Australian Open
-
Madison Keys: తొమ్మిదేళ్ల తర్వాత...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ రూపంలో కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్... తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో 29 ఏళ్ల కీస్ 14వ ర్యాంక్ నుంచి ఏడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌కు చేరుకుంది. కీస్ ఖాతాలో 4680 పాయింట్లున్నాయి. 2016 అక్టోబర్ 10న కీస్ కెరీస్ బెస్ట్ ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత 2020 వరకు కీస్ టాప్–20లో కొనసాగింది. 2021 సీజన్ ముగిసేసరికి 56వ ర్యాంక్‌కు చేరిన కీస్ 2022 సీజన్‌ను 11వ ర్యాంక్‌తో... 2023 సీజన్‌ను 12వ ర్యాంక్‌తో, 2024 సీజన్‌ను 21వ ర్యాంక్‌తో ముగించింది. డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్–10లో నలుగురు అమెరికా క్రీడాకారిణులు ఉన్నారు. కోకో గాఫ్ 6538 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో... జెస్సికా పెగూలా 4861 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో... ఎమ్మా నవారో 3709 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. -
విన్నర్ సినెర్...
ఒకరేమో ఇప్పటికే ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలువగా... మరొకరు ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిపోయారు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఎలా గెలవాలో ఇప్పటికే ఒకరికి అనుభవం ఉండగా... మరొకరికి ఆ అనుభవం లేదు. అయితేనేం ముచ్చటగా మూడో ప్రయత్నంలోనైనా ‘గ్రాండ్’ విజయాన్ని అందుకోవాలని ఒకరు... వరుసగా మూడోసారీ ‘గ్రాండ్’ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో మరొకరు బరిలోకి దిగారు. ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ కాగా... మరొకరు ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్.... ఈ ఆసక్తికర నేపథ్యంలో ఆదివారం ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావించారు. కానీ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సినెర్ తన ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. తొలి పాయింట్ నుంచే పూర్తి ఆధిపత్యం కనబరిచి జ్వెరెవ్ జోరుకు అడ్డుకట్ట వేసిన సినెర్ వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. మరోవైపు సినెర్ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక జ్వెరెవ్ వరుస సెట్లలో చేతులెత్తేసి కెరీర్లో మూడోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో, 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో జ్వెరెవ్ పరాజయం పాలయ్యాడు.మెల్బోర్న్: ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ అవతరించలేదు. గత ఏడాది విజేతగా నిలిచిన ఇటలీ ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఈ సంవత్సరం కూడా టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 42 నిమిషాల్లో 6-3, 7-6 (7/4), 6ృ3తో రెండో సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన సినెర్‌కు 35 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 4 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 19 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గతంలో జ్వెరెవ్‌పై రెండుసార్లు నెగ్గి, నాలుగుసార్లు ఓడిపోయిన సినెర్ గత రికార్డును పట్టించుకోకుండా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఏస్‌తో మొదలుపెట్టిన సినెర్ తొలి గేమ్‌లో జ్వెరెవ్ చేసిన మూడు తప్పిదాలతో ఒకటిన్నర నిమిషంలోనే గేమ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఎనిమిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 46 నిమిషాల్లో సెట్ గెలిచాడు. రెండో సెట్లో ఇద్దరూ ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోటీపడ్డారు. దాంతో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6ృ6తో సమమైంది. టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సినెర్ పైచేయి సాధించి 72 నిమిషాల్లో రెండో సెట్‌నూ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని ఆరో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్, ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5ృ2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఎనిమిదో గేమ్‌ను జ్వెరెవ్ కాపాడుకోగా, తొమ్మిదో గేమ్‌లో సినెర్ తన సర్వీస్‌ను కాపాడుకోవడంతోపాటు బ్యాక్‌హాండ్ విన్నర్ షాట్‌తో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో సినెర్ సర్వీస్‌లో జ్వెరెవ్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ సాధించే అవకాశాన్ని దక్కించుకోకపోవడం గమనార్హం. 4 గత 35 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో బ్రేక్ పాయింట్ ఎదుర్కోని నాలుగో ప్లేయర్ సినెర్. గతంలో పీట్ సంప్రాస్ (బోరిస్ బెకర్‌తో 1995 వింబుల్డన్ ఫైనల్), రోజర్ ఫెడరర్ (ఫిలిప్పోసిస్తో 2003 వింబుల్డన్ ఫైనల్), రాఫెల్ నాదల్ (కెవిన్ అండర్సన్‌తో 2017 యూఎస్ ఓపెన్ ఫైనల్) ఈ ఘనత సాధించారు.5 హార్డ్ కోర్టులపై వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్ సినెర్. గతంలో జాన్ మెకన్రో (1979, 1980, 1981 యూఎస్ ఓపెన్), ఇవాన్ లెండిల్ (1985, 1986, 1987 యూఎస్ ఓపెన్), రోజర్ ఫెడరర్ (2005, 2006, 2007 యూఎస్ ఓపెన్), నొవాక్ జొకోవిచ్ (2 సార్లు; 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, 2012 ఆ్రస్టేలియన్ ఓపెన్; 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్; 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు.1 అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఇటలీ ప్లేయర్‌గా సినెర్ గుర్తింపు పొందాడు. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నికోలా పిత్రాంజెలి (1959, 1960 ఫ్రెంచ్ ఓపెన్) పేరిట ఉన్న రికార్డును సినెర్ (2024, 2025 ఆ్రస్టేలియన్ ఓపెన్; 2024 యూఎస్ ఓపెన్) సవరించాడు. 1 జిమ్ కొరియర్ (అమెరికా; 22 ఏళ్ల 5 నెలల 14 రోజులు; 1992ృ1993) తర్వాత ‘బ్యాక్ టు బ్యాక్’ ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయస్కుడిగా సినెర్ (23 ఏళ్ల 5 నెలల 10 రోజులు) గుర్తింపు పొందాడు.8 కెరీర్లో తాము ఆడిన తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ విజేతగా నిలిచిన ఎనిమిదో ప్లేయర్ సినెర్. కానర్స్ (అమెరికా), జాన్ బోర్గ్, ఎడ్బర్గ్ (స్వీడన్), కుయెర్టన్ (బ్రెజిల్), ఫెడరర్, వావ్రింకా (స్విట్జర్లాండ్), అల్కరాజ్ (స్పెయిన్) ఈ ఘనత సాధించారు. 2019 ఆరేళ్ల తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, రెండో ర్యాంకర్ తలపడ్డారు. ఈసారీ నంబర్‌వన్ ర్యాంకర్ వరుస సెట్లలో గెలిచాడు. 2019లో నంబర్‌వన్ జొకోవిచ్ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్‌పై వరుస సెట్లలో నెగ్గాడు. 6 కెరీర్లో తాము ఆడిన తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిన ఆరో ప్లేయర్ జ్వెరెవ్. ఈ జాబితాలో అగస్సీ (అమెరికా), ఇవానిసెవిచ్ (క్రొయేషియా), ముర్రే (బ్రిటన్), థీమ్ (ఆ్రస్టియా), రూడ్ (నార్వే) ఉన్నారు. -
టౌన్సెండ్ - సినియకోవా జోడీకి డబుల్స్ టైటిల్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో గతంలో ఒక్కసారి కూడా మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయిన అమెరికా క్రీడాకారిణి టేలర్ టౌన్సెండ్ ఈసారి మాత్రం డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో జత కట్టి తన కెరీర్లో రెండోసారి గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది.గత ఏడాది వింబుల్డన్ టోర్నీలో సినియకోవాతో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన టౌన్సెండ్ ఈసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ టౌన్సెండ్ృసినియకోవా ద్వయం 6-2, 6-7 (4/7), 6-3తో సె సు వె (చైనీస్ తైపీ)-ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జోడీపై గెలిచింది. టౌన్సెండ్-సినియకోవాలకు 8,10,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 4 కోట్ల 41 లక్షలు)... సె సు వెృఒస్టాపెంకోలకు 4,40,000 డాలర్లు (రూ. 2 కోట్ల 39 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. సినియకోవా కెరీర్లో ఇది 10వ గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో ఆమె బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి 2022, 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో... 2018, 2021 ఫ్రెంచ్ ఓపెన్‌లో... 2018, 2022 వింబుల్డన్ టోర్నీలో... 2022 యూఎస్ ఓపెన్‌లో... కోకో గాఫ్ (అమెరికా)తో కలిసి 2024 ఫ్రెంచ్ ఓపెన్‌లో... టౌన్సెండ్తో కలిసి 2024 వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. భళా బెర్నెట్... మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి స్విట్జర్లాండ్ ప్లేయర్‌గా హెన్రీ బెర్నెట్ గుర్తింపు పొందాడు. జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బెర్నెట్ 6-3, 6-4తో బెంజమిన్ విల్వెర్త్ (అమెరికా)పై విజయం సాధించాడు. గతంలో స్విట్జర్లాండ్ తరఫున జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో హెయింజ్ గుంతార్ట్ (1976 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్), రోజర్ ఫెడరర్ (1998 వింబుల్డన్), రోమన్ వాలెంట్ (2001 వింబుల్డన్), స్టానిస్లాస్ వావ్రింకా (2003 ఫ్రెంచ్ ఓపెన్), డొమినిక్ స్ట్రయికర్ (2020 ఫ్రెంచ్ ఓపెన్) విజేతలుగా నిలిచారు. -
ఆస్ట్రేలియా ఓపెన్-2025 విజేత జానిక్ సిన్నర్
ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) గెలుచుకున్నాడు. మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరినాలో ఇవాళ (జనవరి 26) జరిగిన ఫైనల్లో అలెక్స్ జ్వెరెవ్‌ను (జర్మనీ) 6-3 7-6(4) 6-3 తేడాతో ఓడించాడు. సిన్నర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ (2 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు, ఓ యూఎస్ ఓపెన్) టైటిల్. సిన్నర్ గతేడాది డానిల్ మెద్వెదెవ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. సిన్నర్ వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిన ఆరో ఆటగాడిగా అలెక్స్ జ్వెరెవ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అలెక్స్ జ్వెరెవ్‌కు ముందు ఆండ్రీ అగస్సీ, గోరాన్ ఇవానిసెవిక్, ఆండీ ముర్రే, డొమినిక్ థీమ్, కాస్పర్ రూడ్ కూడా తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడారు.కెరీర్లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన తొలి ఇటాలియన్ జన్నిక్ సిన్నర్జిమ్ కొరియర్ (1992-93) తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను డిఫెండ్ చేసుకున్న అతి పిన్నవయస్కుడు జన్నిక్ సిన్నర్ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించడం ద్వారా జన్నిక్కు 35,00,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ప్రైజ్‌మనీగా లభించింది. భారత కరెన్సీలో ఈ మొత్తం 19 కోట్లకు పైమాటే. -
క్వీన్ కీస్...
మెల్బోర్న్: పదేళ్ల క్రితం 19 ఏళ్ల ప్రాయంలో ఆ్రస్టేలియన్ ఓపెన్ లోనే మాడిసన్ కీస్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకొని వెలుగులోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే... పదేళ్ల తర్వాత అదే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆమె తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నెరవేర్చుకుంది. 19వ సీడ్‌గా ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ప్రపంచ 14వ ర్యాంకర్ మాడిసన్ కీస్... అందరి అంచనాలను తారుమారు చేసి చివరకు చాంపియన్‌గా అవతరించింది. గత రెండేళ్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచి... ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీలో టైటిల్ నెగ్గి జోరు మీదున్న బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సబలెంకాను ఓడించిన కీస్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కీస్ 6–3, 2–6, 7–5తో సబలెంకాపై గెలిచింది. విజేతగా నిలిచిన మాడిసన్ కీస్‌కు 35 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 3 లక్షలు)... రన్నరప్ సబలెంకాకు 19 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో కీస్ ముగ్గురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను (రిబా కినా, స్వియాటెక్, సబలెంకా) ఓడించడం విశేషం. 2 గంటల 2 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో కీస్ ఆరు ఏస్‌లు సంధించింది. 29 విన్నర్స్ కొట్టింది. 31 అనవసర తప్పిదా లు చేసింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సబలెంకా ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. నేడు యానిక్ సినెర్ (ఇటలీ), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మధ్య పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మొదలవుతుంది. -
ఒలివియా–జాన్ పీర్స్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
ఆరంభ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ‘మిక్స్డ్ డబుల్స్’ ఫైనల్ కాస్తా ఆ్రస్టేలియన్ల సమరంగా మారింది. కోర్టులో ఇవతల... అవతల... నలుగురూ ఆ్రస్టేలియన్లే ట్రోఫీ కోసం ‘ఏస్’లు దూశారు. చివరకు ఒలివియా గడెస్కీ–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిస్తే... సహచర ద్వయం కింబర్లీ బిరెల్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ రన్నరప్‌తో తృప్తి పడింది. ఇరు జోడీలు ‘వైల్డ్‌కార్డ్’ ఎంట్రీతోనే సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్ ఆడటం గమనార్హం. మొత్తానికి 58 ఏళ్ల తర్వాత అంతా అ్రస్టేలియన్లే తలపడిన తుది పోరులో పీర్స్–ఒలివియా జోడీ 3–6, 6–4, 10–6తో స్మిత్–బిరెల్ జంటపై గెలిచింది.ఒలివియా–పీర్స్ జంటకు 1,75,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 95 లక్షల 36 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 22 ఏళ్ల ఒలివియాకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. 36 ఏళ్ల పీర్స్ ఖాతాలో ఆ్రస్టేలియన్ ఓపెన్ (2017) పురుషుల డబుల్స్ టైటిల్, 2022లో యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ఉన్నాయి. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఊహించని సంఘటన.. జొకోవిచ్ గుడ్‌బై చెప్పేస్తాడా?
వయసుతో సంబంధం లేకుండా ఆడుతూ టెన్నిస్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 37 ఏళ్ళ నోవాక్ జొకోవిచ్ చివరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రేక్షకుల నిరసనల మధ్య నిష్క్రమించడం చాలా బాధాకరం. శుక్రవారం అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత ఎడమ కాలిలో కండరాల నొప్పుల కారణంగా నిష్క్రమిస్తున్నట్టు జొకోవిచ్ ప్రకటించాడు. జొకోవిచ్ తొలి సెట్ ను 7-6 (5) తేడాతో కోల్పోయిన అనంతరం నెట్ చుట్టూ నడిచి జ్వెరెవ్‌కు కరచాలనం చేసి ఓటమి అంకీకరిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేసి వెనుదిరిగాడు.సెర్బియా కు చెందిన జొకోవిచ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రారంభంలో ఒక సెట్ ని కోల్పోయినప్పటికీ మూడో సీడ్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ విసిరిన సవాలును గట్టిగా ఎదుర్కొని 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజేత గా నిలిచి సెమీఫైనల్ కి దూసుకెళ్లాడు.రికార్డు స్థాయిలో తన పదకొండవ ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని గెలుచుకోవడానికి జొకోవిచ్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ చివరికి ఒక అడుగు దూరంలో గాయం కారణంగా తలొగ్గాల్సింది. జొకోవిచ్ మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్ ఆడిన రీతిలోనే అదే స్పూర్తితో ఆడి గెలుపొంది ఫైనల్ కి దూసుకెళ్తాడని ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు ఆశించారు. ఇందుకోసం వారంతా ఏంతో ఖర్చు పెట్టి స్టేడియం కి వచ్చారు. అయితే జొకోవిచ్ ఈ రీతి లో వైదొలగడం వారికి ఎంతో నిరాశ పరిచింది. మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ, జెరెవ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. “సాషాకు శుభాకాంక్షలు, అతను తన మొదటి స్లామ్‌కు సాధించడానికి సంపూర్ణంగా అర్హుడు," అని కితాబు ఇచ్చాడు. గత సంవత్సరం కూడా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. 2017 తర్వాత మొదటిసారిగా జొకోవిచ్ ఒక గ్రాండ్ స్లాం కూడా గెలవక పోవడం ఇదే మొదటి సారి. అయితే జొకోవిచ్ గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం సాధించడం విశేషం.ఈ ఏడాదిలో తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరోసారి సెమిస్ స్థాయి నుంచే వైదొలగడం తో ఇంక జొకోవిచ్ కూడా తన చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ లాగానే త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అతని అభిమానులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా జొకోవిచ్ తండ్రి అతనిని రిటైర్మెంట్ ప్రకటించమని ఒత్తిడి చేస్తుండటం గమనార్హం."గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది అతని శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జొకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంతో జొకోవిచ్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు జొకోవిచ్ వంటి అరుదైన ఆటగాడిని ఆ విధంగా గేలి చేయడం మాత్రం ఏ విధంగా సమర్థనీయం కాదు. -
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరిన సిన్నర్..
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ టెన్నిస్ నెం1 జానిక్ సిన్నర్(Jannik Sinner) అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అమెరికా టెన్నిస్ ఆటగాడు బెన్ షెల్టాన్‌ను 7-6(7/2), 6-2, 6-2 తేడాతో ఓడించిన సిన్నర్.. వరుసగా రెండో సారి తన ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.అంతకుముందు జరిగిన మరో సెమీఫైనల్లో గాయం కారణంగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) గాయం కారణంగా తప్పకోవడంతో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఫైనల్‌కు చేరాడు. ఈ క్రమంలో ఆదివారం(జనవరి 27) జరగనున్న ఫైనల్ పోరులో జానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ పోటీపడనున్నారు.కాగా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న జానిక్ సిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్స్‌కు వరుసగా రెండో సారి ఆర్హత సాధించిన తొలి ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను సొంతం చేసుకున్న సిన్నర్.. నోవాక్ జొకోవిచ్ వెనక్కి నెట్టి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మెన్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సిన్నర్ ప్రస్తుతం అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.చదవండి: Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకొవిచ్ అవుట్.. కారణం ఇదే! -
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకొవిచ్ అవుట్.. కారణం ఇదే!
ఆస్టేలియా ఓపెన్-2025(Australian Open 2025) టోర్నమెంట్లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకొవిచ్(Novak Djokovic) ప్రయాణం ముగిసింది. గాయం కారణంగా శుక్రవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే అతడు వైదొలిగాడు. తద్వారా టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నిలవాలన్న జొకొవిచ్ కలకు బ్రేక్ పడింది.కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డుస్థాయిలో ఏకంగా పది సార్లు టైటిల్ సాధించిన ఘనత జొకొవిచ్ సొంతం. కేవలం గతేడాది మాత్రమే అతడు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీ ఫైనల్లో ఓడిపోయాడు. అయితే, ఈసారి మాత్రం మరింత జాగ్రత్తగా అడుగులు వేసిన జొకొవిచ్‌కు గాయం రూపంలో దురదృష్టం ఎదురైంది.అల్కరాజ్ అడ్డంకిని అధిగమించిక్వార్టర్ ఫైనల్లో.. తనకు ప్రధాన అడ్డంకిగా భావించిన అల్కరాజ్తో హోరాహోరీ పోటీలో గెలుపొందిన జొకొవిచ్ సెమీస్‌కు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో జర్మన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev)తో సెమీ ఫైనల్లో తలపడ్డాడు. ఇందులో భాగంగా తొలి సెట్‌ను జ్వెరెవ్ 7-6తో గెలుచుకున్నాడు.పోటీ నుంచి తప్పుకొంటున్నాఅయితే, ఆ వెంటనే నెట్ దగ్గరికి వెళ్లిన జొకొవిచ్ జ్వెరెవ్‌తో కరచాలనం చేసి.. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. దీంతో సెమీస్ విజేతగా నిలిచిన జ్వెరెవ్ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ జొకొవిచ్ కాలి నొప్పితో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. తాజాగా సెమీస్ మ్యాచ్‌లో బాధ భరించలేక వైదొలిగాడు.ఈ నేపథ్యంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన కారణంగానే ఈ సెర్బియా స్టార్ గాయపడ్డాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. రిటైర్మెంట్కు చేరువైన 37 ఏళ్ల నొవాక్ జొకొవిచ్ తాజా గాయం వల్ల.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవకుండానే ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించడం గమనార్హం.జొకొవిచ్‌కు చేదు అనుభవంసెమీ ఫైనల్ బరి నుంచి తప్పించుకుని కోర్టును వీడుతున్న సమయంలో నొవాక్ జొకొవిచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ప్రేక్షకులు అతడి గాయం గురించి హేళన చేసేలా మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జ్వెరెవ్ తన ప్రత్యర్థి ఆటగాడికి మద్దతుగా నిలిచాడు.జ్వెరెవ్ క్రీడాస్ఫూర్తి‘‘గాయం వల్ల కోర్టును వీడిన వ్యక్తిని అవమానించేలా మాట్లాడటం సరికాదు. దయచేసి కాస్త సంయమనం పాటించండి. మీలో ప్రతి ఒక్కరు టికెట్ల కోసం డబ్బులు చెల్లించారని తెలుసు. కాబట్టి ఐదు సెట్ల మ్యాచ్‌ను చూడాలని ఆశించడం మీ హక్కు.కానీ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసం తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి నొవాక్ జొకొవిచ్. దయచేసి అతడిని ఏరకంగానూ హేళన చేయకండి’’ అని జ్వెరెవ్ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం -
సబలెంకా X కీస్
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ ఘనత సాధించేందుకు సబలెంకా... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకునేందుకు మాడిసన్ కీస్... ఒక్క విజయం దూరంలో నిలిచారు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బెలారస్ స్టార్ సబలెంకా వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లగా... అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత పొందింది. గురు వారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సబలెంకా 6–4, 6–2తో 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్)పై నెగ్గగా... 19వ సీడ్ మాడిసన్ కీస్ 5–7, 6–1, 7–6 (10/8)తో రెండో సీడ్, ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. శనివారం జరిగే ఫైనల్లో సబలెంకా, కీస్ అమీతుమీ తేల్చుకుంటారు. 2023, 2024లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకాకు సెమీఫైనల్లో తన ప్రత్యర్థి బదోసా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా 32 వినర్స్ కొట్టి, బదోసా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు బదోసా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 15 అనవసర తప్పిదాలు చేసిన ఈ స్పెయిన్ ప్లేయర్ కేవలం ఒకసారి మాత్రమే సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. స్వియాటెక్‌తో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కీస్ నిర్ణాయక మూడో సెట్లోని 12వ గేమ్‌లో మ్యాచ్ పాయింట్ కాపాడుకుంది. 6–5తో ఆధిక్యంలో నిలిచిన స్వియాటెక్ తన సర్వీస్‌లో 40–30తో విజయం అంచుల్లో నిలిచింది. అయితే స్వియాటెక్ వరుసగా మూడు తప్పిదాలు చేసి తన సర్వీస్‌ను కోల్పోయింది. దాంతో స్కోరు 6–6తో సమమైంది. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. తొలుత 10 పాయింట్లు సాధించిన వారికి విజయం ఖరారయ్యే ఆఖరి సెట్ టైబ్రేక్‌లో రెండుసార్లు స్వియాటెక్ 5–3తో, 7–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీస్ పట్టుదల కోల్పోకుండా పోరాడి చివరకు 10–8తో టైబ్రేక్‌లో నెగ్గి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. 2017లో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన కీస్ రెండో ‘గ్రాండ్’ అవకాశంలోనైనా విజేతగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ (సెర్బియా); బెన్షెల్టన్ (అమెరికా)తో యానిక్ సినెర్ (ఇటలీ) తలపడతారు. -
సెమీస్‌లో స్వియాటెక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో స్టార్ ప్లేయర్లు ఇగా స్వియాటెక్ (పోలాండ్), యానిక్ సినెర్ (ఇటలీ) తమ దూకుడు కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ స్వియాటెక్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ వరుస సెట్లలో నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ కూడా వరుస సెట్లలో తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. 89 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. నవారో సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన స్వియాటెక్ 22 విన్నర్స్ కొట్టింది. మరో క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 3–6, 6–3, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించి మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో బదోసా (స్పెయిన్)తో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్); కీస్‌తో స్వియాటెక్ తలపడతారు. షెల్టన్ తొలిసారి... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ యానిక్ సినెర్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేయగా... అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్ తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–3, 6–2, 6–1తో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై... షెల్టన్ 6–4, 7–5, 4–6, 7–6 (7/4)తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలుపొందారు. డిమినార్తో 1 గంట 48 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సినెర్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 27 వినర్స్ కొట్టిన సినెర్... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
తగ్గేదేలే...
టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు నొవాక్ జొకోవిచ్ రెండు విజయాల దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియా దిగ్గజం 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రికార్డుస్థాయిలో 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన జొకోవిచ్ కేవలం గత ఏడాది మాత్రమే తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గత ఏడాది వింబుల్డన్ టోర్నీలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డు నెలకొల్పేందుకు జొకోవిచ్‌కు అవకాశం లభించింది. కానీ తుదిపోరులో స్పెయిన్ యువతార కార్లోస్ అల్కరాజ్ అద్వితీయ ఆటతీరుతో జొకోవిచ్ ఆశలను వమ్ము చేశాడు. తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే ‘గ్రాండ్’ రికార్డు అందుకోవాలనే లక్ష్యంతో జొకోవిచ్ ఈసారి పక్కా ప్రణాళికతో వచ్చాడు. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన బ్రిటన్ స్టార్, తన చిరకాల ప్రత్యర్థి ఆండీ ముర్రేను కోచ్‌గా నియమించుకున్నాడు. ముర్రే నియామకం సరైనదేనని ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ ఆటతీరును పరిశీలిస్తే తెలుస్తోంది. క్వార్టర్ ఫైనల్లో పెద్ద అడ్డంకి అల్కరాజ్ను నాలుగు సెట్ల పోరులో జొకోవిచ్ అధిగమించాడు. సెమీఫైనల్లో జొకోవిచ్ జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ రూపంలో మరో కీలక పరీక్షకు సిద్ధంకానున్నాడు. అయితే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జ్వెరెవ్‌తో పోటీపడ్డ మూడుసార్లూ జొకోవిచే గెలుపొందడం గమనార్హం. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 2023, 2024లలో విజేతగా నిలిచిన సబలెంకాకు ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లో గట్టిపోటీ ఎదురైంది. అయితే సబలెంకా తన ఆధిపత్యం చాటుకొని ‘హ్యాట్రిక్’ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మెల్బోర్న్: ‘ఈసారి కాకపోతే మరెప్పుడూ కాదు’ అన్న తరహాలో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన శక్తినంతా ధారపోస్తూ, అపార అనుభవాన్ని రంగరిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోరాడుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో మెల్బోర్న్లో అడుగు పెట్టిన జొకోవిచ్ ఎంతో ప్రమాదకరమైన అల్కరాజ్ అడ్డంకిని దాటేశాడు. కొత్త కోచ్ ఆండీ ముర్రే రచించిన వ్యూహాలను కోర్టులో అమలు చేసిన జొకోవిచ్... నాలుగు సెట్లలో స్పెయిన్ స్టార్ అల్కరాజ్ ఆట కట్టించేశాడు. 12వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 4–6, 6–4, 6–3, 6–4తో మూడో సీడ్ అల్కరాజ్ను ఓడించాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆట అబ్బురపరిచింది. జొకోవిచ్‌ను నిలువరించేందుకు 21 ఏళ్ల అల్కరాజ్ అన్ని అస్త్రాలను ప్రయోగించినా...సెర్బియా స్టార్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ర్యాలీ హోరాహోరీగా సాగుతుంటే హఠాత్తుగా దానిని డ్రాప్ షాట్‌గా మలిచి పాయింట్లు నెగ్గడం అల్కరాజ్కు అలవాటు. అయితే ఈసారి అల్కరాజ్ ఈ ‘డ్రాప్ షాట్’ల వ్యూహానికి పక్కాగా సిద్ధమై వచ్చిన జొకోవిచ్ సమర్థంగా అడ్డుకున్నాడు. 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌లను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. అదే జోరులో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోవడంతో జొకోవిచ్పై ఒత్తిడి పెరిగింది. అయితే ఒత్తిడిలోనే జొకోవిచ్లోని మేటి ఆటగాడు మేల్కొన్నాడు. అల్కరాజ్ కంటే అద్భుతంగా ఆడుతూ ముందుకు వెళ్లాడు. రెండో సెట్లోని రెండో గేమ్‌లోనే అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలో వచ్చాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన అల్కరాజ్ ఐదో గేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. అయితే పదో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌లో ఒక్కసారిగా దూకుడు పెంచిన జొకోవిచ్ ఒక్క అవకాశం ఇవ్వకుండా సర్వీస్‌ను బ్రేక్ చేసి 50 నిమిషాల్లో రెండో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్లో కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఆరో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌ను జొకోవిచ్ బ్రేక్ చేయగా... ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. ఎనిమిదో గేమ్‌లో మళ్లీ అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 50 నిమిషాల్లో సెట్‌ను 6–3తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్లోని తొలి గేమ్‌లోనే అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన అన్ని సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 3 గంటల 28 నిమిషాల్లో 7–6 (7/1), 7–6 (7/0), 2–6, 6–1తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై గెలిచి మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫైనల్లో చోటు కోసం జొకోవిచ్‌తో జ్వెరెవ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 8–4తో జ్వెరెవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వీరిద్దరు మూడుసార్లు (2021 యూఎస్ ఓపెన్ సెమీఫైనల్; 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్; 2019 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్) పోటీపడగా... మూడుసార్లూ జొకోవిచే గెలిచాడు. వరుసగా 19వ విజయంతో... మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా 6–2, 2–6, 6–3తో 27వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై, బదోసా 7–5, 6–4తో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సబలెంకాకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం. వరుసగా రెండేళ్లు (2023, 2024) ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సబలెంకా ఈసారీ టైటిల్ సాధిస్తే మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997, 1998, 1999) తర్వాత ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది. పావ్లీచెంకోవాతో ఒక గంట 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 29 విన్నర్స్ కొట్టింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. బదోసాతో ఒక గంట 43 నిమిషాలపాటు జరిగిన పోరులో కోకో గాఫ్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. కోకో గాఫ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన బదోసా ఈ గెలుపుతో తన కెరీర్లో ఆడుతోన్న 20వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో లొరెంజో సొనెగో (ఇటలీ)తో బెన్ షెల్టన్ (అమెరికా); అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో యానిక్ సినెర్; మహిళల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో మాడిసన్ కీస్ (అమెరికా)తో స్వితోలినా (ఉక్రెయిన్); ఎమ్మా నవారో (అమెరికా)తో ఇగా స్వియాటెక్ (పోలాండ్) తలపడతారు. బోపన్న జోడీ ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–షుయె జాంగ్ (చైనా) జోడీ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షుయె జాంగ్ ద్వయం 6–2, 4–6, 9–11తో జాన్ పీర్స్–ఒలివియా గడెస్కీ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది.50 ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధికంగా 50 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పురుష సింగిల్స్ సెమీఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ఆల్‌టైమ్ రికార్డు క్రిస్ ఎవర్ట్ (52 సార్లు; అమెరికా) పేరిట ఉంది. -
స్వియాటెక్ ఫటాఫట్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చి ఈ మాజీ నంబర్‌వన్ విజయాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ స్వియాటెక్ 6–0, 6–1తో ఇవా లిస్ (జర్మనీ)పై గెలిచి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. వరుసగా ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 23 ఏళ్ల స్వియాటెక్ 2022లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవా లిస్తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. మూడో రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకున్న స్వియాటెక్... రెబెకా స్రామ్కోవా (స్లొవేనియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)తో స్వియాటెక్ తలపడుతుంది. కీస్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ఆరో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్, 19వ సీడ్ మాడిసన్ కీస్ 6–3, 1–6, 6–4తో రిబాకినాపై సంచలన విజయం సాధించి నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 28వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుదెర్మెటోవా (రష్యా)పై, ఎమ్మా నవారో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 12వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న స్వితోలినా మూడోసారి క్వార్టర్ ఫైనల్ చేరగా... నవారో తొలిసారి ఈ ఘనత సాధించింది. సినెర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 13వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఇటలీ స్టార్ 6–3, 3–6, 6–3, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన సినెర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో మికిల్సన్ (అమెరికా)పై, లొరెంజో సొనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (3/7), 7–6 (7/2), 1–0తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్ఫిల్స్ గాయంతో వైదొలిగాడు. దాంతో బెన్ షెల్టన్ రెండోసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. -
స్టార్ టెన్నిస్ ప్లేయర్‌కు షాక్.. అతిగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా
స్టార్ టెన్నిస్ ప్లేయర్, 2021 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ డానిల్ మెద్వెదెవ్కు (రష్యా) షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్-2025 సందర్భంగా అతి చేసినందుకు గానూ మెద్వెదెవ్కు భారీ జరిమానా విధించారు నిర్వహకులు. మెద్వెదెవ్.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్లో నిష్క్రమించాడు. రెండు రౌండ్లలో మెద్వెదెవ్ చాలా దురుసగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ 76,000 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. తొలి రౌండ్ లో మెద్వెదెవ్.. 418 ర్యాంక్ కసిడిట్ సామ్రెజ్ పై విజయం సాధించాడు. గెలుపు అనంతరం విజయోత్సవ సంబురాల్లో భాగంగా పలు మార్లు తన రాకెట్‌తో నెట్ కెమెరాను బాదాడు. ఇలా చేసినందుకు గానూ క్రమశిక్షణ చర్యల కింద అతనికి 10 వేల ఆసీస్ డాలర్ల జరిమానా విధించారు. మరోసారి ఇలా ప్రవర్తించకూడదని ఘాటుగా హెచ్చరించారు.Daniil Medvedev was fined $76,000 at this year’s Australian Open.$10k for hitting the camera with his racquet during the 1st round.$66k for his behavior during his match against Tien & not attending press. His total winnings were $124k.pic.twitter.com/bDQ4aj064j— The Tennis Letter (@TheTennisLetter) January 18, 2025నిర్వహకులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినా మెద్వెదెవ్ తీరు ఏ మాత్రం మారలేదు. రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ అలానే ప్రవర్తించాడు. ఈ రౌండ్ లో 19 ఏళ్ల అమెరికా కుర్రాడు, క్వాలిఫయర్ లెర్నర్ టీన్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న మెద్వెదెవ్.. ఓటమి అనంతరం సహనం కోల్పోయి రాకెట్‌ను నేలకేసి బాదాడు. బంతిని కూడా బ్యాక్ వాల్ కేసి కొట్టాడు. తన రాకెట్ బ్యాగ్‌ను విసిరేశాడు. మరోసారి కెమెరాపై తన ప్రతాపాన్ని చూపాడు.మెద్వెదెవ్ ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న నిర్వహకులు ఈసారి 66 వేల ఆసీస్ డాలర్ల జరిమానా విధించారు. అలా మొత్తంగా రెండు రౌండ్లలో మెద్వెదెవ్ 76 వేల డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.40 లక్షలు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్నందుకు గానూ మెద్వెదెవ్కు 1,24,000 ఆసీస్ డాలర్లు ప్రైజ్‌మనీ లభిస్తుంది. దీంట్లో సగానికి పైగా అతను జరిమానా కింద కోల్పోయాడు.కాగా, 2021, 2022, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో భంగపడ్డ మెద్వెదెవ్.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో బరిలో దిగాడు. కానీ మరోసారి అతడికి నిరాశే ఎదురైంది. -
సబలెంకా సాఫీగా...
