
చివరికి బుగ్గిపాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటంతా విద్యుదాఘాతంతో బుగ్గి పాలైంది. ఈ ఘటన అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన తొందూరు ఎల్లయ్య వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏర్పడిన షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో 30 గుంటల వరి పంటంతా కాలిపోయింది. పైపులు, బోరు మోటారు, 100 మీటర్ల సర్వీస్ వైర్, తదితర వస్తువులు కాలిపోయ్యాయి. సమాచారం అందుకు న్న ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పేశాడు. దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లి నట్లు రైతులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతును ఆదుకోవాలని కోరారు.
విద్యుదాఘాతంతో
30 గుంటల వరి దగ్ధం
పైపులు, మోటార్ కాలిబూడిద
రూ. 3 లక్షల వరకు నష్టం

చివరికి బుగ్గిపాలు