
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 10 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2) ఔట్ కాగా.. ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 25; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 3) క్రీజ్‌లో ఉన్నారు.
ఇప్పటివరకు ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీపక్ చాహర్ 3 ఓవర్లలో 26 పరుగులు.. బౌల్ట్ ఓ ఓవర్‌లో 10 పరుగులు.. బుమ్రా 2 ఓవర్లలో 10, విల్ జాక్స్ 2 ఓవర్లలో 12 (ఇషాన్ వికెట్), హార్దిక్ 2 ఓవర్లలో 17 పరుగులిచ్చారు (అభిషేక్ వికెట్).
ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు అభిషేక్, హెడ్‌లకు మూడు లైఫ్‌లు లభించాయి. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లోనే అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో హెడ్ క్యాచ్ ఔటైనప్పటికీ నో బాల్ కావడంతో బ్రతికిపోయాడు.
1000 పరుగుల క్లబ్‌లో హెడ్
ఈ మ్యాచ్‌లో హెడ్ ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. హెడ్ కేవలం 575 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్ మాత్రమే హెడ్ కంటే వేగంగా 1000 పరుగులు పూర్తి చేశాడు. రసెల్ 545 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. హెడ్.. విధ్వంసకర వీరులు క్రిస్ గేల్ (615), మ్యాక్స్‌వెల్ (610) కంటే వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..
545 - ఆండ్రీ రస్సెల్
575 - ట్రావిస్ హెడ్*
594 - హెన్రిచ్ క్లాసెన్
604 - వీరేంద్ర సెహ్వాగ్
610 - గ్లెన్ మాక్స్వెల్
615 - క్రిస్ గేల్
617 - యూసుఫ్ పఠాన్
617 - సునీల్ నరైన్