మ్యాచ్ మ్యాచ్‌కూ తన రాకెట్ పదును పెంచుతున్న బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా ధాటికి ప్రత్యర్థులు తేలిపోతున్నారు. కచ్చితంగా గట్టిపోటీ ఇస్తారనుకుంటే... సబలెంకా ముందు వారు ఎదురు నిలువలేకపోతున్నారు. దాంతో సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా నాలుగో విజయంతో డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా నెగ్గిన సబలెంకాకు క్వార్టర్ ఫైనల్లో రష్యా సీనియర్ ప్లేయర్ అనస్తాసియా పావ్లీచెంకో ఏమేరకు పోటీనిస్తుందో వేచి చూడాలి. వరుసగా 17వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 27వ సీడ్ పావ్లీచెంకోవా ఇప్పటి వరకు మూడుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరుకొని ముందంజ వేయలేకపోయింది. ఈ టోర్నీలో ఆమె తొలిసారి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్ లక్ష్యం దిశగా ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా ఇంకో అడుగు వేసింది. 2023, 2024లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన సబలెంకా ఈసారీ టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 6–1, 6–2తో రష్యా రైజింగ్ స్టార్, 14వ సీడ్ మిరా ఆంద్రీవాపై అలవోకగా గెలిచింది. 62 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. మూడు ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. 15 విన్నర్స్ కొట్టిన ఆమె 11 అనవసర తప్పిదాలు చేసింది. ఆంద్రీవా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన సబలెంకా తన సర్వీస్‌ను ఒక్కసారీ చేజార్చుకోలేదు. నెట్ వద్దకు దూసుకొచ్చిన నాలుగుసార్లూ సబలెంకా పాయింట్లు నెగ్గడం విశేషం. మరోవైపు ఆంద్రీవా మూడు డబుల్ ఫాల్ట్‌లు, 18 అనవసర తప్పిదాలు చేసింది. సబలెంకాతోపాటు మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్), 27వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కోకో గాఫ్ 5–7, 6–2, 6–1తో బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై కష్టపడి గెలుపొందగా... బదోసా 6–1, 7–6 ((7/2)తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై, పావ్లీచెంకోవా 7–6 (7/0), 6–0తో 18వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై వరుస సెట్లలో నెగ్గారు. బోపన్న జోడీకి ‘వాకోవర్’ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న–షుయె జాంగ్ (చైనా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బోపన్న–షుయె జాంగ్‌లతో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆడాల్సిన నాలుగో సీడ్ ద్వయం హుగో న్యాస్ (మొనాకో)–టేలర్ టౌన్సెండ్ (అమెరికా) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బోపన్న–షుయె జాంగ్ కోర్టులో అడుగు పెట్టకుండానే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. తిమియా బాబోస్ (హంగేరి)–మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్); ఒలివియా గడెస్కీ–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షుయె జాంగ్ జంట తలపడుతుంది. తొలి రౌండ్లో బోపన్న–షుయె జాంగ్ 6–4, 6–4తో క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)లపై గెలిచారు. గత ఏడాది పురుషుల డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి టైటిల్ నెగ్గిన బోపన్న ఈ ఏడాది మాత్రం కొత్త భాగస్వామి బారింటోస్ (కొలంబియా)తో కలిసి పోటీపడి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. జొకోవిచ్ 15వసారి...పురుషుల సింగిల్స్ విభాగంలో 10 సార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 15వసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చెక్ రిపబ్లిక్ ప్లేయర్, 24వ సీడ్ జిరీ లెహెస్కాతో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4, 7–6 (7/4)తో విజయం సాధించాడు. 2 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. లెహెస్కా 11 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 27 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 21 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు జొకోవిచ్కంటే ఎక్కువ వినర్స్ (39) కొట్టిన లెహెస్కా ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. లెహెస్కా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. నెట్ వద్దకు జొకోవిచ్ 18 సార్లు వచ్చి 16 సార్లు పాయింట్లు సాధించగా... లెహెస్కా 26 సార్లు ముందుకొచ్చి 18 సార్లు పాయింట్లు నెగ్గాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్తో ‘ఢీ’ రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన జొకోవిచ్‌కు క్వార్టర్ ఫైనల్లో అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. గత ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు నెగ్గిన స్పెయిన్ స్టార్, మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్తో క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ తలపడనున్నాడు. అల్కరాజ్తో ముఖాముఖిగా ఏడుసార్లు పోటీపడ్డ జొకోవిచ్ నాలుగుసార్లు నెగ్గి, మూడుసార్లు ఓడిపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం వీరిద్దరు తొలిసారి తలపడనున్నారు. ఆదివారమే జరిగిన ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–1, 2–6, 6–3, 6–2తో 14వ సీడ్ ఉగో హంబెర్ట్ (ఫ్రాన్స్)పై, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–1, 6–1, 6–1తో డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్)పై నెగ్గారు. 15వ సీడ్ జేక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 7–5, 6–1తో రెండు సెట్లు గెలిచాక అతని ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు. -
సినెర్, స్వియాటెక్ అలవోకగా...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొందరు సీడెడ్ ప్లేయర్లకు అనూహ్య పరాజయాలు ఎదురవుతుంటే... టాప్ స్టార్లు అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... వీరికి దీటుగా యువ క్రీడాకారులు సైతం మేటి ఆటగాళ్లను ఢీకొట్టి మరీ మూడో రౌండ్‌ను దాటేశారు. క్వాలిఫయర్ లెర్నర్ టియెన్, 22 ఏళ్ల మిచెల్సన్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.మెల్బోర్న్: పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్...మహిళల విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ ‘హ్యాట్రిక్’ చాంపియన్, పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌తో పాటు ఆరో సీడ్ ఎలినా రిబాకినా (కజకిస్తాన్), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) ప్రిక్వార్టర్స్ చేరారు. వీరితో పాటు ఎనిమిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), 13వ సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) నాలుగో రౌండ్ చేరుకున్నారు. ఇరు విభాగాల్లో నాలుగో సీడ్ ప్లేయర్లు ఫ్రిట్జ్ (అమెరికా), పావొలిని (ఇటలీ)లకు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. భార్యభర్తలు స్వితోలినా (ఉక్రెయిన్), మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) చెప్పుకోదగిన విజయాలతో ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ముందంజ వేశారు. స్వితోలినా గత సీజన్ రెండు గ్రాండ్‌స్లామ్‌ల రన్నరప్ పావొలినిని కంగుతినిపిస్తే, మోన్ఫిల్స్... గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్కు చెక్ పెట్టాడు. సినెర్ జోరు... డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ యానిక్ సినెర్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. శనివారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అతను 6–3, 6–4, 6–2తో అమెరికాకు చెందిన 46వ ర్యాంకర్ మార్కొస్ గిరోన్‌ను వరుస సెట్లలో ఓడించాడు. గత సీజన్లో ఆసీస్, ఫ్రెంచ్ ఓపెన్లను గెలుచుకున్న 23 ఏళ్ల ఇటలీ టాప్‌స్టార్ ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో గేల్ మోన్ఫిల్స్ ప్రిక్వార్టర్స్ చేరడం ద్వారా వన్నె తగ్గని వెటరన్ ప్లేయర్‌గా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన నిలిచాడు. మూడో రౌండ్లో 38 ఏళ్ల మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 3–6, 7–5, 7–6 (7/1), 6–4తో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)కు షాకిచ్చాడు. 2020లో ఫెడరర్ 38 ఏళ్ల వయసులో తన ఆఖరి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడి సెమీస్ చేరాడు. డి మినార్ (ఆసీస్) 5–7, 7–6 (7/3), 6–3, 6–3తో సెరుండొలొ (అర్జెంటీనా)పై, 13వ సీడ్ రూన్ (డెన్మార్క్) 6–7 (5/7), 6–3, 4–6, 6–4, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. సంచలన క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా) 7–6 (12/10), 6–3, 6–3తో ఫ్రాన్స్‌కు చెందిన మౌటెట్ను ఓడించాడు. అన్‌సీడెడ్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 7–6 (7/5), 6–2తో 19వ సీడ్ కచనొవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. స్వితోలినా ముందంజ మోన్ఫిల్స్ భార్య ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) తన భర్త నెగ్గిన కోర్టులోనే అనంతరం జరిగిన మ్యాచ్‌లో 2–6, 6–4, 6–0తో గత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ (2024)ల రన్నరప్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)ని కంగుతినిపించింది. రెండో సీడ్ స్వియాటెక్ 6–1, 6–0తో యూఎస్ ఓపెన్ (2021) మాజీ చాంపియన్, బ్రిటన్ ప్లేయర్ ఎమ్మా రాడుకానుపై అలవోక విజయం సాధించింది. 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–4, 6–4తో పదోసీడ్ సహచర ప్లేయర్ కొలిన్స్‌ను ఓడించింది. 6వ సీడ్ రిబాకినా 6–3, 6–4తో డయానా యా్రస్తెస్కా (ఉక్రెయిన్)పై, 8వ సీడ్ నవారో 6–4, 3–6, 6–4తో ఓన్స్ జాబెర్ (ట్యూనిíÙయా)పై, 9వ సీడ్ కసత్కినా (రష్యా) 7–5, 6–1తో పుతిన్‌త్సెవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. బాలాజీ జోడీ అవుట్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ నుంచి భారత డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ నిష్క్రమించాడు. మెక్సికన్ భాగస్వామి మిగుల్ ఏంజిల్ రేయెస్ వారెలతో జోడీ కట్టిన భారత ఆటగాడు రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన పోరులో బాలాజీ–ఏంజిల్ రేయెస్ ద్వయం 6–7 (1/7), 6–4, 3–6తో పోర్చుగల్‌కు చెందిన న్యూనో బోర్జెస్–ఫ్రాన్సిస్కొ కాబ్రల్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
జొకోవిచ్, సబలెంకా జోరు
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్ సాధించే దిశగా సబలెంకా... రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే దిశగా జొకోవిచ్ మరో అడుగు ముందుకు వేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్).... పురుషుల సింగిల్స్‌లో 10 సార్లు విజేత జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/5), 6–4తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై గెలుపొందగా... ఏడో సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–4తో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. క్లారాతో 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకాకు గట్టిపోటీ ఎదురైనా కీలకదశలో ఆమె పైచేయి సాధించింది. మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టని సబలెంకా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 39 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 29 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు క్లారా ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్ కోల్పోయిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో మ్యాచ్‌లో మాత్రం వరుసగా మూడు సెట్లలో గెలుపొందడం విశేషం. మఖచ్తో 2 గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 28 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్...నెట్ వద్దకు 18 సార్లు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన ఈ మాజీ చాంపియన్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్; మిరా ఆంద్రీవా (రష్యా)తో సబలెంకా తలపడతారు. పురుషుల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–4, 6–7 (3/7), 6–2తో బోర్జెస్ (పోర్చుగల్)పై, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–4, 6–4తో ఫియరెన్లే (బ్రిటన్)పై, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 7–6 (7/2), 6–2, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. కోకో గాఫ్ సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ఇంటిదారి పట్టింది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 6–4, 6–2తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గగా... పెగూలా 6–7 (3/7), 1–6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడిపోయింది. 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్), 27వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా), బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. బెన్‌చిచ్‌తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయాక మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) గాయం కారణంగా వైదొలిగింది. -
మెద్వెదెవ్కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం పెను సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ అసాధారణ పోరాటపటిమ కనబరిచి మెద్వెదెవ్‌ను ఓడించి తన కెరీర్లోనే అతిపెద్ద విజయం సాధించాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 119వ ర్యాంకర్ లెర్నర్ టియెన్ 6–3, 7–6 (7/4), 6–7 (8/10), 1–6, 7–6 (10/7)తో ఐదో సీడ్, గతంలో మూడుసార్లు రన్నరప్‌గా (2021, 2022, 2024) నిలిచిన మెద్వెదెవ్పై గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ 20 ఏస్‌లు సంధించినా... 9 డబుల్ ఫాల్ట్‌లు, 82 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. గత మూడేళ్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన లెర్నర్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన లెర్నర్ టియెన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఐదు సెట్లు ఆడి నెగ్గడం విశేషం. కామిలో కారాబెల్లి (అర్జెంటీనా)తో 3 గంటల 56 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్లో లెర్నర్ టియెన్ 4–6, 7–6 (7/3), 6–3, 5–7, 6–4తో గెలుపొందాడు. మరోవైపు కాసిదిత్ సామ్రెజ్ (థాయ్‌లాండ్)తో 3 గంటల 8 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 4–6, 3–6, 6–1, 6–2తో గట్టెక్కాడు. రెండో రౌండ్లోనూ మెద్వెదెవ్ ఐదు సెట్లు పోరాడినా అమెరికన్ టీనేజర్ ఆటతీరుకు చేతులెత్తేశాడు. లెర్నర్, మెద్వెదెవ్ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం తెల్లవారుజాము 2 గంటల 53 నిమిషాలకు ముగియడం గమనార్హం. మూడో రౌండ్లో సినెర్మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో సినెర్ 2 గంటల 46 నిమిషాల్లో 4–6, 6–4, 6–1, 6–3తో స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా), పదో సీడ్ కొలిన్స్ (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రిత్విక్ జోడీ ఓటమి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–సెగర్మన్ (అమెరికా) జోడీ 6–7 (5/7), 1–6తో ఆరో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెనీ ప్యాటెన్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. శ్రీరామ్ బాలాజీ (భారత్)–వరేలా (మెక్సికో) ద్వయం రెండో రౌండ్‌కు చేరగా... జీవన్ నెడుంజెళియన్– విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)... అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–ద్రజెవ్స్కీ (పోలాండ్) జోడీలు తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాయి. -
జొకోవిచ్ 430
మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా జొకోవిచ్ అవతరించాడు. 429 మ్యాచ్‌లతో స్విట్జర్లాండ్ లెజెండ్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును 430వ మ్యాచ్‌తో జొకోవిచ్ అధిగమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–1, 6–7 (4/7), 6–3, 6–2తో కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన జైమీ ఫారియా (పోర్చుగల్)పై గెలుపొందాడు. 3 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రమే ప్రతిఘటన ఎదురైంది. 14 ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 33 విన్నర్స్ కొట్టడంతోపాటు 33 అనవసర తప్పిదాలు చేసిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు నెగ్గిన ఈ మాజీ చాంపియన్‌కు మూడో రౌండ్లో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్) రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. కెరీర్లో 77వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్ ఇప్పటి వరకు 379 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో గెలిచాడు. ఇది కూడా ఒక రికార్డే. 369 ‘గ్రాండ్’ విజయాలతో ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును గత ఏడాదే జొకోవిచ్ సవరించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో జొకోవిచ్, ఫెడరర్ తర్వాత సెరెనా విలియమ్స్ (423), రాఫెల్ నాదల్ (358), వీనస్ విలియమ్స్ (356) ఉన్నారు. జ్వెరెవ్, అల్కరాజ్ ముందంజ మరోవైపు రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టగా... ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. జ్వెరెవ్ 6–1, 6–4, 6–1తో మార్టినెజ్ (స్పెయిన్)పై, అల్కరాజ్ 6–0, 6–1, 6–4తో నిషియోకా (జపాన్)పై అలవోకగా గెలిచారు. రూడ్ 2 గంటల 44 నిమిషాల్లో 2–6, 6–3, 1–6, 4–6తో జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన రూడ్ ఇప్పటి వరకు ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. బోపన్న జోడీకి షాక్ పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్నకు చుక్కెదురైంది. గత ఏడాది మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి కొత్త భాగస్వామి బారింటోస్ (కొలంబియా)తో కలిసి బరిలోకి దిగాడు. తొలి రౌండ్లో 14వ సీడ్ బోపన్న–బారింటోస్ ద్వయం 5–7, 6–7 (5/7)తో పెడ్రో మార్టినెజ్–జామి మునార్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. యూకీ–ఒలివెట్టి ద్వయం 2–6, 6–7 (3/7)తో ట్రిస్టన్ స్కూల్‌కేట్–ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పరాజయం పాలైంది. కిన్వెన్ జెంగ్ అవుట్మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ఐదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్లో 36 ఏళ్ల లౌరా సిగెమండ్ (జర్మనీ) 7–6 (7/3), 6–3తో కిన్వెన్ జెంగ్‌ను బోల్తా కొట్టించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 6–3, 7–5తో బుజాస్ మనీరో (స్పెయిన్)పై, కోకో గాఫ్ 6–3, 7–5తో జోడీ బురాజ్ (బ్రిటన్)పై, పెగూలా 6–4, 6–2తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 1–6, 6–1, 6–3తో 20వ సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 14వ సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–4, 3–6, 7–6 (10/8)తో మొయూక ఉచిజిమా (జపాన్)పై, 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–1, 6–0తో తాలియా గిబ్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. -
Australian Open: మాజీ ఛాంపియన్‌కు షాక్.. తొలి రౌండ్లోనే ఓటమి
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) తొలి రౌండ్లోనే ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో లూసియా బ్రాన్జెట్టి (ఇటలీ) 6–2, 7–6 (7/2)తో అజరెంకాను బోల్తా కొట్టించింది. 17వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడిన 26వ సీడ్ అజరెంకా తొలి రౌండ్లో ఓడిపోవడం నాలుగోసారి మాత్రమే కావడం గమనార్హం. 2012, 2013లలో విజేతగా నిలిచిన అజరెంకా ఆ తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. బ్రాన్జెట్టితో జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 37 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 16వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 3–6, 6–7 (6/8)తో బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్ 6–3, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, కోకో గాఫ్ 6–3, 6–3తో 2020 చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–0తో మాయా జాయింట్ (ఆస్ట్రేలియా)పై, 2019, 2021 విజేత ఒసాకా 6–3, 3–6, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. -
Australian Open: జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్
అటువైపు ప్రత్యర్థి 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత... ఏకంగా 1126 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్... కెరీర్లో ఇప్పటికే 76 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవం సొంతం... ఇటువైపు ప్లేయర్‌కు ‘వైల్డ్ కార్డు’ ద్వారా కెరీర్లోనే తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడే అవకాశం... ఎదురైన ప్రత్యర్థి తానెంతో ఇష్టపడే ఆటగాడు... ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే మ్యాచ్ ఏకపక్షంగా వరుస సెట్లలో ముగియడం ఖాయమని విశ్లేషకుల ఏకాభిప్రాయం... కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒకే ఒక్క మ్యాచ్‌తో టెన్నిస్ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాడు వదులుకోలేదు. తన అసమాన పోరాటపటిమతో అందరి దృష్టిలో పడ్డాడు. అతడే 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి... తెలుగు సంతతికి చెందిన అమెరికన్ టెన్నిస్ టీనేజ్ రైజింగ్ స్టార్.. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నిశేష్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ప్రతి పాయింట్ సాధించేందుకు జొకోవిచ్‌ను తెగ కష్టపెట్టాడు. నిశేష్‌కు ఎంతో భవిష్యత్ ఉందని మ్యాచ్ అనంతరం జొకోవిచ్ కూడా వ్యాఖ్యానించడం విశేషం. మెల్బోర్న్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అధిగమించాడు. ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్ రైజింగ్ టీనేజ్ టెన్నిస్ స్టార్ నిశేష్ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్ పోరులో జొకోవిచ్ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిశేష్ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. గత నెలలోనే ప్రొఫెషనల్‌గా మారిన 19 ఏళ్ల నిశేష్ ఏమాత్రం తడబడకుండా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బేస్‌లైన్ వద్ద సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే... అడపాదడపా డ్రాప్ షాట్లు... కళ్లు చెదిరే రిటర్న్‌లతో వరుసగా 21వ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్‌కు ఇబ్బంది పెట్టడంలో నిశేష్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని ఎనిమిదో గేమ్‌లో జొకోవిచ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన నిశేష్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–3తో ముందంజ వేశాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్ కాపాడుకోగా... పదో గేమ్‌లో నిశేష్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 49 నిమిషాల్లో 6–4తో సొంతం చేసుకోవడంతో మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు, టీవీల ముందున్న లక్షలాది వీక్షకులు ఆశ్చర్యపోయారు. తొలి సెట్ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్లోనూ నిశేష్ భేషుగ్గా ఆడాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ టీనేజర్ నిశేష్ ఆటతీరుపై అవగాహన పెంచుకొని దూకుడు పెంచాడు. స్కోరు 4–3 వద్ద ఎనిమిదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 44 నిమిషాల్లో రెండో సెట్ దక్కించుకొని లయలోకి వచ్చాడు. రెండో సెట్లోని చివరి గేమ్ ఆడుతున్న సమయంలో నిశేష్ కాలు బెణకడంతో అతను ఆ తర్వాత చురుగ్గా కదల్లేకపోయాడు. మరోవైపు జొకోవిచ్ మరింత జోరు పెంచాడు. మూడో సెట్లోని తొలి గేమ్‌లోనే నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను కాపాడుకొని 43 నిమిషాల్లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో కూడా తొలి గేమ్‌లో, ఐదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జొకోవిచ్ కళ్లు చెదిరే ఏస్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ‘నిశేష్ పరిపూర్ణ క్రీడాకారుడిలా ఆడాడు. అతను ఆడిన కొన్ని షాట్లు నన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరి పాయింట్ వరకు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. భవిష్యత్ లో నిశేష్ ఆటతీరును చాలాసార్లు చూస్తాము. ఇందులో సందేహం లేదు’ అని మ్యాచ్ ముగిశాక జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. 2005లో అమెరికాలో పుట్టి పెరిగిన నిశేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. నిశేష్ తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న స్వస్థలం నెల్లూరు జిల్లా. 1999లో ఉద్యోగరీత్యా భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలి రౌండ్లో ఓడిన నిశేష్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 70 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిశాక విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో నిశేష్ కెరీర్ బెస్ట్ 104వ ర్యాంక్‌కు చేరుకుంటాడు. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో సోమవారం స్టార్ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్ 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2018 తర్వాత ఈ టోర్నీలో సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఓడిపోవ డం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సినెర్ 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్ (చిలీ)పై, అల్కరాజ్ 6–1, 7–5, 6–1తో షెవ్చెంకో (కజకిస్తాన్)పై విజయం సాధించారు. పసారో (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో పదో సీడ్ దిమిత్రోవ్ గాయం కారణంగా రెండో సెట్లో వైదొలిగాడు. 21-టెన్నిస్ ఓపెన్ శకంలో (1968 నుంచి) వరుసగా 21వ ఏడాది జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఒక్క విజయమైనా సాధించాడు. ఈ జాబితాలో రోజర్ ఫెడరర్ (22 ఏళ్లు) మాత్రమే ముందున్నాడు. 429-ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్ (429 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో బరిలోకి దిగితే ఫెడరర్ రికార్డును అధిగమిస్తాడు. -
సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే...
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది. బరిలో ఉన్న ఏకైక భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 91వ ర్యాంకర్ నగాల్ 3–6, 1–6, 5–7తో ఓడిపోయాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 20 అనవసర తప్పిదాలు చేశాడు. 19 విన్నర్స్ కొట్టిన నగాల్ తన సరీ్వస్‌ను ఏడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లో ఓడిన నగాల్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 69 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హైదరాబాద్ తూఫాన్స్ విజయం రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. వేదాంత కళింగ లాన్సర్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 5–1 గోల్స్ తేడాతో గెలిచింది. తూఫాన్స్ తరఫున గొంజాలో పిలాట్ (6వ, 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మైకో కసెల్లా (21వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (47వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కళింగ లాన్సర్స్ జట్టుకు అలెగ్జాండర్ హెండ్రిక్స్ (5వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 10 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్‌తో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టు ఆడుతుంది. ఒడిశా వారియర్స్ బోణీ రాంచీలో ఆదివారం మొదలైన తొలి మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఒడిశా వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. ఒడిశా వారియర్స్ 4–0 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఒడిశా వారియర్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ (16వ, 37వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... బల్జీత్ కౌర్ (42వ నిమిషంలో), ఫ్రీక్ మోయిస్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌తో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ తలపడుతుంది. -
గ్రాండ్‌స్లామ్ ఓపెనింగ్ ఎవరిదో
కొత్త తరం చాంపియన్లు కార్లోస్ అల్కరాజ్, యానిక్ సినెర్ ఒక వైపు... ఆల్‌టైమ్ గ్రేట్, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఇలా హేమాహేమీలంతా ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్‌తో ఈ సీజన్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని పట్టుదలతో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో గత రెండేళ్లుగా విజేతగా నిలుస్తున్న డిఫెండింగ్ చాంపియన్ అరినా సబలెంక ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేయగా, స్వియాటెక్, కోకో గాఫ్‌లు కూడా ఈ సీజన్‌కు విజయంతో శుభారంభం పలకాలని చూస్తున్నారు. మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్ కోసం రంగం సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) గత సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ విజయంతో జోరుమీదున్నాడు. 23 ఏళ్ల ఇటలీ సంచలనం డోపింగ్ మరక దరిమిలా ఎదురవుతున్న విమర్శలను టైటిల్ నిలబెట్టుకొని అధిగమించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు నాదల్ శకం తర్వాత స్పెయిన్ జైత్రయాత్రకు కొత్త చిరునామాగా అల్కరాజ్ ఎదిగాడు. 21 ఏళ్ల వయసులోనే ఇప్పటికే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను సాధించేశాడు. 2022లో యూఎస్ ఓపెన్, 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్, గతేడాది వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లను గెలుచుకున్నాడు. అయితే నాలుగు గ్రాండ్స్లామ్లనైతే గెలిచాడు.... కానీ ఆ్రస్టేలియన్ ఓపెన్ వెలితి మాత్రం అలాగే వుంది. ఇక్కడ గత సీజన్లో క్వార్టర్ఫైనల్లో నిష్క్రమించిన ఈ స్పెయిన్ స్టార్ బహుశా ఈ ఏడాది ఆ ముచ్చట తీర్చుకుంటాడేమో చూడాలి. మరో వైపు ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరైన 37 ఏళ్ల సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టిపెట్టాడు. వీరితో పాటు 27 ఏళ్ల జర్మనీ స్టార్, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) గత సెమీఫైనల్ అంచెను దాటాలనే పట్టుదలతో ఉన్నాడు. జొకో గెలిస్తే రజతోత్సవమే! గతేడాది సెర్బియన్ సూపర్ స్టార్ జొకోవిచ్ సెమీఫైనల్స్‌తో సరిపెట్టుకున్నాడు. అంతమాత్రాన 37 ఏళ్ల వెటరన్ ప్లేయర్లో సత్తా తగ్గిందంటే పొరబడినట్లే. తనకు బాగా అచ్చొచ్చిన ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పది టైటిళ్లు గెలిచిన నొవాక్ 11వ సారి విజేతగా నిలిస్తే గ్రాండ్‌స్లామ్‌ల రజతోత్సవాన్ని (25వ) మెల్బోర్న్లో జరుపుకుంటాడు. ఏడో సీడ్‌గా ఆసీస్ ఓపెన్ మొదలుపెట్టబోతున్న నొవాక్‌కు ఇక్కడ ఘనమైన రికార్డు ఉంది. 2011–13 హ్యాట్రిక్, 2019–21 హ్యాట్రిక్‌లు సహా 2008, 2015, 2016, 2023లలో విజేతగా నిలిచిన విశేషానుభవం సెర్బియన్ సొంతం. రష్యా స్టార్, ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ ఫైనల్‌కు వచి్చన మూడుసార్లు టైటిల్ వేటలో చతికిలబడ్డాడు. రష్యన్ స్టార్ 2021, 2022లతో పాటు గత సీజన్లో సినెర్ చేతిలో అమీతుమీలో మూడో ‘సారీ’ టైటిల్‌ను కోల్పోయాడు. ఇప్పుడు ఫామ్‌లో ఉన్న సినెర్, అల్కరాజ్లను అధిగమించి విజేతగా నిలువడం అంత సులువైతే కాదు. ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 9వ సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా)లు సంచలన స్టార్లకు షాక్లిచ్చేందుకు సిద్ధమయ్యారు. తొలిరౌండ్లలో షెవ్చెంకో (కజకిస్తాన్)తో అల్కరాజ్, ఫ్రాన్స్ వైల్డ్‌కార్డ్ ప్లేయర్ లుకాస్ పౌలీతో జ్వెరెవ్, నికోలస్ జెర్రీ (చిలీ)తో టాప్‌సీడ్ సినెర్ ఆసీస్ ఓపెన్‌ను ప్రారంభిస్తాడు. హ్యాట్రిక్ వేటలో సబలెంక మహిళల సింగిల్స్‌లో బెలారస్ స్టార్ ప్లేయర్ అరియానా సబలెంక ‘హ్యాట్రిక్’ కలను సాకారం చేసుకునే పనిలోవుంది. 26 ఏళ్ల ఈ టాప్‌సీడ్ గత రెండేళ్లుగా (2023, 2024లలో) టైటిళ్లను నిలబెట్టుకుంటోంది. ఈ సీజన్లో ఆమె... స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)తో తొలిరౌండ్ సమరానికి సిద్ధమైంది. మిగతా మేటి ప్లేయర్లలో 20 ఏళ్ల అమెరికన్ మూడో సీడ్ కోకో గాఫ్ సహచర ప్లేయర్ సోఫియా కెనిన్‌తో తలపడుతుంది. 2024 సీజన్లో ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో వరుసగా సెమీఫైనల్స్ చేరిన గాఫ్ ఈ సారి సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉంది. పోలండ్ సూపర్‌స్టార్ 23 ఏళ్ల ఇగా స్వియాటెక్... చెక్ రిపబ్లిక్కు చెందిన కెటెరినా సినియకొవాతో ఆసీస్ ఓపెన్‌ను ఆరంభించనుంది. ఫ్రెంచ్ ఓపెన్ (2022, 2023, 2024) హ్యాట్రిక్ విజేతకు ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రం కలిసిరావడం లేదు. ఇక్కడ కనీసం ఆమె క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేకపోవడం గమనార్హం. మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. గతేడాది అయితే మూడో రౌండ్నే దాటలేకపోయింది. ఇప్పుడు రెండో సీడ్‌గా ఆరంభ గ్రాండ్‌స్లామ్ పరీక్షకు సిద్ధమైంది. -
రిటైర్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న జకోవిచ్
టెన్నిస్ చరిత్రలో 'ఆల్ టైమ్ గ్రేట్' ఎవరు..? టెన్నిస్ అభిమానులు గంటల తరబడి ఈ ప్రశ్న గురించి చర్చించుకుంటారు. ఇంతకీ పురుషుల టెన్నిస్‌లో "GOAT" ఎవరు..? ఈ ప్రశ్నపై జరిగే చర్చలో జాన్ మెకెన్రో, జాన్ బోర్గ్, పీట్ సాంప్రస్, జిమ్మీ కానర్స్ వంటి దిగ్గజాల పేర్లు కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఇటీవల కాలంలో గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్లను శాసించిన నోవాక్ జకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ల పేర్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి.ముగ్గురిలో ఒక్కడే మిగిలాడు సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఈ జాబితా లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2023 యుఎస్ ఓపెన్ విజయం తరువాత జకోవిచ్ మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల తో ఎవ్వరికీ అందనంత ఎత్తు కి చేరుకున్నాడు. జకోవిచ్ తన 24 స్లామ్లలో 10 ఆస్ట్రేలియా ఓపెన్ లో సాధించి, మెల్బోర్న్ హార్డ్ కోర్టులపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.ఆల్ టైమ్ "క్లే కింగ్" గా పేరుపొందిన నాదల్ తన 22 గ్రాండ్ స్లాం టైటిళ్ల లో 14 ఫ్రెంచ్ ఓపెన్ లో చేజిక్కించుకోగా.. ఫెదరర్ సాధించిన 20 గ్రాండ్ స్లాం విజయాలలో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు కావడం విశేషం.ఈ ముగ్గురి లో ప్రస్తుతం జకోవిచ్ మాత్రమే టెన్నిస్ బరిలో మిగిలాడు. ఫెదరర్ 2022 సెప్టెంబర్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయాల బారిన పడిన స్పానిష్ ఆటగాడు నాదల్ సైతం గత నవంబర్ లో ఆటకి స్వస్తి చెప్పాడు.గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం ఒక్కటేజకోవిచ్ విషయానికి వస్తే, గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో జకో తన మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాడు. అయితే జకోవిచ్ గతేడాది ఒలింపిక్ స్వర్ణం మినహా మరే గ్రాండ్ స్లాం టైటిల్ గెలవలేక పోయాడు. వచ్చే ఆదివారం ప్రారంభమయ్యే 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకో తన ప్రారంభ రౌండ్లోభారత సంతతి కి చెందిన వైల్డ్‌కార్డ్ ఆటగాడు నిశేష్ బసవరెడ్డితో తలపడనున్నాడు.జకోవిచ్ ఇప్పటికీ తన అద్భుతమైన ప్రదర్శనతో టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తున్నప్పటికీ అతని చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ లతో అతని దృక్పధం లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా జకోవిచ్ తండ్రి అతని రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి తెస్తున్నాడు. "గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు.శరీరం పై టెన్నిస్ ప్రభావం సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది జకో శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఈ నేపధ్యం లో తన రిటైర్మెంట్ గురుంచి జకోవిచ్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇందుకు ఖచ్చితమైన సమయం ఎప్పుడు, ఎక్కడా అన్న విషయం పై దృష్టి పెట్టాడు. తన కెరీర్‌ను ఎలా ముగించాలనుకుంటున్నాడనే దానిపై ప్రస్తుతం ఎక్కువ దృష్టి పెట్టాడు. "నేను నా టెన్నిస్ కెరీర్ ని ఎలా ముగించాలి, ఎక్కడ ముగించాలి అన్న విషయం పై వ్యూహం సిద్ధం చేయాలి అని భావిస్తున్నాను. అయితే ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పలేను. ప్రస్తుతం టెన్నిస్ లో అగ్ర స్థాయి ఆటగాళ్ల పై విజయం సాధిస్తున్నందున ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పడం లేదు" అని నర్మగర్భంగా తన ఆలోచనని బయటపెట్టాడు.జకోవిచ్ రిటైర్మెంట్ నిర్ణయం.. ఆతను గ్రాండ్ స్లాం పోటీల్లో తలబడే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. గ్రాండ్ స్లాం టోర్నమెంట్ల విషయానికి వస్తే గతేడాది జకోవిచ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. అడపాదప కొన్ని టైటిళ్లు గెలిచినా, గ్రాండ్ స్లాం టైటిల్ సాధిస్తేనే జకోవిచ్ తన క్రీడా జీవితాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశముంది. లేనిపక్షంలో జకోవిచ్ ఎక్కువ కాలం టెన్నిస్ లో కొనసాగడం కష్టమే.తన కెరీర్‌ను పొడిగించుకోవడానికి, జొకోవిచ్ ఇప్పటికే తన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకున్నాడు. తక్కువ టోర్నమెంట్లు ఆడుతున్నాడు మరియు గ్రాండ్ స్లాం వంటి మేజర్లపై దృష్టి పెట్టాడు. చాలా మంది తాను ఉన్నత స్థాయిలో రిటైర్ కావాలని నమ్ముతున్నప్పటికీ, జకోవిచ్ శారీరకంగా మరియు మానసికంగా సమర్థుడిగా ఉన్నంత వరకు టెన్నిస్ లో కొనసాగాలని నిశ్చయించుకున్నాడు. "గ్రాండ్ స్లామ్లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించగల సత్తా నాలో ఇప్పటికీ ఉందని భావిస్తే, నేను నా టెన్నిస్ జీవితానికి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటాను" అని జకోవిచ్ వ్యాఖ్యానించాడు. -
‘ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతోంది’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. అయితే ఆ సమయంలో అమల్లో ఉన్న కోవిడ్ ఆంక్షల కారణంగా వ్యాక్సిన్ వేసుకున్న వారినే దేశంలోకి అనుమతించారు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్‌ను విమానాశ్రయంలోనే నిలిపి వేశారు. ఆ తర్వాత అతను కోర్టును ఆశ్రయించడం, ఇతర పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. చివరకు టోర్నీలో ఆడకుండానే జొకోవిచ్‌ను ఆ్రస్టేలియా దేశం నుంచి అధికారులు పంపించి వేశారు. నాటి ఘటన తనను ఇప్పటికీ వెంటాడుతోందని, ఆస్ట్రేలియాకు ఎప్పుడు వచ్చినా దానిని మర్చిపోలేకపోతున్నానని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు అతను ఇప్పుడు మళ్లీ వచ్చాడు. ‘నాటి ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా ఎప్పుడు ఆ్రస్టేలియాకు వచ్చినా అదే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ విభాగం నుంచి వద్ద తనిఖీలు జరుగుతుంటే నావైపు ఎవరైనా వస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. పాస్‌పోర్ట్‌ను చెకింగ్ చేస్తుంటే కూడా నన్ను రానిస్తారా, అదుపులోకి తీసుకుంటారా, వెనక్కి పంపిస్తారా అనే సందేహాలు వస్తుంటాయి’ అని జొకోవిచ్ అన్నాడు. అయితే నిజాయితీగా చెప్పాలంటే నాటి సంఘటనకు సంబంధించి తనకు ఎవరీ మీదా కోపంగానీ, ప్రతీకార భావనగానీ లేదని అతను స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 10 సార్లు విజేతగా నిలిచిన జొకోవిచ్... గత ఏడాది సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. అయితే రిటైరయ్యే లోగా ఇక్కడ కనీసం మరో టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. బ్రిటన్ మాజీ ఆటగాడు ఆండీ ముర్రేను కోచ్‌గా ఎంచుకున్న తర్వాత జొకోవిచ్ ఆడనున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే కానుంది. ఈనెల 12న ప్రారంభమయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ కోసం జొకోవిచ్ మంగళవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. -
క్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–11, 21–11తో కాయ్ చెన్ తియో–కాయ్ కి తియో (ఆ్రస్టేలియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)తో సిక్కి–సుమీత్ జంట తలపడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ ప్రణయ్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సమీర్ 21–14, 14–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)ను బోల్తా కొట్టించగా... ప్రణయ్ 21–17, 21–15తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. కిరణ్ జార్జి 20–22, 6–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక, అనుపమ నిష్క్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆకర్షి 21–16, 21–13తో కాయ్ కి తియో (ఆస్ట్రేలియా)పై గెలిచింది. మాళవిక 17–21, 21–23తో ఎస్తెర్ నురిమి (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 18–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
సిక్కి–సుమీత్ జోడీ శుభారంభం
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–17, 21–19తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ–కోన తరుణ్ (భారత్) జంట 6–21, 11–21తో హూ పాంగ్ రోన్–చెంగ్ సు యెన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ప్రణయ్, సమీర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–10, 23–21తో యోగర్ కోల్హో (బ్రెజిల్)పై, సమీర్ వర్మ 21–10, 21–10తో రికీ టాంగ్ (ఆస్ట్రేలియా)పై, కిరణ్ 21–17, 21–10తో జియోడాంగ్ షాంగ్ (కెనడా)పై గెలిచారు.ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మిథున్ మంజునాథ్ (భారత్) 17–21, 17–21తో అల్వి ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో, శంకర్ ముత్తుస్వామి (భారత్) 16–21, 21–18, 10–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, అభిషేక్ (భారత్) 9–21, 15–21తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయారు. పోరాడి ఓడిన సామియా మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, అనుపమ ఉపాధ్యాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. హైదరాబాద్ అమ్మాయి సామియా ఫారూఖీ తొలి రౌండ్లో 23–21, 13–21, 22–24తో టాప్ సీడ్ పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 21–14, 21–11తో పొలీనా బురోవా (ఉక్రెయిన్)పై, మాళవిక 21–10, 21–8తో మోపాటి కెయురపై, అనుపమ 21–14, 23–21తో వోంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై గెలిచారు. -
సబలెంకా బోణీ
పారిస్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–2తో ఇరీకా ఆంద్రీవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.27 విన్నర్స్ కొట్టిన సబలెంకా నెట్ వద్ద 11 పాయింట్లు సాధించింది. ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న ఈ బెలారస్ స్టార్ గత ఏడాది తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ మరియా సాకరి (గ్రీస్) వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. సాకరి 6–3, 4–6, 3–6తో వర్వరా గ్రెచెవా (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), పదో సీడ్ దరియా కసత్కినా (రష్యా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రిబాకినా 6–2, 6–3తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై, కిన్వెన్ జెంగ్ 6–2, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్)పై, కసత్కినా 7–5, 6–1తో మగ్ధలీనా ఫ్రెచ్ (పోలాండ్)పై గెలుపొందారు. రూడ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2022, 2023 రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రూడ్ 6–3, 6–4, 6–3తో అల్వెస్ మెలెగిని (బ్రెజిల్)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 23 విన్నర్స్ కొట్టిన రూడ్ నెట్ వద్ద 10 పాయింట్లు సాధించాడు. వర్షం అంతరాయం కారణంగా మంగళవారం జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లను వాయిదా వేశారు. ఇందులో భారత డబుల్స్ ప్లేయర్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ తొలి రౌండ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కార్నె వీడ్కోలు... ఈ టోర్నీతో ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ అలీజా కార్నె కెరీర్‌కు వీడ్కోలు పలికింది. కిన్వెన్ జెంగ్ చేతిలో మ్యాచ్ ముగిశాక ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు కార్నెను సన్మానించి చేసి వీడ్కోలు ట్రోఫీని అందజేశారు. 34 ఏళ్ల కార్నె అత్యధిక వరుస గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. కార్నె 2007 ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తాజా ఫ్రెంచ్ ఓపెన్ వరకు వరుసగా 69 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2014 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో నాటి ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించిన కార్నె 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2009లో కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్‌ను అందుకున్న కార్నె తాజా ర్యాంకింగ్స్‌లో 106వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్‌పరంగా కార్నెకు నేరుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా జనిక్ సినర్..
