
జడ్జి ప్రత్యేక పూజలు
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జిని అర్చకుడు పరమేశ్వర్ సన్మానించారు.
నీతికథలతో
మంచి ఆలోచనలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నీతి కథలు చెప్పడం వల్ల చిన్నారుల్లో మంచి ఆలోచనలకు స్థానం లభిస్తుందని కథాశిల్పి ఐత చంద్రయ్య అన్నారు. జాతీయ కథల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో కథల తాతయ్య ఎన్నవెళ్లి రాజమౌళిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐత చంద్రయ్య మాట్లాడుతూ నీతి కథలు చెప్పి, విద్యార్థులను మంచివైపు నడిచేలా బాటలు వేస్తున్న కథల తాతయ్య రాజమౌళి అభినందనీయుడన్నారు. కథలు చెప్పడం ఒక కళ అని, అందులో చిన్నారులకు కథలు చెప్పడం అంటే గర్వించే విషయమన్నారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ వేసవి సెలవుల్లో బాలలకు కథలు వినిపించాలన్నారు. సన్మాన గ్రహిత రాజమౌళి మాట్లాడుతూ పిల్లల ప్రపంచంలో కథలు చెప్పడం సంతోషమనిపిస్తుందన్నారు. బాలల వికాసానికి కథలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో కవులు సింగీతం నరసింహరావు, బస్వ రాజ్ కుమార్, కోణం పరశురాములు, ఉండ్రాళ్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
గజ్వేల్‌రూరల్: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ప్రజ్ఞాపూర్‌లోగల టీజీడబ్ల్యూఆర్‌ఎస్(వర్గల్) విద్యార్థి బి.ఆకాష్ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ మురళి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. టీజీడబ్ల్యూఆర్‌ఎస్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆకాష్ ఈనెల 30 నుంచి మే 5వరకు ఢిల్లీలో జరిగే అండర్ –19 జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను చాటి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆకాష్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

జడ్జి ప్రత్యేక పూజలు

జడ్జి ప్రత్యేక పూజలు