'సీఎస్‌కే ఓపెనర్‌గా యువ సంచ‌ల‌నం.. ధోని బ్యాటింగ్‌కు వచ్చేది అప్పుడే' | IPL 2024: Aakash Chopra Picks CSK Probable Playing XI Against RCB - Sakshi
Sakshi News home page

IPL2024: 'సీఎస్‌కే ఓపెనర్‌గా యువ సంచ‌ల‌నం.. ధోని బ్యాటింగ్‌కు వచ్చేది అప్పుడే'

Published Fri, Mar 22 2024 4:48 PM | Last Updated on Fri, Mar 22 2024 5:04 PM

Aakash Chopra Predicts CSK Eleven for RCB game - Sakshi

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2024 మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ 17వ సీజ‌న్‌కు మ‌రి కొన్ని గంట‌ల్లో తెరలేవనుంది. చెపాక్ వేదిక‌గా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

సాయంత్రం 8 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. తొలి పోరులో ఎలాగైనా విజయం సాధించి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.

కాగా ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌ల ఫొటో సెషన్‌కు ముందు ఎంఎస్‌ ధోనీ తన బాధ్యతలను యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించేశాడు. కాగా మొదటి మ్యాచ్‌ నేపథ్యంలో సీఎస్‌కే ప్లేయింగ్‌ ఎలెవన్‌ గురించి భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో చర్చించాడు.

కివీ స్టార్‌ రచిన్‌ రవీంద్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి సీఎస్‌కే ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొన్న యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశముందని చోప్రా అభిప్రాయపడ్డాడు.

రచిన్‌ రవీంద్ర.. రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. అజింక్యా రహానే, డార్లీ మిచెల్‌ వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక ఐదో స్ధానంలో శివమ్‌ దూబే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌కు వస్తారు.

ఆపై శార్దూల్ ఠాకూర్‌, దీపక్ చాహర్ వంటి ఆల్‌రౌండర్లు క్రీజులోకి రానున్నారు. అయితే విదేశీ ప్లేయర్ల కోటాలో పతిరానా అందులో బాటులో లేడు కాబట్టి నాలుగో ఆటగాడిగా మొయిన్‌ అలీ లేదా ముస్తిఫిజర్‌ రెహ్మన్‌కు చోటు దక్కే అవకాశముంది. అదేవిధంగా యువ ఆటగాడు సమీర్ రిజ్వీని సీఎస్‌కే ఉపయోగించుకునే ఛాన్స్‌ ఉందని యూట్యూబ్‌ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement