
PC: BCCI/IPL.com
IPL 2025 SRH Vs MI Live updates: ఐపీఎల్-2025లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి.
ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన ముంబై..
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు.
ముంబై రెండో వికెట్ డౌన్..
రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన రోహిత్.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 32 బంతుల్లో 14 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(26) ఉన్నాడు.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..
రోహిత్ శర్మ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రోహిత్(52) తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న రోహిత్..
4 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(25), విల్ జాక్స్(7) ఉన్నారు.
ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చెలరేగిన క్లాసెన్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు.
అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు.
హెన్రిచ్ క్లాసెన్ ఫిప్టీ..
హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తన ఫైటింగ్ నాక్‌తో ఎస్ఆర్‌హెచ్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్తున్నాడు.15 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
దూకుడు పెంచిన క్లాసెన్..
10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(25), మనోహర్(1) ఉన్నారు.
పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్‌హెచ్.. 13 పరుగులకే 4 వికెట్లు
ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(0), కిషన్(1), అభిషేక్ శర్మ(8),నితీష్ రెడ్డి(2) వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఎస్ఆర్‌హెచ్‌కు భారీ షాక్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు భారీ షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్(0) రూపంలో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో హెడ్ పెవిలియన్‌కు చేరాడు.2 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.
👉ఈ మ్యాచ్‌కు ముందు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఓ నిమిషం మౌనం పాటించారు.
ఐపీఎల్-2025లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పేసర్ అశ్వినీ కుమార్ స్దానంలో విఘ్నేష్ పుత్తర్ తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఎస్ఆర్‌హెచ్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్