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సరికొత్త ఛాంపియన్‌గా ఇటలీ యువ సంచలనం జనిక్ సినర్ అవతరించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ -2024 పురుషల సింగిల్ విజేతగా జనిక్ సినర్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్పై 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో సంచలన విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో ఓడిపోయిన సినర్.. తిరిగి పుంజుకుని వరుసగా మూడు సెట్లలో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. 22 ఏళ్ల యానిక్ సినెర్‌కు మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ను సినెర్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విజయంతో గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆటగాడిగా సినర్ రికార్డులకెక్కాడు. సినర్ కంటే ముందు రోలాండ్ గారోస్, నికోలా పిట్రాంజెలీ టైటిల్‌లను గెలుచుకున్నారు. -
క్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి పరాజయం
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి 14–21, 6–21తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని కెపె్టన్సీలోని భారత జట్టు 6–3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్లో భారత్ తరఫున అక్షత, మరియానా, ముంతాజ్, రుతుజా, జ్యోతి అజ్మీనా ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. Australian Open 2024- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్.. ఫైనల్లోమెద్వెదెవ్తో తలపడనున్నాడు. జొకోవిచ్‌ను ఓడించిన సినెర్.. జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి మెద్వెదేవ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. -
జొకోవిచ్‌కు సినెర్ షాక్
మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, 10 సార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్ ధాటికి జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో సినెర్ 3 గంటల 22 నిమిషాల్లో 6–1, 6–2, 6–7 (6/8), 6–4తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జొకోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడిన సినెర్ తొమ్మిది ఏస్‌లు సంధించి, 31 విన్నర్స్ కొట్టాడు. జొకోవిచ్ సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్విస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశమే ఇవ్వలేదు. మరోవైపు జొకోవిచ్ 54 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)తో సినెర్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మెద్వెదెవ్ 4 గంటల 18 నిమిషాల్లో 5–7, 3–6, 7–6 (7/4), 7–6 (7/5), 6–3తో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై అద్భుత విజయం సాధించి ఈ టోరీ్నలో మూడోసారి, ఓవరాల్‌గా ఆరోసారి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్‌కు చేరుకున్నాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. టోర్నీ నుంచి జకోవిచ్ అవుట్
ఆస్ట్రేలియన్ ఓపెన్-2024లో సెర్బియా టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇటలీకి చెందిన యువ ప్లేయర్ జనిక్ సినర్ చేతిలో జకో ఓటమి పాలయ్యాడు. తద్వారా జకోవిచ్ 33 మ్యాచ్ ల విజయప్రస్థానానికి సినర్ బ్రేక్‌లు వేశాడు . తొలి రెండు సెట్లను 1-6, 2-6 తేడాతో సిన్నర్‌కు కోల్పోయిన జకోవిచ్.. మూడో సెట్లో అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి 7-6తో విజయం సాధించాడు. అయితే నిర్ణయాత్మక నాలుగో సెట్లో మాత్రం సినర్ 6-3తో జకోవిచ్‌ను చిత్తు చేశాడు. దీంతో జకోవిచ్ ఇంటిముఖం పట్టగా.. సినర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో 22 ఏళ్ల సిన్నర్... మెద్వెదెవ్/జ్వెరెవ్ లలో ఒకరిని సినర్ ఎదుర్కొంటాడు. శుక్రవారం రెండో సెమీఫైనల్లో డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు. చదవండి: AUS vs WI: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్ -
ఎదురులేని జొకోవిచ్
మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) తన జోరు కొనసాగిస్తూ 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 7–6 (7/3), 4–6, 6–2, 6–3తో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 20 ఏస్‌లతో హడలెత్తించాడు. 52 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 13సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 36 ఏళ్ల జొకోవిచ్ ఈ టోర్నీలో గతంలో సెమీఫైనల్ చేరిన 10 సార్లూ విజేతగా తిరిగి రావడం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–4, 7–6 (7/5), 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీఫైనల్లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో సినెర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో సినెర్ ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సూపర్ సబలెంకా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై, కోకో గాఫ్ 7–6 (8/6), 6–7 (3/7), 6–2తో మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించారు. క్రిచికోవాతో 71 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సబలెంకా నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
అల్కరాజ్ అలవోకగా...
మెల్బోర్న్: గత ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు దూరంగా ఉన్న ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ ఈ ఏడాది మాత్రం జోరు మీదున్నాడు. మరో అలవోక విజయంతో ఈ స్పెయిన్ స్టార్ తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల అల్కరాజ్ 6–4, 6–4, 6–0తో మియోమిర్ కెచ్‌మనోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఐదు ఏస్‌లు సంధించాడు. 43 విన్నర్స్ కొట్టిన ఈ మాజీ నంబర్‌వన్ 19 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్‌లో మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్ తలపడతాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 4 గంటల 5 నిమిషాల్లో 7–5, 3–6, 6–3, 4–6, 7–6 (10/3)తో 19వ సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)ను ఓడించి ఊపిరి పీల్చుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 7–6 (7/4), 5–7, 6–1తో నునో బోర్జెస్ (పోర్చుగల్)పై, తొమ్మిదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 7–6 (8/6), 7–6 (7/3), 6–4తో ఆర్థర్ కాజుక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. డయానా సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 93వ ర్యాంకర్, క్వాలిఫయర్ డయానా యాస్ట్రెమ్స్కా సంచలన విజయంతో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. కెరీర్లో 16వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఈ ఉక్రెయిన్ క్రీడాకారిణి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–4తో రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 18వ సీడ్ అజరెంకా (బెలారస్)ను బోల్తా కొట్టించింది. లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్), అనా కలిన్స్కాయ (రష్యా) కూడా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... చైనా అమ్మాయి, 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. నొస్కోవా 3–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి స్వితోలినా (ఉక్రెయిన్) గాయంతో వైదొలిగింది. కిన్వెన్ జెంగ్ 6–0, 6–3తో ఒసీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, కలిన్స్కాయ 6–4, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై విజయం సాధించారు. -
జొకోవిచ్ జోరుగా...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సిన్నెర్ (ఇటలీ), మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక (బెలారస్), నాలుగో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) క్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ అతి సులువైన విజయంతో ముందంజ వేశాడు. పది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అయిన జొకో 6–0, 6–0, 6–3తో అడ్రియన్ మనారినొ (ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. ఏకంగా 17 ఏస్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన సెర్బియన్ దిగ్గజం 31 విన్నర్లతో అలవోకగా మ్యాచ్‌ని చేతుల్లోకి తెచ్చుకున్నాడు. తొలి రెండు సెట్లలో అయితే ఫ్రాన్స్ ఆటగాడిని ఖాతా తెరువకుండా చేశాడు. ప్రత్యర్థి సర్వి స్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. కేవలం గంటా 44 నిమిషాల్లోనే వరుస సెట్లలో ప్రత్యర్థి ఆట కట్టించాడు. తాజా ఫలితంతో గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో 58 సార్లు క్వార్టర్స్ ఫైనల్ చేరిన ఆటగాడిగా స్విట్టర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన సెర్బియన్ సూపర్‌స్టార్ నిలిచాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లోనే 14 సార్లు క్వార్టర్స్ చేరిన జొకోవిచ్ 10 సార్లు ముందంజ వేసి టైటిల్ గెలువగలిగాడు. సిట్సిపాస్ అవుట్ నిరుటి రన్నరప్, ఏడో సీడ్ స్టెఫనొస్ సిట్సిపాస్ (గ్రీస్)కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గత మూడేళ్లలో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అతనికి ఇదే నిరాశాజనక ప్రదర్శన. ఆదివారం జరిగిన పోరులో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ 6–7 (3/7), 7–5, 3–6, 3–6తో అమెరికాకు చెందిన 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ చేతిలో కంగుతిన్నాడు. ఈ విజయంతో అమెరికా ఆటగాడు తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్‌లో నాలుగో రౌండ్ అడ్డంకిని దాటి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు స్థానిక ప్లేయర్ నుంచి అసాధారణ పోటీ ఎదురైంది. సుదీర్ఘంగా 4 గంటల 14 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో రుబ్లెవ్ 6–4, 6–7 (5/7), 6–7 (4/7), 6–3, 6–0తో పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా)పై చెమటోడ్చి నెగ్గాడు. దీంతో స్థానిక ఆటగాడు వరుసగా మూడో ఏడాదీ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టాడు. నాలుగో సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 7–5, 6–3తో గత సీజన్ సెమీఫైనలిస్ట్, 15వ సీడ్ కరెన్ కచనొవ్ (రష్యా)కు షాకిచ్చాడు. కొకొ గాఫ్ తొలిసారి... మహిళల సింగిల్స్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్, నాలుగో సీడ్ అమెరికన్ స్టార్ కొకొ గాఫ్ తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. నాలుగేళ్లుగా బరిలోకి దిగుతున్న ఆమెకు రెండు సార్లు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. కానీ ఈ సారి ఆమె 6–1, 6–2తో మగ్దలెన ఫ్రెచ్ (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. కేవలం గంట 3 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. రెండో సీడ్ అరిన సబలెంక (బెలారస్) 6–3, 6–2తో అమండ అనిసిమొవ (అమెరికా)పై గెలుపొందగా, 9వ సీడ్ క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 4–6, 6–3, 6–2తో మిర అండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది. -
స్వియాటెక్‌కు షాక్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 19 ఏళ్ల లిండా నొస్కోవా తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శన చేసి నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 50వ ర్యాంకర్ నొస్కోవా 3–6, 6–3, 6–4తో స్వియాటెక్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మాజీ చాంపియన్ అజరెంకా (బెలారస్), 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. -
సబలెంకా జోరు
మెల్బోర్న్: టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంకా విశ్వరూపం ప్రదర్శించింది. ప్రపంచ 33వ ర్యాంకర్, 28వ సీడ్ లెసియా సురెంకో (ఉక్రెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 6–0, 6–0తో ఘనవిజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేవలం 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తన ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని సబలెంకా 16 విన్నర్స్ కొట్టి ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేయడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సినెర్ (ఇటలీ), ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–2, 6–4తో జాన్ మిల్మన్–ఎడ్వర్డ్ వింటర్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–విక్టర్ కార్నియా (రొమేనియా) జంట 6–3, 6–4తో అర్నాల్డీ–పెలెగ్రినో (ఇటలీ) జోడీపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది. -
Australian Open: పోరాడి ఓడిన సుమిత్ నగాల్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సుమిత్ నగాల్‌కు ఓవరాల్‌గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్‌వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్‌సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది. -
Australian Open 2024: భళా బ్లింకోవా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఐదో రోజు గురువారం టాప్–10లోని ఇద్దరు క్రీడాకారిణులు రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. గత ఏడాది రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)... ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రస్తుతం టాప్–10లో నలుగురు క్రీడాకారిణులు టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) మాత్రమే బరిలో నిలిచారు. 42 పాయింట్ల టైబ్రేక్... రష్యాకు చెందిన 25 ఏళ్ల అనా బ్లింకోవా 2 గంటల 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 6–4, 4–6, 7–6 (22/20)తో రిబాకినాపై గెలుపొందగా... క్లారా బురెల్ (ఫ్రాన్స్) 70 నిమిషాల్లో 6–4, 6–2తో పెగూలాను ఓడించి తమ కెరీర్లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. బ్లింకోవా–రిబాకినా మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. నిర్ణాయక మూడో సెట్లో జరిగిన టైబ్రేక్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్గా నిలిచింది. 31 నిమిషాలపాటు సాగిన 42 పాయింట్ల టైబ్రేక్‌లో చివరకు బ్లింకోవా 22–20తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మూడో సెట్ ఏకంగా 93 నిమిషాలు సాగింది. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో లెసియా సురెంకో (ఉక్రెయిన్)–అనా బొగ్డాన్ (రొమేనియా) మధ్య మూడో రౌండ్ మ్యాచ్‌లోని మూడో సెట్లో టైబ్రేక్ 38 పాయింట్లపాటు జరిగింది. చివరకు సురెంకో ఈ టైబ్రేక్‌ను 20–18 పాయింట్లతో గెల్చుకుంది. రిబాకినాతో జరిగిన మ్యాచ్‌లో బ్లింకోవా ఏకంగా ఆరుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మరోవైపు రిబాకినా తొమ్మిదిసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా పదోసారి పరాజయం తప్పలేదు. శ్రమించి నెగ్గిన స్వియాటెక్ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్ చేరడానికి 3 గంటల 14 నిమిషాలు శ్రమించింది. ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్వియాటెక్ రెండో రౌండ్లో 6–4, 3–6, 6–4తో 2022 రన్నరప్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో 14వ సీడ్ కసత్కినా 6–4, 3–6, 3–6తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్) 4–6, 6–4, 4–6తో యాఫాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–0, 3–6, 6–4తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆ్రస్టేలియా)పై, 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 6–3, 6–3తో కేటీ బుల్టర్ (బ్రిటన్)పై, 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో తొమోవా (బల్గేరియా)పై గెలిచారు. హోల్గర్ రూనెకు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) రెండో రౌండ్లో ని్రష్కమించాడు. ఆర్థర్ కజాక్స్ (ఫ్రాన్స్) 7–6 (7/4), 6–4, 4–6, 6–3తో రూనెపై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 6–3, 7–6 (7/3)తో సొనెగో (ఇటలీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 3–6, 4–6, 7–6 (7/5), 7–6 (10/7)తో లుకాస్ క్లీన్ (స్లొవేకియా)పై, 11వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 6–7 (5/7), 6–3, 3–6, 7–6 (10/7)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై కష్టపడి గెలిచారు. పోరాడి ఓడిన సుమిత్ నగాల్ భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సుమిత్ నగాల్‌కు ఓవరాల్‌గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్‌వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్‌సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాలు.. టాప్ సీడ్లకు షాకిచ్చిన అనామకులు
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాలు నమోదయ్యాయి. రష్యాకు చెందిన 16 ఏళ్ల మిరా అండ్రీవా అద్భుత ఆటతో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా)ను ఇంటిదారి పట్టించగా... ఎలీనా అవెనెస్యాన్ (రష్యా) ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్)ను బోల్తా కొట్టించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లో అండ్రీవా 6–0, 6–2తో ఆన్స్ జెబర్పై, ఎలీనా 6–4, 6–4తో సాకరిపై గెలిచి మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–2తో ఫ్రువిర్తోవా (చెక్ రిపబ్లిక్)పై, నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 7–6 (7/2), 6–2తో డొలెహిడె (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో తమారా (జర్మనీ)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/4), 6–3తో అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
అప్పుడు బ్యాంక్ ఖాతాలో కేవలం 80 వేలు.. ఇప్పుడు కోటి దాకా ప్రైజ్‌మనీ!
Australian Open 2024- మెల్బోర్న్: ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడితే అద్భుతం చేయవచ్చని భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ నిరూపించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 26 ఏళ్ల సుమిత్ చిరస్మరణీయ విజయంతో శుభారంభం చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 137వ స్థానంలో ఉన్న సుమిత్ వరుస సెట్లలో 6–4, 6–2, 7–6 (7/5)తో ప్రపంచ 27వ ర్యాంకర్, 31వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై సంచలన విజయం సాధించి ఈ టోర్నీలో తొలిసారి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అంతేకాకుండా 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌పై గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. 1989 ఆ్రస్టేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో టాప్ సీడ్ మాట్స్ విలాండర్ (స్వీడన్)పై రమేశ్ కృష్ణన్ గెలుపొందాడు. బుబ్లిక్‌తో 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సుమిత్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక ఏస్ కొట్టిన సుమిత్ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 29 విన్నర్స్ షాట్లతో రాణించిన సుమిత్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు దక్కించుకున్నాడు. మరోవైపు 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న బుబ్లిక్ 13 ఏస్‌లతో విరుచుకుపడ్డా... 9 డబుల్ ఫాల్ట్‌లు, 44 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఏఐటీఏ సహకరించకపోయినా... ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో జరగాల్సిన డేవిస్ కప్ మ్యాచ్‌లో తాను ఆడలేనని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులకు గత నెలలో సుమిత్ నగాల్ సమాచారం ఇచ్చాడు. దాంతో సుమిత్‌పై ఏఐటీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆసియా కోటా నుంచి భారత్‌కు అందుబాటులో ఉన్న ‘వైల్డ్ కార్డు’ కోసం సుమిత్ పేరును పంపించకూడదని ఏఐటీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుమిత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం క్వాలిఫయింగ్ టోర్నీలో బరిలోకి దిగాడు. ఏఐటీఏ తనకు సహకరించకపోయినా సుమిత్ నిరాశపడకుండా తన శక్తినంతా ధారపోసి, ఏకాగ్రతతో, పట్టుదలతో ఆడి క్వాలిఫయింగ్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందాడు. క్వాలిఫయర్ హోదాలో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. 2021లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సుమిత్ ఈసారి మాత్రం గొప్ప విజయంతో రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అంతకుముందు 2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ చేతిలో ఓడిపోయిన సుమిత్ 2020 యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 900 యూరోలతో... గత ఏడాది ఆరంభంలో సుమిత్ బ్యాంక్ ఖాతాలో కేవలం 900 యూరోలు (రూ. 80 వేలు) ఉన్నాయి. దాంతో తొలి మూడు నెలలపాటు తాను జర్మనీలో రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే అకాడమీకి వెళ్లలేకపోయాడు. ఈ దశలో అతని మిత్రులు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, క్రిస్టోఫర్ మార్కస్, మహా టెన్నిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడ్డారు. గతంలో తాను గెల్చుకున్న ప్రైజ్‌మనీ, తన ఉద్యోగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా లభించే వేతనాన్ని ఏటీపీ సర్క్యూట్లో చాలెంజర్ టోర్నీలు ఆడేందుకు సుమిత్ వెచ్చించాడు. తాను పాల్గొన్న 24 టోర్నీలలో నిలకడగా రాణించి సుమిత్ రూ. 65 లక్షల వరకు ప్రైజ్‌మనీ సంపాదించాడు. కొత్త ఏడాదిలో కాన్బెర్రా చాలెంజర్ టోర్నీలో సుమిత్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా ... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకోవడం ద్వారా సుమిత్‌కు కనీసం 1,85,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 1 కోటి) ప్రైజ్‌మనీగా రావడం ఖాయమైంది. యూకీ బాంబ్రీ జోడీ ఓటమి పురుషుల డబుల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ–హాస్ ద్వయం 6–1, 6–7 (8/10), 6–7 (7/10)తో నికోలస్ బారిన్టోస్ (కొలంబియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. అల్కరాజ్, స్వియాటెక్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అల్కరాజ్ 7–6 (7/5), 6–1, 6–2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై గెలుపొందగా... స్వియాటెక్ 7–6 (7/2), 6–2తో సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)... మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
Australian Open: సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన సుమిత్
Australian Open 2024- Sumit Nagal First Indian In 35 Years: ఆస్ట్రేలియా ఓపెన్-2024లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ సంచలన విజయం సాధించాడు. మెన్స్ సింగిల్స్‌లో 137వ ర్యాంకర్ అయిన ఈ హర్యానా కుర్రాడు.. వరల్డ్ నెంబర్ 27 అలెగ్జాండర్ బబ్లిక్‌పై గెలుపొంది చరిత్ర సృష్టించాడు. భారత టెన్నిస్ చరిత్రలో 35 ఏళ్ల తర్వాత.. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో ఆటగాడిగా సుమిత్ రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ తాజా ఎడిషన్‌లో భాగంగా తొలి రౌండ్లో.. సుమిత్ నాగల్.. కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ బబ్లిక్‌తో పోటీపడ్డాడు. ర్యాంకింగ్ పరంగా తనకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న అలెగ్జాండర్‌కు ఆది నుంచే గట్టి పోటీనిస్తూ చుక్కలు చూపించాడు సుమిత్. రెండో రౌండ్లో అడుగుపెట్టిన సుమిత్ మొత్తంగా రెండు గంటల 38 నిమిషాల పాటు పోరాడి ఆఖరికి 6-4, 6-2, 7-6తో విజయం సాధించాడు. అయితే, తొలి రెండు సెట్లలో తేలిగ్గానే తలవంచిన అలెగ్జాండర్ మూడో సెట్లో మాత్రం సుమిత్‌ను చెమటోడ్చేలా చేశాడు. ఈ క్రమంలో టై బ్రేకర్‌లో ఎట్టకేలకు పైచేయి సాధించిన సుమిత్.. ప్రత్యర్థిని ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ నాగల్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. 2021లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అతడు ఈసారి మాత్రం చారిత్రక విజయంతో మొదటి ఆటంకాన్ని అధిగమించాడు. రమేశ్ క్రిష్ణన్ తర్వాత అదే విధంగా.. రమేశ్ క్రిష్ణన్ తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్‌లో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన భారత రెండో ఆటగాడిగా సుమిత్ నాగల్ అరుదైన ఘనత సాధించాడు. కాగా 1989 నాటి ఆస్ట్రేలియా ఓపెన్‌లో రమేశ్ క్రిష్ణన్ ఆనాటి నంబర్ వన్ ప్లేయర్ మ్యాట్స్ విలాండర్ను ఓడించి సంచలనం సృష్టించాడు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ సుమిత్ ఆ ఫీట్‌ను నమోదు చేశాడు. పదేళ్ల వయసులోనే.. హర్యానాలో 1997, ఆగష్టు 16న జన్మించిన సుమిత్ నాగల్ 10వ ఏటనే టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు. మహేశ్ భూపతి మిషన్ 2018 ప్రోగ్రాంలో భాగమైన అతడు.. 2015లో తొలిసారి ప్రతిష్టాత్మక విజయం సాధించాడు. వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ టైటిల్ పోరులో తన వియత్నాం పార్ట్నర్ లీ హొంగ్ నామ్‌తో కలిసి విజేతగా నిలిచాడు. అయితే, 2019లో మొదటిసారి సుమిత్ నాగల్ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. Well played Sumit Nagal💐💐💐.Although Sumit Nagal lost, But surely it was an exciting match . Winning a set against @rogerfederer is nothing less than an achievement. #FederervsNagal #USOpen pic.twitter.com/XN3WVuHDiq — Mahesh Kanakaraj🇮🇳 (@maheshmech06) August 27, 2019 ఏకంగా ఫెడరర్తోనే నాటి యూఎస్ ఓపెన్ టోర్నీలో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్‌తో తొలి రౌండ్లో పోటీ పడ్డ సుమిత్.. తొలి సెట్‌ను 6-4తో గెలిచాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ ఫెడరర్‌కు పోటీనిచ్చిన యంగ్‌స్టర్‌గా తనదైన ముద్ర వేయగలిగాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. The first Indian man in 3️⃣5️⃣ years to beat a seed at a Grand Slam 🇮🇳@nagalsumit • #AusOpen • #AO2024 • @Kia_Worldwide • #Kia • #MakeYourMove pic.twitter.com/SY55Ip4JaG — #AusOpen (@AustralianOpen) January 16, 2024 -
Australian Open: శ్రమించిన జొకోవిచ్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఆదివారం మొదలైన ఈ టోరీ్నలో తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–4తో ప్రపంచ 178వ ర్యాంకర్, క్వాలిఫయర్ డినో ప్రిజ్మిక్ (క్రొయేíÙయా)పై కష్టపడి గెలిచాడు. 4 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 40 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 49 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ప్రత్యర్థి సరీ్వస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. సబలెంకా సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ సబలెంకా 6–0, 6–1తో 53 నిమిషాల్లో ఇలా సెడెల్ (జర్మనీ)పై గెలిచింది. ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
Viral Videos: జకోవిచ్ క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడితే...????
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. జకో.. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్‌లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్, జాక్సన్ వార్న్‌లు సైతం కాసేపు జకోతో టెన్నిస్ ఆడాడు. స్టీవ్ స్మిత్ ఆటకు (టెన్నిస్) జకో ఫిదా అయ్యాడు. Is it too late to add him to the test squad?! From the sounds of it the selectors are open to trying things out...@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/VAJq2KFShr — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Game respects game! (And Novak is just like the rest of us when it comes to Smudge...)@stevesmith49 • @DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/ioL8hjVSrF — #AusOpen (@AustralianOpen) January 11, 2024 మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో "ఎ నైట్ విత్ నొవాక్ అండ్ ఫ్రెండ్స్" పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్‌లో జకో.. స్టెఫనాస్ సిట్సిపాస్‌తో తలపడ్డాడు. మధ్యలో ఈ మ్యాచ్ కాసేపు మిక్సడ్ డబుల్స్‌గా కూడా మారింది. జకో.. మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్ మరియా సక్కారితో కలిసి ఆడాడు. A challenge?! This is like shelling peas for international gymnast Georgia Godwin, @DjokerNole!#AusOpen • #AO2024 pic.twitter.com/bXs24p8Lfj — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Nothing. But. Net. Like it wouldn't have been 😆@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/tzrLjgWTsB — #AusOpen (@AustralianOpen) January 11, 2024 ఈ సందర్భంగా జకో క్రికెట్‌తో పాటు పలు ఇతర క్రీడలను కూడా ఆడాడు. తొలుత పోల్ వాల్ట్ ఛాంపియన్ జార్జియా గాడ్విన్‌తో కలిసి ఫీట్లు చేసిన అతను.. ఆతర్వాత ఆస్ట్రేలియన్ వీల్ చైర్ టెన్నిస్ ఛాంపియన్ హీత్ డేవిడ్సన్తో కలిసి వీల్‌చైర్ టెన్నిస్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియన్ బాస్కెట్‌బాల్ స్టార్ అలన్ విలియమ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్, మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్, స్లామ్ డంక్ వంటి ఇతర క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. స్క్రీన్‌పై కనిపించినంత సేపు జకో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అలరించాడు. Move over, @KingJames!@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/bMmPknbXOD — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Race again in Paris? 😅@DjokerNole v @pbol800 #AusOpen • #AO2024 pic.twitter.com/jXgTyzhhbE — #AusOpen (@AustralianOpen) January 11, 2024 -
మరొకటి గెలిస్తే మెయిన్ ‘డ్రా’లోకి...
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. మెల్బోర్న్లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–3, 6–2తో ‘వైల్డ్ కార్డు’ ప్లేయర్ ఎడ్వర్డ్ వింటర్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు. 64 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 12 విన్నర్స్ కొట్టిన సుమిత్ 11 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌వద్దకు 14 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచాడు. 118వ ర్యాంకర్ మోల్కన్ (స్లొవేకియా)తో నేడు జరిగే ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో సుమిత్ నెగ్గితే రెండోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. సుమిత్ 2019, 2020 యూఎస్ ఓపెన్‌లో, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. -
అంకిత రైనా శుభారంభం
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ లో భారత స్టార్ అంకిత రైనా శుభారంభం చేసింది. మెల్బోర్న్లో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 221వ ర్యాంకర్ అంకిత 6–4, 5–7, 7–6 (10/7)తో ప్రపంచ 158వ ర్యాంకర్ జెస్సికా బుజస్ మనెరో (స్పెయిన్)పై గెలిచింది. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ తమ సర్విస్లను ఎనిమిదిసార్లు కోల్పోయారు. నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో అంకిత పైచేయి సాధించి విజేతగా నిలిచింది. రెండో రౌండ్లో ప్రపంచ 132వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్)తో అంకిత తలపడుతుంది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం
స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ ఈనెల 14 నుంచి 28 వరకు జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం నుంచి వైదొలిగాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల నాదల్ గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తుంటి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరమయ్యాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో నాదల్ పునరాగమనం చేశాడు. ఈ టోర్నీ లో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన నాదల్ ఈ మ్యాచ్ సందర్భంగా ఎడమ కాలి కండరాల గాయానికి గురయ్యాడు. -
ఆ్రస్టేలియన్ ఓపెన్ బరిలో వొజ్నియాకి
ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ టెన్నిస్ స్టార్ వొజ్నియాకికి వచ్చే ఏడాది జరిగే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం 242వ ర్యాంక్‌లో ఉన్న 33 ఏళ్ల వొజ్నియాకికికి నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. 2018లో ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన వొజ్నియాకికి 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. గత ఏడాది ఆగస్టులో పునరాగమనం చేసి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడింది. -
ప్రణయ్... రన్నరప్‌తో సరి
సిడ్నీ: ఈ ఏడాది రెండో టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో కేరళకు చెందిన ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. 90 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 9–21, 23–21, 20–22తో ప్రపంచ 24వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ ఏడాది మేలో మలేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించి టైటిల్ నెగ్గిన ప్రణయ్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. తొలి గేమ్‌ను చేజార్చుకున్న ప్రణయ్ రెండో గేమ్‌లో తేరుకున్నాడు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్‌లో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. చివరకు స్కోరు 21–21 వద్ద వెంగ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ స్మాష్ బయటకు వెళ్లింది. అనంతరం ప్రణయ్ నెట్ వద్ద పాయింట్ గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రణయ్ దూకుడుగా ఆడి 19–14తో ఐదు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించాడు. అయితే వెంగ్ హాంగ్ యాంగ్ అసమాన పోరాటంతో కోలుకున్నాడు. స్కోరు 19–17 వద్ద ఏకంగా 71 షాట్ల ర్యాలీ సాగింది. చివరకు ప్రణయ్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో పాయింట్ వెంగ్ ఖాతాలోకి వెళ్లింది. అనంతరం వెంగ్ డ్రాప్ షాట్‌తో పాయింట్ గెలిచి స్కోరును 19–19తో సమం చేశాడు. ఆ తర్వాత ప్రణయ్ పాయింట్ సాధించి విజయానికి ఒక పాయింట్ దూరంలో నిలిచాడు. కానీ పట్టువదలని వెంగ్ మళ్లీ స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత వెంగ్ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. విజేత వెంగ్ హాంగ్ యాంగ్‌కు 31,500 డాలర్ల (రూ. 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ప్రణయ్‌కు 15,960 డాలర్ల (రూ. 13 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో ప్రణయ్
సిడ్నీ: భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిలే లక్ష్యంగా ఫైనల్లోకి ప్రవేశించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత షట్లర్ల మధ్యే జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ వరుస గేముల్లో విజయం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో 31 ఏళ్ల ప్రణయ్ 21–18, 21–12తో సహచరుడు ప్రియాన్షు రజావత్‌పై అలవోక విజయం సాధించాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్... చైనాకు చెందిన వెంగ్ హాంగ్యంగ్తో తలపడతాడు. మరో సెమీస్‌లో 24వ ర్యాంకర్ హాంగ్యంగ్ 21–19, 13–21, 21–13తో మలేసియాకు చెందిన 17వ ర్యాంకర్ లీ జి జియాపై పోరాడి గెలిచాడు. కాగా హాంగ్యంగ్పై భారత ఆటగాడికి టైటిల్ గెలిచిన అనుభవం వుంది. గత మేలో కౌలాలంపూర్‌లో జరిగిన మలేసియన్ మాస్టర్స్ సూపర్–500 టోర్నమెంట్లో అతన్ని ఓడించే ప్రణయ్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో రెండో టైటిల్‌పై కన్నేసిన భారత షట్లర్ ఇపుడు అడుగు దూరంలో ఉన్నాడు. -
చరిత్ర సృష్టించిన జొకోవిచ్.. నాదల్ రికార్డు సమం
పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్. మెల్బోర్న్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్‌పై 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా అవతరించాడు. అంతేకాదు కెరీర్లో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో రాఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డు సమం చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచిన జొకోవిచ్ రికార్డులు జకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ 22. ఇందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ (10), వింబుల్డన్ (7), యూఎస్ ఓపెన్ (3), ఫ్రెంచ్ ఓపెన్ (2) ఉన్నాయి. ప్రస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాఫెల్ నాదల్ (22) సరసన జొకోవిచ్ నిలిచాడు. నాదల్‌ను వెనక్కినెట్టి జొకోవిచ్ కెరీర్లో నెగ్గిన టైటిల్స్ 93. అత్యధిక టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో నాదల్‌ను (92) ఐదో స్థానానికి నెట్టి జొకోవిచ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. టాప్–3లో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103), ఇవాన్ లెండిల్ (అమెరికా; 94) ఉన్నారు. పదికి పది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ 10 సార్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023) ఫైనల్ చేరుకోగా... పదిసార్లూ గెలిచాడు. చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే! -
ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా జొకోవిచ్..
ఆస్ట్రేలియా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో గ్రీక్ ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపస్‌పై 6-3,7-6(7/4),7-6(7/5) తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు. తొలి సెట్లో జకోవిచ్ సూపర్ స్మాష్ షాట్స్‌తో ప్రత్యర్ధి ఆటగాడికి చెమటలు పట్టించాడు. ఇదే క్రమంలో 6-3తో ఫస్ట్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అనంతరం పుంజుకున్న సిట్సిపస్ రెండో సెట్‌ను సమం చేశాడు. దీంతో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్ లో అదరగొట్టిన జొకోవిచ్ 7-4తో రెండో సెట్ ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన మూడో సెట్ కూడా సమం మైంది. దీంతో టై బ్రేక్ లో అద్బుతంగా రాణించిన జొకోవిచ్ 7-5తో మూడో సెట్‌తో పాటు టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. కాగా జొకోవిచ్ కెరీర్లో ఇది 10 వఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఇక ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్. తద్వారా ఓ అరుదైన ఘనతను జొకోవిచ్ సాధించాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన నాధల్(22) రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అదే విధంగా తాజా విజయంతో ప్రపంచ నెం1గా జొకోవిచ్ అవతరించాడు. -
Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో సానియా-బోపన్న జోడి ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా మీర్జా-బోపన్న జోడి ఓటమి పాలైంది. బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇప్పటికే మహిళల డబుల్స్‌లోనూ సానియా-అనా డానిలినా (కజకిస్తాన్) జంట నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ ఆటగాడు బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి టైటిల్‌తో సానియాకు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షించగా వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇక బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్‌కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. (చదవండి: 'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు')) -
Caroline Garcia: గార్సియాకు ఊహించని షాక్! లినెట్టి తొలిసారి..
Australian Open 2023: మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) కథ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ 45వ ర్యాంకర్ మగ్దా లినెట్టి (పోలాండ్) 7–6 (7/3), 6–4తో గార్సియాను ఓడించింది. ఈ గెలుపుతో 30 ఏళ్ల మగ్దా లినెట్టి తన 30వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–2తో 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై, డొనా వెకిచ్ (క్రొయేషియా) 6–2, 1–6, 6–3తో ఫ్రువిర్తోవా (చెక్ రిపబ్లిక్)పై, 30వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–4తో షుయె జాంగ్ (చైనా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. చదవండి: KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. SA20 2023: ఐపీఎల్లో నిరాశపరిచినా.. ఆ లీగ్‌లో మాత్రం దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ -
సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు..
Australian Open 2023- మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పదోసారి విజేతగా నిలిచేందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మూడు విజయాల దూరంలో ఉన్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–2, 6–1, 6–2తో 22వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 126 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ కేవలం ఐదు గేమ్‌లను మాత్రమే తన ప్రత్యర్థికి కోల్పోయాడు. ఆరుసార్లు అలెక్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 26 విన్నర్స్ కొట్టాడు. నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు నెగ్గిన అతను తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా ప్రత్యర్థికి బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. గట్టెక్కి రెండోసారి.. మరోవైపు.. ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఐదు సెట్ల హోరాహోరీ పోరులో గట్టెక్కి రెండోసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్ 6–3, 3–6, 6–3, 4–6, 7–6 (11/9)తో హోల్గర్ రూన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. సంచలనం సృష్టించి.. జొకోవిచ్‌తో పాటు అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారులు టామీ పాల్, బెన్ షెల్టన్ తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టామీ పాల్ 6–2, 4–6, 6–2, 7–5తో 24వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై, బెన్ షెల్టన్ 6–7 (5/7), 6–2, 6–7 (4/7), 7–6 (7/4), 6–2తో జేజే వుల్ఫ్ (అమెరికా)పై గెలిచారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుబ్లెవ్తో జొకోవిచ్; బెన్ షెల్టన్‌తో టామీ పాల్ తలపడతారు. చదవండి: Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. -
Australian Open 2023: ఎదురులేని జొకోవిచ్
మెల్బోర్న్: పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 7–6 (9/7), 6–3, 6–4తో 27వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 28 విన్నర్స్ కొట్టిన అతడు 22 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఐదుసార్లు దిమిత్రోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కథ ముగిసింది. తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదు సెట్లపాటు పోరాడి గెలిచిన ముర్రే మూడో రౌండ్లో మాత్రం పుంజుకోలేకపోయాడు. బాటిస్టా అగుట్ (స్పెయిన్) 6–1, 6–7 (7/9), 6–3, 6–4తో ముర్రేను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 2004 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా నలుగురు అమెరికా ఆటగాళ్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సబలెంకా, గార్సియా ముందంజ మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్ ల్లో సబలెంకా 6–2, 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, గార్సియా 1–6, 6–3, 6–3తో లౌరా సీగెముండ్ (జర్మనీ)పై, బెన్‌చిచ్ 6–2, 7–5తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచారు. -
రూడ్, జబర్లకు షాక్!
