
ఖేడ్ తహసీల్దార్‌గా హసీనాబేగం
నారాయణఖేడ్: ఖేడ్ తహసీల్దార్‌గా హసీనాబేగం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన సి.భాస్కర్ కంగ్టి తహసీల్దార్‌గా బదిలీపై వెళ్లగా మొగుడంపల్లి తహసీల్దారుగా పనిచేస్తున్న హసీనాబేగం ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆమె ఇక్కడ బాధ్యతలను స్వీకరించగా.. డిప్యూటీ తహసీల్దార్ రాజుపటేల్ తోపాటు ఆర్‌ఐ మాధవరెడ్డి, కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానించారు.
డిజిటల్ భిక్షాటన
నారాయణఖేడ్: భిక్షాటనను డిజిటలైజ్డ్ చేసిన అంశాన్ని సినిమాల్లో, సీరియల్స్‌ల్లో కామెడీ సీన్‌గానే ఇన్నాళ్లు చూశాం. కానీ అన్ని రంగాల్లో అప్‌డేటెడ్ అవుతున్న తరహాలోనే ఓ బిచ్చగాడు అప్‌డేటెడ్ అయి సినిమా సీన్‌ను నిజం చేశాడు. మహారాష్ట్రలోని బాల్కికి చెందిన శ్రీను (21) తలలో డప్పు వేసుకొని అడుక్కొంటూ డప్పు కు ఏకంగా డిజిటల్ యూపీఐ స్కానర్‌ను ఏర్పాటు చేశాడు. చిల్లర లేవని ఎవరైనా పంపిస్తే ఫోన్‌పే, లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి ధర్మం చేయడంటూ కోరుతున్నాడు. సంత రోజుల్లో నారాయణఖేడ్, శంకర్‌పల్లి, జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, హైదరాబాద్, బీదర్, ఉద్గీర్ తదితర పట్టణాల్లో భిక్షాటన చేస్తానని తనకు నిత్యం రూ.800కు పైగా గిట్టు బాటు అవుతుందని తెలిపాడు. డిజిటల్ బెగ్గింగ్‌ను చూసి వ్యాపారులు నవ్వుకుంటూ యూపీ ఐ స్కాన్ చేసి మరీ డబ్బులు చెల్లిస్తున్నారు.
మూల్యాంకనంపై ఆరా
రామచంద్రపురం (పటాన్‌చెరు): రామచంద్రపురం పరిధిలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలు జరుగుతున్న పదవ తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంగళవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఈవీ నరసింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కృష్ణారావు అధికారులు సందర్శించారు. మూల్యంకన కేంద్రంలోని బోధన, బార్ కోడింగ్ గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ లింభాజీ పాల్గొన్నారు.
డీకే అరుణను కలిసిన
రైతు హక్కుల నేతలు
జహీరాబాద్: పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను జహీరాబాద్‌కు చెందిన రైతు హక్కుల సాధన సమితి నాయకులు, వక్ఫ్ భూ బాధిత రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం రాత్రి డీకే అరుణను ఆమె నివాసంలో కలిశారు. ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లు పాస్ అయిన సందర్భంగా ఆమెకు స్వీటు తినిపించారు. జేపీసీ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమె రైతుల తరఫున తగిన సమాచారం సేకరించి కమిటీకి అందజేశారు. రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
వైభవంగా
జోగినాథ రథోత్సవం
జోగిపేట (అందోల్): జోగిపేటలో జోగినాథ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగింది. ఐదు అంతస్తులలో నందీశ్వరుడు, గణపతి, శివలింగం, దుర్గామాత, జోగినాథ స్వామి దివ్యమూర్తులను ఏర్పాటు చేశారు. మొదటగా గౌనిచౌరస్తాలో సంప్రదాయాల ప్రకారం జోగినాథ రథోత్సవ కమిటీ అధ్యక్షుడు శివశంకర్, కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఖేడ్ తహసీల్దార్‌గా హసీనాబేగం

ఖేడ్ తహసీల్దార్‌గా హసీనాబేగం

ఖేడ్ తహసీల్దార్‌గా హసీనాబేగం