
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు
తొగుట(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిలువేరి నరేశ్ గౌడ్(30) తల్లిదండ్రులు లక్ష్మీ, వెంకట్ గౌడ్ అనారోగ్యం (పక్షపాతం)తో కొన్నేళ్లుగా బాధపడుతున్నారు. తల్లిదండ్రులు మంచం పట్టడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు, కుటుంబం అవసరాల కోసం అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మద్యానికి బానిసై పనిపాట లేకుండా తిరుగుతున్నాడు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురై నరేశ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వెంకట్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.