మెల్బోర్న్: ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. సీడెడ్ స్టార్లు రెండో రౌండే దాటలేకపోతున్నారు. నాలుగో రోజు పోటీల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 12వ సీడ్, ఒలింపిక్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఇంటిదారి పట్టారు. నాదల్ ఇది వరకే అవుటైన ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా మారిన సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి వింబుల్డన్, యూఎస్ ఓపెన్ రన్నరప్, రెండో సీడ్ అన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో సీడ్ వెరొనికా కుడెర్మెతొవ (రష్యా), 16వ సీడ్ అనెట్ కొంటావిట్ (ఈస్టోనియా)లు కంగు తిన్నారు. ఈ విభాగంలో నాలుగో సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్), ఐదో సీడ్ అరిన సబలెంక (బెలారస్), 12వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ముందంజ వేశారు. బ్రూక్స్‌బి ‘హీరో’చితం పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో 22 ఏళ్ల యువ అమెరికన్ జెన్సన్ బ్రూక్స్‌బి సంచలన ప్రదర్శనతో రూడ్‌ను కంగుతినిపించాడు. దీంతో గతేడాది ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్లలో రన్నరప్‌గా నిలిచిన రూడ్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లో అనూహ్యంగా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 3 గంటల 55 నిమిషాల సమరంలో బ్రూక్స్‌బి 6–3, 7–5, 6–7 (4/7), 6–2తో రూడ్‌ను ఓడించాడు. 8వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) అయితే వైల్డ్‌కార్డ్ ప్లేయర్ అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో చేతులెత్తేశాడు. ఫ్రిట్జ్ 7–6 (7/4), 6–7 (2/7), 4–6, 7–6 (8/6), 2–6తో 23 ఏళ్ల అలెక్సీ పోరాటానికి తలవంచాడు. నాలుగో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–7 (5/7), 6–2, 6–0తో క్వాలిఫయర్ ఎంజో కౌకాడ్ (మారిషస్)పై గెలుపొందగా, జ్వెరెవ్‌కు 7–6 (7/1), 4–6, 3–6, 2–6తో మైకేల్ మో (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–2, 6–4, 6–7 (2/7), 6–3తో ఎమిల్ రుసువురి (ఫిన్లాండ్)పై నెగ్గాడు. మూడో రౌండ్లో గార్సియా, సబలెంక మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 7–6 (7/5), 7–5తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంక (బెలారస్) 6–3, 6–1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై వరుస సెట్లలో విజయం సాధించారు. అయితే గతేడాది సూపర్ ఫామ్‌లో ఉన్న రెండో సీడ్ జబర్ (ట్యూనిషియా) 1–6, 7–5, 1–6తో మర్కెట వొండ్రొసొవా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. 9వ సీడ్ కుడెర్మెతొవ (రష్యా) 4–6, 6–2, 2–6తో అమెరికాకు చెందిన క్వాలిఫయర్ కేటీ వొలినెట్స్ చేతిలో ఇంటిదారి పట్టింది. 12వ సీడ్ బెన్సిచ్ 7–6 (7/3), 6–3తో క్లెయిర్ లియూ (అమెరికా)పై గెలుపొందగా, 16వ సీడ్ కొంటావిట్ (ఈస్టోనియా) 6–3, 3–6, 4–6తో మగ్ద లినెట్ (పోలాండ్) చేతిలో కంగుతింది. 30వ సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్) 6–0, 7–5తో పుతినెత్సవ (రష్యా)పై గెలిచింది. -
Australian Open 2023: జొకోవిచ్ అలవోకగా...
మెల్బోర్న్: కోవిడ్ టీకా వేసుకోనందున... గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం కోల్పోయిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈసారి అలవోక విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలుపొందాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. కార్బెలాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 26 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచిన ఈ మాజీ నంబర్‌వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీలో 2019, 2020, 2021లలో విజేతగా నిలిచిన జొకోవిచ్ గతేడాది బరిలోకి దిగలేదు. ముర్రే మారథాన్ పోరులో... మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్లో అతికష్టమ్మీద విజయం అందుకున్నాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 49వ ర్యాంకర్ ఆండీ ముర్రే 6–3, 6–3, 4–6, 6–7 (7/9), 7–6 (10/6)తో గెలుపొందాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 10 ఏస్‌లు సంధించి, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు బెరెటిని 31 ఏస్‌లు సంధించినా, ఏకంగా 59 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నెట్ వద్దకు 39 సార్లు దూసుకొచ్చిన ముర్రే 23 సార్లు పాయింట్లు గెలుపొందగా... బెరెటిని 49 సార్లు నెట్ వద్దకు వచ్చి 32 సార్లు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా శ్రమించి గెలుపొందాడు. ‘లక్కీ లూజర్’ యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)తో జరిగిన తొలి రౌండ్లో జ్వెరెవ్ 4–6, 6–1, 5–7, 7–6 (7/3), 6–4తో గెలిచాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–6 (8/6), 6–7 (5/7), 6–3తో టొమాస్ మచాచ్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–2తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఎనిమిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–2, 4–6, 7–5తో బాసిలాష్విలి (జార్జియా)పై విజయం సాధించారు. ముగురుజాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో 2020 రన్నరప్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) 3–6, 7–6 (7/3), 6–1తో ముగురుజాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా) 7–6 (10/8), 4–6, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–0తో కేథరీన్ సెబోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో తెరెజా మార్టిన్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
Australian Open 2023: శ్రమించి... శుభారంభం
మెల్బోర్న్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్కు తొలి రౌండ్లోనే గట్టిపోటీ ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ప్రపంచ 40వ ర్యాంకర్ జాక్ డ్రేపర్‌తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రాఫెల్ నాదల్ 7–5, 2–6, 6–4, 6–1తో నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 41 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో నాదల్ ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఏకంగా 46 అనవసర తప్పిదాలు చేసిన నాదల్ 41 విన్నర్స్ కొట్టి పైచేయి సాధించాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న డ్రేపర్ 13 ఏస్‌లతో అదరగొట్టాడు. అయితే 46 అనవసర తప్పిదాలు చేయడం... కీలకదశలో తడబడటంతో డ్రేపర్కు ఓటమి తప్పలేదు. నాదల్ సర్వీస్‌ను 11 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా డ్రేపర్ నాలుగుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు నాదల్ ఆరుసార్లు డ్రేపర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మెద్వెదెవ్ అలవోకగా... పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ ఫీలిక్స్ అలియాసిమ్ (కెనడా), పదో సీడ్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మెద్వెదెవ్ 6–0, 6–1, 6–2తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై, సిట్సిపాస్ 6–3, 6–4, 7–6 (8/6)తో క్వెంటిన్ హేల్స్ (ఫ్రాన్స్)పై, అలియాసిమ్ 1–6, 7–6 (7/4), 7–6 (7/3), 6–3తో పోస్పిసిల్ (కెనడా)పై, హుర్కాజ్ 7–6 (7/1), 6–2, 6–2తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలిచారు. అయితే 2014 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 4 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/3), 3–6, 6–1, 6–7 (2/7), 4–6తో అలెక్స్ మొల్కాన్ (స్లొవేకియా) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా) 3–6, 3–6, 3–6తో జిరీ లెహెక్సా (చెక్ రిపబ్లిక్) చేతిలో... ప్రపంచ 19వ ర్యాంకర్ ముసెట్టి (ఇటలీ) 4–6, 1–6, 7–6 (7/0), 6–2, 6–7 (4/10)తో హ్యారిస్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయారు. స్వియాటెక్ కష్టపడి... మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్) గంటా 59 నిమిషాల్లో 6–4, 7–5తో జూల్ నెమియర్ (జర్మనీ)పై శ్రమించి గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ పెగూలా (అమెరికా) 6–0, 6–1తో జాక్వెలిన్ (రొమేనియా)పై, ఆరో సీడ్ సాకరి (గ్రీస్) 6–1, 6–4తో యు యువాన్ (చైనా)పై, ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. -
Australian Open 2023: నాదల్, జొకోవిచ్లపైనే దృష్టి
మెల్బోర్న్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో రాఫెల్ నాదల్ (స్పెయిన్)... అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నాదల్ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలనే పట్టుదలతో నొవాక్ జొకోవిచ్... రేపటి నుంచి మొదలయ్యే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నారు. ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రిటన్‌కు చెందిన 40వ ర్యాంకర్ జాక్ డ్రేపర్‌తో ఆడనున్నాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 75వ ర్యాంకర్ రొబెర్టో బేనా (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. జొకోవిచ్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గగా అందులో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న జొకోవిచ్ ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిస్తే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. నాదల్, జొకోవిచ్ కాకుండా ఏడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగనున్నారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు మాజీ విజేత దూరం
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు మరో దెబ్బ పడింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, 2022 యూఎస్ ఓపెన్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)... మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా) వైదొలగగా.. ఈ జాబితాలో తాజాగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా చేరింది. జపాన్‌కు చెందిన 25 ఏళ్ల ఒసాకా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగడంలేదని నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. అయితే ఒసాకా వైదొలగడానికి కారణం మాత్రం వారు వెల్లడించలేదు. 2019, 2021లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఒసాకా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏ టోర్నీలోనూ ఆడలేదు. ప్రస్తుతం ఆమె 42వ ర్యాంక్‌కు పడిపోయింది. 2018, 2020 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన ఒసాకా 2021 ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో వైదొలిగింది. ఆ తర్వాత తాను మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నానని తెలిపి రెండునెలలపాటు ఆట నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత పలు టోర్నీలలో ఆమె బరిలోకి దిగినా టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అల్కరాజ్ దూరం
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌నుంచి వరల్డ్ నంబర్‌వన్, స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ తప్పుకున్నాడు. గత కొంత కాలంగా కుడి కాలి గాయంతో బాధపడుతున్న అతను సరైన సమయంలో కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. గత ఏడాది సెప్టెంబర్ 12న అల్కరాజ్ ఏటీపీ చరిత్రలో అతి పిన్న వయసులో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. అల్కరాజ్ దూరం కావడంతో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఈ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. -
సెరెనా విలియమ్స్ సంచలన ప్రకటన
అమెరికా నల్లకలువ, 23 గ్రాండ్‌స్లామ్‌ల విన్నర్ అయిన సెరెనా విలియమ్స్ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 9న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన ఈ దిగ్గజ క్రీడాకారిణి.. తన రిటైర్మెంట్ నిర్ణయంపై యూ టర్న్ తీసుకోబోతున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. యూఎస్ ఓపెన్-2022లో తన చివరి మ్యాచ్ ఆడిన సెరెనా.. మళ్లీ రంగంలోకి దిగడం ఖాయం అంటూ తాజాగా వెల్లడించింది. తన వ్యాపార ప్రమోషన్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సెరెనా మాట్లాడుతూ.. తాను రిటైర్ కాలేదని, ఆట నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని, ఇప్పటికీ తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నానని రీఎంట్రీపై హింట్ ఇచ్చింది. వచ్చే ఏడాది (2023) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పునరాగమనం చేయవచ్చని పరోక్ష సంకేతాలు పంపింది. కాగా, యూఎస్ ఓపెన్-2022 మూడో రౌండ్లో నిష్క్రమించిన తర్వాత నిర్వాహకులు సెరెనాకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సెరెనా తాజా నిర్ణయంతో అభిమానులతో పాటు నిర్వాహకులు సైతం అవాక్కవుతున్నారు. 41 ఏళ్ల సెరెనా విలియమ్స్ చివరిగా 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించింది. చదవండి: 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' -
జొకోవిచ్‌కు మళ్లీ ‘వ్యాక్సిన్’పోటు!
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు. వ్యాక్సిన్ విషయంలో జొకోవిచ్ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్ చెబుతున్నా... వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
Ashleigh Barty: శిఖరం నుంచే సాగిపోనీ...
సాక్షి క్రీడా విభాగం: ‘ప్రొఫెషనల్ క్రీడల్లో అనుకున్న లక్ష్యాలు చేరుకోకుండానే ఆట నుంచి తప్పుకునే వారు 99 శాతం మంది ఉంటారు. కానీ యాష్లే బార్టీ మిగిలిన ఆ 1 శాతం మందిలో ఉంటుంది’ 25 ఏళ్ల వయసుకే బార్టీ సాధించిన ఘనతలు చూస్తే ఈ వ్యాఖ్య ఆమెకు సరిగ్గా సరిపోతుంది. మూడు వేర్వేరు సర్ఫేస్‌లలో (హార్డ్, క్లే, గ్రాస్‌కోర్టు) మూడు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్ పతకం, ఓవరాల్‌గా 121 వారాలు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్, సంపాదనలో మేటి... ఇంకా సాధించడానికి ఏముంది! బార్టీ కూడా ఇలాగే ఆలోచించి ఉంటుంది. శిఖరాన చేరుకున్న తర్వాత ఇక ఎక్కడానికి ఎత్తులు లేవు అనిపించినప్పుడు ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఎలా మొదలు పెట్టామనే దానికంటే ఎలా ముగించామన్నదే ముఖ్యం అని భావిస్తే బార్టీ తన ఘనమైన కెరీర్‌కు అద్భుత రీతిలో గుడ్‌బై పలికింది. సొంతగడ్డపై భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన బార్టీ దానినే చివరి ఘట్టంగా మార్చుకుంది. నిజానికి కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు దానికి ముగింపు పలకడం అంత సులువు కాదు. దానికి ఎంతో సాహసం, మానసిక దృఢత్వం కావాలి. బార్టీ తాజా ఫామ్, వయసును బట్టి చూస్తే రాబోయే కొన్నేళ్లు ఆమె మహిళల టెన్నిస్‌ను శాసించే స్థితిలో ఉంది. ఆర్జనపరంగా చూస్తే మహిళల వరల్డ్ నంబర్‌వన్‌తో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద బ్రాండింగ్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆమె ప్రచార కార్యక్రమాల ద్వారానే లెక్కలేనంత సంపదనను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటివి ఊరిస్తున్నా, వెనక్కి లాగే అవకాశం ఉన్నా బార్టీ ‘ఇట్స్ జస్ట్ మై వే’ అంటూ తనదైన దారిని ఎం చుకుంది. తన ప్రస్తుత స్థాయి ఏమిటో ఆమె పట్టించుకోలేదు. టెన్నిస్ మాత్రమే తనకు ప్రపం చం కాదని, కొత్త కలలను సాకారం చేసుకోవా ల్సి ఉందంటూ ముందుకు వెళ్లేందుకు నిశ్చ యించుకుంది. తానేంటో, తనకు కావాల్సింది ఏమిటో, తాను ఎలా సంతోషంగా ఉండగలనో గుర్తించి దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంది. బార్టీ కెరీర్ ఆసాంతం ఆసక్తికరం. నాలుగేళ్ల వయసులో రాకెట్ పట్టిన ఈ బ్రిస్బేన్ అమ్మాయి 14 ఏళ్ల వయసులో ఐటీఎఫ్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత సంవత్సరమే వింబుల్డన్ జూనియర్ టైటిల్ గెలవడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. కేసీ డెలాక్వా తోడుగా మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఫైనల్ చేరగా, సింగిల్స్‌లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. అయితే 2014లో అనూహ్యంగా ఆటకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘చిన్నప్పటి నుంచే ఆడుతున్న నేను ఇంత ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఒక సాధారణ టీనేజర్‌గా నా జీవితం గడపాలని ఉంది’ అంటూ దాదాపు 18 నెలలు టెన్నిస్ నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో క్రికెట్‌పై దృష్టి పెట్టింది. ప్రాథమిక స్థాయిలో ఎలాంటి శిక్షణ లేకపోయినా కొద్ది రోజుల్లోనే ఆటపై పట్టు సాధించి ఏకంగా ‘మహిళల బిగ్‌బాష్ లీగ్’లో బ్రిస్బేన్ హీట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత 2016 ఫిబ్రవరిలో మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చిన యాష్లే బార్టీకి వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. -
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్‌లో కీలక మార్పు.. ఇకపై
టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో ఇకపై ఆఖరి సెట్లో స్కోరు 6-6తో సమంగా ఉన్నప్పుడు 10 పాయింట్ టై బ్రేక్ ఆడేలా కొత్త రూల్ తీసుకొచ్చినట్లు బుధవారం గ్రాండ్‌స్లామ్ బోర్డు ఉమ్మడి అధికారిక ప్రకటన చేసింది. ఈ నిబంధన రానున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ''ఆస్ట్రేలియన్ ఓపెన్, రోలాండ్-గారోస్(ఫ్రెంచ్ ఓపెన్), వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లాంటి మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో 10-పాయింట్ టై-బ్రేక్ ఆడాలనే ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆఖరి సెట్లో స్కోరు ఆరుకు చేరుకున్నప్పుడు ఈ 10 పాయింట్ టై బ్రేక్ ఆడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుధీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. వాటివల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోతున్నారు.బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ఆట నియమాలలో మరింత స్థిరత్వాన్ని సృష్టించనుంది. తద్వారా ఆటగాళ్ల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇక డబ్ల్యూటీఏ, ఏటీపీ, ఐటీఎఫ్ లాంటి టోర్నీల్లోనూ త్వరలోనే దీనిని అమలు చేయనున్నాం. ఇందుకోసం సదరు కమ్యూనిటీ అధికారులతో విస్తృతమైన సంప్రదింపులు జరుపుతున్నాం. ముందుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో 10 పాయింట్ టై బ్రేక్‌ను ట్రయల్ నిర్వహించనున్నాం. ఆ తర్వాత మెల్లిగా అన్నింటికి వర్తించనున్నాం'' అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 10 పాయింట్ టై బ్రేక్ అనేది అన్ని గ్రాండ్‌స్లామ్‌ల్లో.. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో క్వాలిఫయింగ్ నుంచి ఫైనల్‌కు వరకు ఆఖరి సెట్లో ఇది వర్తించనుంది. సీనియర్‌తో పాటు జూనియర్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, వీల్‌చైర్ డబుల్స్‌లో కూడా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: Maria Sharapova-Michael Schumacher: షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
Djokovic: వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదు.. బలవంతం చేస్తే మాత్రం..!
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేదే లేదని భీష్మించుకు కూర్చున్న వివాదాస్పద టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌కు తాను వ్యతిరేకం కాదని, బలవంతంగా తీసుకోమని ఒత్తిడి తెస్తే మాత్రం భవిష్యత్తులో జరిగే టెన్నిస్ టోర్నీలకు దూరంగా ఉండేందుకైనా సిద్ధంగా ఉన్నానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది జరగబోయే వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలను వదులుకుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జోకో ఈ మేరకు స్పందించాడు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమానికి తానేమీ మద్దతు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా జకో స్పష్టంగా చేశాడు. శరీర ధర్మానికి తగ్గట్లుగానే తన నిర్ణయాలు ఉంటాయని, ఈ విషయంలో తననెవరైనా బలవంతం చేస్తే ట్రోఫీలు వదులుకోవడం పెద్ద సమస్య కాదని తెలిపాడు. కాగా, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఈ సెర్బియన్ స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022కు దూరమైన సంగతి తెలిసిందే. చదవండి క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు.. అరంగేట్రం తర్వాత పుట్టిన క్రికెటర్‌తో..! -
అత్యాశ లేదు... కానీ ఇప్పుడైతే ‘21’ మాత్రం సరిపోదు: టెన్నిస్ స్టార్
Rafael Nadal Comments: - మలోర్కా (స్పెయిన్): పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (21) గెలిచి శిఖరాన ఉన్న రాఫెల్ నాదల్ మరిన్ని మెగా టోర్నీలు గెలవాలని భావిస్తున్నాడు. ఇప్పటివరకు సాధించిన ఘనతతో ఆగిపోనని... అయితే అందు కోసం దేనికైనా సిద్ధమే అన్నట్లుగా వెంటపడనని కూడా నాదల్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అనంతరం తన స్వస్థలం చేరుకొని సొంత అకాడమీలో నాదల్ మీడియాతో మాట్లాడాడు. ‘నేను భవిష్యత్తులో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుస్తాననేది చెప్పలేను. కొన్నాళ్ల క్రితం వరకు కూడా గెలుపు సంగతేమో కానీ ఆడగలిగితే చాలని భావించాను. మిగతా ఇద్దరికంటే నేను ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు సాధించాలని కోరుకుంటున్నాను. అలా జరిగితే చాలా సంతోషం. కానీ ఎలాగైనా గెలవాలనే పిచ్చి మాత్రం నాకు లేదు. నిజంగా ఇది నిజం. నా దారిలో వచ్చేవాటిని అందుకుంటూ పోవడమే తప్ప అత్యాశ కూడా పడటం లేదు. అయితే నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడైతే ‘21’ మాత్రం సరిపోదు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు’ అని ఈ దిగ్గజ ఆటగాడు అన్నాడు. ఇక సుదీర్ఘ కాలంగా కాలి నొప్పితో బాధపడుతున్నా అలాగే ఆటను కొనసాగించానని అతను పేర్కొన్నాడు. ‘ఆడుతున్నప్పుడు నా పాదం ఇప్పటికీ నన్ను ఇబ్బంది పెడుతుంది. అయితే అత్యుత్తమ స్థాయి ఆట ఆడేటప్పుడు దానిని పట్టించుకోలేదు. తాజా విజయంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే ఇక ముందూ టెన్నిస్‌ను బాగా ఆస్వాదించగలను. సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడాలని కోరుకుంటున్నా’ అని స్పెయిల్ బుల్ స్పష్టం చేశాడు. నాదల్–ఫెడరర్ కలిసి... దిగ్గజ ఆటగాళ్లు నాదల్, రోజర్ ఫెడరర్ మరో సారి ఒకే జట్టులో కలిసి ఆడనున్నారు. సెప్టెంబర్ 23నుంచి జరిగే ‘లేవర్ కప్’ టోర్నీలో వీరిద్దరు టీమ్ యూరోప్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. 2017లో ఇదే టోర్నీలో వీరిద్దరు జోడీగా ఆడి డబుల్స్ మ్యాచ్ గెలిచారు. చదవండి: Novak Djokovic: నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్.. జొకోవిచ్ దిగిరానున్నాడా! Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes. ⁰ 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r — #AusOpen (@AustralianOpen) January 30, 2022 -
నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్.. జొకోవిచ్ దిగిరానున్నాడా!
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎంత మొండిగా వ్యవహరించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు జొకోవిచ్ వ్యాక్సిన్ వేసుకోకుండానే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాడు. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు అనుమతిస్తామని ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ విషయంలో జోకో విభేదించడం వివాదాస్పదంగా మారింది. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, జొకోవిచ్ మధ్య మొదలైన వివాదం కోర్టును కూడా తాకింది. అయితే కోర్టులోనూ జొకోవిచ్‌కు చుక్కెదురవడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను మూడేళ్ల పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడకుండా నిషేధించడం సంచలనంగా మారింది. అలా గ్రాండ్‌స్లామ్ ఆడకుండానే వివాదాస్పద రీతిలో జొకోవిచ్ వెనుదిరిగాడు. చదవండి: చరిత్ర సృష్టించిన నాదల్.. హోరాహోరి పోరులో మెద్వెదెవ్పై సంచలన విజయం ఇదంతా గతం.. ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ విషయంలో సెర్బియా స్టార్ దిగిరానున్నాడని సమాచారం. వ్యాక్సిన్ వేయించుకోవడానికి జొకోవిచ్ ఒప్పుకున్నట్లు.. అతని జీవిత కథ రాస్తున్న డానియెల్ ముక్స్ ఒక ప్రకటన చేయడం ఆసక్తి కలిగించింది.''జొకోవిచ్ ఉన్నపళంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి కారణం.. రఫెల్ నాదల్'' అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను నాదల్ గెలవడం ద్వారా తన ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్‌ను వేసుకున్నాడు. ప్రస్తుతం నాదల్ పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా ఉన్నాడు. దీంతో నాదల్ రికార్డును బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో జొకోవిచ్ వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో నాదల్ రికార్డును బ్రేక్ చేయగల సత్తా ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకరు రోజర్ ఫెదరర్.. మరొకరు జొకోవిచ్. గాయాల కారణంగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న ఫెదరర్ సాధిస్తాడన్న నమ్మకం లేదు. అయితే ఫామ్ పరంగా చూస్తే జొకోవిచ్‌కు మాత్రం సాధ్యమవుతుంది. జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఫెదరర్‌తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు? జొకోవిచ్ వ్యాక్సిన్ విషయంలో వెనక్కు తగ్గడానికి నాదల్ రికార్డును బ్రేక్ చేయాలన్న కారణం మాత్రమే కాదు. దీనివెనుక మరొకటి కూడా ఉంది. ఇకపై టెన్నిస్‌లో ఏ టోర్నమెంట్ అయినా ఆటగాళ్లకు వ్యాక్సిన్ తప్పనిసరి అని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య స్పష్టం చేసింది. రానున్న వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ వ్యాక్సిన్ తీసుకున్న ఆటగాళ్లనే అనుమతి ఇస్తామని పేర్కొన్నాయి. దీంతో జొకోవిచ్ దెబ్బకు దిగిరానున్నాడు. ఒకవేళ ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుంటే మాత్రం తనను తానే నష్టపరుచుకున్నట్లు అవుతుందని.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ కల నెరవేరదనే ఉద్దేశంతోనే జొకోవిచ్ వ్యాక్సిన్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. చదవండి: Novak Djokovic: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..! Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes. ⁰ 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r — #AusOpen (@AustralianOpen) January 30, 2022 -
Australian Open Final: చరిత్ర సృష్టించిన నాదల్
-
చరిత్ర సృష్టించిన నాదల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్పై సంచలన విజయం
Rafael Nadal Wins Australian Open 2022 Singles Title: ఓపెన్ టెన్నిస్ ఎరాలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 పురుషుల సింగల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై 2-6, 6-7(5-7),6-4, 6-4, 7-5 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు ఐదున్నర గంటల పాటు నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరిగా సాగిన ఈ పోరులో నదాల్ తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ.. అనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు సెట్లు గెలిచి రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన నాదల్.. ఒక్కో మెట్టును అధిగమిస్తూ 2010 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. మరోవైపు కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్‌పై గంపెడాశలు పెట్టుకున్న మెద్వెదెవ్.. నాదల్ అనుభవం ముందు నిలబడ లేకపోయాడు. మెద్వెదెవ్.. 2021లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ బార్బోరా క్రెజికోవా, కత్రీనా సినికోవా(చెక్ రిపబ్లిక్) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలీనా, బేట్రిజ్ హద్దాద్ మయ్యాపై 6-7(3-7), 6-4, 6-4 తేడాతో విజయం సాధించి, కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఎగురేసుకుపోయింది. అంతకుముందు పురుషుల డబుల్స్ ఫైనల్లో థనాసి కొకినాకిస్-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన విషయం తెలిసిందే. చదవండి: చెక్ జోడీ ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes. ⁰ 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r — #AusOpen (@AustralianOpen) January 30, 2022 -
చెక్ జోడీ ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్
Czech Top Seeds Win Womens Doubles Crown: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ బార్బోరా క్రెజికోవా, కత్రీనా సినికోవా(చెక్ రిపబ్లిక్) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలీనా, బేట్రిజ్ హద్దాద్ మయ్యాపై 6-7(3-7), 6-4, 6-4 తేడాతో విజయం సాధించి, కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఎగురేసుకుపోయింది. 2 గంటల 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ పోరులో చెక్ జోడీకి కజకిస్థాన్ ద్వయం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ చెక్ జోడీ పట్టుదలగా ఆడి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో థనాసి కొకినాకిస్-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించింది. ఈ క్రమంలో ‘వైల్డ్ కార్డు’ ఎంట్రీ ద్వారా బరిలోకి దిగి డబుల్స్ టైటిల్ నెగ్గిన జోడీగా చరిత్ర సృష్టించింది. చదవండి: కొకినాకిస్–కిరియోస్ జంటకు డబుల్స్ టైటిల్ -
కొకినాకిస్–కిరియోస్ జంటకు డబుల్స్ టైటిల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ థనాసి కొకినాకిస్–నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట ఖాతాలోకి వెళ్లింది. శనివారం జరిగిన ఫైనల్లో కొకినాకిస్–కిరియోస్ ద్వయం 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. ‘వైల్డ్ కార్డు’ ద్వారా బరిలోకి ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ టైటిల్ నెగ్గిన జోడీగా కొకినాకిస్–కిరియోస్ చరిత్ర సృష్టించింది. -
భళా బార్టీ... 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్
స్వదేశీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు యాష్లే బార్టీ తెరదించింది. సొంతగడ్డపై ఆద్యంతం అద్వితీయ ఆటతీరు కనబరిచింది. ఫలితంగా 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆసీస్ క్రీడా కారిణిగా బార్టీ గుర్తింపు పొందింది. 1978లో చివరిసారి ఆస్ట్రేలియా తరఫున ఈ టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా క్రిస్టినా ఒనీల్ నిలిచింది. ఆ తర్వాత 1980లో వెండీ టర్న్‌బుల్ ఫైనల్‌కు చేరినా చివరకు ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ (2019), వింబుల్డన్ ఓపెన్ (2021) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన బార్టీ యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంటుంది. మెల్బోర్న్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ స్థాయి... టాప్ సీడ్ హోదాకు తగ్గ ఆటతీరు ప్రదర్శించిన యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ చేరిన తొలిసారే 25 ఏళ్ల బార్టీ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 87 నిమిషాల్లో 6–3, 7–6 (7/2)తో 27వ సీడ్ డానియెల్ కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించింది. ఈ టోర్నీ మొత్తంలో బార్టీ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. బార్టీ తన కెరీర్లో చేరిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఫ్రెంచ్, వింబుల్డన్, ఆస్ట్రేలియన్) విజేతగా నిలువడం విశేషం. మరోవైపు 28 ఏళ్ల కొలిన్స్‌కు కెరీర్లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో నిరాశ ఎదురైంది. చాంపియన్‌గా నిలిచిన యాష్లే బార్టీకి 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్ కొలిన్స్‌కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరో గేమ్‌లో బ్రేక్‌తో... ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా ఫైనల్ చేరిన బార్టీ తుది పోరులోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆరంభంలో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 2–2తో సమంగా నిలిచింది. ఐదో గేమ్‌లో బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం కొలిన్స్‌కు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఏస్‌తో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న బార్టీ ఆరో గేమ్‌లో కొలిన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బార్టీ రెండుసార్లు తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను గెల్చుకుంది. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి... రెండో సెట్లో కొలిన్స్ చెలరేగి రెండో గేమ్‌లో, ఆరో గేమ్‌లో బార్టీ సర్వీస్‌లను బ్రేక్ చేసి 5–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగు గేమ్‌లు వెనుకబడ్డా బార్టీ కంగారు పడలేదు. పట్టువిడవకుండా పోరాడి వరుసగా నాలుగు గేమ్‌లు సాధించి స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత 11వ గేమ్‌లో కొలిన్స్, 12వ గేమ్‌లో బార్టీ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో బార్టీ పైచేయి సాధించింది. ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని బార్టీ విజయగర్జన చేసింది. నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ మెద్వెదెవ్ (రష్యా) గీ రాఫెల్ నాదల్ (స్పెయిన్) మధ్యాహ్నం గం. 2:00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం 2:నలుగురు అమెరికా క్రీడాకారిణులు అనిసిమోవా, జెస్సికా పెగూలా, మాడిసన్ కీస్, కొలిన్స్లను ఓడించి యాష్లే బార్టీ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలువడం ఇది రెండోసారి. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచే క్రమంలో బార్టీ ఈ నలుగురినే ఓడించడం విశేషం. 7:ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఏడో క్రీడాకారిణి బార్టీ. గతంలో స్టెఫీ గ్రాఫ్ (1988, 1989, 1994), మేరీ పియర్స్ (1995), మార్టినా హింగిస్ (1997), లిండ్సే డావెన్‌పోర్ట్ (2000), షరపోవా (2008), సెరెనా (2017) ఈ ఘనత సాధించారు. 8:ఓపెన్ శకంలో (1968 నుంచి) ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఎనిమిదో క్రీడాకారిణిగా బార్టీ నిలిచింది. అంతా కలలా అనిపిస్తోంది. ఈ గెలుపుతో నా స్వప్నం సాకారమైంది. నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఆస్ట్రేలియా పౌరురాలు అయినందుకు గర్వపడుతున్నాను. సొంత ప్రేక్షకుల నడుమ ఆడటం ఎంతో ఆనందాన్నిచ్చింది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శంచడానికి అభిమానుల మద్దతు కూడా కారణం. హార్డ్ కోర్టు, మట్టి కోర్టు, పచ్చిక కోర్టులపై మూడు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచినా నా కెరీర్లో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. –యాష్లే బార్టీ -
అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ ప్లేయర్‌కు భారీ జరిమానా
Medvedev Fined 12000 USD: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా చైర్ అంపైర్‌ను బూతులు తిట్టిన ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డానిల్ మెద్వెదెవ్(రష్యా)కు భారీ జరిమానా విధించారు టోర్నీ నిర్వాహకులు. క్రీడా స్పూర్తికి విరుద్ధంగా అంపైర్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నాడన్నకారణంగా మెద్వెదెవ్కు 12000 యూఎస్ డాలర్లు ఫైన్ వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. One set all in #AusOpen semi-final and Daniil Medvedev has completely lost his head as he goes onto call the umpire a “small cat” 😂 He has a point though, this isn’t the first time Stefanos Tsitsipas has been accused of cheating by receiving coachingpic.twitter.com/Be0h2R7uCZ — Alex ⚒ (@AlexSmith_123) January 28, 2022 కీలకమైన సెమీస్ సందర్భంగా ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ రూల్స్‌కు విరుద్ధంగా స్టాండ్స్‌లోని తన తండ్రి నుంచి సలహాలు తీసుకున్నాడని ఆరోపిస్తూ.. చైర్ అంపైర్ జౌమ్ క్యాంపిస్టల్ను స్టుపిడ్ అంటూ దూషించాడు మెద్వెదెవ్. అయితే, మ్యాచ్ అనంతరం మెద్వెదెవ్ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరినప్పటికీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. కాగా, సెమీస్‌లో నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను 7-6(5),4-6,6-4,6-1తో కంగుతినిపించిన మెద్వెదెవ్.. ఆదివారం జరగబోయే ఫైనల్లో స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. చదవండి: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే -
Australian Open: చరిత్రకు చేరువగా...
ఇద్దరు దిగ్గజాలు రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్‌లను వెనక్కి నెట్టేసి కొత్త చరిత్ర సృష్టించేందుకు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఒకే ఒక్క విజయం దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన ఈ మాజీ చాంపియన్ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)తో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ గెలిస్తే... పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్, ఫెడరర్, జొకోవిచ్ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతి కష్టమ్మీద గట్టెక్కిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ సెమీఫైనల్ అడ్డంకిని మాత్రం మరీ శ్రమించకుండానే దాటేశాడు. ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ నాదల్ 6–3, 6–2, 3–6, 6–3తో నెగ్గి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 35 ఏళ్ల నాదల్ 2009లో ఏకైకసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆ తర్వాత 2012, 2014, 2017, 2019లలో రన్నరప్‌గా నిలిచాడు. బెరెటినితో 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు 28 విన్నర్స్ కొట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ కేవలం 19 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. బెరెటిని 14 ఏస్‌లు సంధించినప్పటికీ 39 అనవసర తప్పిదాలు చేశాడు. నాదల్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం రాగా ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. షపోవలోవ్‌తో నాలుగు గంటలకుపైగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సెట్లో నెగ్గి ఊపిరి పీల్చుకున్న నాదల్ సెమీఫైనల్లో మాత్రం బెరెటినికి ఏదశలోనూ అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో రెండుసార్లు, నాలుగో సెట్లో ఒకసారి బెరెటిని సర్వీస్‌లను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గత ఏడాది రన్నరనప్ మెద్వెదెవ్ (రష్యా) తో నాదల్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో నాదల్ 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వీరిద్దరు ఒకేసారి (2019 యూఎస్ ఓపెన్ ఫైనల్) తలపడగా నాదల్ నెగ్గాడు. ఈసారీ మెద్వెదెవ్‌దే పైచేయి... ఫిలిక్స్ (కెనడా)తో 4 గంటల 42 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్ పాయింట్ కాపాడుకొని గట్టెక్కిన మెద్వెదెవ్ సెమీఫైనల్లో మాత్రం నాలుగు సెట్లలో విజయం రుచి చూశాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో 25 ఏళ్ల మెద్వెదెవ్ 7–6 (7/5), 4–6, 6–4, 6–1తో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో సిట్సిపాస్నే ఓడించి మెద్వెదెవ్ ఫైనల్ చేరాడు. తొలి మూడు సెట్లలో మెద్వెదెవ్కు పోటీ ఎదురైనా నాలుగో సెట్లో మాత్రం ఈ రష్యా స్టార్ ఒకే గేమ్ కోల్పోయాడు. 13 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్ 39 విన్నర్స్ కొట్టాడు. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) X కొలిన్స్ (అమెరికా) మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్‌లో లైవ్ 29: ఇప్పటి వరకు తన కెరీర్లో నాదల్ చేరిన గ్రాండ్‌స్లామ్ టోర్నీల ఫైనల్స్. 500: హార్డ్కోర్టులపై నాదల్ నెగ్గిన మ్యాచ్‌లు. ఈ జాబితాలో ఫెడరర్ (783), జొకోవిచ్ (634) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 3: కఫెల్నికోవ్ (1999, 2000), సఫిన్ (2004, 2005) తర్వాత వరుసగా రెండేళ్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన మూడో రష్యా ప్లేయర్‌గా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో బార్టీ సంచలనం... ఫైనల్లో తలపడబోయేది ఆమెతోనే..
స్వదేశీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ తెరదించింది. 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన ఆసీస్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. 1980లో చివరిసారిగా వెండీ టర్న్‌బుల్ రూపంలో ఆసీస్ మహిళా క్రీడాకారిణి ఈ మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆస్ట్రేలియన్ క్రీడాకారిణిగా ఘనత సాధించేందుకు బార్టీ మరో విజయం దూరంలో నిలిచింది. అమెరికా క్రీడాకారిణి డానియెల్ కొలిన్స్‌తో శనివారం జరిగే ఫైనల్లో బార్టీ గెలిస్తే 1978లో క్రిస్టీన్ ఒనీల్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియ ఓపెన్‌లో ఈ ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా) తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో యాష్లే బార్టీ 62 నిమిషాల్లో 6–1, 6–3తో అన్‌సీడెడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై... కొలిన్స్ 78 నిమిషాల్లో 6–4, 6–1తో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై విజయం సాధించారు. శనివారం జరిగే ఫైనల్లో బార్టీతో కొలిన్స్ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో బార్టీ 3–1తో కొలిన్స్‌పై ఆధిక్యంలో ఉంది. బారీ్టకిది మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా... 28 ఏళ్ల కొలిన్స్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరింది. 25 ఏళ్ల బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2021లో వింబుల్డన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. అదే జోరు... టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఈ టోర్నీలో బార్టీ ఆడుతోంది. ఫైనల్ చేరే క్రమంలో ఆరు మ్యాచ్‌లు ఆడిన బార్టీ 6 గంటల 6 నిమిషాలు మాత్రమే టెన్నిస్ కోర్టులో గడిపింది. ఒక్క సెట్ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోని బార్టీ కేవలం 21 గేమ్‌లు మాత్రమే సమర్పించుకుంది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ మాడిసన్ కీస్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లో బార్టీకి ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. ఐదు ఏస్‌లు సంధించి ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని బార్టీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. 20 విన్నర్స్ కొట్టిన బార్టీ 13 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు 2015 తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ సెమీఫైనల్ ఆడిన కీస్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ సంపాదించలేదు. ‘బ్రేక్’తో మొదలు... 2020 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్‌తో జరిగిన సెమీఫైనల్లో కొలిన్స్ ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించింది. తొలి సెట్లో, రెండో సెట్లో ఆరంభంలోనే రెండుసార్లు చొప్పున స్వియాటెక్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన కొలిన్స్ 4–0తో, 4–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో 0–4తో వెనుకబడ్డాక స్వియాటెక్ కోలుకొని రెండుసార్లు కొలిన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే 5–4తో స్కోరు వద్ద కొలిన్స్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లోనూ 0–4తో వెనుకబడ్డ స్వియాటెక్ ఈసారి మాత్రం ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. ఏడో గేమ్‌లో స్వియాటెక్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన కొలిన్స్ సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏడు ఏస్‌లు సంధించిన కొలిన్స్ 27 విన్నర్స్ కొట్టింది. స్వియాటెక్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 13 అనవసర తప్పిదాలు చేసింది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Made Down Under ™️ 🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp — #AusOpen (@AustralianOpen) January 27, 2022 The finishing touch to the opening set 🎨 🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP — #AusOpen (@AustralianOpen) January 27, 2022 Cool ✅ Calm ✅ Calculated ✅ Swiatek looking as sharp as ever with a beautiful finish 🙌#bondisands • @bondisands pic.twitter.com/2fnl0nLTMh — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
Australian Open: ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆష్లే బార్టీ.. సరికొత్త చరిత్ర
Ashleigh Barty dismantles Madison Keys: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ ఆష్లే బార్టీ అద్భుత విజయం సాధించింది. అమెరికన్ ప్లేయర్ మేడిసన్ కీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. 1980 తర్వాత మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా నిలిచింది. ఇక వరల్డ్ నెంబర్ 1 ఆష్లే.. మేడిసన్ను 6-1, 6-3 తేడాతో మట్టికరిపించి టైటిల్ రేసులోకి దూసుకువెళ్లింది. ఫైనల్లో ఆమె.. ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) లేదంటే... 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా)తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్లో గెలిస్తే ఆష్లే కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరుతుంది. కాగా 1980లో వెండీ టర్న్‌బల్ తొలిసారిగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆష్లే ఆ రికార్డును సవరించింది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Made Down Under ™️ 🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp — #AusOpen (@AustralianOpen) January 27, 2022 The finishing touch to the opening set 🎨 🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP — #AusOpen (@AustralianOpen) January 27, 2022 -
Djokovic: వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఫ్రెంచ్ ఓపెన్ బరిలో..!
