పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ | Huge Blow For Pakistan, Star Wicketkeeper Batter Ruled Out From West Indies Test Series | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ

Published Thu, Jan 9 2025 4:39 PM | Last Updated on Thu, Jan 9 2025 5:34 PM

Huge Blow For Pakistan, Star Wicketkeeper Batter Ruled Out From West Indies Test Series

స్వదేశంలో వెస్డిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హసీబుల్లా ఖాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్‌ సెషన్స్‌ సందర్భంగా హసీబుల్లా ఖాన్‌ గాయపడినట్లు పాక్‌ మీడియా తెలిపింది. 

21 ఏళ్ల హసీబుల్లా ఖాన్‌ విండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌తో పాటు వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా ఎంపిక కావాల్సి ఉండింది. అయితే ఊహించని గాయం టెస్ట్‌ అరంగేట్రం చేయాలనుకున్న హసీబుల్లా ఆశలపై నీళ్లు చల్లింది. హసీబ్‌ గతేడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. హసీబ్‌ గాయపడటంతో విండీస్‌తో సిరీస్‌లో పాక్‌ రిజ్వాన్‌పైనే పూర్తిగా ఆధార పడాల్సి ఉంటుంది. విండీస్‌తో సిరీస్‌ కోసం పాక్‌ జట్టును త్వరలోనే ప్రకటిస్తారు.

అందుబాటులో ఉండని స్టార్‌ బ్యాటర్‌
పాక్‌ ఇటీవలే ఓ కీలక బ్యాటర్‌ సేవలు కోల్పోయింది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌ సందర్భంగా ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సైమ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో సైమ్‌ విండీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు.

జనవరి 17 నుంచి ప్రారంభం
విండీస్‌తో తొలి టెస్ట్‌ జనవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. ముల్తాన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. దీనికి ముందు విండీస్‌ పాక్‌-ఏతో రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ జనవరి 10, 11 తేదీల్లో జరుగుతుంది. జనవరి 25 నుంచి 29 తేదీల మధ్యలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు కూడా ముల్తానే ఆతిథ్యమివ్వనుంది.

18 ఏళ్ల విరామం తర్వాత..
18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విండీస్‌ పాక్‌ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. దీంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

డబ్ల్యూటీసీ 2023-25లో చివరిది
పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు విండీస్‌తో సిరీస్‌ డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో చివరిది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌, విండీస్‌ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి ఎప్పుడో బయటకు వచ్చాయి.

కాగా, పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఇటీవలే సౌతాఫ్రికా గడ్డపై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను పాక్‌ 0-2 తేడాతో కోల్పోయింది.

రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ కోసం పాక్‌-ఏ జట్టు..
ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (కెప్టెన్‌), మొహమ్మద్‌ హురైరా, ఒమైర్‌ యూసఫ్‌, అలీ జర్యాబ్‌, సాద్‌ ఖాన్‌, కషిఫ్‌ అలీ, మొహమ్మద్‌ సులేమాన్‌, హుసేన్‌ తలాత్‌, హసీబుల్లా ఖాన్‌ (వికెట్‌కీపర్‌), రొహైల్‌ నజీర్‌ (వికెట్‌కీపర్‌), ముహమ్మద్‌ మూసా, మొహమ్మద్‌ రమీజ్‌ జూనియర్‌

పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టు..
క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), అలిక్‌ అథనాజ్‌, కవెమ్‌ హాడ్జ్‌, మిఖైల్‌ లూయిస్‌, కీసీ కార్టీ, జస్టిన్‌ గ్రీవ్స్‌, గుడకేశ్‌ మోటీ, జాషువ డ సిల్వ, తెవిన్‌ ఇమ్లాచ్‌, అమిర్‌ జాంగూ, ఆండర్సన్‌ ఫిలిప్‌, జోమెల్‌ వార్రికన్‌, కెవిన్‌ సింక్లెయిర్‌, కీమర్‌ రోచ్‌, జేడెన్‌ సీల్స్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement