
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసంతమ జట్టు మెంటార్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను పిసిబీ నియమించింది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూగా హేడెన్ పాకిస్తాన్ మెంటార్‌గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ అద్భుతంగా రాణించింది.
అనూహ్యంగా సెమీఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ఏడాది టోర్నీలో పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతర సహాయక సిబ్బందితో కలిసి హేడెన్ పనిచేయున్నాడు. కాగా అతడు ఆక్టోబర్ 15న పాకిస్తాన్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్‌లో ఆడనుంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న ఆసియాకప్‌లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెప్టెంబర్11న దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో పాక్ తలపడనుంది.
చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్!