Djokovic Might Play French Open 2022 : వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయిన ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నొవాక్ జకోవిచ్.. త్వరలో ప్రారంభంకానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలను సడలించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో మహమ్మారి వైరస్ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో నిబంధనలను సడలించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల క్రితం పాజిటివ్ వచ్చిన వారు ఫ్రాన్స్‌లో ఎంట్రీకి తప్పనిసరి వ్యాక్సిన్ పాస్ చూపాల్సిన అవసరం లేదని ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. దీంతో జకో ఫ్రెంచ్ ఓపెన్ ఎంట్రీకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా, జకో గతేడాది డిసెంబర్లో కరోనా బారినపడినట్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్‌పై చేయి చేసుకున్న పెద్దాయన.. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసిన సానియా పోరాటం.. క్వార్టర్స్‌లో నిష్క్రమణ
Sania Mirza-Rajeev Ram Lose Quarterfinals In Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్ సీడెడ్ ఆస్ట్రేలియన్ జంట జేసన్ కుబ్లర్-జేమీ ఫోర్లిస్ చేతిలో 4-6, 6-7 తేడాతో పరాజయం పాలైంది. Thank you for the memories, @MirzaSania ❤️ The two-time #AusOpen doubles champion has played her final match in Melbourne.#AO2022 pic.twitter.com/YdgH9CsnF0— #AusOpen (@AustralianOpen) January 25, 2022 మ్యాచ్ ప్రారంభం నుంచి సానియా జోడీ అద్భుంగానే ఆడినప్పటికీ.. ప్రత్యర్ధి అంతకుమించి రాణించడంతో తలవంచక తప్పలేదు. గంటన్నర పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ జోడీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా శకం ముగిసింది. గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్‌ను నెగ్గిన సానియా.. ఈ ఏడాది తన కెరీర్‌కు ముగింపు పలుకనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. చదవండి: కార్నెట్ పట్టు వీడని పోరాటం -
ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రష్యన్ స్టార్, నిరుటి రన్నరప్ మెద్వెదెవ్, గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల ఈవెంట్లో సిమోనా హలెప్ (రొమేనియా), అరిన సబలెంక (బెలారస్), ఇగా స్వియటెక్ (పోలండ్)లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ మెద్వెదెవ్ 6–4, 6–4, 6–2తో వరుస సెట్లలో వాన్ డి జండ్షల్ప్ (నెదర్లాండ్స్)పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్... గంటా 55 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ 7–5, 7–6 (7/3), 3–6, 6–3తో ఐదో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు షాకిచ్చాడు. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ 6–3, 7–5, 6–7 (2/7), 6–4తో బెనాయిట్ పైర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ ఫెలిక్స్ అగర్ అలియసిమ్ (కెనడా) 6–4, 6–1, 6–1తో డానియెల్ ఇవాన్స్ (ఇంగ్లండ్)పై, 11వ సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 1–6, 3–6, 6–1తో తరో డానియెల్ (జపాన్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 4–6, 6–3, 6–1తో మర్కెటా వొండ్రోసొవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–3తో డారియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. 14వ సీడ్ హలెప్ 6–2, 6–1తో డంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై గెలిచింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల మోత
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా భావించిన మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), యూఎస్ ఓపెన్ చాంపియన్, బ్రిటన్ టీనేజర్ ఎమ్మా రాడుకాను, ఆరో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడో ర్యాంకర్ ముగురుజా 3–6, 3–6తో 61వ ర్యాంకర్ అలిజె కార్నె (ఫ్రాన్స్) చేతిలో... 17వ సీడ్ రాడుకాను 4–6, 6–4, 3–6తో 98వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో) చేతిలో... కొంటావీట్ 2–6, 4–6తో 39వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. అలిజె కార్నెతో జరిగిన మ్యాచ్‌లో 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా 33 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో బరిలోకి దిగి ఏకంగా టైటిల్‌ను సాధించి పెను సంచలనం సృష్టించిన బ్రిటన్ టీనేజర్ రాడుకాను ఇక్కడ మాత్రం అద్భుతం చేయలేకపోయింది. కొవినిచ్తో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రాడుకాను నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. కొవినిచ్ సర్వీస్‌లో 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వస్తే రాడుకాను ఆరుసార్లు సద్వినియోగం చేసుకుంది. తన సర్వీస్‌ను ఏడుసార్లు చేజార్చుకుంది. ఈ గెలుపుతో కొవినిచ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో మూడో రౌండ్‌కు చేరిన తొలి మోంటెనిగ్రో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 1–6, 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, హలెప్ 6–2, 6–0తో బీట్రిజ్ (బ్రెజిల్)పై, స్వియాటెక్ 6–2, 6–2తో రెబెకా పీటర్సన్ (స్వీడన్)పై గెలిచారు. మెద్వెదెవ్ కష్టపడి... పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కష్టపడి మూడో రౌండ్లోకి చేరుకున్నారు. మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 7–6 (7/1), 4–6, 6–4, 6–2తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా... సిట్సిపాస్ 3 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/1), 6–7 (5/7), 6–3, 6–4తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–0తో బెరాన్కిస్ (లిథువేనియా)పై, తొమ్మిదో సీడ్ ఫిలిక్స్ అలియాసిమ్ (కెనడా) 4 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/4), 6–7 (4/7), 7–6 (7/5), 7–6 (7/4)తో ఫోకినా (స్పెయిన్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) 4–6, 4–6, 4–6తో టారో డానియల్ (జపాన్) చేతిలో... 13వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–7 (6/8), 4–6, 4–6తో క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు. -
Novak Djokovic: ఆస్ట్రేలియా ప్రభుత్వంపై పరువునష్టం దావా.. ఏకంగా 32 కోట్లకు..!
Djokovic To Sue Australian Govt: వ్యాక్సిన్ తీసుకోలేదన్న కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనను ఆడనీయకుండా అడ్డుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. స్కాట్ మోరిసన్ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నాడు. తన 21వ గ్రాండ్‌స్లామ్ కలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బలవంతంగా క్వారంటైన్‌కు తరలించడాన్ని కారణాలుగా చూపుతూ 32 కోట్ల రూపాయలకు దావా వేయాలని డిసైడయ్యాడు. దీనిపై ప్రస్తుతం లాయర్లతో చర్చిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మెల్ బోర్న్ వెళ్ళిన జకోవిచ్‌ను కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్న సంగతి తెలిసిందే. జకో.. టోర్నీలో పాల్గొనేందుకు నిర్వహకులు అనుమతించినప్పటికీ, ఆ దేశ ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అతన్ని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించింది. వ్యాక్సిన్ తీసుకోని కారణంగా అతన్ని దేశంలోకి అనుమతించలేమని, అలాగే అతని వీసాను కూడా రద్దు చేస్తున్నామని స్పష్టం చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయించిన జకోకు మొదట్లో ఉపశమనం లభించినా.. ఆతర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వాన్నే విజయం వరించింది. ఈ విషయాన్ని చాలా సీరియన్‌గా తీసుకున్న జకో.. స్వదేశానికి వెళ్లగానే ఆస్ట్రేలియా ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీతో పోలిస్తే అతను దావా వేయాలనుకున్న మొత్తం చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే, ఈ సెర్బియన్ యోధుడు ఇటీవలే ఔషధ తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అతనికి కోవిడ్ విరుగుడు మందు తయారు చేసే క్వాంట్ బయోరెస్ అనే ఔషధ తయారీ సంస్థలో 80 శాతం వాటా ఉన్నట్లు సదరు కంపెనీ సీఈఓ స్వయంగా వెల్లడించాడు. చదవండి: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..! -
కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..!
Djokovic Holds Major Stake In Firm Developing Covid Drug: వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనకుండా గెంటి వేయబడ్డ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. ఔషధ తయారీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. అతడికి కోవిడ్ విరుగుడు మందు తయారు చేసే సంస్థలో భారీ వాటా ఉన్నట్లు.. సదరు కంపెనీ సీఈఓనే స్వయంగా వెల్లడించాడు. డానిష్‌కు చెందిన క్వాంట్ బయోరెస్ అనే కోవిడ్ ఔషధ తయారీ సంస్థలో జకో, అతని భార్యకు 80 శాతం వాటా ఉన్నట్లు సంస్థ సీఈఓ ఇవాన్ తెలిపాడు. త్వరలో తమ ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ వార్తలపై జకోవిచ్ స్పందించాల్సి ఉంది. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందకు అనుమతి లభించక పోవడంతో.. 21వ గ్రాండ్‌స్లామ్ గెలిచే అవకాశాన్ని జకోవిచ్ చేజార్చుకున్నాడు. మరోవైపు అతను వ్యాక్సిన్ వేసుకోకపోతే ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా అడనిచ్చేది లేదని ఫ్రెంచ్ అధికారులు సైతం స్పష్టం చేశారు. దీంతో జకో వ్యాక్సిన్ వేసుకుంటాడా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకింది. చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు -
ఒసాకా అలవోకగా...
మానసిక ఆందోళనతో గత ఏడాది ఇబ్బంది పడి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కొత్త సంవత్సరంలో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా దాటింది. అనవసర తప్పిదాలు చేసినా నిరాశకు లోనుకాకుండా నవ్వుతూ ఆడిన ఈ 14వ ర్యాంకర్ కెరీర్లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. మెల్బోర్న్: తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించిన నయోమి ఒసాకా (జపాన్), యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్, 13వ సీడ్ ఒసాకా 6–3, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై, టాప్ సీడ్ బార్టీ 6–0, 6–1తో క్వాలిఫయర్ లెసియా సురెంకో (ఉక్రెయిన్)పై గెలిచారు. ఒసోరియాతో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 68 నిమిషాల్లో గెలిచింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఒసాకా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 15సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచిన ఒసాకా 28 అనవసర తప్పిదాలు చేసింది. సురెంకోతో జరిగిన మ్యాచ్‌లో బార్టీ కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయింది. నాదల్ బోణీ... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన నాదల్ తొలి రౌండ్లో 6–1, 6–4, 6–2తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై నెగ్గగా... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న జ్వెరెవ్ 7–6 (7/3), 6–1, 7–6 (7/1)తో అల్టామెర్ (జర్మనీ)పై గెలిచాడు. గిరోన్తో మ్యాచ్‌లో నాదల్ ఏడు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. 34 విన్నర్స్ కొట్టిన నాదల్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 12వ సీడ్ కామెరాన్ నోరి (బ్రిటన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతోన్న సెబాస్టియన్ కోర్డా (అమెరికా) 6–3, 6–0, 6–4తో నోరిపై గెలిచాడు. ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 4–6, 6–2, 7–6 (7/5), 6–3తో నకషిమా (అమెరికా)పై, పదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–2, 7–6 (7/3), 6–7 (5/7), 6–3తో జెరాసిమోవ్ (బెలారస్)పై నెగ్గారు. కెనిన్‌కు షాక్... మహిళల సింగిల్స్‌లో తొలి రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. 2020 చాంపియన్, 11వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), 18వ సీడ్ కోకో గాఫ్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/2), 7–5తో కెనిన్‌ను ఓడించగా... ప్రపంచ 112వ ర్యాంకర్ కియాంగ్ వాంగ్ (చైనా) 6–4, 6–2తో కోకో గాఫ్‌పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–4, 7–6 (7/2)తో తాత్యానా మరియా (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–4, 6–0తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. -
Novak Djokovic: జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా భారీ షాక్.. ఓడిపోతే ఇక అంతే!
ఆస్ట్రేలియా ఓపెన్ డ్రా చూస్తే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ తప్పక బరిలోకి దిగుతాడనిపించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రపంచ నంబర్‌వన్‌కు బహిష్కరణ తప్పేలా లేదు. మామూలుగా టెన్నిస్ కోర్టులో ఆటగాడు ‘డబుల్‌ఫాల్ట్’ చేస్తాడు. కానీ ప్రభుత్వం దెబ్బకు ఈ టాప్‌సీడ్ ‘డబుల్‌ఫాల్ట్’ అయ్యాడు. రెండో సారీ అతని వీసా రద్దయింది. ఆసీస్ విదేశీ మంత్రిత్వశాఖ తన విచక్షణాధికారం మేరకు అతని వీసాను రెండోసారి రద్దు చేసింది. దేశ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ‘టెన్నిస్ లెజెండ్’ను అమర్యాదగా సాగనంపబోమని, కొన్ని రోజులు ఇక్కడ ఉండే వెసులుబాటు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జొకో మాత్రం ‘తగ్గేదేలే’... వెనక్కి వెళ్లేదేలే అంటున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై తన న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలిపాడు. తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లోని 20 టైటిళ్లలో 9 సార్లు విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను అంత తేలిగ్గా వదిలేలా లేడు. ప్రాక్టీస్‌లో అతను శ్రమిస్తుంటే... అతని లీగల్ టీమ్ కోర్టులో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఫెడరల్ సర్క్యూట్‌లోని ఫ్యామిలీ కోర్టులో అత్యవసర విచారణ కోసం అప్పీల్ చేసింది. సోమవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుండటంతో ఫెడరల్ కోర్టు నేడు (శనివారం) అత్యవసర విచారణ చేపడుతుందా లేదంటే విచారణను తిరస్కరిస్తుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు. ఈ ఫెడరల్ కోర్టులోనే మొదటిసారి రద్దయిన వీసాను పునరుద్దరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి వీసా పునరుద్ధరణ లభించినప్పటికీ మళ్లీ రద్దు చేసే అధికారం విదేశీ మంత్రిత్వ శాఖకు ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖ రద్దు చేసింది. ఇలా ఒక వ్యక్తికి వరుసగా రెండోసారి వీసా రద్దు చేస్తే... అతను మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. జొకో న్యాయ పోరాటం చేసి విఫలమైతే మూడేళ్లు అంటే 2025 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే అవకాశం రాదు. చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
కరోనా పాజిటివ్ వచ్చినందుకే జకోవిచ్‌ను..
మెల్బోర్న్: కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా... ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఇచ్చారనే కారణాన్ని ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు అతని తరఫు లాయర్లు వివరించారు. గత నెల డిసెంబర్ 16వ తేదీన జొకోవిచ్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని... ఆ సమయంలో అతనికి ఎలాంటి జ్వరంగానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులుగానీ లేవని సెర్బియా స్టార్ తరఫు లాయర్లు శనివారం కోర్టుకు సమర్పించిన పత్రాలలో వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ...గత ఆరు నెలల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ తీసుకోకున్నా... ప్రత్యేక మినహాయింపు ద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేందుకు అవకాశం ఇస్తారు. జొకోవిచ్‌కు డిసెంబర్ 16న కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా... అదే రోజు, ఆ మరుసటి రోజు బెల్గ్రేడ్లో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అతను పాల్గొనడం గమనార్హం. 17వ తేదీన తన ముఖచిత్రంతో ముద్రించిన తపాళా బిళ్లను స్వయంగా జొకోవిచ్ విడుదల చేశాడు. 16వ తేదీన నొవాక్ జొకోవిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్‌లోనూ ఈ సెర్బియా స్టార్ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను జొకోవిచ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ కూడా చేశాడు. ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు 5వ తేదీన మెల్బోర్న్ వచ్చిన జొకోవిచ్ వద్ద అవసరమైన పత్రాలు లేవని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా బోర్డర్ ఆఫీసర్లు అతడిని అడ్డుకున్నారు. అతనికి జారీ చేసిన వీసాను రద్దు చేశారు. బోర్డర్ ఆఫీసర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జొకోవిచ్ కోర్టుకెక్కాడు. సోమవారం జొకోవిచ్ కేసు విచారణకు రానుంది. -
Australia Open 2022: జకోవిచ్‌కు కరోనా..!
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పాల్గొనేందుకు మెల్బోర్న్కు వచ్చిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్‌ను కోవిడ్ టీకాలు తీసుకోని కారణంగా టోర్నీలో ఆడనిచ్చేదిలేదని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో.. జకో తరపు లాయర్లు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతేడాది డిసెంబర్ 16న జకోకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, అందుకే అతను వ్యాక్సిన్ వేసుకునేందుకు మినహాయింపు కోరాడని, టోర్నీ నిర్వాహకులు అందుకు మినహాయింపు ఇస్తేనే జకో మెల్బోర్న్కు వచ్చాడని లాయర్లు వాదిస్తున్నారు. కాగా, కోవిడ్ టీకా వేసుకోకపోవడమే కాకుండా సరైన పత్రాలు చూపలేదన్న కారణంగా మెల్బోర్న్ విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ అధికారులు జకోను డెటెన్షన్ సెంటర్లో ఉంచి, వీసాను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జకోవిచ్ నాయపోరాటం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే అతని తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ విషయమై సోమవారం కోర్టు తీర్పు వెల్లడించనుంది. చదవండి: అందుకే వచ్చాను... మరి ఇప్పుడేంటి ఇలా: జొకోవిచ్ -
Roger Federer: ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరం.. రిటైర్ అవుతున్నాడా..!
Roger Federer Likely To Miss Australian Open Not Thinking About Retirement: జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఆడే అవకాశాలు లేవని అతడి కోచ్ లుబిసిచ్ తెలిపాడు. అయితే 2022లోనే ఏదో ఒక టోర్నీ ద్వారా ఫెడరర్ పునరాగమనం చేస్తాడని లుబిసిచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో చివరిసారిగా ఆడిన ఫెడరర్... అనంతరం మెకాలికి మరోసారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ లుబిసిచ్ మాట్లాడుతూ.. ‘‘అతడు కోలుకుంటున్నాడు. టోర్నమెంట్లు ఆడాలని భావిస్తున్నాడు. పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. వందకు వంద శాతం తను తిరిగి కోర్టులో అడుగుపెడతాడు. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్‌కు మాత్రం అందుబాటులో ఉండడు. తనకు ఇప్పుడు 40 ఏళ్లు. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అంతేగానీ రిటైర్మెంట్ ఆలోచన లేదు’’అని చెప్పుకొచ్చాడు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్! -
US Open 2021: రికార్డులపై జొకోవిచ్ గురి
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ జొకోవిచ్‌ను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. అందులో ఒకటి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) కాగా... రెండోది పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నిలువడం. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్‌ను గెలిచాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) సరసన చేరాడు. యూఎస్ ఓపెన్‌లోనూ జొకోవిచ్ గెలిస్తే 21 టైటిల్స్‌తో కొత్త చరిత్రను సృష్టిస్తాడు. అంతేకాకుండా దిగ్గజ ప్లేయర్ రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలుస్తాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున జరిగే తొలి రౌండ్లో క్వాలిఫయర్ హోల్గర్ రునే (డెన్మార్క్) తో జొకోవిచ్ తలపడతాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నయోమి ఒసాకా ఫోటోలు
-
జయహో జొకోవిచ్
తనకెంతో కలిసొచ్చిన వేదికపై ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ చెలరేగాడు. రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ చాంపియన్‌గా నిలిచాడు. రష్యా యువతార డానిల్ మెద్వెదేవ్‌ను ఆద్యంతం హడలెత్తించి... వరుస సెట్లలోనే చిత్తు చేసి... ఈ మెగా టోర్నీ ఫైనల్స్‌లో తన అజేయ రికార్డును కొనసాగించాడు. కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ తన ప్రత్యర్థి దూకుడుకు ఎదురు నిలువలేక మరోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. మెల్బోర్న్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 7–5, 6–2, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను ఓడించాడు. తాజా గెలుపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు. ► 113 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్ కు తొలి సెట్లో మినహా ఎక్కడా గట్టిపోటీ ఎదురుకాలేదు. కచ్చితమైన సర్వీస్, బుల్లెట్‌లాంటి రిటర్న్ షాట్లు,బేస్‌లైన్ వద్ద అద్భుత ఆటతీరుతో జొకో విచ్ చెలరేగడంతో మెద్వెదేవ్‌కు ఓటమి తప్పలేదు. ► తాజా విజయంతో 33 ఏళ్ల జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో తన విజయాల రికార్డును 9–0తో మెరుగుపర్చుకున్నాడు. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు చాంపియన్‌గా నిలిచాడు. ► విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 27 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 కోట్ల 71 లక్షలు), 2000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్‌గా నిలిచిన మెద్వెదేవ్‌కు 15 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 57 లక్షలు), 1200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ► ఫైనల్ చేరే క్రమంలో కేవలం రెండు సెట్లు మాత్రమే కోల్పోయిన మెద్వెదేవ్ ఆటలు తుది పోరులో మాత్రం సాగలేదు. తొలి సెట్ రెండో గేమ్‌లోనే మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆలస్యంగా తేరుకున్న మెద్వెదేవ్ ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 3–3తో సమం చేశాడు. అయితే 6–5తో ఆధిక్యంలోకి వెళ్లిన జొకోవిచ్ 12వ గేమ్‌లో మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ► రెండో సెట్ బ్రేక్ పాయింట్లతో మొదలైంది. ఇద్దరూ తమ సర్వీస్‌లను చేజార్చుకోవడంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. ఆ తర్వాత జొకోవిచ్ జోరు పెంచడంతో మెద్వెదేవ్ డీలా పడ్డాడు. రెండుసార్లు మెద్వెదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ► మూడో సెట్ ఆరంభంలోనే జొకోవిచ్ బ్రేక్ పాయింట్ సాధించి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మెద్వెదేవ్ తేరుకునేందుకు ప్రయత్నించినా జొకోవిచ్ దూకుడు ముందు సాధ్యంకాలేదు. ► తాజా టైటిల్‌తో జొకోవిచ్ మార్చి 8వ తేదీ వరకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాడగం ఖాయమైంది. తద్వారా అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా (311 వారాలు) జొకోవిచ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఫెడరర్ (310 వారాలు) పేరిట ఉంది. ► 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున)కు చేరువయ్యాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకసారి... వింబుల్డన్‌లో ఐదుసార్లు... యూఎస్ ఓపెన్‌లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. కొత్త తరం ఆటగాళ్లు తెరపైకి వచ్చారని, తమ ఆటతో మా ముగ్గురిని (ఫెడరర్, నాదల్, జొకోవిచ్) వెనక్కి నెట్టేస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నాకు మాత్రం అలా అనిపించడంలేదు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లంటే గౌరవం ఉంది. కానీ వారు ‘గ్రాండ్’ విజయాలు సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాలి. రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండటం... టోర్నీ మధ్యలో గాయపడటం... మొత్తానికి నా కెరీర్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడిన గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇది. ఈ టోర్నీతో నేను కొత్త పాఠాలు నేర్చుకున్నాను. – జొకోవిచ్ విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలతో జొకోవిచ్, మెద్వెదేవ్ -
జొకోవిచ్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్: సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ తన కెరీర్లో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్( 4వ సీడ్)ను 7-5,6-2,6-2తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్లో మాత్రమే జొకోవిచ్‌ను కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అయితే తర్వాత జొకోవిచ్ అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో పదునైన సర్వీస్ షాట్లు ఆడి రెండు సెట్లను గెలుచుకోవడంతో మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో కెరీర్లో తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను.. మొత్తంగా 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అంతేగాక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 82-9 తో తన విజయాల రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్ మరో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తే 20 గ్రాండ్‌స్లామ్స్‌తో ఫెదరర్, నాదల్ సరసన నిలవనున్నాడు. -
హబ్బీ అంటే నువ్వేరా అబ్బీ!
ఊఫ్! సెమీస్‌లో సెరీనా డౌన్ అయ్యారు! కానీ మొన్న చూడాలి. క్వార్టర్ ఫైనల్స్‌లో తన ప్రత్యర్థి సిమోవా హ్యాలెప్ను నాకౌట్ చేస్తుంటే సెరెనా భర్త అలెక్స్ మురిసిపోయారు. ఆరోజు ఆయన వేసుకున్న వైట్ టీ షర్ట్ సెరెనా గుండెల్లో పూలు పూయించే ఉండాలి. ఆ టీ షర్ట్‌పై రాకెట్ పట్టుకుని ఉన్న సెరెనా ఇలస్ట్రేషన్ ఉంది! అలెక్స్ వేసుకున్న టీ షర్ట్ మీది సెరెనా బొమ్మ పక్కనే పెద్ద అక్షరాలతో ‘గ్రేటెస్ట్ ఫిమేల్ అథ్లెట్’ అని రాసి ఉంది. ఫిమేల్ అనే మాటపై అడ్డంగా ఇంటూ కొట్టి ఉంది. అది ఓ కంపెనీ తయారు చేసిన టీ షర్ట్. కొట్టేయడం ఎందుకంటే ఫిమేల్ అనే మాట సెరెనాకు నచ్చదు.‘గ్రేట్ అథ్లెట్స్ ఉంటారు కానీ, గ్రేట్ ఉమెన్ అథ్లెట్స్ అంటూ ఎక్కడా ఉండరు’ అని సెరెనా కొన్నేళ్ల క్రితం వాదనగా అన్న ఆ మాట కోట్గా ప్రసిద్ధి చెందింది. అది దృష్టిలో పెట్టుకునే ఆ టీషర్ట్ కంపెనీ ఆ విధంగా ఇంటూ కొట్టినట్లున్న కాప్షన్‌తో షర్ట్‌ను డిజైన్ చేసింది. దానిని అలెక్స్ ధరించి ఆమె ఆట చూడటానికి వచ్చారు. ‘నువ్వు కరెక్ట్’ అని భార్యకు సంకేతం ఇవ్వడం అది. భార్య బొమ్మ ఉన్న షర్ట్‌ని వేసుకొచ్చాడంటే.. ‘నువ్వు గెలిచి తీరతావ్’ అని చెప్పడం అది. భర్త అంత ప్రోత్సాహం ఇస్తూ కళ్లెదుట కనిపిస్తుంటే సెమీస్‌ను కూడా గెలిచేస్తారని సెరెనా అభిమానులు అనుకున్నారు. అయితే నవోమీ గెలిచారు. గురువారం సెమీస్‌లో సెరెనా ఓడిపోయినప్పటికీ అదేమీ పెద్దగా బాధించే విషయం అవలేదు అలెక్స్‌కి. ‘బాగా ఆడావ్’ అని అన్నారు. అలెక్స్ (అలెక్సిస్ ఒహానియన్) అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యూర్, ఇన్వెస్టర్. ‘రెడిట్’ కంపెనీ ఆయనదే. సెరెనాతో పెళ్లి కాకముందు సెరెనాకు పెద్ద ఫ్యాన్ అతడు. ప్రేమించి, ‘విల్యూ మ్యారీ మీ’ అని ప్రపోజ్ చేసి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ‘బ్లాక్ అండ్ వైట్. రెడిట్ టు ఫైట్’ అని ఆ స్థాయిలోని ఫ్రెండ్స్ కూడా అతడిని ఆట పట్టించారని అంటారు. అది తెలిసి సెరెనా కూడా నవ్వుకున్నారట. ఇప్పుడు ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. సెరెనా టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆయన మరింత హ్యాపీగా ఉంటారు. మూడేళ్ల కూతురు ఒలింపియా తండ్రితో కలిసి తల్లి ఆటను చూస్తూ, మూడ్‌ని బట్టి చప్పట్లు కొడుతుంటుంది. ఆ దృశ్యం అలెక్స్‌కి మరింత ఆనందాన్నిస్తుందట. 2017 జనవరి 1 ఆక్లాండ్‌లో ఉన్నారు సెరెనా అలెక్స్. న్యూజిలాండ్ జనాభా మొత్తం జనవరి ఫస్ట్ కోసం ఆక్లాండ్ వచ్చినట్లుగా ఉన్నారు ఆ రోజు. ఒకరికొకరు తగులుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడే వాళ్లొక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏడాదే పెళ్లి చేసుకోవాలని. అప్పుడు కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ చూడ్డానికే సెరెనాతో కలిసి యు.ఎస్. నుంచి ఆక్లాండ్ వెళ్లారు అలెక్స్. చదవండి: (చేజారిన ఆశలు : సెరెనా భావోద్వేగం) -
నాదల్ కల చెదిరె..
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బుధవారం సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఏకై క ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాలనుకున్న స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ కల చెదిరింది. మహిళల విభాగంలోనూ టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)కి చుక్కెదురైంది. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 13వ సారి క్వార్టర్స్ చేరిన నాదల్ గెలుపు అంచుల నుంచి ఓటమిని ఆహ్వానించాడు. 4 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–2, 6–7 (4/7), 4–6, 5–7తో ఐదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీక్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లను నెగ్గి, నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో అనవసర తప్పిదాలతో నాదల్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టైబ్రేక్ 3/3తో సమమైన దశలో 3 అనవసర తప్పిదాలు చేసిన నాదల్ 4/7తో సెట్‌ను సిట్సిపాస్‌కు కోల్పోయాడు. మరోవైపు అనూహ్యంగా పుంజుకున్న సిట్సిపాస్ జాగ్రత్తగా ఆడుతూ నాలుగో సెట్లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–4తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–4తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఐదో సెట్లో ఓ దశలో ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. అయితే పదకొండో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్... పన్నెండో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 7–5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాదల్‌తో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లలో వెనుకబడి తర్వాత విజయం సాధించిన రెండో ప్లేయర్‌గా 22 ఏళ్ల సిట్సిపాస్ ఘనత వహించాడు. 2015 యూఎస్ ఓపెన్‌లో ఫాబియో ఫాగ్నిని ఇదే తరహాలో నాదల్‌పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్ 18, నాదల్ 15 ఏస్‌లు సంధించారు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 2019 యూఎస్ ఓపెన్ రన్నరప్, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 7–5, 6–3, 6–2తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో సిట్సిపాస్‌తో మెద్వెదెవ్ తలపడతాడు. బార్టీకి షాక్ మహిళల విభాగంలో సొంత మైదానంలో జరిగిన పోరులో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీకి 25వ సీడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) షాకిచ్చింది. గంటా 7 నిమిషాల పాటు సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బార్టీ 1–6, 6–3, 6–2తో ముచోవా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లు సంధించిన బార్టీ 3 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు 2 ఏస్‌లే సంధించిన ముచోవా... ప్రత్యర్థి సర్వీస్‌ను 4సార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను 3 సార్లు కోల్పోయింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) 4–6, 6–2, 6–1తో జెస్సికా పెగులా (అమెరికా)పై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. నేడు జరిగే మహిళల తొలి సెమీస్‌లో సెరెనా (అమెరికా)తో నయోమి ఒసాకా (జపాన్), రెండో సెమీస్‌లో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) తలపడతారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. 25వ సీడ్ కరోలినా ముచోవా చేతిలో 6-1,3-6,2-6 తేడాతో ఓడి బార్టీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్లో 6-1తో వెనుకబడిన ముచోవా.. రెండో సెట్లో ఫుంజుకొని 3-6తో సెట్‌ను గెలుచుకుంది. కీలకమైన మూడోసెట్‌లోనూ ముచోవా అదే జోరు కొనసాగించి 2-6తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకొని సెమీస్‌కు ప్రవేశించింది. 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ, అన్‌సీడెడ్ జెస్సికా పెగులా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ముచోవా సెమీస్‌లో తలపడనుంది. కాగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో పదో సీడ్ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో నయామి ఒసాకాతో సెరెనా తలపడనుంది. -
సెమీస్‌కు సెరెనా
మెల్బోర్న్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో పదో సీడ్ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో సెరెనా సెమీస్‌కు చేరడం ఇది తొమ్మిదోసారి. గంటా 21 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 4 ఏస్‌లు సంధించిన ఆమె కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. సెమీఫైనల్లో మూడో సీడ్ నమోమి ఒసాకా (జపాన్)తో తలపడనుంది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఒసాకా గంటా 6 నిమిషాల్లో 6–2, 6–2తో 71వ ర్యాంకర్ సెసువె (తైవాన్)పై సులువుగా గెలుపొంది సెరెనాతో పోరుకు సిద్ధమైంది. కరాత్సెవ్ సంచలనం పురుషుల విభాగంలో క్వాలిఫయర్, 114వ ర్యాంకర్ అస్లాన్ కరాత్సెవ్ మరో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. 2 గంటల 32 నిమిషాల పాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో కరాత్సెవ్ (రష్యా) 2–6, 6–4, 6–1, 6–2తో 18వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై నెగ్గి అరంగేట్ర గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే సెమీస్‌కు చేరిన ఆటగాడిగా ఘనత వహించాడు. ఈ మ్యాచ్‌లో 9 ఏస్‌లు సంధించిన కరాత్సెవ్ 6 డబుల్‌ఫాల్ట్‌లు చేశాడు. మరో క్వార్టర్స్ పోరులో టాప్ సీడ్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–7 (6/8), 6–2, 6–4, 7–6 (8/6)తో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై శ్రమించి గెలుపొందాడు. ఈ మ్యాచ్ 3 గంటల 30 నిమిషాల పాటు సాగింది. సెమీస్‌లో జొకోవిచ్‌తో కరాత్సెవ్ తలపడనున్నాడు. -
నాదల్ జోరు
మెల్బోర్న్: పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పే దిశగా రాఫెల్ నాదల్ దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ స్పెయిన్ టెన్నిస్ స్టార్ 13వసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ఏకపక్ష ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ నాదల్ 6–3, 6–4, 6–2తో ప్రపంచ 17వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)పై గెలుపొందాడు. 2015 యూఎస్ ఓపెన్‌లో నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఫాగ్నిని ఈసారి మాత్రం చేతులెత్తేశాడు. 2 గంటల 16 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ ఫాగ్నినికి అవకాశం ఇవ్వని నాదల్ ఆరు ఏస్‌లు సంధించి, ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో నాదల్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్‌కు తన ప్రత్యర్థి, తొమ్మిదో సీడ్ బెరెటిని (ఇటలీ) నుంచి వాకోవర్ లభించింది. రష్యా యువ స్టార్ ఆటగాళ్లు మెద్వెదేవ్, రుబ్లెవ్ కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ మెద్వెదేవ్ 6–4, 6–2, 6–3తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై నెగ్గగా... ఏడో సీడ్ రుబ్లెవ్ 6–2, 7–6 (7/3)తో కాస్పెర్ రూడ్ (నార్వే)ను ఓడించాడు. రెండు సెట్లు ముగిశాక గాయం కారణంగా రూడ్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. యాష్లే బార్టీ దూకుడు... మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) క్వార్టర్ ఫైనల్ చేరగా... ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)కు అమెరికా యువతార జెస్సికా పగూలా షాక్ ఇచ్చింది. బార్టీ 6–3, 6–4తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై గెలుపొందగా... జెస్సికా పగూలా 6–4, 3–6, 6–3తో స్వితోలినాను బోల్తా కొట్టించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 7–5తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా) 6–1, 7–5తో డొనా వెకిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. -
శ్రమించి... సాధించి
మెల్బోర్న్: తొలి మూడు రౌండ్లలో అంతగా కష్టపడకుండానే విజయాలు నమోదు చేసుకున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), సిమోనా హలెప్ (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్)లకు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం గట్టి పోటీనే ఎదురైంది. అయితే ఈ ‘గ్రాండ్‌స్లామ్ విన్నర్స్’ కీలకదశలో తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన పదో సీడ్ సెరెనా 2 గంటల 9 నిమిషాల్లో 6–4, 2–6, 6–4తో ఏడో సీడ్ సబలెంకా (బెలారస్)పై... రెండో సీడ్ హలెప్ గంటా 50 నిమిషాల్లో 3–6, 6–1, 6–4తో గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై... మూడో సీడ్ ఒసాకా గంటా 55 నిమిషాల్లో 4–6, 6–4, 7–5తో గత ఏడాది రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)పై అద్భుత విజయాలు సాధించారు. ముగురుజాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్లో ఒసాకా 3–5తో వెనుకబడింది. రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాచుకున్న ఆమె వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–4, 6–2తో 2019 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, 19వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన సె సువె సింగిల్స్ విభాగంలో మాత్రం తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో సీడ్ థీమ్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన థీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 4–6, 0–6తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో థీమ్ ఏకంగా 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. పది ఏస్‌లు సంధించడంతోపాటు థీమ్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన దిమిత్రోవ్ ఈ గెలుపుతో నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. జొకోవిచ్ @ 300 మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), క్వాలిఫయర్ అస్లాన్ కరాత్సెవ్ (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 7–6 (7/4), 4–6, 6–1, 6–4తో 14వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో 300వ విజయాన్ని నమోదు చేశాడు. ఫెడరర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మరో మ్యాచ్‌లో కరాత్సెవ్ 3–6, 1–6, 6–3, 6–3, 6–4తో 20వ సీడ్ ఉజెర్ ఆలియాసిమ్ (కెనడా)ను ఓడించి అరంగేట్రం గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన ఏడో క్రీడాకారుడిగా ఘనత వహించాడు. మరో మ్యాచ్‌లో జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–3తో లజోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాదల్ దూకుడు
మెల్బోర్న్: కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 7–5, 6–2, 7–5తో కామెరూన్ నోరి (బ్రిటన్)పై వరుస సెట్లలో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు 16 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన నాదల్ 14 సార్లు కనీసం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. నోరితో 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్ ఏడు ఏస్‌లు సంధించి కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే కోల్పోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)తో నాదల్ ఆడతాడు. ముఖాముఖి పోరులో నాదల్ 12–4తో ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ల్లో మాత్రం వీరిద్దరు రెండుసార్లు తలపడ్డారు. ఒక్కోసారి గెలిచారు. మూడో రౌండ్లో ఫాగ్నిని 6–4, 6–3, 6–4తో అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మెద్వెదేవ్ ఎట్టకేలకు... పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ బెరెటిని (ఇటలీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదేవ్ 6–3, 6–3, 4–6, 3–6, 6–0తో ఫిలిప్ క్రాయినోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఐదు సెట్లపాటు జరిగిన మ్యాచ్‌ల్లో తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. గతంలో మెద్వెదేవ్ ఆరుసార్లు ఐదు సెట్లపాటు జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. సిట్సిపాస్ 6–4, 6–1, 6–1తో మికెల్ వైమెర్ (స్వీడన్)పై, రుబ్లెవ్ 7–5, 6–2, 6–3తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై, బెరెటిని 7–6 (7/1), 7–6 (7/5), 7–6 (7/5)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచారు. యాష్లే బార్టీ జోరు మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. యాష్లే బార్టీ 6–2, 6–4తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై, స్వితోలినా 6–4, 6–0తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై నెగ్గారు. ప్లిస్కోవా 5–7, 5–7తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో... బెన్సిచ్ 2–6, 1–6తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో ఓటమి పాలయ్యారు. ముకోవాతో గంటా 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ప్లిస్కోవా ఏకంగా పది డబుల్ ఫాల్ట్‌లు, 40 అనవసర తప్పిదాలు చేసింది. ముగిసిన భారత్ పోరు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–యింగ్యింగ్ దువాన్ (చైనా) జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. 63 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న–యింగ్యింగ్ ద్వయం 4–6, 4–6తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. దాంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లందరూ తొలి రౌండ్‌ను దాటకుండానే వెనుదిరిగారు. పురుషుల సింగిల్స్‌లో సుమీత్ నాగల్... పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, మహిళల డబుల్స్‌లో అంకిత రైనా జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కెనిన్‌కు షాక్
మెల్బోర్న్: ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల డిఫెండింగ్ చాంపియన్ కెనిన్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ఇంటి దారి పట్టింది. ఈస్టోనియాకు చెందిన 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ కియా కానెపి 2020 చాంపియన్‌పై సంచలన విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) ముందంజ వేశారు. భారత క్రీడాకారులకు డబుల్స్‌లో చుక్కెదురైంది. మహిళల్లో మరో సంచలనం మహిళల సింగిల్స్‌లో నాలుగో రోజు కూడా సంచలన ఫలితం వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరుటి విజేత కెనిన్ ఆట రెండో రౌండ్లోనే ముగిసింది. అన్‌సీడెడ్ ప్లేయర్ కియా కానెపి వరుస సెట్లలో 6–3, 6–2తో నాలుగో సీడ్ కెనిన్‌పై అలవోక విజయం సాధించింది. 2007 నుంచి క్రమం తప్పకుండా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా... క్వార్టర్స్ చేరని 35 ఏళ్ల కానెపి ఈ సీజన్లో మాత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కేవలం గంటా 4 నిమిషాల్లోనే 22 ఏళ్ల అమెరికా యువ క్రీడాకారిణిని కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 7–6 (9/7)తో తమ దేశానికే చెందిన వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డారియా గావ్రిలొవాపై శ్రమించి నెగ్గింది. తొలిసెట్‌ను ఏకపక్షంగా ముగించిన ప్రపంచ నంబర్‌వన్‌కు రెండో సెట్లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. అనామక ప్లేయర్ డారియా అద్భుతంగా పుంజుకోవడంతో ప్రతి పాయింట్ కోసం బార్టీకి చెమటోడ్చక తప్పలేదు. హోరాహోరీగా జరిగిన రెండో సెట్ చివరకు టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ కూడా స్వదేశీ ప్రత్యర్థి ఏమాత్రం తగ్గకపోవడంతో టాప్‌సీడ్ సర్వశక్తులు ఒడ్డి గెలిచింది. ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో డానియెల్లా కొలిన్స్ (అమెరికా)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–3తో కొకొ గాఫ్ (అమెరికా)పై అలవోక విజయం సాధించారు. 11వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) 7–5, 2–6, 6–4తో స్వెత్లానా కుజ్నెత్సొవా (రష్యా)పై చెమటోడ్చి గెలిచింది. నాదల్ జోరు కెరీర్లో 21వ టైటిల్‌పై కన్నేసిన నాదల్ తన జోరు కొనసాగించాడు. పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో స్పానిష్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6–1, 6–4, 6–2తో క్వాలిఫయర్ మైకేల్ మోహ్ (అమెరికా)పై సునాయాస విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఓ వైల్డ్‌కార్డ్ ప్లేయర్‌పై రెండో రౌండ్ గెలిచేందుకు ఐదో సీడ్ సిట్సిపాస్ నాలుగున్నర గంటల పాటు పోరాడాడు. చివరకు గ్రీస్ ప్లేయర్ 6–7 (5/7), 6–4, 6–1, 6–7 (5/7), 6–4తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఊపిరిపీల్చుకున్నాడు. నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–2, 7–5, 6–1తో కార్బలెస్ బయెనా (స్పెయిన్)పై, ఏడో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 7–6 (10/8)తో మాంటెరియా (బ్రెజిల్)పై విజయం సాధించగా, తొమ్మిదో సీడ్ మట్టె బెరెటినీ (ఇటలీ) 6–3, 6–2, 4–6, 6–3తో క్వాలిఫయర్ టామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)పై కష్టంమీద గెలిచాడు. 16వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 4–6, 6–2, 2–6, 6–3, 7–6 (14/12) తన దేశానికే చెందిన కరుసోపై సుదీర్ఘ పోరాటం చేసి నెగ్గాడు. సుమారు నాలుగు గంటల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ జరిగింది. 28వ సీడ్ క్రాజినొవిక్ (సెర్బియా) 6–2, 5–7, 6–1, 6–4తో పాబ్లో అండ్యుజర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. దివిజ్, అంకిత జోడీలు ఔట్ భారత జోడీలకు సీజన్ ఆరంభ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో దివిజ్, మహిళల డబుల్స్‌లో అంకితా రైనా తొలిరౌండ్లోనే నిష్క్రమించారు. స్లోవేకియాకు చెందిన ఇగొర్ జెలెనేతో జతకట్టిన దివిజ్ శరణ్ 1–6, 4–6తో యనిక్ హన్ఫన్– కెవిన్ క్రావిజ్ జోడీ చేతిలో ఓడిపోయారు. ఇదివరకే సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ద్వయం కూడా కంగుతినడంతో డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల ఈవెంట్లో అంకిత–మిహెల బుజర్నెకు (రుమేనియా) జంట 3–6, 0–6తో ఒలివియా గడెకి–బెలిండా వూల్‌కాక్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది. -
'నన్ను వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేస్తా'
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ప్రపంచ 12వ ర్యాంకర్ డెనీస్ షాపోలపోవ్, జన్నిక్ సిన్నర్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ మధ్యలో డెనీస్ టాయిలెట్‌కు వెళ్లాలని చైర్ అంపైర్‌ను అడగ్గా.. అతను అనుమతి ఇవ్వలేదు. దీంతో డెనీస్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'నన్ను టాయిలెట్‌కు వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేలా ఉన్నా..లేదంటే ఆ బాటిల్లో పోస్తా. మీరు ఆటగాళ్లను టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరా? ఇదెక్కడి రూల్? నాకర్థం కావడం లేదు అంటూ విరుచుకుపడ్డాడు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదో సెట్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా వీరిద్దరి మధ్య మ్యాచ్ ఫస్ట్ సెట్ నుంచే 3-6, 6-3,6-2,4-6,6-4తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డెనీస్ విజయం సాధించాడు. -
వైరల్: సెరెనా విలియమ్స్ విచిత్ర వేషదారణ
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వేషదారణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన 39 ఏళ్ల సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొత్త కాస్ట్యూమ్‌తో తళుక్కుమంది. వన్ లెగ్ క్యాట్సూట్ను ధరించి ఆడిన సెరెనా.. అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ స్మారకార్థం దీనిని ధరించినట్లు తెలిపింది. ఫ్లోజోగా పేరున్న ఫ్లోరెన్స్ 1988లో మహిళల 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. కాగా కొత్త కాస్ట్యూమ్‌తో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పదో ర్యాంకర్ సెరెనా 6–1, 6–1తో లౌరా సిగెమండ్ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. సెరెనాతో పాటు జకోవిచ్, నయామి ఒసాకా, రఫెల్ నాదల్, డొమినిక్ థీమ్ రెండో రౌండ్ కు చేరారు. ఒలింపిక్ మాజీ చాంపియన్ ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ pic.twitter.com/imq47N611A — Serena Williams (@serenawilliams) February 8, 2021 -
ఆస్ట్రేలియన్ ఓపెన్: బియాంక, క్విటోవా అవుట్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా)... 2011, 2014 వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను 2019 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడించిన బియాంక మోకాలి గాయం కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన బియాంక రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–3, 6–2తో తొమ్మిదో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్–10లోని క్రీడాకారిణులను ఓడించడం 71వ ర్యాంకర్ సె సువెకిది ఎనిమిదోసారి కావడం విశేషం. 83 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బియాంక ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో సొరానా కిర్‌స్టియా (రొమేనియా) 6–4, 1–6, 6–1తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సొరానా ఆరుసార్లు క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెరెనా జోరు... కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా దిగ్గజం సెరెనా మరో అడుగు ముందుకేసింది. నినా స్లొజనోవిచ్ (సెర్బియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ సెరెనా 6–3, 6–0తో గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 4–6, 6–4, 7–5తో తమియనోవిచ్ (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–3తో కసత్కినా (రష్యా)పై, 15వ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 1–6, 0–6తో క్వాలిఫయర్ సారా ఎరాని (ఇటలీ) చేతిలో, 17వ సీడ్ ఎలీనా రైబకినా (కజకిస్తాన్) 4–6, 4–6తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. అయ్యో వావ్రింకా... పురుషుల సింగిల్స్ విభాగంలో 17వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చేజేతులా ఓడిపోయాడు. ప్రపంచ 55వ ర్యాంకర్ మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి)తో 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 5–7, 1–6, 6–4, 6–2, 6–7 (9/11)తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక ఐదో సెట్ టైబ్రేక్‌లో వావ్రింకా 6–1తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే ఫుచోవిచ్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 6–6తో సమం చేశాడు. చివరకు ఫుచోవిచ్ 11–9తో టైబ్రేక్‌లో గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–7 (3/7), 7–6 (7/2), 6–3తో టియాఫో (అమెరికా)పై, మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో కోఫెర్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 6–4, 6–3తో క్రెసీ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–2, 6–0, 6–3తో ములెర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా), 14వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా), 15వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్), 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–బెన్ మెక్లాలన్ (జపాన్) జంట 4–6, 6–7 (0/7)తో జీ సుంగ్ నామ్–మిన్ క్యు సాంగ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
యాష్లే బార్టీ, నాదల్ శుభారంభం
మెల్బోర్న్: దాదాపు సంవత్సరం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మ్యాచ్ ఆడిన మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) తన ప్రత్యర్థిని హడలెత్తించింది. ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా ఫటాఫట్‌గా కేవలం 44 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుభారంభం చేసింది. 82వ ర్యాంకర్ డాంకా కొవోనిచ్ (మాంటెనిగ్రో)తో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో యాష్లే బార్టీ 6–0, 6–0తో విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఐదు ఏస్‌లు సంధించింది. నెట్ వద్దకు వచ్చిన ఆరుసార్లూ పాయింట్లు గెలిచింది. తొలి సెట్లో మూడుసార్లు, రెండో సెట్లో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్లు సాధించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్), రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సోఫియా కెనిన్ 7–5, 6–4తో మాడిసన్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా)పై, స్వితోలినా 6–3, 7–6 (7/5)తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, కరోలినా ప్లిస్కోవా 6–0, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై, బెన్సిచ్ 6–3, 4–6, 6–1తో లారెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012, 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) మాత్రం తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 12వ సీడ్ అజరెంకా 5–7, 4–6తో జెస్సికా పెగులా (అమెరికా) చేతిలో ఓటమి చవిచూసింది. నాదల్ బోణీ పురుషుల సింగిల్స్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తొలి రౌండ్‌ను అలవోకగా దాటాడు. లాస్లో జెరె (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–1తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్ ఐదు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–2, 6–2, 6–4తో పోస్పిసిల్ (కెనడా)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–1, 6–2, 6–1తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–3, 6–4తో హాన్ఫ్‌మన్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ బెరెటిని (ఇటలీ) 7–6 (11/9), 7–5, 6–3తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందారు. 12వ సీడ్ అగుట్ (స్పెయిన్) 7–6 (7/1), 0–6, 4–6, 6–7 (5/7)తో రాడూ అల్బోట్ (మాల్డొవా) చేతిలో... 13వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–3, 4–6, 7–6 (7/4), 6–7 (6/8), 3–6తో ‘వైల్డ్ కార్డు’ ప్లేయర్ అలెక్సి పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యారు. సుమీత్ నాగల్ ఓటమి పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి బరిలో ఉన్న ఏకైక క్రీడాకారుడు సుమీత్ నాగల్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. 72వ ర్యాంకర్ బెరాన్కిస్ (లిథువేనియా)తో జరిగిన మ్యాచ్‌లో 144వ ర్యాంకర్ సుమీత్ 2–6, 5–7, 3–6తో ఓడిపోయాడు. రెండు గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్ ఆరుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయాడు. రెండు ఏస్‌లు కొట్టిన 23 ఏళ్ల సుమీత్ 42 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి రౌండ్లో ఓడిన సుమీత్కు 1,00,000 ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 30 వేలు) లభించింది. -
సెరెనా సాఫీగా...
మెల్బోర్న్: కొత్త కాస్ట్యూమ్‌తో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పదో ర్యాంకర్ సెరెనా 6–1, 6–1తో లౌరా సిగెమండ్ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఫ్లోరెన్స్ స్ఫూర్తితో... కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన 39 ఏళ్ల సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొత్త కాస్ట్యూమ్‌తో తళుక్కుమంది. ‘వన్ లెగ్ క్యాట్‌సూట్’ను ధరించి ఆడిన సెరెనా అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ స్మారకార్థం దీనిని ధరించినట్లు తెలిపింది. ‘ఫ్లో జో’గా పేరున్న ఫ్లోరెన్స్ 1988లో మహిళల 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. కెర్బర్ పరాజయం సెరెనాతోపాటు ఆమె అక్క వీనస్ విలియమ్స్, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), తొమ్మిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఒసాకా 6–1, 6–2తో పావ్లీచెంకోవా (రష్యా)పై, హలెప్ 6–2, 6–1తో లిజెట్టి కాబ్రెరా (ఆస్ట్రేలియా)పై, వీనస్ 7–5, 6–2తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై, క్విటోవా 6–3, 6–4తో మినెన్ (బెల్జియం)పై గెలుపొందారు. అయితే 2016 చాంపియన్, 25వ ర్యాంకర్ కెర్బర్ (జర్మనీ) 0–6, 4–6తో 63వ ర్యాంకర్ బెర్నార్డా పెరా (అమెరికా) చేతిలో ఓడింది. ఏడో సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. జొకోవిచ్ శుభారంభం... పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6–3, 6–1, 6–2తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–6 (8/6), 6–2, 6–3తో కుకుష్కిన్ (కజకిస్తాన్)పై, ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (8/10), 7–6 (7/5), 6–3, 6–2తో గిరోన్ (అమెరికా)పై గెలిచి ముందంజ వేశారు. అయితే పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6–3, 4–6, 5–7, 6–3, 3–6తో ఎమిల్ రుసువోరి (ఫిన్లాండ్) చేతిలో ఓడిపోయాడు. -
ఎవరిదో కొత్త చరిత్ర?
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారులు జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్), సెరెనా విలియమ్స్ (అమెరికా) కొత్త చరిత్ర లిఖించేందుకు బరిలోకి దిగుతున్నారు. సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 66వ ర్యాంకర్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)తో టాప్ సీడ్ జొకోవిచ్ తలపడనున్నాడు. ఒకవేళ ఈ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిస్తే అత్యధికంగా తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పుతాడు. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ చాంపియన్‌గా నిలిస్తే పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ప్రస్తుతం ఫెడరర్, నాదల్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మంగళవారం జరిగే తన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్ లాస్లో జెరి (సెర్బియా)తో నాదల్ ఆడనున్నాడు. జొకోవిచ్, నాదల్‌తోపాటు ప్రస్తుత యూఎస్ ఓపెన్ చాంపియన్, మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో పోటీ తీవ్రంగా ఉంది. ఏ ఒక్కరినీ కచ్చితమైన ఫేవరెట్ అని పేర్కొనే పరిస్థితి కనిపించడంలేదు. డిఫెండింగ్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా), ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మూడో ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్), రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా), 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) టైటిల్ రేసులో ఉన్నారు. ఈ ఐదుగురితోపాటు మాజీ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్), ఐదో ర్యాంకర్ స్వితోలినా (ఉక్రెయిన్), తొమ్మిదో ర్యాంకర్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), మాజీ విజేత కెర్బర్ (జర్మనీ) కూడా టైటిల్ గెలిచే అవకాశాలున్నాయి. సోమవారం జరిగే తొలి రౌండ్లో లౌరా సిగెమండ్ (జర్మనీ)తో సెరెనా, పావ్లీచెంకోవా (రష్యా)తో ఒసాకా ఆడతారు. సెరెనా చాంపియన్‌గా నిలిస్తే మహిళల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 2017లో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరినా చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. -
సెరెనాకు కష్టమే
మెల్బోర్న్: మహిళల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ మరోసారి ప్రయత్నించనుంది. సోమవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనాకు క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 39 ఏళ్ల సెరెనా తొలి రౌండ్లో లౌరా సిగెముండ్ (జర్మనీ)తో ఆడనుంది. సెరెనా ప్రయాణం సాఫీగా సాగితే ఆమెకు మూడో రౌండ్లో 24వ సీడ్ అలీసన్ రిస్కీ (అమెరికా) ఎదురవుతుంది. ఈ అడ్డంకిని దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సబలెంకా (బెలారస్)తో సెరెనా ఆడే చాన్స్ ఉంది. సెరెనా క్వార్టర్ ఫైనల్ చేరితే అక్కడ ఆమెకు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్స్ సిమోనా హలెప్ (రొమేనియా) లేదా స్వియాటెక్ (పోలాండ్) ఎదురుపడే అవకాశముంది. దీనిని అధిగమిస్తే సెమీఫైనల్లో మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) రూపంలో సెరెనాకు కఠిన ప్రత్యర్థి ఎదురుకావొచ్చు. మరో పార్శ్వం నుంచి టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఫైనల్ చేరుకోవచ్చు. -
క్వీన్ కెనిన్...
టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరూ నిష్క్రమించిన చోట... ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అమెరికా యువతార సోఫియా కెనిన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ చేరే క్రమంలో తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ తుది సమరంలోనూ ఈ అమెరికా భామ సత్తా చాటుకుంది. తన ప్రత్యర్థి గార్బిన్ ముగురుజా ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయినప్పటికీ... ఆమెకు రెండు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన అనుభవం ఉన్నప్పటికీ... ఎంతో ఒత్తిడి ఉండే ‘గ్రాండ్’ టైటిల్ పోరులో తొలి సెట్ కోల్పోయి వెనుకబడినప్పటికీ... 21 ఏళ్ల సోఫియా కెనిన్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ‘నేను గెలవగలను’ అని గట్టిగా విశ్వసిస్తూ అద్భుత ఆటతీరుతో అనూహ్యంగా పుంజుకొని... తదుపరి రెండు సెట్లలో ముగురుజాకు ముచ్చెమటలు పట్టిస్తూ... ‘గ్రాండ్’గా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని విజయ దరహాసం చేసింది. మెల్బోర్న్: చివరిదాకా గెలవాలనే కసి ఉంటే... ప్రత్యర్థి ఏ స్థాయి వారైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... చాంపియన్‌గా అవతరించవచ్చొని అమెరికా యువతార సోఫియా కెనిన్ నిరూపించింది. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్నప్పటికీ... తొలి సెట్ చేజార్చుకున్నప్పటికీ... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా తుదకు సోఫియా కెనిన్ ‘గ్రాండ్’ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 4–6, 6–2, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. విజేత సోఫియా కెనిన్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ ముగురుజాకు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ►తాజా ‘గ్రాండ్’ విజయంతో సోఫియా సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి ఎగబాకుతుంది. ఇప్పటివరకు అమెరికా నంబర్‌వన్‌గా ఉన్న సెరెనా విలియమ్స్‌ను వెనక్కి నెట్టి సోఫియా ఆ స్థానాన్ని ఆక్రమించనుంది. ►ముగురుజాతో జరిగిన ఫైనల్లో కెనిన్ తొలి సెట్లో తడబడింది. 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా సుదీర్ఘంగా సాగిన మూడో గేమ్‌లో మూడో ప్రయత్నంలో కెనిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అదే జోరులో 52 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకొని కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా సాగింది. ►అయితే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీని ఓడించిన కెనిన్ తొలి సెట్ చేజార్చుకున్నా కంగారు పడలేదు. తొలి సెట్లో చేసిన తప్పిదాలను సరిచేసుకున్న కెనిన్ రెండో సెట్లో ముగురుజాను తన శక్తివంతమైన గ్రౌండ్షాట్లతో ఇబ్బంది పెట్టింది. నాలుగో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌లను బ్రేక్ చేసిన కెనిన్ 32 నిమిషాల్లో రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. ►నిర్ణాయక మూడో సెట్లో కెనిన్ ఆటతీరు మరింత మెరుగు పడగా... ముగురుజా ఆట అనవసర తప్పిదాలతో గాడి తప్పింది. ఆరో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెనిన్ ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన కెనిన్ సెట్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ►ఈ విజయంతో సెరెనా (2002లో) తర్వాత పిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా క్రీడాకారిణిగా కెనిన్ గుర్తింపు పొందింది. 2008 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కూడా కెనిన్ ఘనత వహించింది. 2008లో షరపోవా 20 ఏళ్ల ప్రాయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. రన్నరప్ ట్రోఫీతో ముగురుజా నా కల నిజమైంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. మీరూ కలలు కనండి. ఎందుకంటే కలలు నిజమవుతాయి. గత రెండు వారాలు నా జీవితంలోనే అత్యుత్తమ క్షణాలు. నా గుండె లోతుల్లోంచి చెబుతున్నా మీరంటే (ప్రేక్షకులు) నాకెంతో ప్రేమాభిమానాలు. మీ అందరికీ ధన్యవాదాలు. నేను గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించేందుకు నాన్న, కోచ్ అలెగ్జాండర్, ఆయన శిక్షణ బృందం ఎంతగానో కష్టపడింది. ఆఖరికి మా ఇన్నేళ్ల కష్టం ఫలించింది. మా అమ్మకు మూఢనమ్మకాలెక్కువ. అందుకే తను నా మ్యాచ్‌ల్ని చూడదు. చూస్తే ఏదైనా కీడు జరుగుతుందనే బెంగ ఆమెకు... అందుకే మ్యాచ్ అయిపోగానే నేనే ఫోన్ చేసి చెప్పా. నేను గెలిచానని! అప్పుడే ఆమె మనసు కుదుటపడుతుంది. అమ్మా నేను కప్‌తో ఇంటికొస్తున్నాను. నీ జీవితంలో ఎప్పుడు ఎవరికీ ఇవ్వని హగ్ (ఆలింగనం) ఇవ్వాలి. –సోఫియా కెనిన్ -
నాదల్కు థీమ్ షాక్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్‌లో పెను సంచలనం చోటు చేసుకుంది. టైటిల్ ఫేవరెట్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–6 (7/3), 7–6 (7/4), 4–6, 7–6 (8/6)తో ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించి తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరాడు. 4 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో థీమ్ 14 ఏస్‌లు సంధించి, నాలుగుసార్లు నాదల్ సర్వీసెస్ ను బ్రేక్ చేశాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో టైబ్రేక్‌లలో మాత్రం థీమ్ పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 1–6, 6–3, 6–4, 6–2తో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)పై నెగ్గి శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో థీమ్‌తో ఆడనున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సిమోనా హలెప్ (రొమేనియా) 6–1, 6–1తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ముగురుజా (స్పెయిన్) 7–5, 6–3తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గారు. -
నాదల్ దూకుడు
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల ఈవెంట్లో మళ్లీ సంచలనాల మోత మోగింది. చెక్ రిపబ్లిక్ స్టార్, రెండో సీడ్ ప్లిస్కోవా ఆట మూడో రౌండ్లోనే ముగిసింది. ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ బెన్సిక్ (స్విట్జర్లాండ్)లపై ప్రత్యర్థులు సంచలన విజయాలు నమోదు చేశారు. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ దిగ్గజం నాదల్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), 15వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), 23వ సీడ్ కిర్గియోస్ (ఆ్రస్టేలియా)లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఎదురేలేని నాదల్ టైటిల్ ఫేవరెట్, స్పానిష్ టాప్‌సీడ్ రాఫెల్ నాదల్ ఏకపక్ష విజయంతో ముందంజ వేశాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఈ దిగ్గజ ఆటగాడు 20వ టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో అతను వరుస సెట్లలో 6–1, 6–2, 6–4తో తన దేశానికే చెందిన 27వ సీడ్ కారెనో బుస్టాను ఓడించాడు.కేవలం గంటా 38 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించాడు. మిగతా పోటీల్లో మెద్వెదెవ్ 6–4, 6–3, 6–2తో అలెక్సి పొపిరిన్ (ఆ్రస్టేలియా)పై, డొమినిక్ థీమ్ 6–2, 6–4, 6–7 (5/7), 6–4తో అమెరికాకు చెందిన ఫ్రిట్జ్‌పై, జ్వెరెవ్ 6–2, 6–2, 6–4తో వెర్డాస్కో (స్పెయిన్)పై, పదో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 7–6 (7/2), 6–4, 6–3తో క్వాలిఫయర్ ఎర్నెస్ట్స్ గుల్బిస్ (లాతి్వయా)పై గెలుపొందారు. 23వ సీడ్ కిర్గియోస్ 6–2, 7–6 (7/5), 6–7 (6/8), 6–7 (7/9), 7–6 (10/8)తో 16వ సీడ్ కచనోవ్ (రష్యా)పై చెమటోడ్చి నెగ్గాడు. వావ్రింకా 6–4, 4–1తో ఇస్నర్ (అమెరికా)పై ముందంజలో ఉండగా... ప్రత్యర్థి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్లిస్కోవాపై రష్యన్ సంచలనం గతేడాది ఈ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో సెమీస్ చేరిన ప్రపంచ రెండో ర్యాంకర్ ప్లిస్కోవా ఈసారి మూడోరౌండ్తోనే సరిపెట్టుకుంది. రష్యాకు చెందిన అనస్తాసియా పాల్యుచెంకొవా 7–6 (7/4), 7–6 (7/3)తో రెండో సీడ్ ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో రెండు సెట్లు కూడా టైబ్రేక్‌కు దారితీశాయి. మిగతా మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో స్విస్ స్టార్, ఆరో సీడ్ బెన్సిక్ 0–6, 1–6తో 28వ సీడ్ అనెట్ కొంటవెట్ (ఈస్టోనియా) చేతిలో చిత్తుగా ఓడింది. మాజీ ప్రపంచ నంబర్‌వన్ ముగురుజా (స్పెయిన్) 6–1, 6–2తో ఐదో సీడ్ స్వితోలినాను ఇంటిదారి పట్టించగా... నాలుగో సీడ్ హలెప్ (రొమేనియా) 6–1, 6–4తో పుతినెత్సెవా (కజకిస్తాన్)పై సునాయాస విజయం సాధించింది. 2016 చాంపియన్, 17వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–2, 6–7 (4/7), 6–3తో కెమిలా జియోర్జి (ఇటలీ)పై, 16వ సీడ్ మెర్టెన్స్ (బెల్జియం) 6–1, 6–7 (5/7), 6–0తో బెలిస్ (అమెరికా)పై నెగ్గారు. మిక్స్‌డ్‌లో బోపన్న జోడీ ముందంజ భారత సీనియర్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనొక్తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లో భారత్–ఉక్రెయిన్ జోడి 7–5, 4–6, 10–6తో క్రాజిసెక్ (అమెరికా)– లైడ్మిలా కిచెనొక్ (ఉక్రెయిన్) జంటపై గెలిచింది. రెండో రౌండ్లో బోపన్న–నదియా ద్వయం... నికోల్ మెలిచర్ (అమెరికా)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంటతో తలపడుతుంది. నిజానికి బోపన్న హైదరాబాదీ స్టార్ సానియా మీర్జాతో జోడీ కట్టాలనుకున్నాడు. కానీ ఆమె గాయంతో ని్రష్కమించడంతో ఉక్రెయిన్ భాగస్వామితో కలిసి ఆడుతున్నాడు. -
సంచలనాల మోత
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో శుక్రవారం సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ విజేతలు సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎనిమిదో సీడ్ సెరెనా విలియమ్స్ ఆశలను చైనాకు చెందిన 28 ఏళ్ల కియాంగ్ వాంగ్ వమ్ము చేసింది. 2 గంటల 41 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో 19వ సీడ్ కియాంగ్ వాంగ్ 6–4, 6–7 (2/7), 7–5తో ఆరుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సెరెనాను బోల్తా కొట్టించింది. గతేడాది యూఎస్ ఓపెన్‌లో సెరెనాతో క్వార్టర్ ఫైనల్లో కేవలం ఒక్క గేమ్ మాత్రమే నెగ్గి ఘోరంగా ఓడిన కియాంగ్ వాంగ్ తాజా గెలుపుతో అమెరికా స్టార్‌పై ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాకు చెందిన 15 ఏళ్ల టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ మరో అద్భుతం చేసింది. మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకాతో 67 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో గౌఫ్ 6–3, 6–4తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆన్స్ జెబూర్ (ట్యూని íÙయా) 7–5, 3–6, 7–5తో 2018 చాంపియన్, మాజీ ప్రపంచ నంబర్‌వన్ వొజ్నియాకిని ఓడించింది. మరో మ్యాచ్‌లో మరియా సకారి (గ్రీస్) 6–4, 6–4తో పదో సీడ్ కీస్పై నెగ్గింది. టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా) 6–3, 6–2తో రిబకినా (కజకిస్తాన్)పై, ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–2తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై గెలిచారు. జొకోవిచ్ జోరు... పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) అతి కష్టమ్మీద... డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సులువుగా మూడో రౌండ్‌ను దాటారు. 38 ఏళ్ల ఫెడరర్ 4 గంటల 3 నిమిషాల పోరులో 4–6, 7–6 (7/2), 6–4, 4–6, 7–6 (10/8)తో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా... జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో నిషియోకా (జపాన్)ను ఓడించాడు. మిల్‌మన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి సెట్ సూపర్ టైబ్రేక్‌లో ఫెడరర్ ఒకదశలో 4–8తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే ఫెడరర్ కీలకదశలో అద్భుతంగా ఆడి వరుసగా ఆరు పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఫెడరర్‌కిది 100వ విజయం కావడం విశేషం. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రావ్‌నిచ్ (కెనడా) 7–5, 6–4, 7–6 (7/2)తో ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై, సిలిచ్ (క్రొయేíÙయా) 6–7 (3/7), 6–4, 6–0, 5–7, 6–3తో తొమ్మిదో సీడ్ అగుట్ (స్పెయిన్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–సితాక్ (న్యూజిలాండ్) జంట 6–7 (2/7), 3–6తో మ్యాట్ పావిచ్ (క్రొయోషీయా)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
మూడో రౌండ్లో బెన్సిక్, ప్లిస్కోవా
సీడెడ్ ప్లేయర్లు తమ జోరు కొనసాగించారు. ఆరంభ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఎలాంటి సంచలనానికి తావివ్వకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. రెండో సీడ్ ప్లిస్కోవా, నాలుగో సీడ్ హలెప్, ఆరో సీడ్ బెన్సిక్ అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఈసారి టైటిల్‌పై కన్నేసిన కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మరో సునాయాస విజయంతో రెండో రౌండ్‌ను దాటేసింది. 2018 రన్నరప్ హలెప్ (రొమేనియా) కూడా వరుస సెట్లలోనే ప్రత్యర్థిని ఓడించింది. స్విట్జర్లాండ్ స్టార్, ఆరో సీడ్ బెలిండా బెన్సిక్ మాజీ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్లాపెంకోను కంగుతినిపించగా... పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ నాదల్కు రెండో సెట్లో గట్టీపోటీ ఎదురైనా మ్యాచ్‌ను మాత్రం మూడు సెట్లలోనే ముగించాడు. మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) మూడో రౌండ్ చేరేందుకు ఐదు సెట్లు పోరాడాల్సి వచి్చంది. అమ్మయ్యాక తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయంతో ని్రష్కమించింది. ఒస్టాపెంకోకు మళ్లీ నిరాశే మహిళల సింగిల్స్‌లో జెలీనా ఒస్టాపెంకోకు ఆ్రస్టేలియా ఓపెన్‌లో మళ్లీ నిరాశ ఎదురైంది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయిన లాతి్వయా స్టార్ ఇక్కడ ఒకటి లేదంటే మూడో రౌండ్లలో ని్రష్కమించేది. తాజాగా ఆరో సీడ్ బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో రెండో రౌండ్లో ఓడింది. స్విస్ క్రీడాకారిణి 7–5, 7–5తో ఒస్టాపెంకో ఆట ముగించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్లిస్కోవా 6–3, 6–3తో లౌర సీగెమండ్ (జర్మనీ)పై, హలెప్ 6–2, 6–4తో ఇంగ్లండ్ క్వాలిఫయర్ హరియెట్ డార్ట్‌పై, 17వ సీడ్ కెర్బెర్ (జర్మనీ) 6–3, 6–2తో ప్రిసిలా హాన్ (ఆ్రస్టేలియా)పై పోటీలేని విజయాలు సాధించి ముందంజ వేశారు. ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 7–6 (8/6)తో డావిస్ (అమెరికా)ను ఓడించగా.. మాజీ ప్రపంచ నంబర్‌వన్ ముగురుజ 6–3, 3–6, 6–3తో అజ్లా టాంజనోవిక్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. మూడో రౌండ్లో నాదల్ గత ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్, టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన టాప్‌సీడ్ స్పానిష్ దిగ్గజం రాఫెల్ నాదల్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతను 6–3, 7–6 (7/4), 6–1తో డెల్బొనిస్ (అర్జెంటీనా)ను ఓడించాడు. 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన నాదల్ ఇక్కడ మాత్రం ఒక్కసారి మాత్రమే... అది కూడా 11 ఏళ్ల క్రితం 2009లో టైటిల్ గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (7/5), 6–4, 7–5తో ఎగొర్ గెలరసిమోవ్ (బెలారస్)పై, నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7–5, 6–1, 6–3తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై, 15వ సీడ్ వావ్రింకా 4–6, 7–5, 6–3, 3–6, 6–4తో అండ్రిస్ సెప్పి (ఇటలీ)పై విజయం సాధించారు. ఐదో సీడ్ డోమినిక్ థిమ్ (ఆ్రస్టియా) 6–2, 5–7, 6–7 (5/7), 6–1, 6–2తో ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన అలెక్స్ బోల్ట్ (ఆస్ట్రేలియా)పై శ్రమించి నెగ్గాడు. ఆ్రస్టేలియన్ స్టార్ నిక్ కిర్జియోస్ 6–2, 6–4, 4–6, 7–5తో ఫ్రాన్స్‌కు చెందిన గైల్స్ సిమోన్‌ను ఓడించాడు. -
జారిపడ్డాడు
అనుకోకుండా చేసే పనులు కొన్నిసార్లు ఆపదలోకి నెట్టేస్తాయి. ఇలియట్ బెంచెట్రిట్కు వచ్చింది ఆపద కాకున్నా.. అందుకు సమానమైనదే. అతడి ఇమేజ్ ఆపదలో పడిపోయింది. (గట్టెక్కే ప్రయత్నం చేశాడు లెండి). ఇలియట్ ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలు జరుగుతుంటే అక్కడున్నాడు. తన ఆట మధ్యలో విరామం రావడంతో.. పక్కకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అటుగా బాల్ గర్ల్ వస్తే దగ్గరకు రమ్మని ఆ అమ్మాయిని పిలిచాడు. (ఆట జరుగుతున్నప్పుడు ప్లేయర్ కొట్టిన బంతిని తెచ్చి ఇచ్చే అమ్మాయిల్ని బాల్ గర్ల్స్ అంటారు). ఆ అమ్మాయి ఇలియట్ దగ్గరికి వచ్చింది. ఆమెకు అరటి పండు ఇచ్చి ఒలిచి ఇమ్మని అడిగాడు. ఆమె ఒలవబోతుంటే.. చెయిర్ అంపైర్ అడ్డుపడ్డాడు. ‘‘బాల్ గర్ల్ ఏమీ నీ బానిస కాదు’’ అని ఇలియట్పై కోప్పడ్డాడు. అతడు నివ్వెరపోయాడు. ‘తప్పేముందీ! నా రెండు చేతులకూ వ్యాక్స్ ఉంది. ఒలుచుకోలేక తనకు ఇచ్చాను’’ అన్నాడు. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఆ వీడియో వైరల్ అయి నెటిజన్లంతా ‘ఇలియట్ కాదు.. ఇడియట్’ అని తిట్టేస్తున్నారు. దీనికన్నా అరటితొక్క మీద నుంచి జారి పడటమే నయం అని ఇలియట్ అనుకుని ఉండాలి పాపం. -
సానియా రిటైర్డ్ హర్ట్
మెల్బోర్న్: దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగి తొలి టోర్నీలో టైటిల్ నెగ్గి తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్న భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభంలోనే తన పోరును ముగించారు. కాలిపిక్క గాయంతో ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడకుండానే తప్పుకున్నారు. ఉక్రెయిన్ పార్టనర్ నదియా కిచెనోక్‌తో కలిసి ఇటీవలే హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. కాలి పిక్కగాయంతో సతమతమైంది. దీంతోనే మెగా టోర్నీనుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది. తొలుత మిక్స్డ్ డబుల్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సానియా.. గురువారం జిన్యున్ హాన్-లిన్ జు (చైనా) జోడీతో జరిగాల్సిన మహిళల డబుల్స్ మ్యాచ్ మధ్యలో వైదొలిగారు. ఈ మ్యాచ్‌లో సానియా-నదియా 2-6తో తొలి సెట్ కోల్పోయింది. అనంతరం రెండో సెట్లో ఫస్ట్ గేమ్ ఓడి 0-1 వెనుకంజలో ఉండగా సానియా గాయం ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె రిటైర్ట్ హర్ట్‌గా వైదొలిగారు. ఇక మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉండగా తప్పుకున్నారు. -
ఫెడరర్ ఫటాఫట్
వయసు పెరిగినా తనలో వన్నె తగ్గలేదని నిరూపిస్తూ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ప్రత్యర్థి ప్రపంచ 41వ ర్యాంకర్ అయినప్పటికీ... ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన 38 ఏళ్ల ఫెడరర్ కేవలం ఆరు గేమ్‌లు కోల్పోయి విజయం దక్కించుకున్నాడు. 2000లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన ఫెడరర్ వరుసగా 21వ ఏడాది కనీసం మూడో రౌండ్‌కు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఎలాంటి సన్నాహక టోర్నీ ఆడకుండానే నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ఫెడరర్ ఈ మెగా ఈవెంట్లో గతంలో ఆరుసార్లు చాంపియన్‌గా, ఒకసారి రన్నరప్‌గా నిలిచాడు. మెల్బోర్న్: రికార్డుస్థాయిలో ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ ఫెడరర్ 6–1, 6–4, 6–1తో ప్రపంచ 41వ ర్యాంకర్ ఫిలిప్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. 92 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. 14 ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు సాధించాడు. 42 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్ ను ఒకసారి చేజార్చుకున్నాడు. వరుసగా 21వ ఏడాది ఈ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్‌కు ఓవరాల్‌గా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 99వ విజయమిది. శుక్రవారం జరిగే మూడో రౌండ్లో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)తో ఫెడరర్ ఆడతాడు.ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెడరర్ మూడో రౌండ్లో మూడుసార్లు మాత్రమే ఓడిపోయాడు. 2000, 2001లలో అర్నాడ్ క్లెమెంట్ (ఫ్రాన్స్) చేతిలో... 2015లో ఆండ్రియాస్ సెప్పి (ఇటలీ) చేతిలో ఫెడరర్ పరాజయం చవిచూశాడు. ఫెడరర్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) కూడా మూడో రౌండ్‌కు చేరాడు. రెండో రౌండ్లో జొకోవిచ్ 6–1, 6–4, 6–2తో తత్సుమా ఇటో (జపాన్)పై నెగ్గగా... ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)కు తన ప్రత్యర్థి కోల్‌ష్రైబర్ (జర్మనీ) నుంచి వాకోవర్ లభించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 100వ ర్యాంకర్ టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా) 7–6 (9/7), 6–4, 4–6, 2–6, 7–5తో ఎనిమిదో సీడ్ బెరెటిని (ఇటలీ)పై... ప్రపంచ 80వ ర్యాంకర్ టామీ పాల్ (అమెరికా) 6–4, 7–6 (8/6), 3–6, 6–7 (3/7), 7–6 (10/3)తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, మారిన్ సిలిచ్ (క్రొయేíÙయా) 6–2, 6–7 (6/8), 3–6, 6–1, 7–6 (10/3)తో 21వ పెయిర్ (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చివరి సెట్లో స్కోరు 6–6 వద్ద సమమైనపుడు ‘సూపర్ టైబ్రేక్’ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. తొమ్మిదో సీడ్ అగుట్ (స్పెయిన్), 12వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. అగుట్ 5–7, 6–2, 6–4, 6–1తో మైకేల్ మోమా (అమెరికా)పై, ఫాగ్నిని 7–6 (7/4), 6–1, 3–6, 4–6, 7–6 (10/4)తో థాంప్సన్ (ఆ్రస్టేలియా)పై నెగ్గారు. బార్టీ సునాయాసంగా... మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా), టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా) సునాయాస విజయాలతో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో సీడ్ ఒసాకా 6–2, 6–4తో సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)పై, సెరెనా 6–2, 6–3తో తమారా జిదాన్సెక్ (స్లొవేనియా)పై, బార్టీ 6–1, 6–4తో పొలోనా హెర్కాగ్ (స్లొవేనియా)పై గెలిచారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 7–5తో పౌలా బదోసా (స్పెయిన్)పై, పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/3), 6–2తో అరంటా రస్ (నెదర్లాండ్స్)పై, మాజీ చాంపియన్ వొజ్నియాకి (డెన్మార్క్) 7–5, 7–5తో యాస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్)పై, 15 ఏళ్ల అమెరికా టీనేజర్ కోరి గౌఫ్ 4–6, 6–3, 7–5తో సిర్స్టీ (రొమేనియా)పై విజయం సాధించారు. 11వ సీడ్ సాబలెంకా (బెలారస్) 6–7 (6/8), 6–7 (6/8)తో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. రెండో రౌండ్లో దివిజ్ జంట... పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రోహన్ బోపన్న (భారత్)–యాసుటకా ఉచియామ (జపాన్) జోడీ 1–6, 6–3, 3–6తో 13వ సీడ్ మైక్ బ్రయాన్–బాబ్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోగా... దివిజ్ శరణ్ (భారత్)–అర్తెమ్ సితాక్ (న్యూజి లాండ్) ద్వయం 6–4, 7–5తో కరెనో బుస్టా (స్పెయిన్)–జావో సుసా (పోర్చుగల్) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌కు సానియా దూరం.... కాలి పిక్కలో నొప్పి కారణంగా భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ విభాగం నుంచి వైదొలిగింది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉంది. సానియా వైదొలగడంతో ఆమె మహిళల డబుల్స్ భాగస్వామి నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బోపన్న మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. మహిళల డబుల్స్‌లో మాత్రం నేడు జరిగే తొలి రౌండ్లో సానియా–నదియా జంట జిన్యున్ హాన్–లిన్ జు (చైనా) జోడీతో ఆడనుంది. -
తండ్రిని దిద్దిన కూతురు
అమెరికన్ టీనేజ్ టెన్నిస్ సంచలనం.. పదిహేనేళ్ల కోకో గాఫ్.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దుమ్ము రేపుతోంది. ఆ దుమ్ముల్లోంచి కూతురి రాకెట్ విన్యాసాలను తిలకిస్తూ పుత్రికోత్సాహంతో పరమానంద భరితుడౌతున్న ఆమె తండ్రి కోరి గాఫ్.. ఆమె కొట్టే ప్రతి షాటుకీ ‘డామ్ (ఇట్)’.. ‘డామ్ (ఇట్).. అని అరుస్తున్నాడు. అది ఆమెకు నచ్చలేదు. ‘కొట్టు.. అద్దీ.. అలాగ..’ అని బరి బయట ఉన్నవాళ్లు అరుస్తుంటారు కదా.. అలా అంటున్నాడు ఆయన. బ్రేక్‌లో బయటికి వచ్చి.. ‘డాడీ!!’ అంది.. గుసగుసగా కోకో. ‘‘ఏంటమ్మా!’’ అన్నాడు. ‘‘అలా నువ్వు డి–వర్డ్‌ని యూజ్ చెయ్యకు. బాగుండదు’’ అంది. ‘‘తప్పేముందమ్మా.. ఆటే కదా..’’ అన్నాడు తండ్రి. ‘‘ఆట కాబట్టే అనకూడదు డాడీ..’’ అంది. ‘‘సర్సరే.. ఐయామ్ సారీ.. ఇక అనను. ఒకేనా’’ అన్నాడు తండ్రి. మళ్లీ ఆ డి–వర్డ్‌ని యూజ్ చెయ్యలేదు ఆయన. సోమవారం ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో 7–6, 6–3 తేడాతో ముప్పై తొమ్మిదేళ్ల సీనియర్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్‌ని కోకో గాఫ్ పరుగులు పెట్టిస్తున్నప్పుడు కూడా ఆయన చూస్తూ ఆనందించారు తప్ప, చప్పుడు చెయ్యలేదు. -
వీనస్‌కు షాకిచ్చిన 15 ఏళ్ల కోరి గాఫ్
మెల్బోర్న్: ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం చోటుచేసుకుంది. మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, అమెరికా దిగ్గజ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ 6–7(5/7), 3–6తో యువ సంచలనం, 15 ఏళ్ల కోరి గాఫ్ చేతిలో పరాజయం పాలైంది. గతేడాది వింబుల్డన్ తొలి రౌండ్లోనే వీనస్‌ను ఇంటిబాట పట్టించిన గాఫ్ మరోసారి అదే ఫలితం పునరావృతం చేసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్‌లో గెలుచుకున్న గాఫ్ రెండో సెట్లో తిరుగులేని ఆటతీరు ప్రదర్శించింది. కాగా, సోమవారం బరిలోకి దిగిన మిగిలిన సీడెడ్ క్రీడాకారులకు శుభారంభం లభించింది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెం.1, స్థానిక క్రీడాకారిణి ఆష్లే బార్టీ 5–7, 6–1, 6–1తో సురెంకో(ఉక్రెయిన్)పై, వరల్డ్ నెం.4 నవోమీ ఒసాకా(జపాన్) 6–2, 6–4తో మారీ బౌజ్కోవా(చెక్‌రిపబ్లిక్)పై గెలుపొందగా, మార్గరెట్ కోర్ట్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా నల్లకలువ, ఎనిమిదో సీడ్ సెరెనా విలియమ్స్ 6–0, 6–3తో అనస్తాసియా పొటపొవా(రష్యా) ను చిత్తు చేసింది. మాజీ నెం.1 కరోలినా వోజ్నియాకీ(డెన్మార్క్) 6–1, 6–3తో క్రిస్టీ ఆన్(అమెరికా)పై గెలుపొందింది. ఏడో సీడ్ పెట్రా క్విటోవా(చెక్‌రిపబ్లిక్) 6–1, 6–0తో తన దేశానికే చెందిన సినియకోవాపై నెగ్గగా, స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 6–2, 5–7, 2–6తో జాంగ్(చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. చెమటోడ్చిన జకోవిచ్.. పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకర్ రోజర్ ఫెడరర్ 6–3 6–2 6–2తో స్టీవ్ జాన్సన్(అమెరికా)పై గెలుపొందగా, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ తొలి రౌండ్లోనే చెమటోడ్చాడు. హోరాహోరీగా జరిగిన పోరులో జకోవిచ్ 7–6, 6–2, 2–6, 6–1తో జాన్–లెనార్డ్ స్ట్రఫ్(జర్మనీ)పై నెగ్గాడు. అలాగే ఆరో సీడ్, గ్రీస్ స్టార్ సిట్సిపాస్ 6–0, 6–1, 6–3తో కరుసో(ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ మారియో బరెత్తిని(ఇటలీ) 6–3, 6–1, 6–3తో హారిస్(ఆస్ట్రేలియా)పై, వరల్డ్ నెం.18 దిమిత్రోవ్(బల్గేరియా) 4–6, 6–2, 6–0, 6–4తో లోండెరో(అర్జెంటీనా)పై, గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. -
సెరెనా సాధించేనా?
మెల్బోర్న్: టెన్నిస్‌లో ఆ్రస్టేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ పేరు మీదున్న ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డు (24)ను సమం చేయడానికి సెరెనా విలియమ్స్ ఒకవైపు... పురుషుల విభాగంలో ఫెడరర్ (20 టైటిల్స్) సరసన చేరడానికి ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ దూరంలో ఉన్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ మరోవైపు... నేటి నుంచి ఆరంభమయ్యే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్, ఏడుసార్లు విజేత జొకోవిచ్ (సెర్బియా), 38 ఏళ్ల వయసులోనూ తన బ్యాక్ హ్యాండ్ పవర్ ఏమాత్రం తగ్గలేదంటూ రోజర్ ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశారు. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గని సెరెనాను మార్గరెట్ కోర్ట్ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తోంది. తల్లి అయ్యాక... సెరెనా నాలుగు గ్రాండ్‌స్లామ్ (2018–వింబుల్డన్, యూఎస్; 2019–వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోరీ్నలలో ఫైనల్స్ చేరినా... టైటిల్‌ను గెలవడంలో మాత్రం విఫలమైంది. అయితే ఆక్లాండ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి సెరెనా ఆత్మవిశ్వాసంతో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో బరిలో దిగుతోంది. నేటి తొలి రౌండ్ మ్యాచ్‌లో పొటపోవా (రష్యా)తో సెరెనా ఆడుతుంది. -
అదృష్టం కలిసొచ్చింది...
మెల్బోర్న్: అనుకున్నట్లే జరిగింది. భారత టెన్నిస్ నంబర్‌వన్ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’లో ‘లక్కీ లూజర్’గా ప్రజ్నేశ్‌కు చోటు లభించింది. వాస్తవానికి 30 ఏళ్ల ప్రజ్నేశ్ క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రౌండ్లోనే ఓడిపోయాడు. అయితే ఆ్రస్టేలియన్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ‘డ్రా’ విడుదల అయ్యాక ఆ ‘డ్రా’లో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు నికోలస్ జారీ (చిలీ), కామిల్ మజ్చార్జక్ (పోలాండ్), అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) వైదొలిగారు. దాంతో ఈ మూడు బెర్త్‌లను భర్తీ చేసేందుకు క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రౌండ్లో ఓడిపోయిన ఐదుగురు అత్యుత్తమ ర్యాంక్ ఆటగాళ్లకు ‘లక్కీ లూజర్’ ‘డ్రా’లో అవకాశం లభించింది. మూడు బెర్త్‌ల కోసం ‘లక్కీ లూజర్’ ‘డ్రా’లో ప్రజ్నేశ్తోపాటు లొరెంజో గియెస్టినో (ఇటలీ), మిలోజెవిచ్ (సెర్బియా), డాన్స్కాయ్ (రష్యా), కొవాలిక్ (స్లొవేకియా) పోటీపడ్డారు. ‘డ్రా’లో ప్రజ్నేశ్, డాన్స్కాయ్, కొవాలిక్ పేర్లు రావడంతో ఈ ముగ్గురికి ‘లక్కీ లూజర్స్’గా ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం లభించింది. తొలి రౌండ్లో ప్రపంచ 144వ ర్యాంకర్ టట్సుమా ఇటో (జపాన్)తో ప్రజ్నేశ్ ఆడతాడు. ఒకవేళ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ గెలిస్తే రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్, ఏడుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఎదురయ్యే అవకాశముంది. -
ప్రజ్నేశ్ పరాజయం
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తుది మెట్టుపై తడబడ్డాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6–7 (2/7), 2–6తో గుల్బిస్ (లాత్వియా) చేతిలో ఓడిపోయాడు. క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రౌండ్లో ఓడినప్పటికీ... 122వ ర్యాంకర్ ప్రజ్నేశ్‌కు ‘లక్కీ లూజర్’గా మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మెయిన్ ‘డ్రా’ విడుదల కావడం... ఎంట్రీలు ఖరారు చేసిన ముగ్గురు ఆటగాళ్లు వైదొలగడంతో ఈ మూడు బెర్త్‌లను క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఓడిన అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లతో భర్తీ చేస్తారు. మూడు బెర్త్‌ల కోసం క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఓడిన ఐదుగురు అత్యుత్తమ ర్యాంక్ ఆటగాళ్ల మధ్య ‘డ్రా’ నిర్వహించి ముగ్గురిని ఎంపిక చేస్తారు. -
రెండో రౌండ్లో ప్రజ్నేశ్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేయగా... రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా కూడా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ 6–2, 6–4తో హ్యారీ బుర్చియెర్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా... రామ్‌కుమార్ 6–4, 4–6, 1–6తో ఫెడెరికో కొరియా (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. అంకిత రైనా 2–6, 6–7 (2/7)తో విక్టోరియా తొమోవా (బల్గేరియా) చేతిలో పరాజయం పాలైంది. -
సెరెనా సాధించెన్...
ఆక్లాండ్ (న్యూజిలాండ్): ఎట్టకేలకు అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. తల్లి అయ్యాక ఆమె తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో సెరెనా సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సెరెనా 6–3, 6–4తో జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాక సెరెనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. ఎనిమిది వారాల గర్భవతిగానే 2017 ఆ్రస్టేలియా ఓపెన్‌లో పాల్గొని చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్ లో పాప కు జన్మనిచ్చిన సెరెనా 2018 మార్చిలో టెన్నిస్‌లో పునరాగమనం చేసింది. 2018 వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో... 2019 వింబుల్డన్, రోజర్స్ కప్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్ చేరినా రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. అయితే ఫైనల్ చేరిన ఆరో టోరీ్నలో సెరెనా టైటిల్‌ను సొంతం చేసుకుంది. సెరెనా కెరీర్లో ఇది 73వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనాకు 43 వేల డాలర్లు ప్రైజ్‌మనీ (రూ. 30 లక్షల 52 వేలు) లభించింది. ఈ మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన బుష్ఫైర్ రిలీఫ్ ఫండ్‌కు సెరెనా విరాళంగా ఇచ్చేసింది. -
షరపోవాకు వైల్డ్ కార్డు
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నేరుగా ఆడేందుకు ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఈ టోర్నీ మాజీ విజేత మరియా షరపోవాకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. గాయం కారణంగా గతేడాది ఈ రష్యా స్టార్ ఎక్కువ కాలం ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్ 147కు పడిపోయింది. ఫలితంగా ర్యాంక్ ప్రకారం ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 32 ఏళ్ల షరపోవాకు మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కలేదు. అయితే ఈ టోరీ్నలో ఆమె గత రికార్డును పరిగణనలోకి తీసుకొని నిర్వాహకులు వైల్డ్ కార్డు ద్వారా నేరుగా మెయిన్ ‘డ్రా’లో స్థానం కలి్పంచారు. 2003లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడిన షరపోవా 2008లో చాంపియన్‌గా నిలిచింది. 2007, 2012, 2015లలో ఫైనల్లో ఓడి రన్నరప్ ట్రోఫీ అందుకుంది. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనుండటం ఎంతో ప్రత్యేకం. ఈ టోరీ్నలో నాకెన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయి. ఒకసారి విజేతగా నిలిచాను. మూడుసార్లు ఫైనల్లో ఓడాను. మరోసారి ఇక్కడ ఆడే అవకాశం ఇచి్చనందుకు సంతోషంగా ఉంది’ అని షరపోవా వ్యాఖ్యానించింది. -
ఆ్రస్టేలియన్ ఓపెన్ యథావిధిగా
సిడ్నీ: ఆ్రస్టేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చు సెగ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తగులుతుందనే వార్తల్ని నిర్వాహకులు కొట్టిపారేశారు. ఈ నెల 20 నుంచి మెల్బోర్న్ పార్క్‌లో ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ జరగనుంది. ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు మెల్బోర్న్ పార్క్‌కు ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో రగులుతోందని దీని వల్ల వేదికకు, ఆటగాళ్లకు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగదని టెన్నిస్ ఆ్రస్టేలియా చీఫ్ క్రెయిగ్ టైలీ తెలిపారు. ఏటీపీ ప్లేయర్స్ కౌన్సిల్ అధ్యక్షుడైన నొవాక్ జొకోవిచ్ మీడియాతో మాట్లాడుతూ కార్చిచ్చు పొగవల్ల సమస్య ఉంటే మ్యాచ్‌ల్ని ఆలస్యంగా ప్రారంభించే అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. దీనిపై స్పందించిన క్రెయిగ్ వాతావరణ శాఖ నిపుణులు గాలి నాణ్యతపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తున్నారని... వారితో నిర్వాహక కమిటీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. -
ముర్రే అవుట్
లండన్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన ఆండీ ముర్రే వచ్చే నెలలో జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత నెలలో బ్రిటన్ తరఫున 32 ఏళ్ల ముర్రే డేవిస్ కప్ మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలో తన పాత గాయం తిరగబెట్టిందని అతను వెల్లడించాడు. ‘అత్యున్నత స్థాయిలో మళ్లీ పోటీ పడేందుకు ఎంతో శ్రమించాను. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు దూరం కావాల్సి వస్తోంది. నేను చాలా నిరాశ చెందాను. అయితే ఇటీవలి పరిణామాల తర్వాత ముందు జాగ్రత్తగానే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ముుర్రే చెప్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదు సార్లు ఫైనల్ చేరిన ముర్రే ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. -
ముగిసిన భారత్ పోరు
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఇప్పటికే మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లో భారత జోడీలు వెనుదిరగ్గా, తాజాగా మహిళల, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్లో తొలి టైటిల్ ఖాతాలో వేసుకోవాలని బరిలోకి దిగిన పీవీ సింధుతోపాటు, సమీర్ వర్మ, సాయిప్రణీత్ సైతం ఇంటిబాట పట్టారు. గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, వరల్డ్ నెం.5 సింధు 19–21 18–21తో 29వ ర్యాంకర్ నిచోన్ జిందాపోల్(థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీలక సమయాల్లో తడబడిన సింధు మూల్యం చెల్లించుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నెం.12 సమీర్ 16–21, 21–7, 13–21తో వాంగ్ జు వీ(తైవాన్) చేతిలో, సాయి ప్రణీత్ 23–25, 9–21తో రెండో సీడ్ ఆంథోనీ సినిసుక గింటింగ్(ఇండోనేషియా) చేతిలో, పారుపల్లి కశ్యప్ 17–21 22–20 14–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడారు. అలాగే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ పోరాటం సైతం ముగిసింది. సాయిరాజ్– చిరాగ్ ద్వయం 19–21, 18–21తో లి జున్హుయ్– లియూ యుచెన్(చైనా) చేతిలో పోరాడి ఓడింది. ముఖాముఖి పోరులో జిందాపోల్ చేతిలో ఇది సింధుకు రెండో ఓటమి. ఇప్పటివరకూ వీరిద్దరూ ఏడు సార్లు తలపడగా ఐదింట్లో విజయం సింధూనే వరించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌తోపాటు మరో నాలుగు టోర్నీల్లో పాల్గొన్న సింధు ఒక్కదాంట్లోనూ కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్‌లో మాత్రం సెమీస్‌కు చేరగలిగింది. -
సింధు శుభారంభం
సిడ్నీ: ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించే దిశగా భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో వరల్డ్ నెం.5, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సింధు 21–14,21–9తో చొయరున్నీసా (ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది. కాగా, పురుషుల విభాగంలో సమీర్ వర్మ, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ సైతం రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఆరో సీడ్ సమీర్ 21–15, 16–21, 21–12తో లీ జీ జియా(మలేషియా)పై గెలిచాడు. ఫలితంగా సుదిర్మన్ కప్‌లో అతని చేతిలో ఎదురైన అనూహ్య ఓటమికి బదులు తీర్చుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో భమిడిపాటి సాయి ప్రణీత్ 21–16, 21–14తో లీ డాంగ్ కియూన్ (దక్షిణకొరియా)పై, కశ్యప్ 21–16, 21–15తో అవిహింగ్సనన్(థాయ్‌లాండ్) పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకోగా, హెచ్ఎస్ ప్రణయ్ 18–21, 19–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తదుపరి రౌండ్లో జిందాపోల్(థాయ్‌లాండ్)తో సింధు, వాంగ్ జు వీ(తైవాన్)తో సమీర్, ఆంథోనీ సినిసుక గింటింగ్(ఇండోనేషియా)తో ప్రణీ త్ తలపడతారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ షెట్టి ద్వయం 21–12, 21–16తో మనదేశానికే చెందిన మనుఅత్రి –సుమీత్ రెడ్డిజోడీని ఓడించగా, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ 14–21, 13–21 తో బేక్ హ న– కిమ్ హైరిన్(దక్షిణకొరియా)జంట చేతిలో పరాజయం పాలైంది. -
జొకోవిచ్‌కు చుక్కెదురు
మోంటెకార్లో: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్లోనూ ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)కు నిరాశ ఎదురైంది. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన ఈ సెర్బియా స్టార్... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ సెమీస్ చేరలేకపోయాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 3–6, 6–4, 2–6తో మెద్వెదేవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో నాదల్ మరోవైపు 11సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ ఈ టోర్నీలో 14వసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. అర్జెంటీనా ప్లేయర్ గిడో పెల్లాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–6 (7/1), 6–3తో విజయం సాధించాడు. గతంలో నాదల్ 2004 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిదిసార్లు... 2016 నుంచి 2018 వరకు వరుసగా మూడుసార్లు మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్స్ సాధించాడు. -
ముర్రే గాయానికి శస్త్ర చికిత్స
లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్, వింబుల్డన్ మాజీ చాంపియన్ ఆండీ ముర్రే తుంటి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ‘లండన్‌లో సోమవారం జరిగిన శస్త్రచికిత్సతో కొంత ఉపశమనం పొందా. సమస్య నుంచి ఇది గట్టెక్కిస్తుందని ఆశిస్తున్నాం’ అంటూ అతడు ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. 31 ఏళ్ల ముర్రే ఇటీవలి ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా తన గాయం తీవ్రతను వివరిస్తూ వింబుల్డన్ తర్వాత టెన్నిస్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. అయితే, శస్త్రచికిత్సలో భాగంగా అతడి తుంటి భాగంలో ఇనుప ప్లేట్ అమర్చారు. దీంతో అతడు మళ్లీ ఉన్నత శ్రేణి టెన్నిస్ ఆడే అవకాశాలు క్లిష్టమేనని తెలుస్తోంది. వింబుల్డన్ సమయానికీ ఫిట్ కావడం సందేహంగానే ఉంది. గత ఏడాదిలో ముర్రే తుంటికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండోసారి. -
జొకోవిచ్ సెవెన్ స్టార్
తనకు ఎంతో అచ్చొచ్చిన వేదికపై ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ విశ్వరూపం ప్రదర్శించాడు. హోరాహోరీ పోరు ఆశించి వచ్చిన ప్రేక్షకులకు తన అద్వితీయ ఆటతీరుతో కనువిందు చేశాడు. తుది సమరాన్ని ఏకపక్షం చేసేశాడు. గతంలో ఎవరికీ సాధ్యంకానిరీతిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకొని చరిత్ర పుటల్లోకి చేరాడు. కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన రాఫెల్ నాదల్ సెర్బియా స్టార్ దెబ్బకు కుదేలయ్యాడు. మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో తన అజేయ రికార్డును సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కొనసాగించాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్‌కు చేరి ఆరుసార్లూ (2008, 2011, 2012, 2013, 2015, 2016) విజేతగా నిలిచిన జొకోవిచ్ ఏడోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఆదివారం రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–2, 6–3తో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లోని ఏదశలోనూ 31 ఏళ్ల జొకోవిచ్ జోరు ముందు 32 ఏళ్ల నాదల్ ఎదురు నిలువలేకపోయాడు. 2012లో చివరిసారి వీరిద్దరి మధ్య జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ 5 గంటల 53 నిమిషాలు కొనసాగగా... ఈసారి మాత్రం 2 గంటల 4 నిమిషాల్లోనే ముగిసింది. విజేత జొకోవిచ్‌కు 41 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 87 లక్షలు)... రన్నరప్ నాదల్కు 20 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 43 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా బరిలోకి దిగిన జొకోవిచ్ తొలి గేమ్ నుంచే తన వ్యూహాన్ని అమలులో పెట్టాడు. కచ్చితమైన సర్వీస్‌లు చేసిన అతను రెండో గేమ్‌లోనే నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. జొకోవిచ్ గేమ్ ప్లాన్‌పై అవగాహన వచ్చేలోపే నాదల్ తొలి సెట్‌ను కోల్పోయాడు. రెండో సెట్లోనూ జొకోవిచ్ జోరు కొనసాగగా... నాదల్ ప్రేక్షకుడిలా మారిపోయాడు. మూడో సెట్లోనూ నాదల్ తేరుకోవాలని చూసినా జొకోవిచ్ జోరు ముందు చేతులెత్తేశాడు. ►73 జొకోవిచ్ సాధించిన మొత్తం అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్స్. గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో జొకోవిచ్, నాదల్ ముఖాముఖి రికార్డు 4–4 ►68 ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో జొకోవిచ్ మొత్తం 76 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 68 మ్యాచ్‌ల్లో గెలిచి, ఎనిమిదింటిలో మాత్రమే ఓడిపోయాడు. ►28కెరీర్లో నాదల్‌పై జొకోవిచ్ సాధించిన విజయాలు. నాదల్‌తో 53 సార్లు తలపడిన జొకోవిచ్ 28 సార్లు గెలిచి, 25 సార్లు ఓడిపోయాడు. ►3 పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో పీట్సంప్రాస్ (అమెరికా–14)ను వెనక్కి నెట్టి జొకోవిచ్ (15) మూడో స్థానానికి ఎగబాకాడు. ఫెడరర్ (20), రాఫెల్ నాదల్ (17) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో ఐదో సీడ్ నికొలస్ మహుట్–పియరీ హ్యూస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో మహుట్–హెర్బర్ట్ జోడీ 6–4, 7–6 (7/2)తో 12వ సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. ఈ విజయంతో మహుట్–హెర్బర్ట్ ద్వయం డబుల్స్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ ఘనతను (మొత్తం నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్–ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) పూర్తి చేసుకున్న ఎనిమిదో జోడీగా గుర్తింపు పొందింది. నేను ఆడిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఇదే అత్యుత్తమం. నాదల్‌పై నేను కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే. ఏడాది క్రితం మోచేతికి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత టాప్–20లో చోటు కోల్పోయాను. మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి గతేడాది వరుసగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలిచి ఫామ్‌లోకి వచ్చాను. ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడంతో నా అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాను. – జొకోవిచ్ -
సరికొత్త చరిత్ర సృష్టించిన జొకోవిచ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా ఏడో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6-3, 6-2, 6-3 తేడాతో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెర్బియా స్టార్ దూకుడు ముందు నాదల్ తేలిపోయాడు. వరుసగా మూడు సెట్లను సునాయసంగా కైవసం చేసుకోవడంతో నాదల్కు ఓటమితప్పలేదు. దీంతో రాయ్ ఎమర్సన్, ఫెడరర్ (ఆరు సార్లు విజేతలుగా నిలిచారు)ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్ చేరిన జొకోవిచ్ (2016, 2015, 2013, 2012, 2011, 2008) ఆరుసార్లూ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. జొకోవిచ్ చాంపియన్ ఆట ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ అసలైన చాంపియన్ ఆట ఆడాడు. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన నాదల్కు ఫైనల్ పోరులో చుక్కలు చూపించాడు. మ్యాచ్ ఆసాంతం ఎలాంటి అనవసర తప్పిదాలు చేయని సెర్బియా స్టార్.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇక ఈ విజయంతో జొకోవిచ్ పదిహేనో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సంప్రాస్(14) రికార్డును నొవాక్ అధిగమించాడు. 15 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు. 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో నాదల్ రెండో స్థానంలో ఉండగా 20 టైటిళ్లతో మొదటి స్థానంలో ఫెడరర్ కొనసాగుతున్నాడు. .@DjokerNole reunited with Norman once again.#AusOpen #AusOpenFinal pic.twitter.com/J6HBOr367d — #AusOpen (@AustralianOpen) January 27, 2019 -
నయోమి నవ్వింది
నాలుగు నెలల క్రితం యూఎస్ ఓపెన్‌లో అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ను ఓడించినప్పటికీ జపాన్ అమ్మాయి నయోమి ఒసాకా ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయింది. నాటి ఫైనల్లో చైర్ అంపైర్‌ను తీవ్రంగా దూషించిన సెరెనా అక్కడి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చేసింది. ఒసాకా విజయంకంటే సెరెనా ప్రవర్తనే అక్కడ హైలైట్ అయ్యింది. ఫైనల్‌ను వీక్షించిన ప్రేక్షకులు కూడా ఒసాకా విజయాన్ని అంగీకరించకుండా ఆమెను గేలి చేశారు. సీన్ కట్ చేస్తే... నాడు సెరెనాపై తాను సాధించిన విజయం గాలివాటమేమీ కాదని ఒసాకా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరూపించింది. రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన క్విటోవాపై ఈసారి ఫైనల్లో గెలిచింది. కెరీర్లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. ‘గ్రాండ్’ విజయంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ దక్కించుకుంది. విజయానంతరం చిరునవ్వులు చిందిస్తూ, తనివితీరా ఆస్వాదిస్తూ ఈ క్షణాలను నయోమి ఒసాకా చిరస్మరణీయం చేసుకుంది. మెల్బోర్న్: టైటిల్ ఫేవరెట్స్ అందరూ ముందే నిష్క్రమించగా... పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జపాన్ యువతార నయోమి ఒసాకా మళ్లీ అద్భుతం చేసింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. రాడ్ లేవర్ ఎరీనాలో శనివారం 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా 7–6 (7/2), 5–7, 6–4తో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. విజేత ఒసాకాకు 41 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 87 లక్షలు)... రన్నరప్ క్విటోవాకు 20 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 43 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ విజయంతో 21 ఏళ్ల ఒసాకా సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనుంది. ఈ క్రమంలో ఆసియా నుంచి ఈ ఘనత సాధించనున్న తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించనుంది. మూడు మ్యాచ్ పాయింట్లు చేజార్చుకొని... గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను ఓడించి పెను సంచలనం సృష్టించిన ఒసాకా ఆ తర్వాత మరో నాలుగు టోర్నీల్లో ఆడినా టైటిల్ గెలవలేకపోయింది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం ఆద్యంతం నిలకడగా ఆడుతూ ఫైనల్ చేరింది. క్విటోవాతో జరిగిన తుది సమరంలోనూ ఆమె తన జోరు కొనసాగించింది. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఒసాకా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన ఒసాకా... క్విటోవా సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను సంపాదించింది. అయితే క్విటోవా ఈ మూడింటిని కాపాడుకుంది. అనంతరం పదో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసింది. మళ్లీ 12వ గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ చెక్ రిపబ్లిక్ స్టార్ రెండో సెట్‌ను 7–5తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని మూడో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్విటోవా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా ఒసాకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని ఒసాకా మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ట్రోఫీ ప్రదానోత్సవం జరుగుతున్నంతసేపూ ఇది కలయా నిజమా అన్న భావనలో ఉండిపోయా. రెండో సెట్లో మూడు మ్యాచ్ పాయింట్లు కోల్పోయినపుడు నిరాశచెందా. అయితే జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దానిపై దృష్టి పెట్టా. అనవసరంగా ఆందోళన చెందకుండా పరిణతితో ఆడాల్సిన అవసరం ఉందని మనసులో అనుకొని దానిని అమలు చేశా. అనుకున్న ఫలితాన్ని సాధించా. – నయోమి ఒసాకా విశేషాలు జెన్నిఫర్ కాప్రియాటి (అమెరికా–2001లో) తర్వాత కెరీర్‌లోని తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను వరుసగా నెగ్గిన రెండో క్రీడాకారిణిగా ఒసాకా గుర్తింపు పొందింది. కాప్రియాటి కంటే ముందు క్రిస్ ఎవర్ట్ (అమెరికా), ఇవోన్ గూలగాంగ్ (ఆస్ట్రేలియా), హానా మాండ్లికోవా (చెక్ రిపబ్లిక్), వీనస్ విలియమ్స్ (అమెరికా) ఈ ఘనత సాధించారు. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1998లో) తర్వాత బ్యాక్ టు బ్యాక్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా... 2010లో కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) తర్వాత పిన్న వయస్సులో నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ నాదల్vsజొకోవిచ్ మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–2లలో ప్రత్యక్ష ప్రసారం -
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఒసాకా
-
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఒసాకా
మెల్బోర్న్ : గతేడాది గ్రాండ్‌స్లామ్ చివరి టోర్నీ యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా.. ఈ ఏడాది సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సైతం అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఒసాకా 7-6(7/2), 5-7, 6-4 తేడాతో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇరువురు క్రీడాకారిణులు మధ్య హోరాహోరీగా సాగిన తుది పోరులో ఒసాకానే విజయం వరించింది. తొలి సెట్‌ను టైబ్రేక్ ద్వారా గెలుపొందిన ఒసాకా.. రెండో సెట్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ ఆసక్తికరంగా మారింది. ఓవరాల్‌గా 116 పాయింట్లను ఒసాకా సాధించి విజేతగా నిలవగా, 112 పాయింట్లను క్విటోవా సాధించారు. ఇందులో ఒసాకా 9 ఏస్‌లను సంధించగా, క్విటోవా 5 ఏస్‌లను మాత్రమే సంధించి వెనుకబడింది. ఇక ఇరువురు తలో నాలుగుసార్లు డబుల్ ఫాల్ట్స్ చేయడం గమనార్హం. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జొకో జోరు
తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన వేదికపై సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరోసారి చెలరేగిపోయాడు. సెమీఫైనల్లో తన ప్రత్యర్థికి కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే కోల్పోయిన అతను ఘనవిజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్‌కు చేరిన ఆరుసార్లూ విజేతగా నిలిచిన ఈ ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ ఆదివారం జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో అమీతుమీ తేల్చుకుంటాడు. ఈసారీ జొకోవిచ్ గెలిస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను అత్యధికంగా ఏడుసార్లు సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చేరుతాడు. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన సెమీఫైనల్లో జొకోవిచ్ 6–0, 6–2, 6–2తో 28వ సీడ్ లుకాస్ పుయి (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. ఐదు అనవసర తప్పిదాలు చేసిన అతను ఏడుసార్లు పుయి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 24 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ నెట్ వద్దకు 14 సార్లు వచ్చి తొమ్మిదిసార్లు పాయింట్ సాధించాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్ చేరిన జొకోవిచ్ (2016, 2015, 2013, 2012, 2011, 2008) ఆరుసార్లూ చాంపియన్‌గా నిలువడం విశేషం. ఆదివారం రాఫెల్ నాదల్‌తో జరిగే ఫైనల్లో జొకోవిచ్ గెలిస్తే అత్యధికంగా ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తాడు. గతంలో రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఆరుసార్లు చొప్పున ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సాధించారు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 27–25తో నాదల్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరు 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తలపడగా... జొకోవిచ్ 5 గంటల 53 నిమిషాల్లో నాదల్‌ను ఓడించాడు. నెగ్గిన వారు నంబర్‌వన్ నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ ఒసాకా (vs) క్విటోవా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), నయోమి ఒసాకా (జపాన్) తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం తలపడనున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలుస్తారు. -
నాదల్ నిర్దాక్షిణ్యంగా...
