
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్‌తో మెరిశాడు. కేకేఆర్ మ్యాచ్‌ను లాగేసుకుంటున్న తరుణంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో చహల్ మ్యాజిక్ చేశాడు. తొలుత వెంకటేశ్ అయ్యర్‌ను స్టంప్ ఔట్ చేసిన చహల్.. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ఫీట్ సాధించి అరుదైన ఘనత సాధించాడు.
ఈ నేపథ్యంలోనే చహల్ సాధించిన ఘనతకు గుర్తింపుగా రాజస్తాన్ రాయల్స్ అతని పేరిట ప్రత్యేక్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది. ఆ వెబ్‌సైట్‌కు www.Yuzigetshattrick.com అని పేరు ఇచ్చి చహల్‌ను గౌరవించుకుంది. ఆ వెబ్‌సైట్‌లో చహల్ ఫోటోలతో పాటు అతను ఈ సీజన్‌లో వికెట్లు తీసిన సందర్భాలను గుర్తుచేస్తూ షేర్ చేసింది. దీంతో పాటు సీజన్‌లో మరెవరైనా హ్యాట్రిక్ నమోదు చేసినా ఈ వెబ్‌సైట్‌లో కనిపించేలాగా డిజైన్ చేసింది. అయితే అవన్నీ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లు మాత్రమే. తాజాగా చహల్ పేరిట వెబ్‌సైట్‌ను డిజైన్ చేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు.
''చహల్ సాధించింది మాములు ఘనత కాదు.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్ నమోదు చేయడం గొప్ప విషయం.. వెబ్‌సైట్ తయారు చేయడంలో తప్పులేదు.. ఆ మాత్రం ఉండాల్సిందే..'' అని పేర్కొన్నారు. అయితే మరికొందరు మాత్రం..'' చహల్ సాధించింది ఘనతే కావొచ్చు.. అంతమాత్రానా వెబ్‌సైట్ తయారు చేయడం ఏంటని తప్పుబట్టారు.
చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు
Yuzvendra Chahal: ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు..
So we did a thing... 😂https://t.co/zvjEuIDk2X https://t.co/l3kOpsNkw0
— Rajasthan Royals (@rajasthanroyals) April 19, 2022