
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. బెంగళూరు వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత్.. ఇప్పుడు పుణేలో జరుగుతున్న రెండో టెస్టులో కూడా అదే తీరును కనబరుస్తోంది.
తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా, బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో కేవలం 156 పరుగులకే భారత్ కుప్పకూలింది.
బెడిసి కొట్టిన గంభీర్ వ్యూహం...
కాగా తొలి టెస్టులో ఓటమి అనంతరం కివీస్‌పై భారత జట్టు మెనెజ్‌మెంట్ స్పిన్ అస్త్రాన్ని సంధించాలని భావించింది. ఈ క్రమంలో పుణే పిచ్‌ను డ్రై వికెట్‌గా స్పిన్నర్లకు అనుకూలించేలా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అండ్ కో తయారు చేయించింది.
అయితే 'ఎవరు తీసుకున్న గోతిలో వారే పడినట్లు' అన్న చందంగా టీమిండియా పరిస్థితి మారింది. ప్రత్యర్ధిని స్పిన్‌తో బోల్తా కొట్టించాలనుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే స్పిన్ వలలో చిక్కుకుని విల్లవిల్లాడింది. కివీస్ స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మొత్తం 10 వికెట్లలో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
ఆఖరికి పార్ట్‌టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌ను కూడా భారత బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. అసలు మనం చూస్తుంది భారత బ్యాటర్లనేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. విరాట్ కోహ్లి వంటి స్టార్ క్రికెటర్లు సైతం చెత్త షాట్లు ఆడి తన వికెట్‌ను సమర్పించుకున్నారు.
దీంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్లాన్ మిస్ ఫైర్ కావడంతో గౌతం గంభీర్‌ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. "ఇది టెస్టు క్రికెట్ డ్యూడ్" ఎక్కువగా ప్లాన్స్ చేయవద్దు అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.
Next level hai #INDvsNZ pic.twitter.com/HZJ1T8qbgr
— Hesy Rock (@Hesy_R0ck) October 25, 2024
Team India be like. #INDvsNZ pic.twitter.com/yr4E1dX9VL
— Sagar (@sagarcasm) October 25, 2024