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో రోజర్ ఫెడరర్‌నే చిత్తు చేసి సంచలనం సృష్టించిన గ్రీకు వీరుడు సిట్సిపాస్ ఆటలు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ముందు సాగలేదు. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో సిట్సిపాస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తూ నాదల్ చెలరేగాడు. నిర్దాక్షిణ్యమైన ఆటతో విజయాన్ని అందుకొని పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ వేటలో నిలిచాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా కోల్పోని నాదల్ భీకర ఫామ్ ముందు సిట్సిపాస్ పూర్తిగా చేతులెత్తేశాడు. మహిళల విభాగంలో పెట్రా క్విటోవా, నయోమి ఒసాకా ఫైనల్ చేరి ఆఖరి సమరానికి సిద్ధమయ్యారు. వీరిద్దరిలో ఎవరి గెలిస్తే వారు హలెప్ స్థానంలో కొత్త వరల్డ్ నంబర్‌వన్‌గా నిలుస్తారు. మెల్బోర్న్: కెరీర్లో ఒకే ఒక్క సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) మరో టైటిల్ విజయానికి మరింత చేరువయ్యాడు. నాలుగు సార్లు ఈ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను... మళ్లీ ఇక్కడ విజయం సాధించగలిగితే ఓపెన్ ఎరాలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కనీసం రెండేసి సార్లు నెగ్గిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. నాదల్ అద్భుత ఫామ్‌ను చూపించేలా సెమీ ఫైనల్ సాగింది. ఈ మ్యాచ్‌లో అతను 6–2, 6–4, 6–0తో స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్)ను చిత్తుగా ఓడించాడు. 1 గంటా 46 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఆద్యంతం రాఫెల్ దూకుడు కొనసాగింది. ఫైనల్ చేరే క్రమంలో వరుసగా 63 గేమ్‌లలో నాదల్ తన సర్వీస్‌ను కోల్పోకపోవడం విశేషం. తొలి సెట్ మూడో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన ధాటిని మొదలు పెట్టిన నాదల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. పదునైన సర్వీస్‌లతో దూసుకుపోయిన అతను 4–2తో ముందంజ వేశాడు. రెండు డబుల్ ఫాల్ట్‌లతో పాటు పేలవ డ్రాప్షాట్లతో సిట్సిపాస్ తొలి సెట్లో పూర్తిగా వెనుకబడిపోయాడు. రెండో సెట్లో మాత్రం కొంత పోటీనిచ్చిన గ్రీక్ ఆటగాడు 4–4 వరకు సమంగా నిలిచాడు. అయితే బ్రేక్ సాధించిన నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. మూడో సెట్‌లోనైతే తిరుగులేని ఆటతో మూడు సార్లు సర్వీస్ బ్రేక్ చేసిన నాదల్... ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వలేదు. నాదల్ 28 విన్నర్లు కొట్టగా, సిట్సిపాస్ 17కే పరిమితం కావడం ఇద్దరి ఆట మధ్య తేడాను చూపిస్తోంది. ఈ టోర్నీలో హోరాహోరీ మ్యాచ్‌లు ఆడటంతో నాదల్‌తో పోలిస్తే దాదాపు పది గంటలు ఎక్కువగా కోర్టులో గడిపిన సిట్సిపాస్‌పై తీవ్ర అలసట కూడా ప్రభావం చూపించింది. తొలిసారి ఫైనల్‌కు... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్లో మొదటి సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీస్‌లో క్విటోవా 7–6 (7/2), 6–0తో డానియెల్ కొలిన్స్‌ను చిత్తు చేసింది. 1 గంటా 34 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. తొలి సెట్ ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. 4–4తో స్కోరు సమంగా నిలిచిన స్థితిలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోవడంతో రాడ్ లేవర్ ఎరీనా పై కప్పును మూసేశారు. తిరిగొచ్చిన తర్వాత కొలిన్స్ ఆట గతి తప్పింది. సహనం కోల్పోయిన ఆమె రెండో సెట్‌కు ముందు అంపైర్‌తో కూడా వాదనకు దిగింది. రెండో సెట్లో క్విటోవాకు ఎదురు లేకుండా పోయింది. రెండు సార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన క్విటోవా 2016లో కత్తిపోటుకు గురైంది. పునరాగమనం తర్వాత ఆమె అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. మరో సెమీస్‌లో నాలుగో సీడ్, యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 4–6, 6–4తో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో సెరెనాను కంగు తినిపించిన ప్లిస్కోవా గట్టిగా పోరాడినా జపాన్ స్టార్ ముందు తలవంచక తప్పలేదు. -
అయ్యో సెరెనా!
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డు సమం చేసేందుకు స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. రెండేళ్ల క్రితం చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై మరో ట్రోఫీని ఆశించిన అమెరికా దిగ్గజం ఆట క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇటీవలే యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో తన చేతిలోనే ఓడిన ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా అద్భుత ఆటతో సెరెనాపై ప్రతీకారం తీర్చుకుంది. మెల్బోర్న్: హోరాహోరీగా సాగిన సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మధ్య క్వార్టర్ ఫైనల్ పోరుకు అనూహ్య ముగింపు లభించింది. రెండు సెట్ల తర్వాత ఇద్దరూ చెరో సెట్ గెలిచి సమంగా నిలవగా... మూడో సెట్లో సెరెనా 5–1తో ఆధిక్యంలో నిలిచింది. మరో గేమ్ గెలిస్తే సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. కానీ ప్లిస్కోవా మొండిగా పోరాడింది. వరుసగా నాలుగు పాయింట్లు కాపాడుకొని ఆధిక్యాన్ని 2–5కు తగ్గించింది. ఆ తర్వాత అదే జోరుతో దూసుకుపోయి సెరెనా ఆట కట్టించింది. 2 గంటల 10 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చివరకు ఏడో సీడ్ ప్లిస్కోవా 6–4, 4–6, 7–5 తేడాతో 16వ సీడ్ సెరెనాను చిత్తు చేసింది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఓటమి అంచుల నుంచి... ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా సాగిన బ్రిస్బేన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి ఫామ్‌లో ఉన్న ప్లిస్కోవా తొలి సెట్లో ఆధిక్యం కనబర్చింది. పదో గేమ్‌ను నెగ్గి సెట్ గెలుచుకుంది. అయితే సెరెనా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. చివరి సెట్లో సెరెనా 5–1తో ముందంజలో నిలిచినప్పుడు మరో ఫలితం గురించి ఎవరూ ఊహించలేదు. కానీ ఈ దశలో సెరెనా ఆట గతి తప్పింది. కాలి మడమకు స్వల్ప గాయంతో సెరెనా కొంత ఇబ్బంది పడటాన్ని గుర్తించిన ఆమె ప్రత్యర్థి మరో అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన ప్లిస్కోవా... తర్వాతి గేమ్‌లో చెలరేగిపోయింది. సెరెనా కొట్టిన ఫోర్‌హ్యాండ్ నెట్‌ను తాకడంతో ప్లిస్కోవా గెలుపు ఖాయమైం ది. 4 డబుల్ ఫాల్ట్‌లు చేసిన అమెరికా స్టార్, ఏకంగా 37 అనవసర తప్పిదాలతో ఓటమిని ఆహ్వా నించింది. మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–4, 6–1తో స్వితోలినా (ఉక్రె యిన్)పై నెగ్గి సెమీస్ చేరింది. 1994లో కిమికో డాటె తర్వాత తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి జపాన్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. జొకోవిచ్ జోరు... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ కీ నిషికోరితో జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–1, 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయం కారణంగా తప్పుకున్నాడు. హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్స్‌లో లుకాస్ పుయి (ఫ్రాన్స్) 7–6 (7/4), 6–3, 6–7 (2/7), 6–4తో 16వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. నేటి షెడ్యూల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ క్విటోవాvsకొలిన్స్ ప్లిస్కోవాvsనయోమి ఒసాకా ఉదయం గం. 8.30 నుంచి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ రాఫెల్ నాదల్ vs సిట్సిపాస్ మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
క్విటోవా హవా
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ స్టార్ క్రీడాకారులు... ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అద్భుత ఆటతీరుతో దూసుకొస్తున్న అనామక క్రీడాకారులు... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తమ హవా చలాయిస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా ఏడేళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్ చేరుకోగా... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఏనాడూ తొలి రౌండ్ దాటని అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ తన విజయపరంపర కొనసాగిస్తూ తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో నాదల్ ఆరోసారి సెమీఫైనల్ చేరగా... గ్రీస్ యువతార సిట్సిపాస్ మరో అద్భుత విజయంతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. మెల్బోర్న్: రెండేళ్ల క్రితం ఆగంతకుడి కత్తి దాడిలో గాయపడి ఆరు నెలలపాటు ఆటకు దూరమైన పెట్రా క్విటోవాకు పునరాగమనంలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆమె ఆడిన గత ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ దశనూ దాటలేదు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం క్విటోవా కదం తొక్కుతోంది. తన ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తూ టైటిల్ దిశగా సాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–4తో 15వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై నెగ్గి 2012 తర్వాత తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2014లో వింబుల్డన్ టోర్నీ తర్వాత క్విటోవా సెమీఫైనల్ చేరిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా ఇదే కావడం గమనార్హం. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ షరపోవాను బోల్తా కొట్టించిన యాష్లే బార్టీ ఈ మ్యాచ్‌లో మాత్రం క్విటోవా ముందు నిలువలేకపోయింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్విటోవా మూడు ఏస్‌లు సంధించి, మూడుసార్లు బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్ చేరే క్రమంలో క్విటోవా ఇప్పటివరకు తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. గురువారం జరిగే సెమీఫైనల్లో అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)తో క్విటోవా తలపడుతుంది. ‘కన్నీళ్లు కావివి ఆనంద బాష్పాలు. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నా. కత్తి దాడిలో గాయపడ్డాక మళ్లీ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ దశకు రావడానికి నేను తీవ్రంగా శ్రమించాను. నాకైతే ఇది రెండో కెరీర్లాంటిదే. పునరాగమనం చేశాక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని అనుకోలేదు. ఈ క్షణాలను నేనెంతో ఆస్వాదిస్తున్నాను’ అని విజయానంతరం సెంటర్‌కోర్టులో క్విటోవా వ్యాఖ్యానించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 35వ ర్యాంకర్ డానియెలా కొలిన్స్ 2–6, 7–5, 6–1తో మరో అన్‌సీడెడ్ క్రీడాకారిణి అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొలిన్స్ ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అగుట్ పోరు ముగిసె... పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నాదల్, 14వ సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ 6–3, 6–4, 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై గెలుపొందగా... సిట్సిపాస్ 7–5, 4–6, 6–4, 7–6 (7/2)తో 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ లో సెమీఫైనల్‌కు చేరాడు. కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతూ తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన అగుట్ కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. తొలి రౌండ్లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేపై... మూడో రౌండ్లో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో నిరుటి రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచిన అగుట్ ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌పై సంచలన విజయం సాధించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సిట్సిపాస్... ఈ ఏడాది తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకున్నానని వ్యాఖ్యానించాడు. ‘ఈ ఏడాది నీ లక్ష్యమేంటి అని అడిగితే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరడం అని చెప్పాను. అయితే ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు’ అని 20 ఏళ్ల సిట్సిపాస్ అన్నాడు. పేస్ జంట పరాజయం మిక్స్డ్ డబుల్స్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన లియాండర్ పేస్ (భారత్)–సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. పేస్–స్టోసుర్ ద్వయం 6–4, 4–6, 8–10తో ఐదో సీడ్ రాబర్ట్ ఫరా (కొలంబియా)–అనా లెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. పేస్ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. నేటి క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ విభాగం నయోమి ఒసాకా (vs) ఎలీనా స్వితోలినా సెరెనా విలియమ్స్(vs) కరోలినా ప్లిస్కోవా పురుషుల సింగిల్స్ విభాగం మిలోస్ రావ్‌నిచ్(vs) లుకాస్ పుయి జొకోవిచ్(vs) నిషికోరి ఉదయం గం. 5.30 నుంచి; మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పొరపాటు.. వెనుదిరిగిన మాజీ నెంబర్ వన్..!!
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెరెనా విలియమ్స్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. గంటా 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ సెరెనా 6–1, 4–6, 6–4తో టాప్ సీడ్ హలెప్‌ను బోల్తా కొట్టించారు. అయితే, మ్యాచ్‌కు ముందు సెరెనా చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల కాస్త గందరగోళం, ఇంకాస్త సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అనౌన్సర్ ప్లేయర్లను పరిచయం చేసే క్రమంలో.. ‘టాప్ సీడ్, వరల్డ్ నెంబర్ వన్ సిమోనా హాలెప్ (రొమేనియా) ను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పగానే.. సెరెనా గ్రౌండ్లోకి ప్రవేశించేందుకు నడిచారు. (సెరెనా గర్జన) టన్నెల్ దాటి నాలుగు అడుగులు వేయగానే.. తన పొరపాటును గ్రహించారు. దాంతో వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. హాలెప్ వచ్చిన అనంతరం మళ్లీ వచ్చారు. కాగా, చాలా ఏళ్లపాటు ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా కొనసాగిన సెరేనా ప్రస్తుతం 16వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఇక మూడో రౌండ్లో సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ హాలెప్ చేతిలో ఓడారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెరెనాపై హలెప్ గెలిచుంటే ఒకే టోర్నీలో విలియమ్స్ సిస్టర్స్ వీనస్, సెరెనాలను ఓడించిన తొమ్మిదో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేవారు. సెరెనా 2017లో కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహానియన్ జూనియర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. -
సెరెనా గర్జన
తల్లి హోదా వచ్చాక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన 37 ఏళ్ల సెరెనా విలియమ్స్ ఆ దిశగా మరో అడుగు వేసింది. రెండేళ్ల క్రితం రెండు నెలల గర్భంతో ఈ మెగా టోర్నీలో ఆడి విజేతగా నిలిచిన ఆమె ఈసారీ అదే జోరు కనబరుస్తోంది. గత సంవత్సరం వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిపోయిన ఈ అమెరికా నల్లకలువ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదరగొడుతోంది. తొలి మూడు రౌండ్లలో అంతగా ప్రతిఘటన ఎదుర్కోని సెరెనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ రూపంలో అసలు సిసలు సవాల్ ఎదురైంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో 24 ఏళ్ల అనుభవమున్న సెరెనా ఈ అడ్డంకిని అద్భుత ఆటతో అధిగమించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 12వసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మెల్బోర్న్: అమ్మతనం వచ్చాక తన ఆటలో మరింత పదును పెరిగిందని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నిరూపించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఈ మాజీ చాంపియన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మూడో రౌండ్లో తన అక్క వీనస్ విలియమ్స్‌ను ఓడించిన ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా)పై సెరెనా ప్రిక్వార్టర్ ఫైనల్లో అద్భుత విజయం సాధించింది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ సెరెనా 6–1, 4–6, 6–4తో టాప్ సీడ్ హలెప్‌ను బోల్తా కొట్టించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెరెనాపై హలెప్ గెలిచుంటే ఒకే టోర్నీలో విలియమ్స్ సిస్టర్స్ వీనస్, సెరెనాలను ఓడించిన తొమ్మిదో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేది. కెరీర్లో పదోసారి హలెప్‌తో తలపడిన సెరెనా తొలి సెట్‌ను కేవలం 20 నిమిషాల్లో సొంతం చేసుకుంది. తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందం హలెప్‌నకు ఎక్కువసేపు నిలువలేదు. ఆమె వరుసగా ఆరు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను సెరెనాకు అప్పగించేసింది. అయితే రెండో సెట్లో పరిస్థితి మారిపోయింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. సెరెనా ఆటకు తగిన సమాధానమిస్తూ హలెప్ స్కోరు 5–4 వద్ద బ్రేక్ పాయింట్ సంపాదించి రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 3–2 వద్ద సెరెనా సర్వీస్‌లో హలెప్ మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. కానీ వాటిని అనుకూలంగా మల్చుకోవడంలో ఆమె విఫలమైంది. తీవ్రంగా పోరాడి తన సర్వీస్‌ను కాపాడుకున్న సెరెనా స్కోరును 3–3తో సమం చేసింది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఆమె 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో హలెప్ తన సర్వీస్‌ను కాపాడుకుంది. మ్యాచ్‌లో నిలవాలంటే పదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కచ్చితంగా బ్రేక్ చేయాల్సిన హలెప్ చేతులెత్తేయడంతో మ్యాచ్ సెరెనా వశమైంది. ఓవరాల్‌గా హలెప్‌పై సెరెనాకిది తొమ్మిదో విజయం. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడోది. గతంలో వీరిద్దరు తలపడిన రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లు (2016 యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్; 2011 వింబుల్డన్ రెండో రౌండ్) కూడా మూడు సెట్లపాటు సాగడం విశేషం. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో సెరెనా ఆడుతుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్లిస్కోవా 6–3, 6–1తో 18వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. మరోవైపు నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్ చేరేందుకు తీవ్రంగా శ్రమించారు. 13వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)తో గంటా 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 4–6, 6–3, 6–4తో గెలుపొందింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)తో గంటా 36 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా 6–2, 1–6, 6–1తో నెగ్గి క్వార్టర్ ఫైనల్లో ఒసాకాతో పోరుకు సిద్ధమైంది. 5 గంటల 5 నిమిషాలు పోరాడి... పురుషుల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ కి నిషికోరి (జపాన్), టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 16వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా), 28వ సీడ్ లుకాస్ పుయి (ఫ్రాన్స్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 23వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో నిషికోరి ఏకంగా 5 గంటల 5 నిమిషాలు పోరాడి 6–7 (8/10), 4–6, 7–6 (7/4), 6–4, 7–6 (10/8)తో విజయాన్ని దక్కించుకున్నాడు. తొలి రెండు సెట్లను కోల్పోయిన నిషికోరి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గెలిచాడు. నిర్ణాయక ఐదో సెట్ టైబ్రేక్‌లో 5–8తో వెనుకబడిన నిషికోరి ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించి 10–8తో టైబ్రేక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ‘నేను ఎలా పుంజుకున్నానో నాకే తెలియదు. తుది ఫలితంతో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను’ అని క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌తో తలపడనున్న నిషికోరి వ్యాఖ్యానించాడు. 15వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా)తో 3 గంటల 15 నిమిషాలపాటు సాగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6–4, 6–7 (5/7), 6–2, 6–3తో గెలిచాడు. నేటి క్వార్టర్ ఫైనల్స్ పురుషుల సింగిల్స్ విభాగం సిట్సిపాస్ (VS) బాటిస్టా అగుట్ రాఫెల్ నాదల్ (VS) టియాఫో మహిళల సింగిల్స్ విభాగం పావ్లీచెంకోవా (VS) డానియెలా కొలిన్స్ క్విటోవా(VS) యాష్లే బార్టీ ఉదయం 7 గంటల నుంచి; మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
లవ్ @టెన్నిస్ కోర్ట్...
మెల్బోర్న్: టెన్నిస్ జగతిలో కొత్తగా మరో కొత్త ప్రేమకథ మొదలైంది. ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్ఫిల్స్, ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆరో సీడ్ స్వితోలినా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్ బాక్స్‌లో కూర్చొని మోన్ఫిల్స్ ఆమెను ప్రోత్సహించడం కనిపించింది. దీనిపై ప్రశ్నించగా...‘అతను నా కోసమే, నాకు మద్దతునిచ్చేందుకే అక్కడికి వచ్చాడు. నేను కూడా అతని కోసమే ఉన్నాను. ఇప్పుడు మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఇద్దరికీ బాగా తెలుసు’ అంటూ స్వితోలినా తమ బంధాన్ని నిర్ధారించింది. తమ ఇద్దరి పేర్లు ‘గేల్ ఎలీనా మోన్ఫిల్స్ స్వితోలినా’లను కలుపుతూ వీరు ‘జీ.ఈ.ఎం.ఎస్ లైఫ్’ పేరుతో ఒకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను మొదలు పెట్టడం విశేషం. ఇందులో వారిద్దరు కలిసి ఉన్న వీడియోను కూడా పంచుకున్నారు. 7 ఏటీపీ టైటిల్స్ గెలిచిన 32 ఏళ్ల మోన్ఫిల్స్ ప్రస్తుతం 33వ ర్యాంక్‌లో ఉన్నాడు. 13 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించిన 24 ఏళ్ల స్వితోలినా ప్రస్తుతం 7వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
చాంపియన్‌కు షాక్
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం సంచలనాల మోత మోగింది. ఒకే రోజు టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారులు నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్... గతేడాది రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్... 20వ సీడ్ దిమిత్రోవ్... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్... మాజీ చాంపియన్ షరపోవా... ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టారు. మెల్బోర్న్: అనుకున్నదొకటి... అయ్యిందొకటి. తొలి మూడు రౌండ్లలో అలవోకగా ప్రత్యర్థుల ఆట కట్టించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం మట్టికరిచాడు. అంతర్జాతీయస్థాయిలో తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్ యువతార స్టెఫానోస్ సిట్సిపాస్ చేతిలో ఫెడరర్ కంగుతిన్నాడు. వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్‌కు... కెరీర్లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న సిట్సిపాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ సిట్సిపాస్ 6–7 (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్ ఫెడరర్‌పై గెలిచి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అంతేకాకుండా గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్ ప్లేయర్‌గానూ గుర్తింపు పొందాడు. తన ప్రత్యర్థి 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత అని... 21 ఏళ్ల అనుభవమున్న దిగ్గజమని... కళాత్మక ఆటతీరుకు మరో రూపమని తెలిసినా... సిట్సిపాస్ అవేమీ పట్టించుకోలేదు. ఎలాంటి బెరుకు లేకుండా తొలి పాయింట్ నుంచి మ్యాచ్ పాయింట్ వరకు దూకుడుగానే ఆడాడు. ఫలితంగా తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ‘ప్రస్తుతం ఈ భూగోళం మీద అమితానందంగా ఉన్న వ్యక్తిని నేనే. నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి ఫెడరర్‌ను ఆరాధిస్తున్నాను. మరో దిగ్గజం రాడ్ లేవర్ పేరిట ఉన్న సెంటర్ కోర్టులోనే ఫెడరర్‌తో ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైంది. ఈ ఫలితాన్ని ఎలా వర్ణించాలో కూడా మాటలు రావడంలేదు’ అని ఫెడరర్‌ను ఓడించిన అనంతరం సిట్సిపాస్ వ్యాఖ్యానించాడు.‘నేను మంచి ప్లేయర్ చేతిలోనే ఓడిపోయాను. ఇటీవల కాలంలో సిట్సిపాస్ చాలా బాగా ఆడుతున్నాడు. కీలక సమయాల్లో అతను ఎంతో ఓర్పుతో ఆడాడు’ అని ఫెడరర్ ప్రశంసించాడు. శక్తివంతమైన సర్వీస్‌లు... కచ్చితమైన రిటర్న్‌లు.. నెట్ వద్ద పైచేయి... ఏకంగా 12 బ్రేక్ పాయింట్లను కాపాడుకోవడం సిట్సిపాస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్ మొత్తంలో 20 ఏస్‌లు సంధించిన ఈ గ్రీస్ యువతార కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. మరోవైపు ఫెడరర్ 12 ఏస్‌లు కొట్టినా... 12 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఒక్కటీ సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. 55 అనవసర తప్పిదాలు చేసిన ఈ స్విస్ స్టార్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అగుట్ అద్భుతం... మరోవైపు 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) మరో అద్భుత విజయం సాధించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. 3 గంటల 58 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అగుట్ 6–7 (6/8), 6–3, 6–2, 4–6, 6–4తో నిరుటి రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. తొలి రౌండ్లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేపై, మూడో రౌండ్లో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచిన అగుట్ క్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో అమెరికా యువతార టియాఫో 7–5, 7–6 (8/6), 6–7 (1/7), 7–5తో 20వ సీడ్ దిమిత్రోవ్‌ను ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–0, 6–1, 7–6 (7/4)తో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచి టియాఫోతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. కెర్బర్ కుదేలు... మహిళల సింగిల్స్ విభాగంలో 2016 చాంపియన్, మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)కు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతోన్న 25 ఏళ్ల అమెరికా అమ్మాయి డానియెలా కొలిన్స్ 6–0, 6–2తో కెర్బర్‌ను చిత్తు చేసింది. గతంలో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొన్న కొలిన్స్ ఏనాడూ తొలి రౌండ్‌ను దాటకపోగా ఆరో ప్రయత్నంలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవడం విశేషం. మరో మ్యాచ్‌లో 15వ ర్యాంకర్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 4–6, 6–1, 6–4తో 30వ సీడ్, 2008 చాంపియన్, మాజీ నంబర్‌వన్ మరియా షరపోవా (రష్యా)ను బోల్తా కొట్టించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 6–7 (3/7), 6–3, 6–3తో ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించగా... ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–1తో అమండా అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. -
షరపోవాను ఓడించిన క్రికెటర్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ మారియా షరపోవా (రష్యా) కథ ముగిసింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో క్రికెటర్ కమ్ టెన్నిస్ స్టార్ ఆష్‌బార్టీ (ఆస్ట్రేలియా)ఈ రష్యాస్టార్ను మట్టికరిపించింది. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో ఆష్‌బార్టీ విజయం సాధించింది. ఈ విజయంతో 22 ఏళ్ల ఆష్‌బార్టీ తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2014లో టెన్నిస్‌కు విరామం ఇచ్చి అనూహ్యంగా క్రికెట్ ఆడిన ఆష్‌బార్టీ.. మహిళల బిగ్‌బాష్‌లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిథ్యం ఇచ్చింది. టెన్నిస్ రాకెట్ వదిలి బ్యాట్ పట్టుకున్నఈ యంగ్ లేడీ క్రికెట్లోనూ అదరగొట్టింది. లీగ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే 29 బంతుల్లో 37 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టుకున్న ఆష్‌బార్టీ గతేడాదే కెరీర్ బెస్ట్ 15వ ర్యాంకును సొంత చేసుకుంది. ఇక తాజాగా ఐదు గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన టెన్నిస్ దిగ్గజం షరపోవాను మట్టికరిపించి ఔరా అనిపించింది. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ చేరింది. The most famous victory of her young career. Congratulations, @ashbar96 👏👏👏#AusOpen pic.twitter.com/MEvPFeKZc7 — #AusOpen (@AustralianOpen) January 20, 2019 -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం..!
కాన్బెర్రా: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలన జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రీక్వార్టర్స్‌లో దిగ్గజ క్రీడాకారిణి మరియా షరపోవా అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో నయాసంచలనం ఆష్‌బార్టీ సంచలన విజయం నమోదు చేశారు. ఆదివారం ఇక్కడి మెల్బోర్న్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆష్‌బార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి ఆష్‌బార్టీ క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ఈ దశాబ్దాంలో తొలిసారి అస్ట్రేలియన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. 22 ఏళ్ల ఆష్‌బార్టీ 5సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన షరపోవాను ఓడించడం విశేషం. -
హలెప్ అలవోకగా..
గతేడాది ఆఖరి మెట్టుపై బోల్తా పడిన ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ ఈసారి మాత్రం టైటిల్‌తో తిరిగి వెళ్లాలనే లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ రొమేనియా అమ్మాయి అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్‌పై అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం వీనస్ సోదరి సెరెనాతో హలెప్ అమీతుమీ తేల్చుకోనుంది. హలెప్తోపాటు సెరెనా, ముగురుజా సునాయాసంగా ముందంజ వేయగా... ఇతర సీడెడ్ క్రీడాకారిణులు నయోమి ఒసాకా, కరోలినా ప్లిస్కోవా, ఎలీనా స్వితోలినా మాత్రం మూడో రౌండ్ దాటేందుకు కష్ట పడ్డారు. మెల్బోర్న్: టాప్ సీడ్ హోదాకు తగ్గ ప్రదర్శన చేస్తూ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో హలెప్ 6–2, 6–3తో విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గతేడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన హలెప్‌నకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. 19వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న వీనస్ మ్యాచ్ మొత్తంలో నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. హలెప్ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లు సాధించే అవకాశం వచ్చినా 38 ఏళ్ల వీనస్ ఒక్కసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు 27 ఏళ్ల హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సోమవారం సెరెనాతో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని హలెప్ వ్యాఖ్యానించింది. ‘నేను ఓ గొప్ప చాంపియన్‌తో తలపడబోతున్నా. ఈ సవాల్‌కు నేను సిద్ధంగా ఉన్నా. ఫలితం ఎలా వచ్చినా కోల్పోయేదేమీ లేదు’ అని తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో మూడు సెట్లలో విజయాలను అందుకున్న హలెప్ తెలిపింది. మరోవైపు సెరెనా సునాయాస విజయం సాధించింది. 16వ సీడ్‌గా బరిలోకి దిగిన 37 ఏళ్ల సెరెనా 6–2, 6–1తో డయానా యెస్ట్రెంస్కా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సెరెనా ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న డయానాను నెట్ వద్దకు వచ్చి సెరెనా ఓదార్చింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–2తో 12వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, 18వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 7–6 (7/5), 6–2తో తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై, 13వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 6–3, 6–3తో 21వ సీడ్ కియాంగ్ వాంగ్ (చైనా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఓటమి దిశ నుంచి... మరోవైపు నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడు సెట్లపాటు పోరాడి మూడో రౌండ్‌ను దాటారు. 28వ సీడ్ సు వె సెయి (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 5–7, 6–4, 6–1తో గెలిచింది. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా తొలి సెట్‌ను కోల్పోయి రెండో సెట్లో 1–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే గత సంవత్సరం యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాపై గెలిచి పెను సంచలనం సృష్టించిన ఒసాకా పట్టుదలతో పోరాడింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో మాత్రం ఒసాకా ధాటికి సు వె సెయి ఎదురునిలువలేకపోయింది. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్‌లో స్వితోలినా 4–6, 6–4, 7–5తో షుయె జాంగ్ (చైనా)పై, 2 గంటల 11 నిమిషాల పోరులో ప్లిస్కోవా 6–4, 3–6, 6–2తో 27వ సీడ్ కామిల్లా జార్జి (ఇటలీ)పై గెలుపొందారు. జొకోవిచ్ ముందుకు... పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ నిషికోరి (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. జొకోవిచ్ 6–3, 6–4, 4–6, 6–0తో 25వ సీడ్ షపవలోవ్ (కెనడా)పై, జ్వెరెవ్ 6–3, 6–3, 6–2తో అలెక్స్ బోల్ట్ (ఆస్ట్రేలియా)పై, నిషికోరి 7–6 (8/6), 6–1, 6–2తో జోవో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కొరిచ్ (క్రొయేషియా) 2–6, 6–3, 6–4, 6–3 తో క్రాజ్నోవిచ్ (సెర్బియా)పై, 23వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) 6–2, 6–4, 2–6, 6–4తో 12వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై, 15వ సీడ్ మెద్వె దెవ్ (రష్యా) 6–2, 7–6 (7/3), 6–3తో 21వ సీడ్ గాఫిన్ (బెల్జియం)పై, 16వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 6–4, 6–4, 7–6 (8/6)తో హెర్బర్ట్ (ఫ్రాన్స్)పై, 28వ సీడ్ లుకాస్ పుయి (ఫ్రాన్స్) 7–6 (7/3), 6–3, 6–7 (10/12), 4–6, 6–3తో పాపిరిన్ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు. పేస్ జంట శుభారంభం మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–సమంత స్టోసుర్ (ఆస్ట్రేలియా) ద్వయం 6–4, 7–5తో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్)–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే రోహన్ బోపన్న (భారత్)–జావోజువాన్ యాంగ్ (చైనా) జోడీ 6–3, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ ఫరా (కొలంబియా)–అనా లెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. -
హవ్వా.. అనుష్కా లెజెండా?
మెల్బోర్న్ : బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్కశర్మపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసిన ఓ ఫోటోనే ఈ ట్రోలింగ్‌కు కారణమైంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఆసీస్ పర్యటనను ఘనంగా ముగించిన భారత ఆటగాళ్లు ఈ విన్నింగ్ మూమెంట్‌ను అక్కడే గడుపుతూ ఆస్వాదిస్తున్నారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్కతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. శనివారం ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతున్న మెల్బోర్న్ పార్క్‌ను విరుష్కా సందర్శించింది. ఈ సందర్భంగా ఈ జోడి టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను కలిసి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫొటోను యూఎస్ ఓపెన్ ‘ముగ్గురు దిగ్గజాలు.. ఒక్క ఫొటో’ అనే క్యాఫ్షన్‌తో ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అనుష్కను ఓ ఆట ఆడుకున్నారు. ‘కోహ్లి, ఫెడరర్ సరసన ఉన్న అనుష్క దిగ్గజమా? మీరే చెప్పాలి.. కోహ్లి, ఫెడరర్!’ అంటూ ఒకరు, ‘ఓహో.. ఫెడరర్‌ను కలిస్తే లెజెండ్ అవుతామన్నమాట! అయితే నేను కూడా కలుస్తా!’ అని మరొకరు సెటైరిక్‌గా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే యూఎస్ ఓపెన్ అధికారులకు మతి దొబ్బినట్టుంది.. లేకుంటే అనుష్క లేజెండ్ ఏంటని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. -
వొజ్నియాకి ఔట్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కరోలైన్ వొజ్నియాకి కథ ముగిసింది. మాజీ విజేత షరపోవా (రష్యా) కీలకదశలో పైచేయి సాధించి వొజ్నియాకిని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మాజీ నంబర్‌వన్, 30వ సీడ్ షరపోవా 6–4, 4–6, 6–3తో మూడో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్)పై గెలిచింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 2008 చాంపియన్ షరపోవా ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ రష్యా స్టార్ వొజ్నియాకి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి ఫలితాన్ని శాసించింది. రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కెర్బర్ 6–1, 6–0తో కింబర్లీ బిరెల్ (ఆ స్ట్రేలియా)పై, స్లోన్ స్టీఫెన్స్ 7–6 (8/6), 7–6 (7/5)తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై, క్విటోవా 6–1, 6–4తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై నెగ్గారు. 11వ సీడ్ సబలెంకా (బెలారస్) 3–6, 2–6తో అనిస్మోవా (అమెరికా) చేతిలో... 19వ సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 2–6తో డానియెలా (అమెరికా) చేతిలో ఓడిపోయారు. ఫెడరర్, నాదల్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మూడో రౌండ్లో ఫెడరర్ 6–2, 7–5, 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, నాదల్ 6–1, 6–2, 6–4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 4–6, 3–6, 6–1, 7–6 (10/8), 6–3తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై శ్రమించి నెగ్గగా... పదో సీడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా) 4–6, 5–7, 4–6తో బటిస్టా అగుట్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. -
మెయిన్ ‘డ్రా’కు ప్రజ్నేశ్ అర్హత
మెల్బోర్న్: భారత టెన్నిస్ నంబర్‌వన్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా ప్రజ్నేశ్ ప్రధాన టోర్నీకి అర్హత పొందాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో 29 ఏళ్ల ప్రజ్నేశ్ 6–7 (5/7), 6–4, 6–4తో యోసుకె వతనుకి (జపాన్)పై విజయం సాధించాడు. ‘గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో ఆడాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నాను. నేడు అది నిజమైంది. నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా కెరీర్లో ఇది పెద్ద ఘనత’ అని చెన్నైకి చెందిన ప్రజ్నేశ్ వ్యాఖ్యానించాడు. క్వాలిఫయింగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ప్రజ్నేశ్‌కు ప్రైజ్‌మనీగా 40 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 లక్షలు 32 వేలు) లభించాయి. ఇక మెయిన్ ‘డ్రా’లో తొలి రౌండ్లో ఓడిపోయినా అతనికి మరో 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 38 లక్షల 10 వేలు) లభిస్తాయి. సోమవారం మొదలయ్యే ప్రధాన టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ 39వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫోతో ప్రపంచ 112వ ర్యాంకర్ ప్రజ్నేశ్ తలపడతాడు. -
కన్నీళ్లతో టెన్నిస్‌కు ముర్రే వీడ్కోలు!
మెల్బోర్న్: సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న తుంటి గాయంతో బ్రిటన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నంబర్‌వన్ ఆండీ ముర్రే కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోతోంది. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు 31 ఏళ్ల ముర్రే శుక్రవారం ప్రకటించాడు. సోమవారం ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్ అవుతున్నట్లు అతను చెప్పాడు. సొంతగడ్డపై ఈ ఏడాది వింబుల్డన్ ఆడిన తర్వాత గుడ్‌బై చెప్పాలనుకున్నానని, అయితే అప్పటి వరకు తాను నొప్పితో ఆడలేనని అన్నాడు. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ముర్రే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘తుంటి గాయం చాలా బాధపెడుతోంది. ఏదోలా ఓర్చుకుంటూ కొంత వరకు ఆడగలనేమో. కానీ అంత సహనంతో బాధను భరిస్తూ ప్రాక్టీస్‌లో గానీ పోటీల్లో గానీ శ్రద్ధ పెట్టలేకపోతున్నా. కాబట్టి ఇదే నా ఆఖరి టోర్నీ కావచ్చు’అని ముర్రే వ్యాఖ్యానించాడు. ఇంగ్లీష్ హీరో... 1936లో ఫ్రెడ్ పెర్రీ వింబుల్డన్ గెలిచిన తర్వాత బ్రిటన్ అభిమానులు మళ్లీ టైటిల్ సాధించే తమ దేశపు ఆటగాడి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు 2013లో సొంతగడ్డపై వింబు ల్డన్ గెలిచి ముర్రే 77 ఏళ్ల కల నెరవేర్చాడు. మరో మూడేళ్లకు 2016లో కూడా ముర్రే ఇదే టైటిల్ నెగ్గాడు. ఈ రెండింటికంటే ముందు 2012లో గెలిచిన యూఎస్ ఓపెన్ అతని ఖాతాలో ఉన్న మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో (2012, 2016) అతను స్వర్ణపతకం గెలుచుకొని ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2016 నవంబర్ 7 నుంచి వరుసగా 37 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగిన రికార్డు ముర్రే సొంతం. మొత్తం 45 ఏటీపీ టైటిల్స్ అతని ఖాతాలో ఉన్నాయి.