
మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. ఆదివారం మొదలైన ఈ టోరీ్నలో తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–4తో ప్రపంచ 178వ ర్యాంకర్, క్వాలిఫయర్ డినో ప్రిజ్మిక్ (క్రొయేíÙయా)పై కష్టపడి గెలిచాడు. 4 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 40 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 49 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ప్రత్యర్థి సరీ్వస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు.
సబలెంకా సులువుగా...
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ సబలెంకా 6–0, 6–1తో 53 నిమిషాల్లో ఇలా సెడెల్ (జర్మనీ)పై గెలిచింది. ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు.