫీషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స​ (ఏజీఐ) సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Supreme Court Lawyer Prashant Bhushan Raises Concerns Over Ursa Land Deal10
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం

సాక్షి,విజయవాడ: ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉర్సాకి రూ.3వేల కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, ఊరుపేరు లేని ఉర్సాకి వేలకోట్ల భూముల్ని కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆఫీస్‌,ట్రాక్‌ రికార్డ్‌ లేని ఉర్సాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఆఫీసు లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం ఘోస్ట్‌ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది! పూర్తిగా చట్టవిరుద్ధం! 59.6 ఎకరాలు ఘోస్ట్‌ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. No Office, No Track Record: How a Two-Month-Old Firm Landed a Multi-Crore Deal With Andhra Govt. Wow!59.6 Acres of land gifted virtually free to this ghost company by the CB Naidu govt! Totally illegal!Is it kickbacks or connections with Top officials? https://t.co/XzoU8HVCp4— Prashant Bhushan (@pbhushan1) April 22, 2025ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? అంటూ ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్సాకి భూ కేటాయింపులపై అనుమానాలు తలెత్తతున్నాయి.అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్‌పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నోరు మెదకపోవడం గమనార్హం. ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్‌తో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బంధం బయటపడటంతో ఉర్సా ల్యాండ్ డీల్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చాంశనీయంగా మారింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement