క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌

Published Tue, Apr 29 2025 9:53 AM | Last Updated on Tue, Apr 29 2025 10:09 AM

క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌

క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్‌

రామచంద్రాపురం(పటాన్‌చెరు): క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్‌ ఉంటుందని మెదక్‌ పార్లమెంట్‌ సభ్యులు ఎం.రఘునందన్‌ రావు అన్నారు. తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో జరుగుతున్న జాతీయస్థాయి కలరిపయట్టు క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాచీన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేరళలో పుట్టిన కలరిపయట్టు క్రీడకు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇప్పటికీ అనేక మంది ఈ క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. చిన్ననాటి నుంచే ఈ క్రీడలో శిక్షణ అందిస్తే ఎంతో రాణిస్తారని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement